జీహెచ్‌ఎంసీఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అండర్–10 బాలబాలికల విభాగాల్లో జ్ఞాన దత్తు, దీప్షిక విజేతలుగా నిలిచారు.
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అండర్–10 బాలబాలికల విభాగాల్లో జ్ఞాన దత్తు, దీప్షిక విజేతలుగా నిలిచారు. అమీర్‌పేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ టోర్నీలో అండర్–10 బాలుర ఫైనల్లో టి.టి. జ్ఞాన దత్తు (సుచిత్ర అకాడమీ) 21–12, 21–10తో ఎస్.వి. మహేశ్ (కేన్స్ అకాడమీ)పై... అండర్–10 బాలికల ఫైనల్లో ఎన్. దీప్షిక (ఏఎస్ రావు అకాడమీ) 21–8, 21–10తో బి. హాసిన రెడ్డి (పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ)పై విజయం సాధించారు.