breaking news
banakacharla
-
అసలు మాట్లాడితేనేగా..! గురువును అడ్డంగా ఇరికించిన శిష్యుడు
-
బనకచర్లపై బాబు హైడ్రామా!
-
పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వచేస్తేనే బనకచర్లకు గోదావరి జలాలు... పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు నీళ్లందించడం అసాధ్యం అంటున్న సాగు నీటి రంగ నిపుణులు
-
పోలవరం–బనకచర్లే ఎజెండా
సాక్షి, అమరావతి: పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు (పీబీఎల్పీ) అనుమతిచ్చే అంశాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నిర్వహించే సమావేశం ఎజెండాగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాంటి అనుమతుల్లేని.. గోదావరి ట్రిబ్యునల్, విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ తలపెట్టిన పీబీఎల్‌పీపై సమావేశంలో చర్చించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టును తప్పించాలని కోరింది.పీబీఎల్‌పీపై ఏపీ ప్రభుత్వం సమర్పించిన పీఎఫ్ఆర్ (ప్రాథమిక నివేదిక)ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తిరస్కరించాలని డిమాండ్ చేసింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) ప్రతిపాదించిన మేరకు ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని కోరింది. ⇒ పోలవరం కుడి కాలువ నుంచి 200 టీఎంసీల గోదావరి జలాలను బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలించేలా పీబీఎల్‌పీని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. కొత్తగా 3 లక్షల హెక్టార్లకు సాగు నీటితో పాటు 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ.. 80 లక్షల మందికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు 20 టీఎంసీలు అందిస్తామని చెబుతోంది. పీబీఎల్పీ డీపీఆర్ రూపకల్పనకు అనుమతి కోసం.. పీఎఫ్ఆర్ను మే 22న సీడబ్ల్యూసీకి సమర్పించింది. అయితే, సీడబ్ల్యూసీ దీనిపై గోదావరి బేసిన్‌లోని రాష్ట్రాలు, గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ల అభిప్రాయాన్ని కోరింది. గోదావరిలో వరద జలాలు లేవని, పీబీఎల్పీతో తమ ప్రాజెక్టుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ సర్కార్ కేంద్రానికి లేఖ రాసింది. ⇒ ఇక పీబీఎల్‌పీకి పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక తయారీ కోసం కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ (ఈఏసీ)కి జూన్ 5న రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసింది. గోదావరిలో వరద జలాలు లేవని.. నీటి కేటాయింపులు లేని ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి ఇవ్వొద్దంటూ ఈఏసీకి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో పీబీఎల్పీతో పాటు కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో ఏపీ, తెలంగాణ మధ్య తరచూ తలెత్తుతున్న వివాదాలపై చర్చించేందుకు బుధవారం రెండు రాష్ట్రాల సీఎంలను కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఢిల్లీకి ఆహ్వానించారు. ఎవరి వాదన వారిదే... గోదావరి నుంచి ఏటా సగటున 3 వేల టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని.. అందులో 200 టీఎంసీలు పీబీఎల్పీ ద్వారా మళ్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. నికర జలాలు కాకుండా వరద జలాలు మళ్లిస్తున్నందున ఏ రాష్ట్రానికి, ఏ ప్రాజెక్టు హక్కులకూ విఘాతం కలగదని అంటోంది. కానీ, దీనిని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణకు ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలను పూర్తిగా వాడుకోవడం లేదని.. ఆ జలాలే సముద్రంలో కలుస్తున్నాయని.. వరద జలాలు కాదని చెబుతోంది. వాటి ఆధారంగా పీబీఎల్పీ చేపడితే తమ రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.ఏపీ సింగిల్ పాయింట్... బహుళ అంశాలతో తెలంగాణకేంద్ర మంత్రితో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై రెండు రాష్ట్రాలు ఎజెండాలు పంపాయి. పీబీఎల్‌పీకి అనుమతి ఒక్కదానినే ఏపీ పేర్కొనగా.. దీనిపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దానిని ఎజెండా నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పాలమూరు, డిండిలకు జాతీయ ప్రాజెక్టులుగా గుర్తింపు, తుమ్మడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత–చేవెళ్లకు 80 టీఎంసీల నీటి కేటాయింపు, సత్వర సాగునీటి ప్రయోజన కార్యక్రమం (ఏబీఐపీ) కింద సాయం, గోదావరిపై ఇచ్చంపల్లి నుంచి 200 టీఎంసీల వరద జలాల వినియోగం కోసం కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు, నిధుల కేటాయింపును తెలంగాణ సర్కార్ ప్రతిపాదించింది. -
