SIR ప్రక్రియ అత్యంత కీలకమైనది: సజ్జల | Sajjala Ramakrishna Reddy Meeting With YSRCP Parliamentary Observers Ahead Of SIR Exercise | Sakshi
Sakshi News home page

SIR ప్రక్రియ అత్యంత కీలకమైనది: సజ్జల

May 18 2026 3:54 PM | Updated on May 18 2026 6:06 PM

Sajjala Ramakrishna Reddy Meeting wIth YSRCP Parliamentary Observers

తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పరిశీలకులతో  పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్  సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. త్వరలో రాష్ట్రంలో ఎస్‌ఐఆర్(SIR) ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పార్లమెంటరీ పరిశీలకులతో సజ్జల సమావేశమయ్యారు. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి బీఎల్ఏ(బూత్‌ లెవెల్‌ ఏజెంట్‌లు) లు ఎలా వ్యవహరించాలనే అంశంపై దిశా నిర్దేశం చేశారు.  

దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ జూన్ 15 నుంచి ఏపీలో ఎస్ఐఆర్ ప్రారంభమవుతోంది. ఈ సర్ ప్రక్రియ అత్యంత కీలకం. బూత్ లెవల్ ఏజెంట్లు, బీఎల్ఓల మధ్య సమన్వయం ఉండాలి.. బీఎల్ఏలకు వెంటనే శిక్షణ తరగతులు ఇవ్వాలి. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలి. డ్రాఫ్ట్ స్థాయిలోనే జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు ఉండవు. 

ఎన్యూమరేషన్ పత్రాలకు ముందే బీఎల్ఏలు సిద్ధంగా ఉండాలి. ఓటర్లను కూడా చైతన్యపరచాలి. ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వకపోతే ఓటు ఉండదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. సెప్టెంబర్ వరకు అన్ని టీమ్‌లు, సీనియర్ నేతలు, ఇన్‌ఛార్జ్‌లు నిరంతర పర్యవేక్షణ చేయాలి. సమర్థంగా పనిచేసే బూత్ ఏజెంట్లకు రాబోయే రోజుల్లో పార్టీ గుర్తింపు ఉంటుంది..

SIRపై BLOకు సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం

Advertisement
 
Advertisement
Advertisement