క్వార్టర్స్‌లో సామియా

Samiya Enters Quarters of Badminton Tourney - Sakshi

ఆలిండియా బ్యాడ్మింటన్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారులు సామియా ఇమాద్‌ ఫరూఖీ, తరుణ్, నవనీత్‌ బొక్కా, సాహితి బండి ముందంజ వేశారు. విజయవాడలో జరుగుతోన్న ఈటోర్నీ సింగిల్స్‌ విభాగంలో సామియా, తరుణ్‌ క్వార్టర్స్‌కు చేరుకోగా... బాలుర డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో వేరు వేరు భాగస్వాములతో కలసి నవనీత్‌ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. సాహితి తన భాగస్వామి నఫీసా (కేరళ)తో కలిసి బాలికల డబుల్స్‌లో రెండోరౌండ్‌కు చేరుకుంది. శనివారం జరిగిన బాలికల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్‌ సామియా ఇమాద్‌ ఫరూఖీ (తెలంగాణ) 21–10, 21–10తో జాహ్నవి (మహారాష్ట్ర)పై నెగ్గింది. నేడు జరుగనున్న క్వార్టర్స్‌లో క్వాలిఫయర్‌ హిమాన్షి రావత్‌ (ఉత్తరాఖండ్‌)తో సామియా ఆడుతుంది. బాలుర ప్రిక్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్‌ ఎం. తరుణ్‌ (తెలంగాణ) 21–19, 21–12తో క్వాలిఫయర్‌ సిద్ధార్థ్‌ (తమిళనాడు)పై గెలుపొందాడు. ఇతన మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్‌ శరత్‌ (ఏపీ) 22–20, 22–24, 21–16తో సిద్ధాంత్‌ గుప్తా (తమిళనాడు)పై, ఏడో సీడ్‌ సాయి చరణ్‌కోయ (ఏపీ) 21–19, 15–21, 21–19తో రిత్విక్‌ (తమిళనాడు)పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకున్నారు.  

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలంగాణ జోడీ నవనీత్‌ బొక్కా–సాహితి బండి క్వార్టర్స్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్స్‌లో రెండోసీడ్‌ నవనీత్‌–సాహితి ద్వయం 21–19, 21–11తో శ్యామ్‌ ప్రసాద్‌ (కేరళ)–కావ్య గుప్తా (ఢిల్లీ) జోడీపై గెలిచింది. మరో మ్యాచ్‌లో జ్ఞాన హర్ష–నవ్య (ఏపీ) జంట 21–16, 21–19తో అనురాగ్‌ భట్‌ (ఉత్తరాఖండ్‌)–టీనా (కర్ణాటక) జోడీని ఓడించింది. బాలుర డబుల్స్‌ రెండోరౌండ్‌లో టాప్‌సీడ్‌ నవనీత్‌ బొక్కా–పి.విష్ణువర్ధన్‌ గౌడ్‌ (తెలంగాణ) జంట 21–17, 23–21తో సిద్ధార్థ్‌ మిశ్రా (యూపీ)–ఆకాశ్‌ఠాకూర్‌ (బిహార్‌) జోడీని ఓడించి క్వార్టర్స్‌కు చేరుకుంది.

మరో మ్యాచ్‌లో శరత్‌ (ఏపీ)–అచ్యుతాదిత్య రావు (తెలంగాణ) ద్వయం 21–16, 21–15తో శంకర్‌ ప్రసాద్‌–శ్యామ్‌ప్రసాద్‌ (కేరళ) జోడీపై గెలిచింది. బాలికల డబుల్స్‌ విభాగంలో బండి సాహితి జంట శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో సాహితి (తెలంగాణ)–నఫీసా సారా (కేరళ) జంట 21–11, 21–10తో బాలాశ్రీ–అరుల్‌బాలా (తమిళనాడు) జోడీపై నెగ్గి రెండోరౌండ్‌కు చేరుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top