బనకచర్ల వద్దు.. తెలంగాణ సర్కారు లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశం ఎజెండాలో గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమతులు లేని ప్రాజెక్టుపై చర్చ అసమంజసమని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేనే లేదని, వెంటనే ఎజెండాను సవరించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో రాసిన ఈ లేఖలో బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలన్నింటినీ సీఎస్ ప్రస్తావించారు. బనకచర్లే సింగిల్ ఎజెండాగా ఏపీ ప్రతిపాదన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డితో ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ భేటీ సింగిల్ (ఏకైక) ఎజెండాగా బనకచర్లపై మాత్రమే చర్చించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ లేఖ రాసింది. తెలంగాణ చేసిన పలు ప్రతిపాదనలను ఎజెండాలో చేర్చాలని కోరింది. కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టులుగా గుర్తింపు అంశాన్ని ఎజెండాలో చేర్చి చర్చించాలని ఇప్పటికే కేంద్రాన్ని రాష్ట్ర సర్కారు కోరింది. అలాగే తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ పథకం కింద సాయం, గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు, నిధుల కేటాయింపు వంటి అంశాలను చేర్చాలని విజ్ఞప్తి చేసింంది. తాజాగా ఇప్పుడు కూడా ఈ అంశాలపైనే చర్చించాలని సీఎస్ స్పష్టం చేశారు. ఆ సంస్థల విశ్వసనీయత దెబ్బతింటుంది.. బనకచర్ల ప్రాజెక్టుపై గోదావరి బోర్డు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర పర్యావరణ శాఖలోని నిపుణుల మదింపు కమిటీ తీవ్ర అభ్యంతరాలు తెలపడాన్ని సీఎస్ గుర్తు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా, చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నింటినీ ఉల్లంఘిస్తూ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేనేలేదని తేల్చి చెప్పారు. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏపీ సమర్పించిన ప్రీ ఫీజబిలిటీ రిపోర్టును కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావించారు. సీడబ్ల్యూసీ కూడా ఈ రిపోర్టును తిరస్కరించాలని కోరారు. డీపీఆర్ సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలు ఇవే.. ⇒ పరీవాహక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండా, అంగీకారం తీసుకోకుండా, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రాలకు ట్రిబ్యునల్ జరిపిన నీటి కేటాయింపుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రాజెక్టుల నిర్వహణలో సైతం మార్పులు చోటుచేసుకుంటాయి. ఏకపక్షంగా 200 టీఎంసీలను తరలించాలని చేసిన ప్రతిపాదనతో పోలవరం ప్రాజెక్టు ఆపరేషన్ షెడ్యూల్లో మార్పులు జరగడంతో పాటు తెలంగాణ నీటి హక్కులకు విఘాతం కలుగుతుంది. ⇒ ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుకు అనుమతుల జారీకి సీడబ్ల్యూసీ, గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ నుంచి క్లియరెన్స్‌లు అవసరం కాగా, బనకచర్ల ప్రాజెక్టుకు ఇవేమీ లేవు. ⇒ ఏపీ సమర్పించిన ప్రీ ఫీజబిలిటీ రిపోర్టులో కీలకమైన సమాచార లోపాలున్నాయి. నీటి లభ్యత, సాంకేతిక సమాచారం లోపించింది. ⇒ పోలవరం ప్రాజెక్టుతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పడే ముంపుపై ఇప్పటికే న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమయంలో ఈ ప్రాజెక్టును ఎలా చేపడతారు? ⇒ ఈ ప్రాజెక్టు తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాలను హరిస్తుంది. ప్రధానంగా కరువు పీడిత ప్రాంతాలపై దుష్ప్రభావం చూపుతుంది. అన్ని ప్రక్రియలూ పూర్తైన తర్వాతే చర్చించాలి ⇒ చట్టబద్ధంగా రావాల్సిన అన్ని అనుమతులు, అంతర్రాష్ట్ర సంప్రదింపులు, అభ్యంతరాల పరిష్కారం వంటి ప్రక్రియలు పూర్తైన తర్వాతే ఈ ప్రాజెక్టుపై అయినా, ఏ సమావేశంలోనైనా చర్చ జరగాలి. ఆ తర్వాతే ప్రాజెక్టును ఆమోదించాలి. ⇒ బనకచర్ల