యువత కోసం.. సరికొత్త బీమా పాలసీ | Aditya Birla Launches Active Yuva Health Insurance Plan for Young Indians | Sakshi
Sakshi News home page

యువత కోసం.. సరికొత్త బీమా పాలసీ

May 18 2026 12:51 PM | Updated on May 18 2026 3:22 PM

Aditya Birla Launches Active Yuva Health Insurance Plan for Young Indians

నేటి తరం యువత మారుతున్న జీవనశైలి, ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ‘యాక్టివ్‌ యువ’ పేరుతో సరికొత్త ఆరోగ్య బీమా పాలసీని ప్రవేశపెట్టింది. కేవలం ఆసుపత్రి ఖర్చులకే పరిమితం కాకుండా, పాలసీదారులు నిత్యం ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహించడం ఈ ప్లాన్‌ ప్రత్యేకత.

ప్రతిరోజూ కనీసం 10 వేల అడుగులు నడవడం లేదా ఒకే వ్యాయామ సెషన్‌లో 300 కేలరీలు ఖర్చు చేయడం ద్వారా వినియోగదారులు రివార్డులు పొందవచ్చు. మెరుగైన ‘హెల్తీ హార్ట్‌ స్కోర్‌’ కొనసాగించిన వారు తమ వార్షిక ప్రీమియంలో 100 శాతం వరకు తిరిగి పొందే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. బీమాను కేవలం అత్యవసర వైద్య సాయంలా కాకుండా, రోజువారీ జీవితంలో ఒక భాగంగా మార్చేలా ‘యాక్టివ్‌ యువ’ను రూపొందించినట్లు కంపెనీ సీఈవో మయాంక్‌ బత్వాల్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement