ఏనుగుల మధ్య తీవ్ర ఘర్షణ.. మధ్యలో వెళితే విషాదం
బెంగళూరు: కర్ణాటకలో దారుణం జరిగింది. రెండు ఏనుగులు ఘర్షణపడుతున్న సమయంలో ఒక మహిళా టూరిస్టు వాటిని చూస్తూ అక్కడే ఉంది. ఈ ప్రమాద ఘటనలో ఒక ఏనుగు ఆ మహిళపై పడిపోయింది. దీంతో ఆ మహిళ ఊపిరి ఆడక ప్రాణాలు వదిలింది. కొడుగు జిల్లాలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఈ రోజు సోమవారం ఈ ఘటన జరిగింది.చెన్నైకి చెందిన 33 ఏళ్ల జ్యునేష్ దుబారే అనే పర్యాటకురాలు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఏనుగులకు స్నానం చేయిస్తుండగా ఆసక్తిగా తిలకిస్తోంది. అయితే ఆ సమయంలో కంచన్ అనే ఏనుగు మార్తాండ అనే మరో ఏనుగుపై దాడి చేసింది. కొంత సేపట్లోనే ఆ ఘర్షణ తీవ్రతరమైంది. దీంతో మావటిలు వాటిని అదుపుచేసేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇంతలోనే మార్తాండా అనే ఏనుగు జ్యూనేష్ దుబారేపై పడిపోయింది. వెంటనే జ్యునేష్ నిలబడే ప్రయత్నం చేసినప్పటికీ మరింతగా తొక్కివేసింది. దీంతో ఆ పర్యాటకురాలు అక్కడికక్కడే మృతిచెందింది. అయితే ఈ మృతి పట్ల కర్ణాటక అడవీ శాఖ అధికారి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బంధించి ఉంచిన ఏనుగులకు శిక్షణ ఇచ్చినప్పటికీ, వాటి ప్రవర్తనను అంచనా వేయడం కష్టమన్నారు. పర్యాటకులు సైతం జాగ్రత్తగా ఉండాలని ఏనుగుల తొండాలను తాకడం, ఫోటోల కోసం దగ్గరగా నిలబడటం, ఏనుగులను కడగడం లేదా వాటికి ఆహారం పెట్టడం చేయకూడదన్నారు.కాగా ఇటీవల ఏనుగుల దాడులలో ప్రజలు మృతిచెందడం తీవ్ర కలవరం రేపుతోంది. గత నెలలో, ఛత్తీస్‌గఢ్‌లోని గౌరేలా-పెండ్రా-మార్వాహి జిల్లాలో ఒక అడవి ఏనుగు తొక్కడంతో 55 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు.ఉత్తర ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలోని కతర్నియాఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఒక ఏనుగు తొక్కడంతో 80 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది.ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి.I have always been stunned by, and have marvelled at, the raw brute force of nature manifested in elephants.[in this tragedy, a life was lost]https://t.co/OfHTUtgkwn— Sandeep Manudhane (@sandeep_PT) May 18, 2026
‘అమ్మ క్యాంటీన్ల’పై సీఎం విజయ్ ఫోకస్
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ ‘అమ్మ క్యాంటీన్లు’పై తన దృష్టి సారించారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను(ఉనవగామ్లు) ఆధునీకరించాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన సమావేశంలో సీఎం విజయ్ అమ్మ క్యాంటీన్లను పునరుద్దరించడంతో పాటు ఆధునీకరించాలని అధికారులకు ఆదేశించారు. అమ్మ క్యాంటీన్ల మౌలిక సదుపాయాలను పునరుద్ధరించి, మెరుగుపరచాలని, ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని విజయ్ అధికారులకు తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అమ్మ క్యాంటీన్లలో అందించే ఆహారం నాణ్యత, రుచి సంతృప్తికరంగా లేవన్న అభిప్రాయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిన తర్వాత, ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.2011-16 ఏఐఏడీఎంకే ప్రభుత్వ హయాంలో అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలచే ఆప్యాయంగా "అమ్మ" అని పిలుచుకునే అప్పటి ముఖ్యమంత్రి జె. జయలలిత పుట్టినరోజున, 2013 ఫిబ్రవరి 24న ఈ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. మొదట ఇవి చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత, వీటిని వివిధ పట్టణాలు, నగరాలకు విస్తరించారు. రాష్ట్రంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో 383 అమ్మ క్యాంటీన్లు, ఇతర స్థానిక సంస్థల పర్యవేక్షణలో 237 అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి.
SIR ప్రక్రియ అత్యంత కీలకమైనది: సజ్జల
తాడేపల్లి : వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పరిశీలకులతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. త్వరలో రాష్ట్రంలో ఎస్ఐఆర్(SIR) ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పార్లమెంటరీ పరిశీలకులతో సజ్జల సమావేశమయ్యారు. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి బీఎల్ఏ(బూత్ లెవెల్ ఏజెంట్లు) లు ఎలా వ్యవహరించాలనే అంశంపై దిశా నిర్దేశం చేశారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ జూన్ 15 నుంచి ఏపీలో ఎస్ఐఆర్ ప్రారంభమవుతోంది. ఈ సర్ ప్రక్రియ అత్యంత కీలకం. బూత్ లెవల్ ఏజెంట్లు, బీఎల్ఓల మధ్య సమన్వయం ఉండాలి.. బీఎల్ఏలకు వెంటనే శిక్షణ తరగతులు ఇవ్వాలి. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలి. డ్రాఫ్ట్ స్థాయిలోనే జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు ఉండవు. ఎన్యూమరేషన్ పత్రాలకు ముందే బీఎల్ఏలు సిద్ధంగా ఉండాలి. ఓటర్లను కూడా చైతన్యపరచాలి. ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వకపోతే ఓటు ఉండదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. సెప్టెంబర్ వరకు అన్ని టీమ్‌లు, సీనియర్ నేతలు, ఇన్ఛార్జ్లు నిరంతర పర్యవేక్షణ చేయాలి. సమర్థంగా పనిచేసే బూత్ ఏజెంట్లకు రాబోయే రోజుల్లో పార్టీ గుర్తింపు ఉంటుంది..
రూ. 51 లక్షలు, ఫార్చ్యూనర్ కారు కోసం దారుణం?
తమ బిడ్డ పెళ్లి కోసం దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. రూ. 11 లక్షల నగదు, రూ. 50 లక్షల విలువైన బంగారం, ఫర్నిచర్ , ఒక స్కోర్పియో (Scorpio) కారు లాంటి ఖరీదైన కానుకలను కట్నంగా ఇచ్చారు. కానీ ఏం లాభం, పెళ్లైన 17 నెలలకే తీరని కట్నం దాహానికి 25 ఏళ్ల కొత్త కోడలు బలైపోయింది. దీంతో అమ్మాయి తల్లి దండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అత్యంత హృదయ విదారకమైన ఈ ఘటన, గ్రేటర్ నోయిడాలోని జల్పురా ప్రాంతంలో, Ecotech-III పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది.ఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడా (జల్పురా ప్రాంతం)లో 25 ఏళ్ల దీపికా నాగర్ అనే వివాహిత తన అత్తవారింటి పైకప్పు (టెర్రస్) పైనుంచి పడి అనుమానాస్పద స్థితిలో మరణించింది. 2024 డిసెంబరులో దీపిక వివాహం జరిగింది. ఈ వివాహం కోసం దీపిక తండ్రి సంజయ్ నగర్ దాదాపు ఒక కోటి రూపాయలు ఖర్చు చేశారు. పెళ్లయిన 3-4 నెలల నుంచే అత్తవారింటి వేధింపులు మొదలయ్యాయని దీపిక తల్లిదండ్రలు ఆరోపించారు. నిందితులు అదనంగా ఒక ఫార్చ్యూనర్ కారు, రూ. 51 లక్షల నగదు కావాలని దీపికను వేధించడం ప్రారంభించారు. కట్నం కోసమే ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించి, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఎలాగైన తనబిడ్డ సంసారం నిలబడుతుందనే ఆశతో, సర్దుకుపోతుందని భావించి తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, కూతురి జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించామని దీపిక తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. అంత కట్నం ఇచ్చినా నా కూతురు నాకు దక్కలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పడిపోయిందా? తోసేశారా? ఆదివారం నాడు దీపికా తన తండ్రికి ఫోన్ చేసి, భర్త మరియు అత్తవారింటి వారు తనను తీవ్రంగా కొడుతున్నారని ఏడుస్తూ చెప్పింది. దాంతో తండ్రి బంధువులు ఆ సాయంత్రం అత్తగారింటికి వెళ్లి గొడవను సర్దిచెప్పి, వారు ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే, రాత్రి 12:30 గంటల ప్రాంతంలో దీపికా మూడో అంతస్తునుంచి పైనుంచి కింద పడిందని సమాచారం అందింది.అయితే ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని తండ్రి చెప్పారు. ఆమెను తీవ్రంగా కొట్టి, కడుపులో స్క్రూడ్రైవర్ లేదా కత్తితో పొడిచి, ఆపై పైనుంచి కిందకు తోసేసారని ఆరోపించారు. ఆసుపత్రిలో ఆమె శరీరంపై తీవ్ర గాయాలున్నాయని, ముక్కు, చెవులలోంచి రక్తం కారుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను కొట్టి, ఆపై అది ఒక ప్రమాదంలా కనిపించేలా చేయడానికి కిందకు విసిరేశారని దీపిక బాబాయ్ విశేష్ నాగర్ ఆరోపించారుమామ, భర్త అరెస్ట్సెంట్రల్ నోయిడా డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. యువతి పైకప్పు పైనుంచి దూకి మరణించినట్లు సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దీపిక భర్త రితిక్ తన్వర్, మామ మనోజ్ లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం శవపరీక్ష (Post-mortem) నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.
ఇది ఒక కల.. ఆ కలను నిజం చేసుకున్నాం: అమిత్ షా
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. సౌదీకి తోడుగా పాక్ సైన్యం భారీ మోహరింపు
స్టైల్ మార్చిన శోభిత.. చీరలో మానస
ఎస్బీఐ, ఎల్ఐసీకి ప్రభుత్వం ఆదేశాలు
చేతులే కాదు.. మెదడూ వాడలేదు.. యముడు పిలుస్తున్నాడా?
ధోనీ రిటైర్మెంట్పై రుతురాజ్ క్లారిటీ!
పెట్రో, డీజిల్ ధరలు పెంచినా నష్టం తగ్గట్లేదు.. రోజు వందల కోట్లు
సుడిగాలి సుధీర్ కొత్త సినిమా.. హీరోయిన్గా తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ
వర్క్ ఫ్రమ్ హోమ్ విస్తరణపై జోహో కామెంట్స్
ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ కన్నుమూత!
“పుష్ప” సంగతి నేను చూస్తా: బెంగాల్ సీఎం సువేందు
అర్ధరాత్రి నడిరోడ్డుపై దీన స్థితిలో పావలా శ్యామల
మహేశ్ సినిమా.. నేను అది తీసుకోలేకపోయాను
18 సార్లు లాటరీ విన్.. లక్కీ మ్యాన్ ‘జాక్‌పాట్’ సీక్రెట్ ఇదే..
ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!
మద్యం తాగించి.. బలవంతం చేసి!
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్..!
సాక్షి కార్టూన్ 16-05-2026
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
అప్పటి నుంచి ధోని అస్సలు నచ్చలేదు: గంగూలీ
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
మాను సంపంగి... మా అబ్బాయి
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
ఇంత కాలానికి ఓ శుభవార్త విన్నాం.. యుద్ధం చేయలేమని..!
ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఇంటి ఓనర్‌తో భర్త ఒప్పందం చేసుకుని భార్యను..!
ఇది ఒక కల.. ఆ కలను నిజం చేసుకున్నాం: అమిత్ షా
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. సౌదీకి తోడుగా పాక్ సైన్యం భారీ మోహరింపు
స్టైల్ మార్చిన శోభిత.. చీరలో మానస
ఎస్బీఐ, ఎల్ఐసీకి ప్రభుత్వం ఆదేశాలు
చేతులే కాదు.. మెదడూ వాడలేదు.. యముడు పిలుస్తున్నాడా?
ధోనీ రిటైర్మెంట్పై రుతురాజ్ క్లారిటీ!
పెట్రో, డీజిల్ ధరలు పెంచినా నష్టం తగ్గట్లేదు.. రోజు వందల కోట్లు
సుడిగాలి సుధీర్ కొత్త సినిమా.. హీరోయిన్గా తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ
వర్క్ ఫ్రమ్ హోమ్ విస్తరణపై జోహో కామెంట్స్
ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ కన్నుమూత!
“పుష్ప” సంగతి నేను చూస్తా: బెంగాల్ సీఎం సువేందు
అర్ధరాత్రి నడిరోడ్డుపై దీన స్థితిలో పావలా శ్యామల
మహేశ్ సినిమా.. నేను అది తీసుకోలేకపోయాను
18 సార్లు లాటరీ విన్.. లక్కీ మ్యాన్ ‘జాక్‌పాట్’ సీక్రెట్ ఇదే..
ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!
మద్యం తాగించి.. బలవంతం చేసి!
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్..!
సాక్షి కార్టూన్ 16-05-2026
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
అప్పటి నుంచి ధోని అస్సలు నచ్చలేదు: గంగూలీ
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
మాను సంపంగి... మా అబ్బాయి
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
ఇంత కాలానికి ఓ శుభవార్త విన్నాం.. యుద్ధం చేయలేమని..!
ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఇంటి ఓనర్‌తో భర్త ఒప్పందం చేసుకుని భార్యను..!
ఫొటోలు
‘కాక్టెయిల్ 2’ మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్న,కృతి సనన్ (ఫొటోలు)
ఫ్యామిలీ ట్రిప్‌లో హీరోయిన్ శ్రీదేవి విజయ్‌కుమార్.. (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరో ఆది పినిశెట్టి దంపతులు.. (ఫొటోలు)
అనంతపురం : భారమైన వేళ.. బాధతో విక్రయం! (ఫొటోలు)
హైదరాబాద్ : మురిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
నాలుగు పదుల వయసులో మరింత బొద్దుగా ఛార్మి.. బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
హల్దీ పిక్స్ షేర్ చేసిన హీరోయిన్ (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 17-24)
ఫ్లవర్ గర్ల్‌లా నయనతార (ఫొటోలు)
వయసు పెరిగినా వన్నె తగ్గని మాధురి అందం (ఫొటోలు)
సినిమా
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
మరోవారం వచ్చేసింది. ఈసారి సతీ లీలావతి, సిస్టమ్, మధువిధు, మేం కాప్‌లం లాంటి తెలుగు మూవీస్, సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరోవైపు థియేటర్లలో 'దృశ్యం 3' రిలీజ్ కానుంది. ఈ వీకెండ్‌కి అయితే ఇదే ఎంటర్టైన్మెంట్. అయితే సడన్ గా ఓ రెండు తెలుగు చిత్రాలు ఒకే ఓటీటీలోకి స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. రిలీజైన 12 రోజులకే)గతేడాది జనవరిలో థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'డ్రీమ్ క్యాచర్'. ప్రశాంత్ కృష్ణ, అనీషా దామా, ఐశ్వర్య హోళక్కల్ ప్రధాన పాత్రలు చేశారు. కలలో వచ్చిన సంఘటనలు నిజజీవితంలో ఒకవేళ జరిగితే హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఈ కలలు రావడం అనేది ప్లస్ అయిందా మైనస్ అయిందా అనేది కాన్సెప్ట్. ఇప్పుడీ చిత్రం ఏడాదిన్నర తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.ఇకపోతే సుమన్, మహేశ్ పెగ్గర్ల, సిరి తదితరులు నటించిన 'భీంసేరి' అనే తెలుగు సినిమా కూడా నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఇది కూడా రెంట్ విధానంలోనే అందుబాటులోకి వచ్చింది. ఓ క్రూరమైన లేడీ పోలీసాఫీసర్.. ఓ నిరుపేద కుటుంబాన్ని అన్యాయంగా నాశనం చేస్తుంది. కానీ ఆ కుటుంబంలో ఓ మహిళ ప్రాణాలతో బయటపడుతుంది. ఈమె సదరు లేడీ పోలీసాఫీసర్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక)
'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక
సాధారణంగా నటీనటులు ఎవరైనా సరే ఆచితూచి మాట్లాడుతుంటారు. స్టార్స్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉంటారు. కొన్నిసార్లు మాత్రం పొరపాటులో నోరు జారుతుంటారు. హీరోయిన్ రష్మిక కూడా ఇప్పుడు అలానే చేసింది. తోటి హీరోయిన్ని పొగుడుతూ టంగ్ స్లిప్ అయింది. వెంటనే నాలిక్కరుచుకుంది. ఇంతకీ ఏమైంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)స్వతహాగా కన్నడ అమ్మాయి అయినప్పటికీ రష్మిక.. తెలుగు సినిమాలతోనే బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. హీరో విజయ్ దేవరకొండని ప్రేమించి పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు అయిపోయింది. హిందీలోనూ మూవీస్ చేస్తున్న ఈమె నటించిన 'కాక్టెయిల్ 2' వచ్చే నెల 19న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది.ఈ కార్యక్రమంలోనే తోటి హీరోయిన్ కృతి సనన్ గురించి చెబుతూ '****' అనే బూతుని పొరపాటున ఉపయోగించింది. వెంటనే క్షమాపణ కూడా చెప్పేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రష్మిక, కృతిసనన్ హీరోయిన్లుగా కాగా షాహిద్ కపూర్ హీరో. అయితే ఈ మూవీలో రష్మిక-కృతి సనన్.. స్వలింగ సంపర్క పాత్రల్లో కనిపించనున్నారనే రూమర్స్ గతంలో వచ్చాయి. (ఇదీ చదవండి: తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్.. స్పందించిన హీరోయిన్ తల్లి)#RashmikaMandanna just couldn’t stop praising #KritiSanon 🤯🔥pic.twitter.com/bf76j1cVYd— Filmyscoops (@Filmyscoopss) May 18, 2026
రష్మికకు చేదు అనుభవం.. స్టార్ హీరో అసభ్య ప్రవర్తన..!
