సాయివిష్ణు, శ్రీకృష్ణ సాయికుమార్‌ ముందంజ

Sai Vishnu And Sri Krishna Leads Badminton Championship Of Telangana - Sakshi

 తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుల్లెల సాయివిష్ణు, శ్రీకృష్ణ సాయికుమార్‌ ముందంజ వేశారు. శుక్రవారం ప్రారంభమైన ఈ టోర్నీల్లో లో వీరిద్దరూ పురుషుల సింగిల్స్‌ విభాగంలో మూడోరౌండ్‌లో విజయం సాధించారు. మూడోరౌండ్‌ తొలి మ్యాచ్‌లో సాయివిష్ణు 17–15, 15–11తో పి. సాకేత్‌రెడ్డి (రంగారెడ్డి)పై గెలుపొందగా... శ్రీకృష్ణ సాయికుమార్‌ 15–12, 6–15, 15–8తో ఉదయ్‌ తేజ (హైదరాబాద్‌)ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌ విభాగంలో వన్షిక కపిల, కె. మమత (రంగారెడ్డి), వెన్నెల, లయ (హైదరాబాద్‌) మూడోరౌండ్‌లో అడుగుపెట్టారు.

రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో వన్షిక 17–15, 17–15తో మృతిక షెనోయ్‌ (హైదరాబాద్‌)పై, మమత 15–10, 15–5తో స్ఫూర్తి (వరంగల్‌)పై, వెన్నెల 15–10, 15–10తో సౌమ్య వ్యాస్‌ (మెదక్‌)పై, లయ 15–9, 15–6తో సుప్రియ (రంగారెడ్డి)పై నెగ్గారు. బాలుర డబుల్స్‌ రెండో రౌండ్‌లో విష్ణువర్ధన్‌–శ్రీకృష్ణ సాయికుమార్‌ (రంగారెడ్డి) ద్వయం 15–9, 15–13తో నిఖిల్‌రాజ్‌–మనీశ్‌ కుమార్‌ (హైదరాబాద్‌) జోడీపై గెలుపొందగా... మిక్స్‌డ్‌ డబుల్స్‌ రెండో రౌండ్‌లో నవనీత్‌–సాహితి (మెదక్‌) జంట 15–2, 15–3తో రాకేశ్‌–మీనా (రంగారెడ్డి) జోడీని ఓడించి మూడో రౌండ్‌లో అడుగుపెట్టింది.  

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు
పురుషుల సింగిల్స్‌ మూడోరౌండ్‌: రోహిత్‌ రెడ్డి (హైదరాబాద్‌ 15–10 15–2తో శశాంక్‌ (వరంగల్‌)పై, విష్ణువర్ధన్‌ గౌడ్‌ (హైదరాబాద్‌) 16–14 15–12తో ఓంప్రకాశ్‌ రెడ్డి (రంగారెడ్డి)పై, విజేత (హైదరాబాద్‌) 15–9 15–5 తో గౌతమ్‌ (నల్లగొండ)పై, సతీశ్‌ (హైదరాబాద్‌) 15–5 15–9తో అనిల్‌ కుమార్‌ (వరంగల్‌)పై, గోపాల్‌ కృష్ణ (రంగారెడ్డి) 15–7 15–8తో ఆశ్రయ్‌ కుమార్‌ (రంగారెడ్డి)పై, తరుణ్‌ (ఖమ్మం) 15–6 15–2తో నిక్షిప్త్‌ నారాయణ (హైదరాబాద్‌)పై, అభీశ్‌ (హైదరాబాద్‌)15–4, 15–11తో మహేశ్‌ (ఖమ్మం)పై గెలుపొందారు.  
మిక్స్‌డ్‌ డబుల్స్‌ రెండో రౌండ్‌: తరుణ్‌ (హైదరాబాద్‌)– శ్రీయ(మెదక్‌) జంట 15–9, 15–9తో ముహీబ్‌–లిఖిత (రంగారెడ్డి) జోడీపై, లోహిత్‌–వైష్ణవి (రంగారెడ్డి) 15–6, 15–7తో రోహిత్‌ రెడ్డి–మృతిక షెనోయ్‌ (హైదరాబాద్‌)పై, సందీప్‌ కుమార్‌–సుప్రియ (రంగారెడ్డి) 15–7, 15–8తో అరుణ్‌–నిఖిల్‌ (రంగారెడ్డి)పై, సాయిపృథ్వీ–అభిలాష (హైదరాబాద్‌) జంట 15–8, 15–5తో అజయ్‌ (నల్లగొండ)–శివారెడ్డి (హైదరాబాద్‌) జోడీపై నెగ్గి ముందంజ వేశాయి.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top