breaking news
Samiya Imad
-
బల్గేరియన్ ఓపెన్ విజేత సామియా
Samiya Samad: హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సామియా ఇమాద్ ఫారూఖీ ఆదివారం ముగిసిన బల్గేరియన్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో సామియా 16–21, 21–20, 21–11తో రెండో సీడ్ ఒజ్గె బేరక్ (టర్కీ)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత్‌కే చెందిన మీరాబా లువాంగ్ మైస్నమ్ 21–19, 7–21, 21–14తో ఐదో సీడ్ డానియల్ నికోలవ్ (బల్గేరియా)పై నెగ్గి టైటిల్ దక్కించుకున్నాడు. చదవండి: CSK Vs DC: చెన్నై అడుగు టైటిల్ వైపు -
క్వార్టర్స్‌లో సామియా
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు సామియా ఇమాద్ ఫరూఖీ, తరుణ్, నవనీత్ బొక్కా, సాహితి బండి ముందంజ వేశారు. విజయవాడలో జరుగుతోన్న ఈటోర్నీ సింగిల్స్ విభాగంలో సామియా, తరుణ్ క్వార్టర్స్‌కు చేరుకోగా... బాలుర డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో వేరు వేరు భాగస్వాములతో కలసి నవనీత్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. సాహితి తన భాగస్వామి నఫీసా (కేరళ)తో కలిసి బాలికల డబుల్స్‌లో రెండోరౌండ్‌కు చేరుకుంది. శనివారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్ సామియా ఇమాద్ ఫరూఖీ (తెలంగాణ) 21–10, 21–10తో జాహ్నవి (మహారాష్ట్ర)పై నెగ్గింది. నేడు జరుగనున్న క్వార్టర్స్‌లో క్వాలిఫయర్ హిమాన్షి రావత్ (ఉత్తరాఖండ్)తో సామియా ఆడుతుంది. బాలుర ప్రిక్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ ఎం. తరుణ్ (తెలంగాణ) 21–19, 21–12తో క్వాలిఫయర్ సిద్ధార్థ్ (తమిళనాడు)పై గెలుపొందాడు. ఇతన మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ శరత్ (ఏపీ) 22–20, 22–24, 21–16తో సిద్ధాంత్ గుప్తా (తమిళనాడు)పై, ఏడో సీడ్ సాయి చరణ్కోయ (ఏపీ) 21–19, 15–21, 21–19తో రిత్విక్ (తమిళనాడు)పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. మిక్స్డ్ డబుల్స్‌లో తెలంగాణ జోడీ నవనీత్ బొక్కా–సాహితి బండి క్వార్టర్స్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్స్‌లో రెండోసీడ్ నవనీత్–సాహితి ద్వయం 21–19, 21–11తో శ్యామ్ ప్రసాద్ (కేరళ)–కావ్య గుప్తా (ఢిల్లీ) జోడీపై గెలిచింది. మరో మ్యాచ్‌లో జ్ఞాన హర్ష–నవ్య (ఏపీ) జంట 21–16, 21–19తో అనురాగ్ భట్ (ఉత్తరాఖండ్)–టీనా (కర్ణాటక) జోడీని ఓడించింది. బాలుర డబుల్స్ రెండోరౌండ్లో టాప్‌సీడ్ నవనీత్ బొక్కా–పి.విష్ణువర్ధన్ గౌడ్ (తెలంగాణ) జంట 21–17, 23–21తో సిద్ధార్థ్ మిశ్రా (యూపీ)–ఆకాశ్ఠాకూర్ (బిహార్) జోడీని ఓడించి క్వార్టర్స్‌కు చేరుకుంది. మరో మ్యాచ్‌లో శరత్ (ఏపీ)–అచ్యుతాదిత్య రావు (తెలంగాణ) ద్వయం 21–16, 21–15తో శంకర్ ప్రసాద్–శ్యామ్‌ప్రసాద్ (కేరళ) జోడీపై గెలిచింది. బాలికల డబుల్స్ విభాగంలో బండి సాహితి జంట శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సాహితి (తెలంగాణ)–నఫీసా సారా (కేరళ) జంట 21–11, 21–10తో బాలాశ్రీ–అరుల్బాలా (తమిళనాడు) జోడీపై నెగ్గి రెండోరౌండ్‌కు చేరుకుంది. -
విజేత సామియా ఇమాద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్–19 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సామియా ఇమాద్ ఫారూఖీ విజేతగా నిలిచింది. మంచిర్యాలలో జరిగిన ఈ టోర్నీలో సామియా బాలికల సింగిల్స్ టైటిల్‌ను అందుకుంది. శుక్రవారం జరిగిన అండర్–19 బాలికల ఫైనల్లో నాలుగోసీడ్ సామియా 21–15, 21–14తో రెండోసీడ్ ఎ. అభిలాష (హైదరాబాద్)కు షాకిచ్చింది. బాలుర ఫైనల్లో ఎం. తరుణ్ (ఖమ్మం) 21–11, 21–15తో ఆదిత్య గుప్తా (హైదరాబాద్)పై నెగ్గి చాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు బాలికల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో సృష్టి జూపూడి జంట విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. బాలికల డబుల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ సృష్టి (హైదరాబాద్) – సాహితి (మెదక్) ద్వయం 21–10, 21–10తో శ్రీవిద్య–సాయి శ్రీయ (మెదక్) జోడీపై నెగ్గగా... మిక్స్డ్ డబుల్స్ తుదిపోరులో టాప్‌సీడ్ సృష్టి– కె. సాయి కుమార్ (రంగారెడ్డి) జంట 21–14, 21–19తో బి. నవనీత్–సాహితి (మెదక్) జోడీపై గెలుపొందింది. బాలుర డబుల్స్ ఫైనల్లో పీఎస్కే సాయి కుమార్ (రంగారెడ్డి)–పీవీ గౌడ్ (హైదరాబాద్) ద్వయం 21–11, 21–17తో ఆకాశ్ చంద్రన్– సాయి రోహిత్ (హైదరాబాద్) జోడీపై గెలిచింది.