టాలీవుడ్ హీరోయిన్, కన్నడ బ్యూటీ రష్మికకు చేదు అనుభవం ఎదురైంది. తాను నటిస్తోన్న కాక్టెయిల్-2 మూవీ ప్రమోషన్స్‌లో చాలా ఇబ్బందికి గురైంది. రష్మిక మాట్లాడుతుండగా పక్కనే ఉన్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఆమె భుజంపై చేయి వేశాడు. దీంతో రష్మిక మందన్నా తీవ్ర అసౌకర్యానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం.. విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి చిత్రంలో నటిస్తోంది. పెళ్లి తర్వాత వీళ్లిద్దరు కలిసి నటిస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ మూవీ ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం కాక్టెయిల్-2 మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ మూవీ ‘కాక్టెయిల్-2’ ప్రమోషన్లలో షాహిద్ కపూర్ తీరుతో రష్మిక కాస్త ఇబ్బంది పడ్డారు. షాహిద్ తన భుజంపై చేయి వేయగానే అన్‌కంఫర్టబుల్‌గా ఫీలై వెంటనే పక్కకు తప్పుకున్నారు. ఆ సమయంలో ఆమె పైకి నవ్వుతూనే ఉన్నప్పటికీ ఏదో జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి… pic.twitter.com/FGza2sYnR8— ChotaNews App (@ChotaNewsApp) May 18, 2026
జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్.. ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్..!
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ నెల 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.తాజాగా యంగ్ టైగర్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 19న రాత్రి 11 గంటల 52 నిమిషాలకు ఫస్ట్ గ్లింప్స్ థియేటర్లతో పాటు డిజిటల్‌గా ప్రదర్శించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో జూనియర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. Before the clock strikes May 20…the celebrations begin across India ⚡#NTRNeel First Glimpse arrives at 11:52 PM IST on May 19th in selected theatres & digitally 🔥— NTR Arts (@NTRArtsOfficial) May 18, 2026
క్రీడలు
బంగ్లా బ్యాటర్ చరిత్ర.. పాక్‌కు క్లీన్‌స్వీప్ గండం!
బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ ఆ జట్టు తరఫున టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ మార్క్ అందుకోవడం ద్వారా బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితా లో ముష్ఫికర్ రహీమ్ చోటు సంపాదించాడు. 39 ఏళ్ల ముష్ఫికర్ రహీమ్‌కు టెస్టుల్లో ఇది 14వ సెంచరీ.తద్వారా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన బంగ్లా క్రికెటర్‌గా ముష్ఫికర్ రహీమ్ నిలిచాడు. 2005లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ముష్ఫికర్ రహీమ్ బంగ్లాదేశ్ తరపు 100కు పైగా టెస్టు మ్యాచ్‌లు ఆడి 6వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు, 14 సెంచరీలు, 29 అర్థసెంచరీలు ఉండడం విశేషం. జింబాబ్వేతో టెస్టులో 219 పరుగులు కెరీర్ బెస్ట్ స్కోరు సాధించిన ముష్ఫికర్ రహీమ్ బంగ్లాదేశ్ తరఫున డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా, అలాగే బంగ్లా తరఫున మూడు ద్విశతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సెంచరీలు బాదిన జాబితాలో ముష్ఫికర్ రహీమ్ తర్వాత మోమినుల్ హక్ (13 సెంచరీలు), ప్రస్తుత బీసీబీ తాత్కాలిక అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ (10 సెంచరీలు), నజ్ముల్ హొసేన్ షాంటో (9 సెంచరీలు), లిటన్ దాస్ (6 సెంచరీలు) ఉన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారింది. పాకిస్తాన్ ముందు బంగ్లాదేశ్ 437 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. అంతకముందు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్ రహీమ్ (137) సెంచరీ చేయగా.. ఓపెనర్ మహ్మదుల్ హసన్ జాయ్ (52), లిటన్ దాస్ (69) అర్థసెంచరీలు సాధించారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ 4 వికెట్లు తీయగా, సాజిద్ ఖాన్ 3, హసన్ అలీ 2 వికెట్లు తీశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 278 పరుగులకు ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ 232 పరుగులకే కుప్పకూలింది. తద్వారా 56 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ కలుపుకొని ప్రత్యర్థి ముంగిట భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజుల ఆట ముగిసేసరికి పాకిస్తాన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లలో పరుగులేమి చేయలేదు. చేతిలో పది వికెట్లు ఉన్నప్పటికీ రెండు రోజులు ఆట మిగిలి ఉండడంతో అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే తొలి టెస్టును కోల్పో యిన పాక్ ఇప్పుడు రెండో టెస్టులోనూ ఓడిపోతే క్లీన్‌స్వీప్ అయినట్లే. Built on class and consistency 💪Mushfiqur Rahim among the finest in Tests. Celebrates in style pic.twitter.com/DN6067jYjc— Bangladesh Cricket (@BCBtigers) May 18, 2026చదవండి: IPL: లిటన్ దాస్ సంచలన ఆరోపణలు
IPL: లిటన్ దాస్ సంచలన ఆరోపణలు
బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో తన ప్రయాణం గుర్తుంచుకోదగినది కాదన్నాడు. ఫ్రాంఛైజీ నుంచి తనకు ఎలాంటి మద్దతూ లభించలేదని ఆరోపించాడు.ఒక్క మ్యాచ్.. చేదు అనుభవంకాగా 2023 ఐపీఎల్ సీజన్‌కు ముందు రూ. 50 లక్షల కనీస ధరకు కేకేఆర్ లిటన్ దాస్‌ను కొనుగోలు చేసింది. చాన్నాళ్లపాటు బెంచ్‌కే పరిమితమైన అతడు.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు.ఓపెనర్‌గా బరిలోకి దిగిన లిటన్ దాస్ (Liton Das).. నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి అవుటయ్యాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో లలిత్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక వికెట్ కీపర్‌గానూ లిటన్ దాస్ విఫలమయ్యాడు. రెండుసార్లు స్టంపింగ్ చేసే అవకాశం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమిపాలైంది.నాకెలాంటి మద్దతూ లభించలేదుఆ తర్వాత లిటన్ దాస్‌కు మళ్లీ ఆడే అవకాశం రాలేదు. ఈ విషయాల గురించి బంగ్లాదేశ్ క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘కేకేఆర్‌కు నా అవసరం ఉందని అస్సలు అనుకోలేదు. ఆశించిన విధంగా జట్టు నుంచి నాకెలాంటి మద్దతూ లభించలేదు. ఒక మ్యాచ్‌లో ప్లేయర్‌ను ఆడిస్తున్నామంటే ముందుగానే సమాచారం ఇస్తారు.రాత్రి 11 గంటలకు మెసేజ్కానీ నా విషయంలో అలా జరుగలేదు. రెండు మ్యాచ్‌లలో నన్ను బెంచ్ మీదే కూర్చోబెట్టారు. అకస్మాత్తుగా రాత్రి 11 గంటలకు నాకో మెసేజ్ వచ్చింది. ‘నువ్వు ఆడబోతున్నావు’ అని చెప్పారు. అప్పటికప్పుడు ఎలా సన్నద్ధం కావాలో అర్థం కాలేదు. నా శాయశక్తులా బాగా ఆడేందుకు ప్రయత్నించా. అయితే, క్రికెట్లో ఒక్కోసారి మనం అనుకున్నవన్నీ జరుగకపోవచ్చు. ఆరోజు నాది కాదంతే’’ అని లిటన్ దాస్ నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ కేకేఆర్ యాజమాన్యంపై ఆరోపణలు చేశాడు.కాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, జై మెహతా తదితరులు కేకేఆర్ సహ యజమానులు. ఐపీఎల్-2026 మినీ వేలంలో బంగ్లాదేశ్ ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కేకేఆర్ కొనుగోలు చేసింది.హైడ్రామాఅయితే, భారత్- బంగ్లా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో.. బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ తొలగించింది. దీంతో బంగ్లా బోర్డు భద్రతా కారణాలు సాకుగా చూపుతూ టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు తమ జట్టును భారత్‌కు పంపలేదు. వేదిక మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేయగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించింది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు బంగ్లా ప్రకటించింది. తద్వారా భారీ మూల్యమే చెల్లించింది. ఇక కొత్తగా వచ్చిన ప్రభుత్వం బీసీసీఐతో సంబంధాల పునరుద్ధణ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాగా బంగ్లా ప్రపంచకప్ జట్టుకు లిటన్ దాస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.చదవండి: ఐపీఎల్ ఎక్కువైందా?.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్
బీసీసీఐ విషయంలో కీలక తీర్పు.. ఇకపై..
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి భారీ ఊరట లభించింది. సమాచార హక్కు చట్టం (RTIA) పరిధి నుంచి బోర్డును తొలగిస్తూ కేంద్ర సమాచార కమిషన్ (CIC) తీర్పు వెలువరించింది. బీసీసీఐ ‘పబ్లిక్ అథారిటీ’ కాదని స్పష్టం చేసింది.గతంలో అలా..కాగా 2018లో సమాచార కమిషనర్‌గా ఉన్న ఎం. శ్రీధర్ ఆచార్యులు.. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2(h)ను అనుసరించి బీసీసీఐని పబ్లిక్ అథారిటీగా డిక్లేర్ చేశారు. బోర్డులో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మద్రాస్ హైకోర్డును ఆశ్రయించగా.. CIC వద్దకు చేరింది.ప్రభుత్వ నియంత్రణలో లేదుగీతా రాణి అనే వ్యక్తి గతంలో బీసీసీఐ విషయంలో వేసిన పిటిషన్‌ను తాజాగా కొట్టివేస్తూ.. ‘‘చట్టపరమైన తీర్పులు గానీ.. శాసనాల ద్వారా రాతపూర్వకంగా జరిగిన చట్టంగా మారినట్లుగా గానీ.. బీసీసీఐ ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా ప్రభుత్వానికి చెందినట్లుగా లేదంటే ప్రభుత్వ నియంత్రణలో ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. అదే విధంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కూడా పొందడం లేదు’’ అని CIC తన తీర్పులో పేర్కొంది.ప్రభుత్వ ఫండింగ్‌గా భావించకూడదుబీసీసీఐ ఆర్థికంగా స్వతంత్ర వ్యవస్థ అని.. మీడియా హక్కులు, స్పాన్సర్షిపులు, ఐపీఎల్ ఒప్పందాలు, టికెట్ల అమ్మకాలు.. తదితరాల నుంచి ఆదాయం పొందుతోందని CIC ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసింది. అయితే, ఇందుకు సంబంధించిన పన్ను ప్రయోజనాలు పొందుతోంది కాబట్టి.. దీనిని ప్రభుత్వ ఫండింగ్‌గా భావించడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేసింది.అదే విధంగా.. క్రికెట్ పరిపాలనా అంశాలకు సంబంధించి అంతా పారదర్శకంగా ఉండాలని మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశించిందని CIC పేర్కొంది. అంతేతప్ప.. ఆర్టీఐ చట్టం కింద బీసీసీఐని ఎన్నడూ పబ్లిక్ అథారిటీగా ప్రకటించలేదని స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థగాకాగా తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ప్రైవేటు సంస్థగా బీసీసీఐ నమోదైంది. పార్లమెంట్ ద్వారా చేయబడిన చట్టం లేదంటే రాజ్యంగబద్ధంగా బోర్డు రూపొందలేదు. కాగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా బీసీసీఐ వెలుగొందుతున్న సంగతి తెలిసిందే.చదవండి: ఐపీఎల్ ఎక్కువైందా?.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్
‘సత్తా చాటినా.. టీమిండియాకు అతడి ఎంపిక కష్టమే’
ఐపీఎల్-2026 ముగిసిన వారం వ్యవధిలోపే టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ బరిలో దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎంపిక ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.బుమ్రాకు విశ్రాంతిప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక సొంతగడ్డపై స్పిన్నర్ల ప్రభావమే ఎక్కువ కాబట్టి.. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లకు బౌలింగ్ విభాగంలో చోటు ఖాయం.ఇక బుమ్రా లేకపోయినా మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ పేస్ దళంలో ఉండనే ఉన్నారు. అయితే, అఫ్గన్ బలహీన జట్టు కాబట్టి ఈసారి ప్రయోగాలు చేయాలని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నట్లు వినికిడి.ఆకిబ్ నబీ ఎంపికపై చర్చఈ నేపథ్యంలో గత ఏడాది రంజీల్లో అత్యధిక వికెట్లతో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీ ఎంపికపై చర్చ నడుస్తోంది. అతడిని తప్పక ఈ సిరీస్‌కు ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తాజాగా ఓ జర్నలిస్టు సోషల్ మీడియా వేదికగా నబీ అరంగేట్రం ఇప్పట్లో కష్టమనే సంకేతాలు ఇచ్చారు.పేస్ లేదు‘‘అఫ్గనిస్తాన్‌తో టెస్టుకు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆకిబ్ నబీ 60 వికెట్లు తీసినా.. అతడి బౌలింగ్‌లో పెద్దగా పేస్ లేదనే చర్చ జరిగింది. అతడు అందరినీ ఆకట్టుకోలేకపోయాడు.ఒకవేళ అతడికి పదిహేను మంది సభ్యుల టెస్టు జట్టులో చోటు దక్కినా.. ఇప్పట్లో అరంగేట్రం చేయడం కష్టమే. అంతేకాదు ఈసారి కూడా అతడిని ఎంపిక చేసే అవకాశాలు చాలా తక్కువ’’ అని కుశన్ సర్కార్ అనే జర్నలిస్టు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రిన్స్ యాదవ్‌కు అవకాశం!ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ వన్డే సిరీస్‌కు మాత్రం బీసీసీఐ కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో 17 వికెట్లు పడగొట్టడంతో పాటు ప్రస్తుత ఐపీఎల్లో కూడా చెలరేగుతున్న ప్రిన్స్ యాదవ్ పేరు తెరమీదకు వచ్చింది.హర్షిత్ రాణా ఇంకా ఫిట్నెస్ సాధించకపోవడంతో ప్రిన్స్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మే 31న ఫైనల్‌తో ఐపీఎల్ తాజా సీజన్ ముగియనున్న సంగతి తెలిసిందే.భారత్ వర్సెస్ అఫ్గనిస్తాన్ సిరీస్‌ల షెడ్యూల్👉ఏకైక టెస్టు: జూన్ 6 నుంచి ఆరంభం, న్యూ చండీగఢ్👉తొలి వన్డే: జూన్ 14, ధర్మశాల👉రెండో వన్డే: జూన్ 17, లక్నో👉మూడో వన్డే: జూన్ 20, చెన్నై.చదవండి: రిటైర్మెంట్పై స్పష్టమైన సంకేతాన్నిచ్చిన ధోని
