విజేత సామియా ఇమాద్‌ | Samiya Imad wins under 19 Badminton Tourney | Sakshi
Sakshi News home page

విజేత సామియా ఇమాద్‌

Sep 1 2018 10:13 AM | Updated on Sep 4 2018 5:44 PM

Samiya Imad wins under 19 Badminton Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అండర్‌–19 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి సామియా ఇమాద్‌ ఫారూఖీ విజేతగా నిలిచింది. మంచిర్యాలలో జరిగిన ఈ టోర్నీలో సామియా బాలికల సింగిల్స్‌ టైటిల్‌ను అందుకుంది. శుక్రవారం జరిగిన అండర్‌–19 బాలికల ఫైనల్లో నాలుగోసీడ్‌ సామియా 21–15, 21–14తో రెండోసీడ్‌ ఎ. అభిలాష (హైదరాబాద్‌)కు షాకిచ్చింది. బాలుర ఫైనల్లో ఎం. తరుణ్‌ (ఖమ్మం) 21–11, 21–15తో ఆదిత్య గుప్తా (హైదరాబాద్‌)పై నెగ్గి చాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు బాలికల డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో సృష్టి జూపూడి జంట విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది.

బాలికల డబుల్స్‌ ఫైనల్లో టాప్‌సీడ్‌ సృష్టి (హైదరాబాద్‌) – సాహితి (మెదక్‌) ద్వయం 21–10, 21–10తో శ్రీవిద్య–సాయి శ్రీయ (మెదక్‌) జోడీపై నెగ్గగా... మిక్స్‌డ్‌ డబుల్స్‌ తుదిపోరులో టాప్‌సీడ్‌ సృష్టి– కె. సాయి కుమార్‌ (రంగారెడ్డి) జంట 21–14, 21–19తో బి. నవనీత్‌–సాహితి (మెదక్‌) జోడీపై గెలుపొందింది. బాలుర డబుల్స్‌ ఫైనల్లో పీఎస్‌కే సాయి కుమార్‌ (రంగారెడ్డి)–పీవీ గౌడ్‌ (హైదరాబాద్‌) ద్వయం 21–11, 21–17తో ఆకాశ్‌ చంద్రన్‌– సాయి రోహిత్‌ (హైదరాబాద్‌) జోడీపై గెలిచింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement