జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ నెల 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
తాజాగా యంగ్ టైగర్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 19న రాత్రి 11 గంటల 52 నిమిషాలకు ఫస్ట్ గ్లింప్స్ థియేటర్లతో పాటు డిజిటల్‌గా ప్రదర్శించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో జూనియర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది.
Before the clock strikes May 20…
the celebrations begin across India ⚡#NTRNeel First Glimpse arrives at 11:52 PM IST on May 19th in selected theatres & digitally 🔥— NTR Arts (@NTRArtsOfficial) May 18, 2026