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
తెలంగాణలోనూ గెలుస్తాం... పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
నేడు తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణం... మెజార్టీ దక్కడంతో ఎట్టకేలకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్
తమిళనాట ప్రతిష్టంభనలో విజయ్ ప్రమాణ స్వీకారం... మద్దతు ప్రకటించినా అధికారికంగా లేఖ ఇవ్వని వీసీకే
బిజినెస్
మే చివరినాటికి ‘కేఫే-3’ నిబంధనలు
దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని మలుపు తిప్పే కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ (కేపే) ఫేజ్-3 నిబంధనల నోటిఫికేషన్‌కు సర్వం సిద్ధమైంది. ఇథనాల్ రోడ్‌మ్యాప్‌కు అనుగుణంగా చివరి నిమిషంలో కొన్ని సాంకేతిక మార్పులు (E25 రీకాలిబ్రేషన్) జరిగినప్పటికీ ఈ నెల చివరి నాటికే తుది నిబంధనలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) తుది ఫార్ములాను సిద్ధం చేస్తోంది.ప్రధాని కార్యాలయం పర్యవేక్షణ..భారతదేశ ముడిచమురు దిగుమతుల భారాన్ని తగ్గించడం, పర్యావరణ అనుకూల ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ఈ అడుగులు వేస్తోంది. ఈ వ్యవహారాన్ని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) నేరుగా పర్యవేక్షిస్తుండటం దీని ప్రాధాన్యతను తెలియజేస్తోంది.కేఫే నిబంధనల ఉద్దేశంవాహనాల ఇంధన సామర్థ్యాన్ని పెంచడం, వాహనాల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలను తగ్గించడం. సరళంగా చెప్పాలంటే ఒక వాహన తయారీ సంస్థ (ఉదాహరణకు మారుతి సుజుకి లేదా టాటా మోటార్స్) ఒక ఆర్థిక సంవత్సరంలో విక్రయించే అన్ని కార్ల సగటు ఇంధన వినియోగం, ఉద్గారాలు ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి లోబడి ఉండాలి.E20 నుంచి E25/E27 వైపు..ఇథనాల్ బ్లెండింగ్‌ను E20 (20% ఇథనాల్) నుంచి E25/E27 (25%-27% ఇథనాల్) స్థాయికి వేగంగా తీసుకెళ్లాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఫార్ములాను మారుస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మార్పుల కేఫే-3 లక్ష్యాల్లో ఎటువంటి మార్పు ఉండదని కేవలం ఇంధన రసాయన లక్షణాల ఆధారంగా లెక్కించే పద్ధతిని మాత్రమే సవరించినట్లు నిపుణులు స్పష్టం చేశారు. దీనివల్ల ఇథనాల్ వాడకం వల్ల వాహన సామర్థ్య అంచనాలో ఆటోమొబైల్ కంపెనీలకు నష్టం జరగదు. ‘చర్చలన్నీ పూర్తయ్యాయి. ఈ నెలాఖరుకల్లా తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. వాహన తయారీదారులు తమ భవిష్యత్తు ఇంజిన్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి సమయం చాలా తక్కువగా ఉంది’ అని ఈ చర్చల్లో పాల్గొన్న ఒక సీనియర్ ఆటోమొబైల్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.ఆటోమొబైల్ కంపెనీలకు 11 నెలల గడువుఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుంచి అమలులోకి రానున్నాయి. మే చివరినాటికి నోటిఫికేషన్ వస్తే వాహన తయారీ కంపెనీలకు సన్నద్ధమవడానికి కేవలం 11 నెలల సమయం మాత్రమే మిగులుతుంది. ఈ నిబంధనల ఆధారంగానే ఈవీలు, హైబ్రిడ్, ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలకు ఇచ్చే కంప్లయన్స్ క్రెడిట్లను లెక్కిస్తారు. ఏ సాంకేతికత కలిగిన వాహనాల తయారీ చౌకగా మారుతుందో, ఏవి ఖరీదవుతాయో ఈ నిబంధనలే డిసైడ్ చేయనున్నాయి.స్పష్టత వస్తేనే పెట్టుబడులువాహన తయారీదారులు ఇప్పటికే ఆర్థిక సంవత్సరం 2028కి సంబంధించిన ప్రొడక్ట్ ప్లానింగ్‌లో ఉన్నారు. నిబంధనలపై స్పష్టత వస్తేనే సప్లయర్లతో ఒప్పందాలు, ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టడం కంపెనీలకు సాధ్యమవుతుంది. రాబోయే దశాబ్ద కాలంలో భారత ఆటోమొబైల్ రంగం ఏ దిశగా సాగాలో నిర్దేశించే ఈ రూల్‌బుక్ కోసం పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.ఇదీ చదవండి: రూ.100 కోట్ల వ్యాపారానికి స్వస్తి!
భారత్ vs అమెరికా: ఇదీ.. వర్క్ కల్చర్‌లో తేడా!
అమెరికాలో పనిచేస్తున్న భారతీయ మహిళ శారికా యాదవ్.. షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె భారతదేశం vs అమెరికా కార్పొరేట్ పని సంస్కృతుల మధ్య ఉన్న తేడాలను వివరించింది.అమెరికాలో పనిచేసే ఉద్యోగులు తమ పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడం, తీసుకురావడం, డాక్టర్ అపాయింట్మెంట్లు వంటి వ్యక్తిగత పనుల కోసం.. ముందుగానే తమ ఆఫీస్ క్యాలెండర్లో సమయం బ్లాక్ చేసుకుంటారు. ఆ సమయంలో ఇతరులు మీటింగ్స్ పెట్టకుండా గౌరవిస్తారు. ఒకవేళ మీటింగ్ అవసరం వచ్చినా, ముందుగా ఉద్యోగిని అడిగి సమయం ఖరారు చేస్తారు. అక్కడ ఉద్యోగుల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించడం కంపెనీల పని సంస్కృతిలో భాగంగా మారిందని శారికా యాదవ్ పేర్కొన్నారు.భారతదేశంలో పరిస్థితి భిన్నంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక్కడ సెలవు తీసుకోవాలంటే.. ఉద్యోగులు మేనేజర్లకు పూర్తి వివరణ ఇవ్వాల్సి వస్తుందని పేర్కొన్నారు. అనేక కంపెనీల్లో ఉద్యోగులపై పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, వ్యక్తిగత అవసరాలకు తగిన ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. చాలా మంది తమ అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. కొందరు అమెరికా వర్క్ కల్చర్‌లో వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని అంగీకరించగా, మరికొందరు ప్రతి దేశానికి ప్రత్యేకమైన పని విధానం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇంకొందరు భారతదేశంలో ఉద్యోగులపై ఉండే ఒత్తిడి కారణంగా చాలామంది స్వంత వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారని అభిప్రాయపడ్డారు. View this post on Instagram A post shared by Sarika Yadav | Indian Blogger in America (@sarika_in_america)
యువత కోసం.. సరికొత్త బీమా పాలసీ
నేటి తరం యువత మారుతున్న జీవనశైలి, ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘యాక్టివ్ యువ’ పేరుతో సరికొత్త ఆరోగ్య బీమా పాలసీని ప్రవేశపెట్టింది. కేవలం ఆసుపత్రి ఖర్చులకే పరిమితం కాకుండా, పాలసీదారులు నిత్యం ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహించడం ఈ ప్లాన్ ప్రత్యేకత.ప్రతిరోజూ కనీసం 10 వేల అడుగులు నడవడం లేదా ఒకే వ్యాయామ సెషన్లో 300 కేలరీలు ఖర్చు చేయడం ద్వారా వినియోగదారులు రివార్డులు పొందవచ్చు. మెరుగైన ‘హెల్తీ హార్ట్ స్కోర్’ కొనసాగించిన వారు తమ వార్షిక ప్రీమియంలో 100 శాతం వరకు తిరిగి పొందే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. బీమాను కేవలం అత్యవసర వైద్య సాయంలా కాకుండా, రోజువారీ జీవితంలో ఒక భాగంగా మార్చేలా ‘యాక్టివ్ యువ’ను రూపొందించినట్లు కంపెనీ సీఈవో మయాంక్ బత్వాల్ తెలిపారు.
ఐటీఆర్ ఫైలింగ్.. జూలై 31 లాస్ట్ డేట్!
2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను మీరు వేయవలసిన ఆదాయపు రిటర్నులలో రెండు ఫారాలు ఉంటాయి. ఒకటి నంబర్ 1, రెండోది నంబర్ 4. వీటిని దాఖలు చేయడానికి డిపార్టుమెంటు వారి తరఫున ప్లాట్‌ఫాం రెడీ అయ్యింది. ఇందుకు అవసరమైన యుటిలిటీలను, సాధనాలను వారు సన్నద్ధం చేశారు. ఈ వారం ఐటీఆర్1 గురించి తెలుసుకుందాం. దీన్నే సహజ్ అని కూడా అంటారు. మీరు ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్‌లైన్ ద్వారా వేయొచ్చు.ఎవరు దాఖలు చేయొచ్చు..కేవలం రెసిడెంట్ వ్యక్తులైన వారు మాత్రమే ఈ ఫారం ఐటీఆర్–1 లేదా సహజ్ వేయగలరు. ఇతరులెవ్వరూ ఈ ఫారంను వేయడానికి లేదు. ఎంత ఆదాయం వచ్చే వారు వేయొచ్చు.. ఈ కింది మార్గాల్లో ఆదాయాలు వచ్చే వారు ఈ ఫారం వాడాలి. పెన్షన్జీతాలుఒకటి/రెండు ఇళ్ల మీద ఇంటద్దె వచ్చే వాళ్లుఇతర ఆదాయంవ్యవసాయ ఆదాయం రూ. 5000 లోపు ఉన్న వారుఇతర షరతులు..మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటిన వారు ఈ ఫారం కింద ఆదాయం డిక్లేర్ చేయకూడదు. భార్య ఆదాయం, పిల్లల ఆదాయం, భర్త కేసులో కలిపే సందర్భం ఏర్పడితే, రూ. 50,00,000 దాటనంత వరకు ఈ ఫారం వాడొచ్చు. రూ. 1,25,000 లోపల లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటే, అటువంటి వారు ఫారం 1 వాడొచ్చు.ఏయే కాగితాలు ఉండాలి..పాత చట్టం ప్రకారం 16, 16ఎ, ప్రీమియం మొదలైన వాటి రశీదులు, అద్దె రశీదులు, మొదలైనవి మీ ఫైల్లో ఉండాలి. రిటర్నుతో పాటు జతపరచనవసరం లేదు కానీ రెడీగా ఉంచుకోండి.ఎవరు ఫారం 1 దాఖలు చేయకూడదు..మీ మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటితే.వ్యవసాయం మీద నికర ఆదాయం రూ. 5,000 దాటితే.లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రూ. 1,25,000 దాటితే. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎలాగు రూ. 1,25,000 వరకు మినహాయింపు ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రూ. 1,250,000 వరకు పన్ను భారం ఉండదు. వృత్తి మీద ఆదాయం ఉన్నవారు.వ్యాపారం మీద ఆదాయం ఉన్నవారు.ఒకటి, రెండు దాటి .. అంటే మూడో ఇంటి మీద ఆదాయం వచ్చే వాళ్లు వేయకూడదు.ఏదైనా కంపెనీలో డైరెక్టర్ అయితేఅన్లిస్టెడ్ ఈక్విటీ షేర్ల మీద ఆదాయం ఉంటేవిదేశాల్లో ఆస్తులున్నా, వాటి మీద హక్కులున్నామీరు నాన్ రెసిడెంటు అయినావిదేశాల నుంచి ఆదాయం ఉన్నా194ఎన్ (పాత చట్టం) ప్రకారం టీడీఎస్ రికవరీ అయితే, అతి పెద్ద నగదు విత్‌డ్రాయల్స్ మీదఉద్యోగస్తుల స్టాక్ / షేర్ల మీద ఎటువంటి చెల్లింపులు, రికవరీలు ఉన్నాగత సంవత్సరపు సర్దుబాటు నష్టాలున్నాఏ ఆదాయం నుంచైనా సర్దుబాటు చేయాల్సిన నష్టాలున్నాచివరగా..ఫైలింగ్ చేయడానికి గడువు తేదీ 2026 జూలై 31. ఆన్లైన్లో వేయొచ్చు లేదా ఎక్సెల్లాంటి యుటిలిటీ ద్వారా డౌన్లోడ్ చేసి దాఖలు చేసుకోవచ్చు. ఎన్నెన్నో సాఫ్ట్వేర్లు ఉన్నాయి. మీరే స్వయంగా వేయొచ్చు లేదా వృత్తి నిపుణులు ఉన్నారు. సమాచారం సరైనది. సమగ్రమైనది. సంపూర్ణమైనది. రెడీగా ఉంటే సరైనదే, సమగ్రంగా, సంపూర్ణంగా, రెడీగా ఉంటే సులభతరంగా వేయొచ్చు. ఫారంలు చాలా స్నేహపూర్వకంగానే ఉంటాయి.
ఫ్యామిలీ
పుదీనాతో చెమటకు చెక్!
పుదీనాలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని డ్యామేజ్ కాకుండా రక్షించడమే కాకుండా, హైడ్రేట్ చేసి తాజాగా ఉండేలా చేస్తాయి. పుదీనాలోని విటమిన్ ‘ఏ’ చర్మంలోని జిడ్డును తగ్గించి, చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. పుదీనా ఆకుల పేస్ట్, గుడ్డు తెల్లసొన మిశ్రమంతో మాస్క్ వేసుకుంటే చర్మం నిగారిస్తుంది. పుదీనాలోని శాలిసిలిక్ యాసిడ్ మొటిమలను తగ్గిస్తుంది. పుదీనా రసం, పచ్చి బొప్పాయి రసాన్ని కలిపి మచ్చలు, కీటకాలు కుట్టిన చోట లేదా చర్మ ఇన్ఫెక్షన్లపై రాస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. వేసవిలో చన్నీటిలో పుదీనా ఆకులను వేసి ముఖం కడుక్కోవడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. స్నానం చేసే నీటిలో పుదీనా ఆకులు లేదా పుదీనా నూనె వేసుకుంటే అలసట తగ్గి, అధిక చెమట సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖంపై మొటిమల వల్ల ఏర్పడే మచ్చల నివారణకు కూడా పుదీనా తోడ్పడుతుంది. సమాన పరిమాణంలో ఎండిన తులసి, వేప, పుదీనా ఆకులను పొడి చేసి పెట్టుకోవాలి. ఒక చెంచా ఈ పొడికి కొంచెం పసుపు, రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసి మచ్చలపై రాస్తే అవి క్రమంగా తగ్గుతాయి. చర్మ సంరక్షణ కోసం కానోపిఎంత ఖరీదైన ఫేస్ వాష్‌లు వాడినా, ముఖం కడుక్కోవడానికి ఉపయోగించే నీరు బాగుండకపోతే ఆ ప్రయత్నాలన్నీ వృథానే. కొళాయి నీటిలో ఉండే క్లోరిన్, ఇతర మలినాలు, హార్డ్ వాటర్ చర్మాన్ని పొడిగా మార్చడమే కాకుండా, మొటిమలు, అలర్జీలకు దారితీస్తాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ వెల్నెస్ బ్రాండ్ కానోపీ తన సరికొత్త ఫాసెట్ ఫిల్టర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫిల్టర్ సాధారణ వాటర్ ఫిల్టర్ల లాగా కాకుండా, ప్రత్యేకంగా చర్మ సంరక్షణ కోసం రూపొందించినది. ఇది నీటిలోని క్లోరిన్, ఇతర మలినాలను తొలగించి, నీటిని సున్నితంగా మారుస్తుంది. దీనివల్ల చర్మంపై కలిగే మంట, అలర్జీలు తగ్గుతాయి. మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది. చర్మం సహజసిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది.ఈ ఫిల్టర్ కేవలం పనితీరులోనే కాకుండా, చూడటానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బాత్రూమ్ ఇంటీరియర్‌కు తగినట్లుగా ఇది లావెండర్, ఇత్తడి, మ్యాట్ బ్లాక్, బ్రష్డ్ నికెల్ వంటి అద్భుతమైన రంగులలో లభిస్తుంది. కానోపీ సంస్థ కేవలం ఫిల్టర్లకే పరిమితం కాకుండా, షవర్ హెడ్లు హ్యూమిడిఫైయర్లను కూడా సరికొత్త రీతిలో డిజైన్ చేస్తోంది. గృహోపకరణాలను బ్యూటీ టూల్స్‌గా మార్చడం ద్వారా మన ఇంట్లోనే చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.(చదవండి: గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?)
గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?
నేను ఐదు నెలల గర్భవతిని. డాక్టర్ చెప్పడంతో ఓజీటీటీ పరీక్ష చేయించుకున్నాను. దాంతో రక్తంలో షుగర్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇది నాకు, నా బిడ్డకు ప్రమాదకరమా? నేను ఇకపై డయాబెటిక్‌గా ఉండాల్సి వస్తుందా?– శైలజ, గుంటూరు.గర్భధారణ సమయంలో కొంతమంది మహిళల్లో రక్తంలో షుగర్ స్థాయి పెరగవచ్చు. దీనిని ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. ఇది గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల ప్రభావం వల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం కారణంగా వస్తుంది. ఇది సాధారణంగా 24 నుంచి 28 వారాల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ప్రతి గర్భిణీకి ఓజీటీటీ అనే పరీక్ష చేయించుకోవాలని సూచిస్తారు. కొంతమంది మహిళల్లో ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గత గర్భధారణలో జెస్టేషనల్ డయాబెటిస్ ఉండటం, కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉండటం, 35 ఏళ్లకు పైబడిన వయస్సు, అధిక బరువు వంటి కారణాలు ఉంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్నప్పుడు తల్లి, బిడ్డకు కొన్ని సమస్యలు రావచ్చు. బిడ్డ బరువు ఎక్కువగా పెరగడం, ఉమ్మనీరు ఎక్కువ కావడం, డెలివరీ సమయంలో ఇబ్బందులు, డెలివరీ తర్వాత ఎక్కువ బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టిన తర్వాత బిడ్డకు శ్వాస సమస్యలు లేదా తక్కువ షుగర్ లెవల్స్ రావచ్చు, కానీ ఇవి సాధారణంగా చికిత్సతో నియంత్రించవచ్చు. ఇది నిర్ధారణ అయిన తర్వాత మీరు డైట్ పై ఎక్కువగా దృష్టి పెట్టాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వులు, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాగే రక్తంలో షుగర్ స్థాయిలను తరచూ చెక్ చేసుకోవాలి. డైట్‌తో నియంత్రణలో లేకపోతే సురక్షితమైన మందులు లేదా ఇన్సులిన్ ఇవ్వవచ్చు. ఇవి తల్లికి, బిడ్డకు సేఫ్‌గా ఉంటాయి. చాలా సందర్భాల్లో డెలివరీ అయిన తర్వాత ఈ జెస్టేషనల్ డయాబెటిస్ తగ్గిపోతుంది. అయితే భవిష్యత్తులో టైప్–2 డయాబెటిస్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. నేను ఇప్పుడు ఎనిమిది వారాల గర్భవతిని. గతంలో ఏడు వారాలలో మిస్క్యారేజ్ అయింది. ఈ గర్భధారణలో ఇప్పటివరకు నాకు రెండుసార్లు బ్లీడింగ్ వచ్చింది. డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలని, కొన్ని మందులు వాడాలని చెప్పారు. ఈ బిడ్డను కూడా కోల్పోతానేమో అన్న భయం నన్ను చాలా బాధిస్తోంది. – రూప, కర్నూలు.గర్భధారణలో తొలి పన్నెండు వారాలను ఫస్ట్ ట్రైమెస్టర్ అంటారు. ఈ దశ చాలా కీలకం, ఎందుకంటే ఈ సమయంలో శిశువు ముఖ్యమైన అవయవ వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి. అయితే ఇదే సమయంలో మిస్క్యారేజ్ ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో ప్రతి గర్భిణీ గమనించాల్సిన రెండు ముఖ్యమైన లక్షణాలు బ్లీడింగ్, కడుపు నొప్పి. ఫస్ట్ ట్రైమెస్టర్‌లో బ్లీడింగ్‌కు అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో చాలా సందర్భాల్లో ఇది తల్లి లేదా శిశువుకు హానికరం కాకపోవచ్చు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, ఇన్ఫెక్షన్లు, సెక్స్ తర్వాత రక్తస్రావం, హార్మోన్ల మార్పులు వంటి కారణాలు ఉండవచ్చు. అయితే ముందుగా తప్పకుండా రూల్ అవుట్ చేయాల్సిన రెండు ముఖ్యమైన పరిస్థితులు మిస్క్యారేజ్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. మీరు డాక్టర్‌ను కలిసినప్పుడు పూర్తి వైద్య చరిత్ర తీసుకుంటారు, శరీర పరీక్ష చేస్తారు, అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా శిశువు పరిస్థితిని చెక్ చేస్తారు. ఈ పరీక్షలతో బ్లీడింగ్‌కు గల అసలు కారణం ఏమిటో తెలుసుకోవచ్చు. మీ ఆరోగ్యం స్థిరంగా ఉండి, స్కాన్‌లో బిడ్డ బాగానే కనిపిస్తే, బ్లీడింగ్ పరిమాణం, కారణాన్ని బట్టి చికిత్స ఇస్తారు. ఇందులో ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, మనశ్శాంతిగా ఉండడం చాలా ముఖ్యం. అవసరమైతే ప్రొజెస్టెరాన్ మందులు కూడా ఇస్తారు, ఇవి గర్భధారణకు మద్దతు ఇస్తాయి. గతంలో మిస్క్యారేజ్ జరిగినందుకు ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి గర్భధారణ వేరు. చాలాసార్లు సరైన పర్యవేక్షణతో ఆరోగ్యంగా గర్భధారణ కొనసాగుతుంది. బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు ఆసుపత్రిలో అబ్జర్వేషన్ కోసం ఉంచవచ్చు. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండటం, డాక్టర్ సూచనలు పాటించడం చాలా ముఖ్యం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే చాలా మంది మహిళలు ఆరోగ్యంగా బిడ్డలను ప్రసవిస్తున్నారు.డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: బీపీని నియంత్రణలో ఉంచే ‘3-3-3’ రూల్ అంటే..? వైద్యులు ఏమంటున్నారంటే..)
కృత్రిమ గర్భధారణకు కృత్రిమ మేధోసాయం!
కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో ఒకటైన ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియను మరింత సమర్థంగా జరిగేలా ఇప్పుడు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తోడ్పడుతోంది. మునుపు దాదాపు పరిశోధనల్లో లేదా మరికొన్ని అంశాల్లో సహాయకారిగా ఉండే ఏఐ ఇప్పుడు వైద్యరంగంలోని చాలా విషయాల్లో తన సహాయం అందించడం పరిపాటి అయ్యింది. ఐవీఎఫ్ ప్రక్రియకు మరింత చేయూత ఇచ్చేందుకు అవసరమైన పరిజ్ఞానం సమకూర్చుకుంటోంది. ఆ వివరాలేమిటో చూద్దాం...పిల్లలు లేనివారు ఓ బిడ్డకోసం తాపత్రయపడటం మన సమాజంలో ఉన్నదే. ఇందుకు సహాయపడే కృత్రిమ గర్భధారణ ప్రక్రియల్లో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ఒకటి.ఐవీఎఫ్ అంటే... ఐవీఎఫ్ ప్రక్రియలో మొదట మహిళ అండాశయాల నుంచి అండాలను సేకరించి వీర్యకణంతో కృత్రిమంగా ఫలదీకరణం జరిగేలా చూస్తారు. దంపతులు కలిసినప్పుడు ఏదైనా కారణాలతో మహిళలో నేచురల్‌గా ఫలదీకరణం జరగనప్పుడు డాక్టర్లు ఇలా బయటే ఫలదీకరణ జరిగేందుకు సహాయపడుతుండటంతో దీన్ని ‘అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ’ (ఏఆర్టీ) అంటారు. ఫలదీకరణ లోపలే జరగకపోవడానికి కారణాలంటే... మహిళల్లో ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకు΄ోవడం, ఎండోమెట్రియాసిస్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) లేదా ఓవరీ తాలూకు సమస్యలుండటం, నిర్దిష్టంగా ఇదీ సమస్య అని తెలియని కారణాలు ఉండటం. అదే పురుషుల విషయంలో వీర్యకణాల సంఖ్య (స్పెర్మ్ కౌంట్) తక్కువగా ఉండటం. ఈ సమస్యలున్నప్పుడు ఫలదీకరణ జరిగేందుకు బయటే ఐవీఎఫ్ జరిగేలా చూస్తారు.ఎలా చేస్తారంటే... సంక్లిష్టమైన ప్రక్రియ అయి ఐవీఎఫ్‌ను అనేక అంచెల్లో చేయాల్సి ఉంటుంది. మొదట హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి మహిళలో అండాలు పెరిగేలా చూస్తారు. మామూలుగానైతే మహిళలో నెలకు ఒక అండమే పెరుగుతుంది. ఇలా అనేక అండాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్ ఇవ్వడాన్ని ‘కంటెయిల్డ్ ఒవేరియన్ స్టిమ్యులేషన్’ అంటారు. ఇలా అండాలు పెరిగాక ఒక సూదిలాంటి పరికరంతో ‘ఫాలికిల్’ నుంచి వాటిని బయటకు తెస్తారు. అటు తర్వాత ఆ అండాలను ఓ ఇంక్యుబేటర్లోకి ప్రవేశపెడతారు. ఆపైన ఆ అండాల్లోకి శుక్రకణాలను ఇంజెక్ట్ చేస్తారు. ఇలా ఇంజెక్ట్ చేయడాన్ని ‘ఇంట్రా సైటో΄్లాసమిక్ స్పెర్మ్ ఇంజెక్షన్’ (ఐసీఎస్ఐ) అంటారు. ఫలదీకరణం అయిన అండం ఇక ‘పిండం’ (ఎంబ్రియో)గా మారుతుంది. బయట కృత్రిమంగా ఫెర్టిలైజ్ చేశాక... ఇక ఆ పిండాన్ని (ఎంబ్రియోను) గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) ద్వారా గర్భసంచిలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియను ‘ఎంబ్రియో ట్రాన్స్ఫర్’ అంటారు. తాజా పిండాన్ని మహిళ గర్భసంచిలోకి ప్రవేశపెట్టడాన్ని ‘ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంబ్రియో’ అంటారు. కొన్ని సందర్భాల్లో నిల్వ చేసిన ఎంబ్రియోలను మహిళ గర్భసంచిలోకి ప్రవేశపెడితే దాన్ని ‘ఫ్రోజెన్ ట్రాన్స్ఫర్’ అని అంటారు. ఇలా మహిళలోకి ప్రవేశపెట్టిన పిండాన్ని గర్భసంచి ఆమోదించి, తనలో నేచురల్‌గా పెరిగేందుకు అనుమతిస్తే ఇక ఆ ప్రెగ్నెన్సీ మామూలు గర్భవతిలోలాగే పెరుగుతుంది. ఐవీఎఫ్‌లో జరిగేది ఇదే.ఏఐ సహాయం ఎక్కడెక్కడ...ఇప్పుడు ఐవీఎఫ్లోని అనేక దశల్లో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) సహాయం చేస్తోంది. అదెలాగంటే... ∙హార్మోన్ ఇంజెక్షన్స్ ఏవేవి ఎంత మోతాదులో ఇవ్వాలో నిర్ణయించడం కృత్రిమంగా పెరిగిన అనేక అండాలలో నాణ్యమైన వాటి ఎంపిక పార్టనర్ వీర్యకణాల్లోనూ నాణ్యమైన వాటి ఎంపిక టైమ్–లాప్స్ ఎంబ్రియో ఇమేజింగ్ సిస్టమ్స్... అంటే ఇందులో పిండం (ఎంబ్రియో) డిస్టర్బ్ కాకుండా ఉండేలా చూస్తూ... కొన్ని అడ్వాన్స్డ్ కెమెరాల సహాయంతో... ఆ ప్రక్రియ ఎలాంటి అంతరాయాలూ లేకుండా జరుగుతోందా లేదా అనే అంశాన్ని పరిశీలించడం. ఈ డేటా సహాయంతో నాణ్యమైన ఎంబ్రియోను సూచించడం.భవిష్యత్తులో మరింత పురోగతి... ఏఐ పరిజ్ఞానాన్ని మరిన్ని అంశాల్లో మరింత లోతుగా ఉపయోగించుకోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యనిపుణులు భావిస్తున్నారు. వాటిలో కొన్ని... ∙గర్భధారణ ఏ మేరకు విజయవంతం కాగలదనే అంశాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం ∙ల్యాబ్‌లలో జరిగే ప్రక్రియలు మరింత తేలిగ్గా / సులువుగా జరిగేందుకు తగిన సాంకేతికతను అభివృధ్ధి చేసుకోవడం (ఎంబ్రియాలజీ ల్యాబ్ ఆటోమేషన్) మహిళ దేహంలో జరుగుతున్న హార్మోనల్ మార్పులను పరిశీలించడం (డిజిటల్ పేషెంట్ మానిటరింగ్) ∙రోబోటిక్స్ సహాయంతో ప్రక్రియలు మరింత సునిశితంగా / ఖచ్చితత్వంతో జరిగేలా చూడటం ∙తనకు డాక్టర్ ఇచ్చిన సూచనలను మహిళ ఖచ్చితంగా పాటిస్తోందా లేదా అన్నది పరిశీలించడం (రియల్ టైమ్ అప్డేట్) ∙అండాలు/పిండాల నిల్వలో (క్రయోప్రిజర్వేషన్)లో గణనీయమైన మెరుగుదల.ఏఐ సహాయంతో ఇవీ ప్రయోజనాలు...మెరుగైన గర్భధారణ ఫలితాలు: నాణ్యమైన ఎంబ్రియో ఎంపికతో గర్భధారణకు మెరుగైన అవకాశాలు ప్రమాదాలు / ముప్పులు తగ్గడం : దేహానికి కోత / గాటు పెద్దగా లేకపోవడంతో (అతి తక్కువ ఇన్వేసివ్ పద్ధతుల వల్ల) తక్కువ నొప్పి, తక్కువ ముప్పు (రిస్క్) సునిశితత్వం / ఖచ్చితత్వం: ల్యాబ్ ప్రక్రియలన్నీ సమర్థంగా జరిగేలా చూడటం ద్వారా మానవ తప్పిదాలను తగ్గించడం. చివరగా... ఐవీఎఫ్ అన్నది ఇప్పటికీ కొంత ఖరీదైన ప్రక్రియే. ఈ ప్రక్రియలో వేగాన్నీ, సునిశితత్వాన్ని, ఖచ్చితత్త్వాన్ని పెంచడం ద్వారా ఫలదీకరణ అవకాశాలు మరింత మెరుగుపరచడం, తద్వారా ఖర్చులు తగ్గించడం సాధ్యమవుతుంది. ఇలా ఏఐ సహాయంతో భవిష్యత్తులో ఐవీఎఫ్ మరింత ఫలవంతంగా రూపొందే అవకాశముంది.నిర్వహణ : యాసీన్ (చదవండి: ప్రతీక్ యాదవ్ మరణానికి కారణమైన ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ అంటే?)
పేరెంట్ మార్క్ స్కాలర్షిప్స్
సంస్థలు ఇచ్చేది మార్కులకు స్కాలర్షిప్. కాని తల్లిదండ్రులు ఇవ్వాల్సింది బతుకుకు స్కాలర్షిప్. ఈ సెలవుల్లో పిల్లలకు నేర్పాల్సిన ఆరు లక్షణాలు: 1. కుతూహలం 2. ఓర్పు 3. సహానుభూతి 4. శ్రమ 5. ఓటమి ఒప్పుకోలు 6. కృతజ్ఞత... రోజుకో గంట. సెలవులు మరో 30 రోజులు. ఎలా నేర్పాలో చదవండి. చివరి రోజు ‘స్కాలర్షిప్ సర్టిఫికెట్’ ఇచ్చి వాళ్లు కోరిన సబబైన కానుక ఇవ్వండి. అదే అసలైన వేసవి ఫలితం. వేసవి సెలవులు ఇంకో 30 రోజులున్నాయి. ఆటలూ పాటలూ సరే. వాటితోపాటు కొన్ని వ్యకిత్వ గుణాల్లో కూడా తర్ఫీదు ఇవ్వాలి. మార్కుల కోసం హితవు చెప్పినట్టే ఈ లక్షణాల పెంపు కోసం కూడా హితవు చెప్పాలి. అందుకు స్కాలర్షిప్లు ప్రకటించండి. పిల్లల్లో ఆరు ఉత్తమ లక్షణాలను నాటి, పెంచి, సెలవులు అయిపోయే రోజు ‘స్కాలర్షిప్’ పేరుతో వాళ్లు అడిగిన సబబైన కానుక ఇవ్వండి. ఆ కానుక అందుకునే సమయానికి పిల్లలు ‘మనిషి’గా తయారై ఉంటారు. అదీ సంతోషం. ఇంతకీ ఆ ఆరు లక్షణాలు ఏంటి? 1. కుతూహలం: ప్రశ్నించే గుణం లేకపోతే నేర్చుకునేది ఏదీ ఉండదు. ‘ఎందుకు? ఏమిటి? ఎలా? అని అడిగే ధైర్యం నీలో ఉండాలి’ అని చెప్పాలి. ఇలా నేర్పాలి: రోజూ ‘ఈ రోజు నువ్వు అడిగే మూడు ప్రశ్నలు’ అని ఒక పేపర్ ఇవ్వండి. అందులో ప్రశ్నలు మీరే రాయండి. సూర్యుడు ఎందుకు ఎర్రగా ఉంటాడు? ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఇలా. జవాబు తెలుసుకోమనండి. ‘జవాబు నాక్కూడా తెలీదు, కలిసి వెతుకుదాం పద’ అనండి. నెట్లో కాదు. లైబ్రరీకి తీసుకెళ్లండి. ప్రశ్న లేకపోతే జీవితమే ప్రశ్నార్థకవుతుందని తెలియచేయండి.2. ఓర్పు: రీల్స్, షార్ట్స్ యుగంలో పిల్లలకు పది సెకన్ల కన్నా ఎక్కువ వేచి చూసే ఓపిక ఉండటం లేదు. ఓర్పు లేని వాడు చదువులో, ఉద్యోగంలో, జీవితంలో సమస్యలు ఎదుర్కొంటాడు. అన్నీ క్షణాల్లో జరిగిపోవాలి అనే భావన సరికాదని తెలియచేయండి.ఇలా నేర్పాలి: ఒక మొక్క నాటించండి. రోజూ నీళ్లు పోయమనండి. ‘రేపటికి రేపు పండ్లు రావు. దానికి కొంత సమయం పడుతుంది’ అని చెప్పండి. ఓపిగ్గా చేయాల్సిన పజిల్స్, చెస్‌లో ఉంచండి. వంట చేయడం నేర్పండి. ‘సేమ్యా పాయసం ఉడకడానికి 20 నిమిషాలు ఆగాలి’ అని రుచి చూపించండి. ఈలోపు అతడు ఏడ్చినా, గొడవ చేసినా వెంటనే ఫోన్ ఇవ్వకండి. ‘ఐదు నిమిషాలు ఆగితే ఇస్తా’ అనండి. ఓర్పుకు రివార్డ్ ఇవ్వండి. 3. సహానుభూతి: ‘సాటివాడికి నొప్పి అయితే నాకూ నొప్పే’ అనే భావన కలిగించాలి. క్లాస్‌లో 95 శాతం మార్కులు తెచ్చుకుని అన్ని మార్కులు రాని వారితో కలవకపోతే, వారిని సహానుభూతితో చూడకపోతే ఒంటరిగా మిగలక తప్పదని చెప్పండి. రేపు ఉద్యోగమైనా అంతే అని చెప్పండి. ప్రపంచాన్ని నడిపేది ఐక్యూ కాదని; ఈ.క్యూ (ఎమోషనల్ కోషియెంట్) అని చెప్పండి.ఇలా నేర్పాలి: పనిమనిషి, పాలవాడు, చెత్త ఎత్తే అన్నతో మాట్లాడించండి. ‘వాళ్ల పిల్లలు ఏం చదువుతున్నారు?’ అని అడగమనండి. వీధికుక్కకు, పక్షులకు నీళ్లు పెట్టమనండి. ‘దానికి దాహం అవుతుంది’ అని చెప్పండి. టీవీలో యుద్ధం వార్త వస్తే ‘అక్కడ పిల్లలు స్కూల్‌కి వెళ్లలేరు కదా’ అని చర్చ పెట్టండి.4. శ్రమ: ‘నా పని నేను చేసుకుంటా’ అనే దర్జా కలిగి ఉండటమే జీవితం అని నేర్పండి. ఫోన్లో మీటలు నొక్కుతూ ఏ.సి. రూమ్‌లో కూర్చుని ఆర్డర్ వేస్తే అన్నీ ముంగిటకొస్తాయనుకునే తరం తయారవుతోంది. ఇలాంటి వారు డేటా అయిపోయినా, కరెంట్ లేకపోయినా, స్విగ్గీబాయ్ రాకపోయినా మిడిగుడ్లేస్తారు. ఇలా నేర్పాలి: వాళ్ల పక్క వాళ్లతోనే సర్దించండి. ప్లేట్ కడిగించండి. వారానికి ఒకరోజు ‘నో స్విగ్గీ డే’. కలిసి అన్నం వండండి, చపాతీలు చేయించండి. తల్లి, తండ్రి ఎంత శ్రమ చేస్తారో ఆఫీస్, షాప్, పొలం చూపించండి. ‘ఇంట్లో ఫ్యాన్ తిరగడానికి బయట నాన్న ఎంత చెమటోడుస్తున్నాడో’ చూపించండి.5. ఒప్పుకునే గుణం ‘ఓడిపోయా. తప్పు నాదే. నెక్ట్స్ ట్రై చేస్తా’ అనిపించే తత్త్వం పిల్లల్లో ముఖ్యం. 99 మార్కులు వచ్చి ఒక మార్కుతో ఫస్ట్ ర్యాంక్ పోతే కుంగిపోయే పిల్లలున్నారు. ఆటల్లో ఓడిపోతే బ్యాట్ విరగ్గొడుతున్నారు. జీవితం ర్యాంకుల గేమ్ కాదు పడి లేచే గేమ్ అని వారికి తర్ఫీదు ఇవ్వండి.ఇలా నేర్పాలి: వాళ్లతో కలిసి క్యారమ్స్, చెస్ ఆడండి. కావాలని ఓడించండి. ‘ఓటమి కొత్త గేమ్‌కి టికెట్’ అని చెప్పండి. మీరు కూడా చేసిన తప్పులు, పొరపాట్ల వల్ల ఓడిపోయిన ఉదంతాలు చెప్పండి. ‘నాన్న కూడా ఒకసారి ఫెయిల్ అయ్యాడు’ అనండి. ‘ట్రై’ అనే మాటకు చాలా బలం ఉందని చెప్పండి. ఓడినా గెలిచినవారి కథలు వినిపించండి.6. కృతజ్ఞత: ‘ఇది నాకు ఊరికే రాలేదు’ అని గుర్తించే పిల్లలూ, గుర్తుంచుకునే పిల్లలే ముందుకు వెళతారు. అన్నీ ఉన్నా ‘ఇంకా ఏం లేదు’ అని ఏడ్చే పిల్లలు ఉంటున్నారు. ఉన్నదానితో సంతృప్తి పడటం లేదు. కృతజ్ఞత లేని వాడు ఎప్పటికీ సంతోషంగా ఉండడని చెప్పాలి.ఇలా నేర్పాలి: రాత్రి పడుకునే ముందు ‘ఈ రోజు నీకు నచ్చిన మూడు మంచి విషయాలు’ చెప్పమనండి. అన్నం తిన్నాను, సినిమాకు వెళ్లాను, ఫ్రెండ్ బ్యాట్‌తో ఆడుకున్నాను – ఇలా ఏదైనా. అన్నం వండిన అమ్మకు, సినిమా కు డబ్బు ఇచ్చిన నాన్నకు, బ్యాట్ ఇచ్చిన ఫ్రెండ్‌కు మనసులో థ్యాంక్స్ చెప్పుకోమనండి. ‘థ్యాంక్యూ కార్డ్’ చేయించండి. ‘గ్లాస్ నీళ్లు ఇచ్చినందుకు థ్యాంక్స్‌రా’ అనండి. పిల్లలూ నేర్చుకుంటారు. ముగింపు – స్కాలర్షిప్ డేసెలవులు అయిపోయే రోజు ఇంట్లో చిన్న ఫంక్షన్. ‘నెల రోజుల స్కాలర్షిప్ ప్రోగ్రాం కంప్లీటెడ్’ అని సర్టిఫికెట్ మీ చేత్తో రాసి ఇవ్వండి. ‘నువ్వు స్కాలర్షిప్ గెలిచావ్. నీకు ఈ టెలిస్కోప్’ అని ఇవ్వండి. ఆ కానుక విలువ 500 కావచ్చు, 5000 కావచ్చు. ఎన్ని లక్షణాల్లో బాగా తర్ఫీదు అయ్యారో ఆ ప్రతి లక్షణానికి ఒక సర్టిఫికెట్, బహుమతి ఇవ్వండి. ఇవి జీవితాంతం గుర్తుంటాయి. ఆ లక్షణాలను కాపాడుకునేలా చేసి జీవితాంతం నడిపిస్తాయి.
అంతర్జాతీయం
గగనతలంలో మోదీకి స్వీడన్ యుద్ధ విమానాల ఎస్కార్ట్
గోతెన్‌బర్గ్: ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల యూరప్ పర్యటనలో భాగంగా స్వీడన్‌లోని గోతెన్‌బర్గ్ చేరుకున్నారు. విమానాశ్రయంలో మోదీకి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనకు ఉన్న భౌగోళిక రాజకీయ ప్రాధాన్యాన్ని సూచిస్తూ స్వీడన్ గగనతలంలోకి ప్రధాని మోదీ విమానం ప్రవేశించిన సమయంలో ఆ దేశ గ్రిపెన్ యుద్ధ విమానాలు భద్రత కల్పించాయి.గ్రిపెన్ యుద్ధ విమానం గగనతల రక్షణ, శత్రు లక్ష్యాలపై దాడులు, గూఢచారి సమాచార సేకరణ వంటి పలు విధుల్లో ఉపయోగపడుతుంది. అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ సాంకేతికత, క్షిపణి దాడి సామర్థ్యాలు ఇందులో ఉన్నాయి.ఈ విమానాలకు వేగంగా టేకాఫ్ తీసుకోవడం, చిన్న రన్‌వేలపై కూడా పనిచేయడం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో హైవేలపై నుంచి కూడా ఆపరేట్ చేసేలా దీనిని రూపొందించారు. గ్రిపెన్లో అధునాతన డేటా లింక్ వ్యవస్థ ఉంది. దీని ద్వారా ఇతర యుద్ధ విమానాలు, ఆర్మీ, రాడార్ కేంద్రాలతో వేగంగా సమాచార మార్పిడి జరుగుతుంది.స్వీడన్లో 2 రోజుల పర్యటన స్వీడన్ నేలపై అడుగుపెట్టిన ప్రధాని మోదీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్ పర్యటనల్లో కీలక దౌత్య కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చిన ఉత్సాహంతో కనిపించారు. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ మే 17-18 తేదీల్లో స్వీడన్లో పర్యటిస్తున్నారు.ఈ రెండు రోజుల కీలక పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త మార్పులకు దారి తీసే అవకాశం ఉంది. వాణిజ్యం, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ టెక్నాలజీలు, అభివృద్ధి చెందుతున్న రంగాలకు కొత్త ఊపు ఇవ్వనుంది. ఈ సమావేశాన్ని కీలక దౌత్య ఘట్టంగా భావిస్తున్నారు. ఎన్నో ఏళ్ల విరామం తర్వాత భారత ప్రధాని నార్డిక్ (ఉత్తర యూరప్ ప్రాంతంలో ఉన్న దేశాల సమూహం) దేశంలో పర్యటన చేపడుతున్నారు. నార్డిక్ దేశాల్లో స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ దేశాలు ఉంటాయి.“2018లో జరిగిన తొలి ఇండియా-నార్డిక్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని గతంలో స్వీడన్ పర్యటించారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, ప్రధాని క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. భారత్-స్వీడన్ సంబంధాలన్నింటినీ సమీక్షించి కీలక రంగాల్లో కొత్త సహకార అవకాశాలను గుర్తించనున్నారు.ఈ ఉన్నతస్థాయి చర్చలు భారత్, స్వీడన్ మధ్య ఆర్థిక, వాణిజ్య సత్సంబంధాన్ని మరింత బలోపేతం చేసే అవకాశముంది. సాంప్రదాయ వాణిజ్య రంగాలకే పరిమితం కాకుండా.. గ్రీన్ మార్పు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలు, స్టార్టప్‌లు, సరఫరా వ్యవస్థల బలోపేతం, రక్షణ తయారీ, అంతరిక్ష సహకారం, వాతావరణ చర్యలు, ప్రజల మధ్య సంబంధాల బలోపేతంపై కూడా చర్చలు జరగనున్నాయి.ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో యూరప్‌లో ప్రముఖ దేశంగా స్వీడన్‌కు గుర్తింపు ఉంది. భవిష్యత్ రంగాల్లో వ్యూహాత్మక సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.#WATCH | Swedish Gripen fighter jets escort PM Narendra Modi’s plane as he enters SwedenPM Modi is visiting Gothenburg, Sweden, on May 17-18 at the invitation of Swedish Prime Minister Ulf Kristersson. pic.twitter.com/m2Rgoxg3x8— ANI (@ANI) May 17, 2026
పశ్చిమాసియా యుద్ధం.. ఇరాన్‌కు అమెరికా ఐదు షరతులు
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ అణు చర్చలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరాన్‌కు అమెరికా ఐదు కీలక షరతులను విధించింది. వాటిలో ప్రధానంగా 400 కిలోల యురేనియం అమెరికాకు అప్పగించాలి. ఇరాన్లో ఒక్క అణు కేంద్రం మాత్రమే కొనసాగాలి. గత ఆంక్షల వల్ల కలిగిన నష్టాలకు ఎటువంటి పరిహారం ఇవ్వబోం. విదేశాల్లో స్తంభించిన ఇరాన్ ఆస్తుల్లో 25 శాతం కూడా విడుదల చేయదు. అలాగే వివిధ యుద్ధ రంగాల్లో శాంతి కొనసాగింపుపై చర్చలు జరగాలి అని స్పష్టం చేసింది.ఈ డిమాండ్లపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బదులుగా, ఇరాన్ తన షరతులను ప్రకటించింది. లెబనాన్ సహా అన్ని యుద్ధ రంగాల్లో శాంతి కొనసాగించాలి. అన్ని ఆంక్షలను తొలగించాలి. విదేశాల్లో స్తంభించిన నిధులను విడుదల చేయాలి. యుద్ధ నష్టాలకు పరిహారం ఇవ్వాలి. అలాగే హర్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి అని తెలిపింది.ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ మాట్లాడుతూ.. అమెరికా-ఇజ్రాయెల్‌లు శాంతి పేరుతో యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. సంక్షోభాన్ని సృష్టించి, దాన్ని శాంతి పేరుతో మరింత పెంచడం అమెరికా-ఇజ్రాయెల్‌ల పాత పద్ధతి అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. తమ ప్రతిపాదనలకు అమెరికా అంగీకరించకపోతే ఆ దేశ చెల్లింపు దారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్‌ను తీవ్రంగా కుదిపేశాయి. ప్రతిగా, ఇరాన్ హర్మూజ్ జలసంధి మార్గాలను అడ్డుకోవడంతో ప్రపంచ ఇంధన సరఫరా దెబ్బతింది. ఏప్రిల్ 8న పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో తాత్కాలిక కాల్పుల విరమణ కుదిరినా, శాశ్వత శాంతి ఒప్పందం సాధ్యం కాలేదు. ఇరాన్ సైన్యం అమెరికా మరోసారి దాడి చేస్తే మరింత తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని పునరుద్ఘాటించింది.
రష్యాలో కలకలం.. భారీగా డ్రోన్ దాడులు.. నలుగురి మృతి
మాస్కో సహా రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులు చేసింది. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడాది వ్యవధిలో రష్యాపై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని అధికారులు వివరించారు. ఆదివారం రష్యా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మాస్కోలో ముగ్గురు మృతిచెందగా, ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని బెల్గొరోడ్లో మరో వ్యక్తి చనిపోయాడు.మాస్కో గవర్నర్ ఆండ్రే వోరోబ్యోవ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగర ఉత్తర భాగంలోని ఖిమ్కిలో ఓ ఇంటిపై డ్రోన్ దాడి జరగగా ఓ మహిళ మృతి చెందింది. శిథిలాల కింద మరో బాధితుడు ఉన్నాడని తెలుస్తోంది. మైటిష్చి జిల్లాలోని పొగొరెల్కి గ్రామంలో మరో ఇద్దరు చనిపోయినట్లు ఆయన తెలిపారు. దాడుల్లో అపార్ట్మెంట్ భవనాలు, మౌలిక సదుపాయ కేంద్రాలు దెబ్బతిన్నాయని వోరోబ్యోవ్ తెలిపారు.మాస్కో మేయర్ సెర్గెయ్ సోబ్యానిన్ను ఉటంకిస్తూ రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మాస్కోను లక్ష్యంగా చేసుకున్న 81 డ్రోన్లను రాత్రికిరాత్రే గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. మాస్కో చమురు శుద్ధి కేంద్రం సమీపంలో కొందరు గాయపడ్డారు. శుద్ధి కేంద్రం పనులు ఆగలేదని, 3 ఇళ్లు దెబ్బతిన్నాయి.రష్యా రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ 556 డ్రోన్లను అడ్డుకున్నారు. మాస్కోలోని అతిపెద్ద షెరెమెత్యేవో విమానాశ్రయం పరిధిలో డ్రోన్ శకలాలు పడినప్పటికీ ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం ముగింపు దశకు చేరవచ్చని సూచించిన తర్వాత ఈ దాడులు జరిగాయి. గత వారం ట్రంప్ మాట్లాడుతూ యుద్ధం ఆపేందుకు రష్యా, ఉక్రెయిన్ త్వరలో ఒప్పందానికి వస్తాయని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.ఇదే సమయంలో ఉక్రెయిన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై రష్యా దాడులు కొనసాగాయి. ఖార్కివ్ ప్రాంతంలో గత 24 గంటల్లో 15 ప్రాంతాలను రష్యా బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయని, ఏడుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.దక్షిణ ఖెర్సోన్ ప్రాంతంలో శనివారం ఉదయం ఇన్హులెట్స్ గ్రామంపై రష్యా డ్రోన్ పేలుడు పదార్థాలు వదలగా 36 ఏళ్ల వ్యక్తి మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.
యువతులపై ఆగని ఆగడాలు.. అలా చేస్తే పెళ్లికి అంగీకారమే
కాబూల్: మహిళలపై తాలిబన్ల ఆంక్షలు ఎంతమాత్రమూ ఆగడం లేదు. పెళ్లిడుకు వచ్చిన అమ్మాయిలు వివాహ విషయమై మౌనంగా ఉంటే పెళ్లికి అంగీకరించినట్లు భావించాలని కొత్త చట్టాన్ని తెచ్చారు. ఇది వరకే ఆరో తరగతి తరవాత బాలికలకు చదువుకోవడం నిషేదించిన తాలిబన్లు ఇప్పుడు మరో కఠిన చట్టం అమలులోకి తెచ్చారు.తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంజాదా భార్యాభర్తల విడిపోవడానికి సంబంధించిన సూత్రాలు అనే 31 నిబంధనల జీవోలో ఈ విషయాలను పొందుపరిచారు. అందులో వివాహ దశకు వచ్చిన అమ్మాయి తన వివాహ విషయమై మౌనంగా ఉంటే, దానిని వివాహానికి ఆమె అంగీకరించినట్లుగానే పరిగణించవచ్చని చట్టాన్ని తీసుకవచ్చారు. బాల్య వివాహాలపై హక్కులు పూర్తిగా తండ్రులు, తాతలకు ఇవ్వబడినట్లు పేర్కొన్నారు. బాల్యంలో జరిగిన వివాహాలను బాలికలు రజస్వల అయిన తర్వాత రద్దు చేసుకోవచ్చని దానికి తాలిబాన్ కోర్టు ఆమెదం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.అయితే అఫ్గానిస్థాన్ లో బాలికలపై జరుగుతున్న ఆగడాలపై వచ్చిన నివేదికలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం అప్పులు తీర్చడానికి లేదా ఆర్థిక సహాయం కోసం పసిపిల్లలను పెళ్లి చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారని తెలిపాయి. బ్రిటిష్ వార్తా సంస్థ 'జిబి న్యూస్'నివేదికల ప్రకారం భార్య శరీరంపై గాయాలు కనిపించనంత వరకు భర్తలు వారిని శారీరకంగా శిక్షించవచ్చు. మహిళలపై కఠిన చట్టాలు కాగా తాలిబన్లు ఇదివరకే మహిళలపై పలు కఠినచట్టాలు అమలులోకి తెచ్చారు.బాలికలు 6వ తరగతి దాటిన తర్వాత పాఠశాలలకు వెళ్లడాన్ని నిషేధించారు.యూనివర్సిటీల బంద్: మహిళలు ఉన్నత విద్య (యూనివర్సిటీలు) అభ్యసించకుండా పూర్తిగా నిషేధం విధించారు. దీనివల్ల ఆ దేశంలో మహిళా డాక్టర్లు, టీచర్లు తయారయ్యే అవకాశం దాదాపు లేకుండా పోయింది.మహిళలు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేయడాన్ని నిలిపివేశారు. కేవలం కొద్దిమంది ఆరోగ్య రంగ సిబ్బందికి మాత్రమే మినహాయింపులు ఉన్నాయి.మహిళలు ఒంటరిగా సుదూర ప్రయాణాలు చేయకూడదని మగవారి తోడు తప్పనిసరని పేర్కొన్నారు.మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వడం నిలిపివేశారు.పార్కులు, జిమ్‌లు, బ్యూటీ పార్లర్లు, వినోద ప్రదేశాలకు మహిళలు వెళ్లకుండా పూర్తిగా నిషేధించారు. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు తల నుండి కాళ్ల వరకు పూర్తిగా కప్పేసేలా హిజాబ్ లేదా బురఖా ధరించడం తప్పనిసరి చేశారు
జాతీయం
‘బెయిల్ మీ ఇష్టమా?’.. కింది బెంచ్‌లపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థలో సంచలనం రేకెత్తించేలా భారత అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఒక కీలక తీర్పును వెలువరించింది. ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) అంటే ‘ఉపా’ (UAPA) చట్టం కింద నమోదైన కేసుల్లోనూ ‘బెయిల్ పొందడం ఒక నియమం’ అని, విచారణ లేకుండా సుదీర్ఘకాలం జైలులో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. ముఖ్యంగా ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్ కు బెయిల్ నిరాకరించిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీంతో ఉమర్ ఖాలిద్‌కు బెయిల్ దక్కే అవకాశాలు మెరుగుపడ్డాయి. గతంలో ‘కేఏ నజీబ్’ కేసులో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును కింది బెంచ్‌లు పట్టించుకోకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పులను న్యాయవ్యవస్థలో కీలక మార్గదర్శకాలుగా భావిస్తారు. అలాంటి తీర్పులు చట్టపరమైన స్పష్టతను తీసుకురావడమే కాదు, దిగువ బెంచ్‌లకు దిశానిర్దేశం చేస్తాయి. ఇద్దరు జడ్జిల బెంచ్ ఏదైనా అంశాన్ని విచారించే సమయంలో పెద్ద బెంచ్ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోవడం న్యాయసూత్రాల్లో భాగం. పెద్ద ధర్మాసనం అభిప్రాయాన్ని పక్కన పెట్టి భిన్నంగా వ్యవహరించొద్దు. చిన్న బెంచ్‌లు పెద్ద ధర్మాసనం నిర్దేశించిన సూత్రాలను అనుసరించడం న్యాయపరమైన బాధ్యతగా భావిస్తారు. ఈ విషయాన్నే సుప్రీంకోర్టు కాస్త ఘాటుగా చెప్పింది.విస్తృత ధర్మాసనం తీర్పులను ధిక్కరిస్తారా?జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. 2024లో వెలువడిన ‘గుర్విందర్ సింగ్’, ఉమర్ ఖాలిద్ కు సంబంధించిన ‘గుల్ఫిషా ఫాతిమా’ కేసుల్లో ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన తీర్పులపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. 2021లో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ‘కేఏ నజీబ్’ కేసులో ఇచ్చిన తీర్పుకు ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ భుయాన్ పేర్కొన్నారు. విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పులకు కట్టుబడి ఉండాల్సిందేనని, చిన్న బెంచ్‌లు వాటిని తక్కువ చేయడం న్యాయ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు ఘాటుగా మందలించింది.‘ఉపా’ కేసుల్లోనూ బెయిల్ ప్రాథమిక హక్కేఉపా చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ, ‘బెయిల్ ఇవ్వడమే నియమం.. జైలులో ఉంచడం మినహాయింపు’ అనే సూత్రం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 21 కల్పించే వ్యక్తిగత స్వేచ్ఛా హక్కును ఉపా చట్టంలోని కఠినమైన సెక్షన్ 43D(5) కూడా అడ్డుకోలేదని పేర్కొంది. కేవలం ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే సాకుతో, నిందితులను ఏళ్ల తరబడి విచారణ లేకుండా జైలులో ఉంచడం అనేది వారికి శిక్ష విధించినట్లే అవుతుందని కోర్టు హెచ్చరించింది. ఆరోపణలు ఎంత తీవ్రమైనవో, విచారణ కూడా అంతే వేగంగా జరగాలని సూచించింది.ఆరేళ్ల జైలు జీవితం: సయ్యద్ ఇఫ్తిఖర్ కు విముక్తిమాదకద్రవ్యాల సరఫరా ద్వారా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చారనే ఆరోపణలపై ఉపా చట్టం కింద అరెస్టై, ఆరేళ్లుగా జైలులో ఉన్న జమ్ముకశ్మీర్‌కు చెందిన సయ్యద్ ఇఫ్తిఖర్ అంద్రాబీ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. కింది కోర్టులు, హైకోర్టు ఇతనికి బెయిల్ నిరాకరించగా, సుప్రీంకోర్టు మాత్రం అతని సుదీర్ఘ జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. ఉపా కేసుల్లో నేరం రుజువయ్యే శాతం చాలా తక్కువగా ఉందని కూడా న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తుచేయడం గమనార్హం.ఇది కూడా చదవండి: మణిపూర్‌లో టెన్షన్.. బందీల కోసం బలగాలు
శబరిమల: ప్రైవేట్ హోటల్స్‌కు శాశ్వతంగా చెక్!
శబరిమల: కేరళలోని శబరిమల సన్నిధానంలో ఇకపై కలుషిత ఆహారానికి, ఇష్టారాజ్యంగా వ్యవహరించే ప్రైవేట్ హోటల్స్‌కు శాశ్వతంగా చెక్ పడనుంది. పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చే అయ్యప్ప స్వామి భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన ప్రైవేట్ కాంట్రాక్టర్ల సిండికేట్‌ను బద్దలు కొడుతూ, ఫుడ్ క్వాలిటీ కోసం ప్రముఖ విశ్వసనీయ సంస్థలను రంగంలోకి దించుతోంది.రంగంలోకి 'కుటుంబశ్రీ'.. హెల్త్ కార్డ్ తప్పనిసరిటెండర్ నిబంధనలను సమూలంగా ప్రక్షాళన చేస్తూ, పంపా, సన్నిధానం వద్ద ఉన్న ఫుడ్ సెక్టార్‌లోకి కుటుంబశ్రీ, ఇండియన్ కాఫీ హౌస్, కేటీడీసీ లాంటి సంస్థలను దేవస్వం బోర్డు ఆహ్వానిస్తోంది. ఇకపై ప్రతి హోటల్ కార్మికుడికి ‘హెల్త్ కార్డ్’ ఉండటం తప్పనిసరి. ఈ కొత్త మార్గదర్శకాలను ఏమాత్రం ఉల్లంఘించినా ఫుడ్ అవుట్లెట్లను తక్షణమే మూసివేస్తారు. ఇప్పటివరకు కేవలం తనిఖీలు, జరిమానాలతో సరిపెట్టుకున్న అధికారులు ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.కాంట్రాక్టర్ల లాబీయింగ్‌కు చెక్‘విజన్ శబరిమల’ చొరవలో భాగంగా ఈ భారీ ప్రక్షాళన జరుగుతోంది. ఇటీవల ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్ స్వయంగా జరిపిన తనిఖీల్లో పారిశుద్ధ్య లోపం, కేటాయించిన దానికంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించడం లాంటి పలు ఉల్లంఘనలు వెలుగుచూశాయి. కాంట్రాక్టర్లు లాబీయింగ్ చేస్తూ, రేట్లు తగ్గించే వరకు టెండర్లు వేయకుండా ఆపే పాత పద్ధతికి బోర్డు ముగింపు పలుకుతోంది. అవకతవకలను నివారించేందుకు టెండర్ ప్రక్రియ మొత్తాన్ని ‘ఈ-టెండరింగ్’ విధానంలోకి మార్చాలని యోచిస్తోంది. వ్యర్థాల నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది.భక్తుల సౌకర్యానికే తొలి ప్రాధాన్యతమండల-మకరవిళక్కు సీజన్లో దేవస్వం బోర్డు ఉచిత అన్నదానం చేస్తున్నప్పటికీ, వేలాది మంది భక్తులు హోటళ్లపైనే ఆధారపడుతున్నారు. అయితే ఇరుకైన దారుల్లో కొట్లు ఏర్పాటు చేయడంతో భక్తుల కదలికలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని, ఇకపై భక్తుల సౌకర్యానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని జయకుమార్ తెలిపారు. ఇక మహిళల సామూహిక సంఘమైన ‘కుటుంబశ్రీ’ విషయంలో వయసు నిబంధనలను పాటిస్తారు.ఇది కూడా చదవండి: గంగాతీరంలో హై అలర్ట్.. అసలేం జరిగింది?
మాజీ మిస్ పూణే అనుమానాస్పద మృతి : దిగ్భ్రాంతి పర్చే లాస్ట్ మెసేజెస్
భోపాల్‌లో గత వారం అనుమానాస్పద స్థితిలో మరణించిన మాజీ మిస్ పూణే , కంటెంట్ క్రియేటర్ 33 ఏళ్ల ట్విషా శర్మ మరణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు నెలల గర్భిణి అయిన ట్విషా (31) భోపాల్‌లోని అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోవడానికి ముందు తన స్నేహితులకు పంపిన చివరి సందేశాలు వాట్సాప్ చాట్ కలకలం రేపుతోంది. తొందరపడి పెళ్లి చేసుకోవద్దు అంటూ ఆమె తన స్నేహితులకు పంపిన సందేశాలు ఆమె తీవ్రమైన మానసిక ఆందోళన, ఒంటరితనం, పెళ్లి తర్వాత వేదనలో ఉన్నట్లు ఆ మెసేజ్‌ల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఆమె ఉరి వేసుకోవడానికి ఉపయోగించినట్టు చెబుతున్న బెల్టును పోస్ట్‌మార్టంకు ఎయిమ్స్ భోపాల్‌కు పంపకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ కేసును పక్క దారి పట్టిస్తున్నారంటూ భోపాల్ పోలీసులపై ఆరోపణలు కుదిపేస్తున్నాయి. దర్యాప్తు సమగ్రతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అసలు ఏం జరిగింది?నోయిడాకు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన ట్విషా శర్మ, ఢిల్లీలో ఉద్యోగం చేసేది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన లాయర్ సమర్థ్ సింగ్‌ను డిసెంబర్ 2025లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన అయిదు నెలలకే, మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన భర్త ఇంట్లో ట్విషా శవం వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం ఆమె మరణం ఉరి వేసుకోవడం వల్లే జరిగిందని తేలినప్పటికీ, ఆమె శరీరంపై పలు చోట్ల గాయాల గుర్తులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్‌మీడియా చాట్స్ కీలకంగా మారాయి.మే 7న ఒక స్నేహితురాలితో వాట్సాప్ చాట్‌లో.. "నేను ఇంట్లోనే ఖాళీగా కూర్చోవడం వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నాను. నా జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నాను. పెళ్లి కుటుంబాన్ని ఇస్తుంది, కానీ ఎక్కడున్నా మన కోసం మనం పని చేయడం ఆపకూడదు" అని పేర్కొంది. పెళ్లి చేసుకోవాలనే తొందరలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. బాగా ఆలోచించి ముందడుగు వేయండి" అని స్నేహితురాలిని హెచ్చరించింది. అలాగే తనకు ఇల్లు, స్నేహితులు బాగా గుర్తొస్తున్నారని వాపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మరో స్నేహితుడితో మాట్లాడుతూ.. "నేను చిక్కుకుపోయాను బ్రో (I am trapped bro). నువ్వు మాత్రం ఇలాంటి వాటిలో ఇరుక్కోవద్దు. నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను, సమయం వచ్చినప్పుడు కాల్ చేస్తాను" అని తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది.న్యాయం కోసం రోడ్డెక్కిన కుటుంబంట్విషా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్ (రిటైర్డ్ జడ్జి)లపై కుటుంబ సభ్యులు హత్య, కట్నం వేధింపుల ఆరోపణలు చేశారు. భర్త, అత్తమామలు ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించారని ఆరోపించారు. నిందితులు ప్రభావవంతమైన వ్యక్తులు కావడం వల్ల వారికి ముందస్తు బెయిల్ లభించిందని, దీనివల్ల స్థానిక పోలీసుల దర్యాప్తు సక్రమంగా జరగకపోవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమార్తె మరణంపై న్యాయం చేయాలని, ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS Delhi)లో మళ్లీ పోస్ట్‌మార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ట్విషా కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నివాసం వెలుపల నిరసన చేపట్టారు. భోపాల్ వచ్చినప్పటి నుండి తాము ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయడం కోసం మహిళా కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, పోలీస్ కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ట్విషా తండ్రి నవనిధి శర్మ, సోదరుడు ఆశిష్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు .స్థానిక పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరుతున్నారు.నిందితుల కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉండటంతో పాటు, వారికి సమీప బంధువైన వ్యక్తి లోకాయుక్తగా ఉండటంతో కేసును ప్రభావితం చేస్తున్నారని తండ్రి నవనిధి శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కుటుంబ సభ్యుల ప్రకారం పెళ్లయిన దగ్గర్నుంచీ ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. దీంతో తిరిగి వచ్చేయాలని ఆమె భావించింది. ఇంతలోనే ఆమె అనుమానాస్పద స్థితిలో కన్నుమూయడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త సమర్థ్ సింగ్ పరారీలో ఉన్నాడని, అతని తల్లి, రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్‌కు ముందస్తు బెయిల్ లభించిందని చెప్పారు. బెయిల్‌ను సవాలు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: విజయ్ సర్కార్ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్ నేత జోస్యం
గంగాతీరంలో హై అలర్ట్.. అసలేం జరిగింది?
హరిద్వార్: లక్షలాది మంది భక్తులు నిత్యం పుణ్యస్నానాలు ఆచరించే పవిత్ర పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రసిద్ధ ‘హర్ కీ పౌరి’ ఘాట్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ సోమవారం పోలీసులకు వచ్చిన ఒక బెదిరింపు ఫోన్ కాల్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అత్యంత రద్దీగా ఉండే ఈ ఆధ్యాత్మిక ప్రాంతంలో బాంబు హెచ్చరికల వార్త తెలియగానే నగరవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.పోలీసులను పరుగులు పెట్టించిన ఫోన్ కాల్పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని ఒక వ్యక్తి ఎమర్జెన్సీ నంబర్ 112 కు ఫోన్ చేశాడు. నాలుగు రోజుల్లో హర్ కీ పౌరి సహా హరిద్వార్‌లోని పలు కీలక ప్రాంతాలను బాంబులతో పేల్చేస్తామని బెదిరించాడు. ఈ హెచ్చరికతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేసి, నగరం నలుమూలల హైఅలర్ట్ ప్రకటించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు బహుళ పోలీస్ బృందాలను ఏకకాలంలో రంగంలోకి దించారు.లోకేషన్ ట్రేసింగ్.. నిందితుడి అరెస్ట్బెదిరింపు కాల్ రాగానే రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్, దర్యాప్తు బృందాలు ఆ ఫోన్ నంబర్, లొకేషన్‌ను ట్రేస్ చేశాయి. నిందితుడిని పౌరీ జిల్లాలోని యమకేశ్వర్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల సోహన్ సింగ్ రావత్గా గుర్తించి, వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసుల విచారణలో ఊహించని వాస్తవం వెలుగుచూసింది. తాను పీకలదాకా మద్యం సేవించి ఉన్నానని, కేవలం మత్తులోనే ఈ బాంబు బెదిరింపు కాల్ చేశానని నిందితుడు విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు.హర్ కీ పౌరి ప్రాముఖ్యతశ్రీ మహావిష్ణువు పాదముద్రలు ఉన్నాయని భావించే హర్ కీ పౌరి ఘాట్‌కు ఎంతో ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. ఇక్కడ సాయంత్రం జరిగే గంగా హారతికి, 12 ఏళ్లకోసారి జరిగే కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తుతారు. ఇంతటి పవిత్రమైన ప్రదేశంపై బెదిరింపులు రావడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. నిందితుడు సోహన్ సింగ్‌పై హరిద్వార్ నగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు హరిద్వార్ ఎస్ఎస్పీ నవనీత్ సింగ్ భుల్లర్ తెలిపారు.ఇది కూడా చదవండి: రైలు బోగీలో మహిళ మొండెం.. లక్నోలో దారుణం
ఎన్ఆర్ఐ
ఈ అనుభవంతో భారత్‌ను వెతుక్కుంటూ తిరిగొచ్చేసిన NRI
చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్‌కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్‌లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు."భారత్‌లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.భారత్‌లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్‌నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్‌లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sanjum Singh Dhaliwal | Certified Yapper (@_sangym_)
అమెరికాలో ఇద్దరు తెలుగు వాళ్లకు ఐదేళ్ల జైలు శిక్ష!
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీసాల జారీ విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అయినప్పటికీ హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతుండడం కలకలం రేపుతోంది.తాజాగా హెచ్-1బీ వీసాల పేరిట జరిగిన ఫ్రాడ్ కేసులో అమెరికాలోని ఇద్దరు తెలుగు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగరానికి చెందిన సంపత్ రాజీదీ, శ్రీధర్ మాడ ఈ ఫ్రాడ్ కేసులో భాగం అయినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లు తేలడంతో అమెరికా చట్టం ప్రకారం.. వీరికి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు దాదాపు 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 2 కోట్లు) భారీ జరిమానా విధించే అవకాశముందని తెలుస్తోంది. సంపత్ రాజీదీ అమెరికాలో రెండు వీసా ప్రాసెసింగ్ కంపెనీలను నడుపుతున్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉద్యోగాలు ఉన్నాయని ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి విదేశీయులకు హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేశారు. అలాగే శ్రీధర్ మాడ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ విభాగంలో చీఫ్ ఇన్ఫర్మేషనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అభ్యర్థులు యూనివర్సిటీ ప్రాజెక్టుల్లో పని చేస్తారని ఫేక్ పత్రాలు అందించారు. సాధారణంగా హెచ్-1బీ వీసా పొందాలంటే అమెరికాలోని ఏదైనా ఒక సంస్థలో సదరు నిపుణుడికి ఉద్యోగం కచ్చితంగా ఉండాలి. దీన్ని ఆసరాగా చేసుకున్న శ్రీధర్ మాడ.. తనకున్న అధికారంతో యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నట్లు నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించారు. ఈ విషయాలు విచారణలో తేలినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఇక జూన్ 2020 నుంచి జనవరి 2023 మధ్య ఈ ఫేక్ దందాను కొనసాగించినట్లు విచారణలో తేలింది.చదవండి: మలి విడత చర్చలు.. పాక్‌కు వెళ్లని జేడీ వాన్స్!
అరవింద కృష్ణ స్వామికి అట్లాంటా శంకర నేత్రాలయ సత్కారం
అట్లాంటా: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం Crowne Plaza Atlanta NE నార్క్రాస్లో అత్యంత ఉత్సాహభరితమైన, భారీ సంఖ్యలో ప్రజలు హాజరైన ఒక "Meet ’n Greet" (పరిచయ సమావేశం) కార్యక్రమాన్ని నిర్వహించింది. జార్జియా, పొరుగు రాష్ట్రాల నుండి 250 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం, ఆ సంస్థ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా, Medlytix LLC CEO అయిన అరవింద్ కృష్ణ స్వామిని తమ సలహా మండలి (Board of Advisors)లో సరికొత్త సభ్యుడిగా సంస్థ అధికారికంగా ఆహ్వానించింది.అట్లాంటాలోని ప్రముఖ సంగీత, నృత్య అకాడమీల సాంస్కృతిక ప్రదర్శనలు పురోహిత నరసింహాచార్యులు దివ్య సన్నిధిలో, ఈ సమావేశం అర్థవంతంగా, విజయవంతంగా జరగాలని ఆశీస్సులు కోరుతూ, అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి గారితో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా. జగదీష్ శెత్, మెగా దాతలు మరియు బ్రాండ్ అంబాసిడర్లు శ్రీ శంకర్ సుబ్రమణియన్, శ్రీ అరవింద్ కృష్ణస్వామి, శ్రీమతి జయ కృష్ణస్వామి, మరియు డా. కిషోర్ చివుకుల, సలహాదారుల మండలి సభ్యులు, కోశాధికారి మూర్తి రేకపల్లి; జె.సి. శేఖర్ రెడ్డి; పాలక మండలి సభ్యులు డా. రెడ్డి ఊరిమిండి మరియు మెహర్ లంక; సాంస్కృతిక సమన్వయకర్త నీలిమ గడ్డమనుగు; చాప్టర్ ఉపాధ్యక్షుడు వెంకీ నీలం; మరియు అట్లాంటా ఎస్ఎన్ బృందంలోని ఇతర అంకితభావం గల సభ్యులు పాల్గొన్న సాంప్రదాయ జ్యోతి ప్రజ్వలన, అనగా లాంఛనప్రాయంగా జ్యోతి ప్రజ్వలనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.అట్లాంటాలోని నాలుగు ప్రముఖ శాస్త్రీయ నృత్య, సంగీత అకాడమీలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమంతో ఈవెంట్ ప్రారంభమైంది. సుస్వర సంగీత విద్యాలయంకు చెందిన శాంతి మెడిచెర్ల, భరత దర్శన్ స్కూల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్కు చెందిన సౌజన్య మధుసూదన్, కళాక్ష్య అకాడమీకి చెందిన మిటల్ పటేల్, మరియు నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీకి చెందిన నీలిమ గడ్డమనుగు దీనికి నాయకత్వం వహించారు. ఈ సాంస్కృతిక విభాగంలో భారత్‌కు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు రాము (చెన్నై) అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ప్రతిభావంతులైన స్థానిక గాయకులు శిల్పా ఉప్పులూరి (ఈమె కార్యక్రమ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు), ఫణి డొక్కా, రామ్ దుర్వాసుల, ఉషా మోచర్ల, శాంతి మెడిచర్ల, మరియు అట్లాంటాకు చెందిన రాగ వాహినిలతో కలిసి, ఎంతో ఇష్టపడే క్లాసిక్ చిత్రాల నుండి హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో బహుభాషా మేళవింపును ప్రదర్శించి రాము ఆ సాయంత్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. బహుభాషా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ప్రదర్శనకు, అధ్యక్షులు బాల ఇందుర్తి ఆయనను ఆప్యాయంగా “ఎస్పీబీ మానసపుత్ర” అని సంబోధించారు.మొబైల్ కంటి శస్త్రచికిత్స విభాగానికి భారీ విరాళంఅరవింద్ కృష్ణస్వామికి సంబంధించిన ఆడియో-విజువల్ (AV) ప్రజెంటేషన్ ప్రదర్శించినప్పుడు, ఆయన చేసిన అద్భుతమైన $555,000 విరాళాన్ని గుర్తించి, ప్రేక్షకులు కరతాళధ్వనులతో హోరెత్తిస్తూ, లేచి నిలబడి ఘన సన్మానం (standing ovation) చేశారు. 12 MESU (Mobile Eye Surgical Unit) 'Adopt-A-Village' కంటి వైద్య శిబిరాలకు మద్దతుగా అరవింద్ $155,000 విరాళం అందించారని అధ్యక్షుడు బాల ఇందుర్తి తెలియజేశారు. అంతేకాకుండా, భారతదేశంలో వైద్య సేవలు సరిగా అందని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకచోట కొత్త MESU కేంద్రాన్ని స్థాపించడానికి అరవింద్ ఉదారంగా ప్రకటించిన $400,000 విరాళం వినియోగించబడుతుంది.మహారాష్ట్ర మరియు గుజరాత్‌లలో అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు అధ్యక్షుడు బాల, ప్రస్తుతం 'శంకర నేత్రాలయ ఇండియా' అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావుతో కలిసి సన్నిహితంగా పనిచేస్తున్నారు. డల్లాస్‌కు చెందిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు మరియు SMUలో అరవింద్ కృష్ణస్వామికి పూర్వ సహవిద్యార్థి అయిన డాక్టర్ రెడ్డి ఊరిమిండి, అరవింద్‌ను 'శంకర నేత్రాలయ USA'కు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పరోపకార నాయకత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ, ప్రసాద్ రెడ్డి కాటమ్రెడ్డితో పాటు అరవింద్ కూడా అర్ధ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించడం చూడటం గర్వకారణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర నేత్రాలయ అట్లాంటా బృంద సభ్యులలో డా. కిషోర్ రెడ్డి రాసమల్లు; రమేష్ చాపరాల, గిరి కోటగిరి; ప్యాడీ రావు, సుబ్బారావు; శ్రీనివాస్ దుర్గం; చరిత్ర జూలపల్లి; మరియు చాప్టర్ లీడ్లు కార్తికేయన్ వినాయగం మరియు లోగియ అవిలినేలి ఉన్నారు. శంకర నేత్రాలయతో తన ప్రయాణం 2016లో అప్పటి ఉపాధ్యక్షుడు డాక్టర్ శేషు శర్మ చొరవతో ప్రారంభమైందని అధ్యక్షుడు బాల తెలిపారు. ఆ సమయంలో, సంస్థకు కేవలం ఏడు శాఖలు మాత్రమే ఉండేవి; నేడు, ఇది దేశవ్యాప్తంగా ముప్పై శాఖలకు విస్తరించింది. ఈ అద్భుతమైన విస్తరణకు అంకితభావం గల బలమైన వాలంటీర్ల బృందం, వ్యవస్థాపకులు, పద్మభూషణ్ దివంగత డాక్టర్ ఎస్. ఎస్. బద్రీనాథ్ మరియు SNUSA వ్యవస్థాపకులు శ్రీ ఎస్. వి. ఆచార్యల ఆశీస్సులే కారణమని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు
న్యూయార్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న 2026న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో స్మారక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ నైతికతపై దార్శనికత మరియు బహుపాక్షికవాదానికి దాని ప్రాసంగికత’ అనే థీమ్‌తో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి,అంబాసిడర్ హరీష్ పార్వతనేని స్వాగతోపన్యాసం చేశారు. భారత పౌరులలో రాజ్యాంగ నైతికత స్ఫూర్తిని నింపడంలో డాక్టర్ అంబేద్కర్ కృషి చాలా ముఖ్యమైందన్నారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగానికి మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు మధ్య ఉన్న ఉమ్మడి అంశాలను వివరించారు. రాజకీయ విభజన, నిరంతర సంఘర్షణలతో కూడిన ఈ క్లిష్ట సమయాల్లో రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాలన్న డాక్టర్ అంబేద్కర్ పిలుపు ఎంతో సందర్భోచితమైనదని, ఇది బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడానికి, ఐక్యరాజ్యసమితిలో సమర్థవంతమైన సంస్కరణలు తీసుకురావడానికి, దాని ప్రధాన విభాగాలకు పునరుజ్జీవం పోయడానికి, ఐక్యరాజ్యసమితిని దాని ఉద్దేశ్యానికి అనుగుణంగా తీర్చిదిద్దడానికి సహాయపడుతుందని రాయబారి హరీష్ చెప్పారు.ప్రముఖ సివిల్ సర్వెంట్, ప్రముఖ అంబేద్కర్ పండితుడు అయిన డాక్టర్ రాజా శేఖర్ వుండ్రు కీలకోపన్యాసం చేశారు. రెండు ప్రపంచ యుద్ధాలను, ఐక్యరాజ్యసమితి ఏర్పాటును ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా, డాక్టర్ అంబేద్కర్ బహుపాక్షికవాదం ప్రాముఖ్యతను గుర్తించారని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం యొక్క కేంద్ర సూత్రాలను రూపొందించడంలో డాక్టర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితి చార్టర్లో పొందుపరిచిన అంతర్జాతీయ శాంతి పరిరక్షణ అనే ప్రాథమిక స్ఫూర్తి భారత రాజ్యాంగంలో కూడా ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని డాక్టర్ అంబేద్కర్ నొక్కిచెప్పారని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో, బహుపాక్షికవాదం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా అంతర్జాతీయ రాజ్యాంగ నైతికతను పెంపొందించాల్సిన అవసరం ఉందని రాజా శేఖర్ వుండ్రు అన్నారు.డాక్టర్ అంబేద్కర్ జీవితం ఒక నైతిక నిదర్శనమని, అందులో ఆయన కేవలం బాధ నుండి తప్పించుకోవడమే కాకుండా, దానిని రూపాంతరం చెందించి, ఆ గాయాన్ని జ్ఞానంగా మార్చారని హార్వర్డ్ డివినిటీ స్కూల్ విజిటింగ్ ప్రొఫెసర్, అతిథి వక్త డాక్టర్ సంతోష్ రౌత్, అభిప్రాయపడ్డారు. నేటి ప్రపంచంలో, ముఖ్యంగా బహుపాక్షికత (multilateralism) విషయంలో, డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషి మరియు ఆదర్శాల గాఢమైన ఔచిత్యాన్ని డాక్టర్ రౌత్ విశదీకరించారు. ఐక్యరాజ్యసమితి ఛార్టర్ వంటి లిఖితపూర్వక గ్రంథాల స్ఫూర్తిని ఆచరణలో పెట్టడానికి దోహదపడే శక్తిగా ఆయన నైతికతను అభివర్ణించారు.వివిధ రంగాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా హాజరయ్యారు.
క్రైమ్
ప్రేమోన్మాది మణితేజ మృతి
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన వైష్ణవిని కత్తితో అతి కిరాతకంగా హత్య చేసిన ప్రేమోన్మాది మణితేజ (29) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శనివారం వైష్ణవి తాను పనిచేస్తున్న పాఠశాలలో విధులు ముగించుకుని నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా నిందితుడు కత్తితో దారుణంగా మెడ, గొంతుపై విచక్షణా రహితంగా పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. రక్తం మరకలతో పారిపోతున్న మణితేజను స్థానికులు పట్టుకుని కాళ్లు చేతులు కట్టి వేసి దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో అతని తలపై రాళ్లు ఎత్తివేయడంతో తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన మణితేజను మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. హైదరాబాద్‌లో పరిచయం.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన మణితేజ ల్యాండ్రీ షాప్ నిర్వహించేవాడు. గతంలో వైష్ణవి ఓ హాస్టల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో విద్యార్థుల దుస్తులు ఉతికి, ఇస్త్రీచేసి అప్పగించే సందర్భంగా ఆమెతో పరిచయం ఏర్పడింది. తర్వాత వైష్ణవి అక్కడ ఉద్యోగం మానేసినా ఫోన్లో ఇద్దరూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే తాను ప్రేమిస్తున్నట్లు వైష్ణవిని వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. అయితే ఇటీవల వైష్ణవికి వెళ్లి కుదిరిందన్న సమాచారం తెలియడంతో మణితేజ తన ప్రేమను కాదన్న వైష్ణవిని హతమార్చాలని నిర్ణయించుకుని.. జడ్చర్లకు వచ్చి ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.కాగా, మణితేజ తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి, తమ్ముడు ఉన్నారు. హత్య అనంతరం వైష్ణవి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు యువకుడి ఆచూకీని గుర్తించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మణితేజ మృతి చెందాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్ నుంచి జడ్చర్లకు వచ్చారు. ఈ క్రమంలో వైష్ణవి కుటుంబ సభ్యులు, బంధువులు వారిపై దాడిచేస్తారన్న అనుమానంతో పోలీసులు వారిని జడ్చర్ల సమీపంలోని డీటీసీలో ఉంచి రక్షణ కల్పించారు. అప్పటి దాకా మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. జడ్చర్లలో వైష్ణవి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత జనరల్ ఆస్పత్రిలో మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.
ఆస్తి కోసం తల్లీకూతుళ్ల దారుణ హత్య
హాలియా: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సాయిలు, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు యాదయ్యకు సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామానికి చెందిన సుమలతతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. యాదయ్య, సుమలత (40) దంపతులకు కుమార్తె రుద్రాక్షి లావణ్య (19) సంతానం. కుమార్తె పుట్టిన ఆరు నెలలకే తండ్రి యాదయ్య మృతి చెందాడు.దీంతో సుమలత తన కుమార్తె లావణ్యతో కలిసి వేరుగా నివాసం ఉంటోంది. కాగా, రుద్రాక్షి సాయిలు, యాదయ్యకి వారసత్వంగా వచ్చిన 6 ఎకరాల వ్యవసాయ భూమిని అతని కుమార్తె లావణ్య పేరుమీద రిజిస్టర్ చేసి గార్డియన్‌గా నానమ్మ వెంకటమ్మను పె ట్టారు. కొంతకా లం తరువాత వెంకటమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. కోడలు సుమలత అత్త గురించి పట్టించుకోకపోవడంతో వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు ఆమెను ఆస్పత్రిలో చూపించగా వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలిసింది.ఈ క్రమంలో వెంకటమ్మను ఆమె కోడలు సుమలత, మనుమరాలు లావణ్య పట్టించుకోవడం లేదని వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు కోర్టులో పిటిషన్ వేశారు. గత ఏడాది లావణ్య మేజర్ అయినందున తాత సాయిలు లావణ్యకు చేసిన భూమి పట్టా విషయంలో తీర్పు అనుకూలంగా రావడంతో తమ తల్లి వెంకటమ్మకు ఆస్పత్రిలో వైద్యం కోసం ఖర్చు చేసిన రూ.30 లక్షలు ఇవ్వాలని ఆడబిడ్డలు వేసిన కేసుకు సంబంధించి రూ.5 లక్షలు ఇవ్వాలని కోర్టు రుద్రాక్షి సుమలతకు సూచించింది. సాయిలు, వెంకటమ్మ బాగోగుల విషయంలో పలుమార్లు ఆడబిడ్డలకు, సుమలతకు మధ్య తగాదాలు జరిగాయి.ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆస్తి విషయంలో ఆడపడుచులు.. సుమలత మరోమారు ఘర్షణ పడ్డారు. అనంతరం ఉదయం 9 గంటల సమయంలో సుమలత, ఆమె కూతురు లావణ్య గ్రామ శివారులోని ఆయిల్‌పామ్ తోట వద్దకు పని చేయడానికి వెళ్లారు. అక్కడే గుర్తు తెలియని వ్యక్తులు తల్లీకూతుళ్లపై విరుచుకుపడి కంట్లో కారం చల్లారు. లావణ్య మెడకు చున్నీ, సుమలత మెడకు పైటకొంగు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ తల్లీకూతుళ్ల హత్య విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా జరుగుతున్న ఆస్తి తగాదాలే తల్లీకూతుళ్ల హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి తల్లి శాంతమ్మ తన కుమార్తె, తన మనుమరాలు హత్యకు ఆమె ఆడపడుచులు, వారి భర్తలే కారణమని ఆరోపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు.
భర్త వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య
కిర్లంపూడి: నవ వధువు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ జి.సతీష్ తెలిపిన వివరాల మేరకు..కిర్లంపూడి మండలం గోనేడకు చెందిన సత్యంశెట్టి వెంకటేశులు దంపతుల మూడవ కుమార్తె వెంకటలక్ష్మి (25)కి ఏప్రిల్ 25న పిఠాపురం మండలం మర్లావకు చెందిన గాది దుర్గాకోటేశ్వరరావుతో వివాహమైంది. దుర్గాకోటేశ్వరరావు పెళ్లి జరిగిన మూడో రోజే తనకు వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ వీడియోలు, ఫొటోలు ఆమెకు చూపించాడు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి అప్పటినుంచి అన్యమనస్కంగా ఉంటోంది. ఆచారాల్లో భాగంగా మూడు సార్లు అత్తారింటికి వెళ్లి వచ్చిన ఆమె గోనేడలోని తన తల్లిదండ్రుల ఇంటివద్దే ఉంటోంది. తన భర్తకు ఉన్న అక్రమ సంబంధాల విషయాన్ని తట్టుకోలేక శనివారం రాత్రి తన గదిలోని ఫ్యానుకు చీరకట్టి ఉరి వేసుకుంది. మృతదేహాన్ని పోలీసులు ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించారు.కాగా, వెంకటలక్ష్మి తల్లిదండ్రులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఇద్దరు పిల్లలకు వివాహాలు కాగా, చిన్న కుమార్తె వెంకటలక్ష్మిని డిగ్రీ వరకు చదివించి గత నెలలోనే పెళ్లి చేశాడు. తమ బాధ్యతలు తీరాయని సంతోషపడేలోపే ఈ దారుణం జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి తల్లి సత్యంశెట్టి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త దుర్గాకోటేశ్వరరావు, అత్త నూకామణిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రేమించకుంటే చంపేస్తారా?
సాక్షి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్లో తనను ప్రేమించడం లేదని ప్రేమోన్మాది తేజ.. చేతితో గాయపడి వైష్ణవి (23) మృతి చెందింది. ఈ ఘటనలో స్థానికులు చితకబాదడంతో తీవ్రంగా గాయపడిన తేజను ఆసుపత్రికి తరలించారు. ఆ యవకుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో వైష్ణవి మృతిపై తన సోదరి అక్షయ కీలక వ్యాఖ్యలు చేసింది. తన అక్క(వైష్ణవి) గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డింది.వైష్ణవి మృతిపై తన సోదరి అక్షయ స్పందించింది. ఈ సందర్బంగా అక్షయ..‘మా సోదరి మృతిపై రకరకాల కథనాలు రావడం బాధాకరం. ఏ అమ్మాయి అయినా డబ్బులు తీసుకొని మోసం చేస్తారా?. చనిపోయే సందర్భంలో నిందితుడు చేసిన ఆరోపణను ఎలా నిర్ధారిస్తారు?. అమ్మాయిలను సమాజంలో పురుగుల్లా చూస్తున్నారు. మా అక్క గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆమె గురించి మీకేం తెలుసు?. మాకు న్యాయం చేయకపోయినా సరే కానీ ఇలాంటి ఆరోపణలు మానుకోవాలి. న్యాయం కోసం ముఖ్యమంత్రి వద్దకైనా వెళ్తాం.మా అక్కపై దాడి జరిగే సమయంలో అందరూ చూస్తూనే ఉన్నారు తప్ప ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్‌ను అలవరచుకోవాలి. ఎవరో చనిపోయారని తెలిస్తే అక్కడికి వెళ్ళాక మా అక్క అని గుర్తించాం. సామాజిక బాధ్యతగా వివరించాల్సిన అవసరం ప్రజలపై ఉంది. ప్రేమించకుంటే చంపేస్తారా?’ అని ప్రశ్నించింది.ఇదిలా ఉండగా.. బాదేపల్లి పట్టణంలోని ఎర్రసత్యం కాలనీకి చెందిన వైష్ణవి పోలేపల్లి సెజ్‌లోని ఎస్వీకేఎం స్కూల్లో రిసెప్షనిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. శనివారం విధులు ముగించుకొని సాయంత్రం 5.30 గంటల సమయంలో కాలనీలో నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న సమయంలో యువకుడు తేజ.. యువతిని వెంటాడి తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు. దీంతో, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ యువకుడు పారిపోతున్న సమయంలో స్థానికులు గమనించి వెంటాడి పట్టుకుని కాళ్లు చేతులు తాళ్లతో కట్టి వేసి చితకబాదారు. రాళ్లతో తలపై దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడకు వచ్చిన 108 అంబులెన్స్‌లో యువతిని వైద్య చికిత్స కోసం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
వీడియోలు
పెద్ది సినిమా ట్రైలర్ వచ్చేసింది..
బుర్ర ఉండి మాట్లాడుతున్నావా..!
పెట్రో బాదుడుపై పోరుబాట
RCBతో ఓటమి కన్నీళ్లు పెట్టుకున్న పాంటింగ్
పెద్ది ట్రైలర్ ఈవెంట్ లో రామ్ చరణ్ అనుభవం
ఈ తల్లి ధైర్యానికి చేతులెత్తి మొక్కాల్సిందే
అప్పుడు మా అమ్మ, చిరు సార్.. ఇప్పుడు నేను & చరణ్
అమరావతిలో తేడా జరుగుతుంది అని పవన్ కి తెలుసు
లోకేష్ ని రఫ్ఫాడించిన పేర్ని కిట్టు
బయటపడ్డ బుద్ధా వెంకన్న.. అల్లుడి అరాచకాలు కన్నీళ్లు పెట్టుకున్న బాధితుడు