ద్వారా తరలించనున్న 200 టీఎంసీల గురించి పోలవరం ప్రాజెక్టు డీపీఆర్‌లో ప్రస్తావన లేదు. నీటి లభ్యత, అంతర్రాష్ట్ర ప్రభావాలపై సమగ్ర అధ్యయనంతో పాటు ట్రిబ్యునల్ తీర్పులను నికచ్చిగా అమలు చేస్తేనే ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుందని పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ) స్పష్టం చేసింది. ⇒ బనకచర్ల ప్రాజెక్టుతో పోలవరం ప్రాజెక్టు ఆపరేషన్ షెడ్యూల్, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, 1980 ఏప్రిల్ 2న జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం అమలు తీరులో మార్పులు చోటుచేసుకుంటాయని గోదావరి బోర్డు అభ్యంతరం తెలిపింది. ఎలాంటి మార్పులకైనా పరీవాహకంలోని అన్ని రాష్ట్రాల నుంచి తప్పనిసరిగా రాతపూర్వకంగా సమ్మతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గోదావరి జలాల బట్వాడా విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి ఒప్పందం లేదని కూడా తెలిపింది. 80 టీఎంసీలకు మించి జలాలను ఇతర బేసిన్లకు మళ్లిస్తే బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలకు వాటాలు ఇవ్వాలని కృష్ణా, గోదావరి ట్రిబ్యునల్ తీర్పులు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది. ⇒ గోదావరి ట్రిబ్యునల్ పరీవాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకు కేటాయించిన నికర జలాల కోటాలను పూర్తిగా వాడుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ప్రాజెక్టులను నిర్మించిన తర్వాతే బనకచర్ల ప్రాజెక్టుకు ప్రతిపాదించిన 200 టీఎంసీల లభ్యతపై స్పష్టత వస్తుందని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పింది. ⇒ ప్రాజెక్టు గోదావరి ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధమని పేర్కొంటూ బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయడానికి కేంద్ర పర్యావరణ శాఖ నిరాకరించిన విషయాన్ని సైతం లేఖలో తెలంగాణ ప్రస్తావించింది. అన్ని రకాల అనుమతులు సాధించిన తర్వాతే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని కోరిందని తెలిపింది. చర్చకు పెడితే బాయ్‌కాట్! కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగే సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రి వారు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే ఈ సమావేశానికి హాజరైనప్పటికీ, ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్లపై చర్చకు ఒప్పుకునేది లేదని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ బనకచర్లను ఎజెండాలో పెట్టి చర్చ ప్రారంభిస్తే నిరసన వ్యక్తం చేస్తూ బాయ్‌కాట్ చేస్తారని తెలుస్తోంది. కాగా, వీలును బట్టి సీఎం బుధవారం రాత్రికి, లేదా గురువారం నగరానికి వస్తారని సీఎంవో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
‘నాడు బాబుకు బ్యాగులు మోసి బ్యాడ్‌మెన్.. నేడు బనకచర్ల బొంకుమెన్’
సాక్షి, హైదరాబాద్: బనకచర్ల విషయంలో కాంగ్రెస్ నేతల తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభవన్‌లోనే చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందన్నారు. తెలంగాణ నీటి హక్కులను రేవంత్ మరణశాసనం రాశారని సంచలన ఆరోపణలు చేశారు. గురు దక్షిణలో భాగంగానే ఒప్పందం చేసుకున్నారని వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్లపై బీఆర్ఎస్ పోరాటం చేస్తే.. కాంగ్రెస్ మొద్దు నిద్ర పోతోంది. మధ్యాహ్నం మేం ప్రెస్‌మీట్ పెడితే రాత్రి ఉత్తమ్ లేఖ రాశారు. బ్యాక్ డేట్ వేసి మీడియాకు ప్రభుత్వం రిలీజ్ చేసింది. బనకచర్లపై బొంకుడు రాజకీయాలు బంద్ చేయాలి. రేవంత్, ఉత్తమ్ కలిసిన తర్వాతే కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. ఈ విషయాన్ని జనవరిలో బీఆర్ఎస్ బయటపెట్టింది.సీఎం రేవంత్‌కు బేసిన్ల గురించి కనీసం అవగాహన లేదు. స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్‌లో అని రేవంతే చెప్పారు. రేవంత్ టెక్నికల్‌గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి.. కానీ, ఆయన హృదయం టీడీపీలోనే ఉంది. బనకచర్లను ఆపే చిత్తశుద్ది రేవంత్‌కు లేదు. బెజవాడ బజ్జీలు తిని బనకచర్లకు జెండా ఊపారు. నాడు బాబు బ్యాగులు మోసి బ్యాడ్మెన్గా పేరు తెచ్చుకున్నారు. నేడు అదే బాబు కోసం బనకచర్ల బొంకుమెన్గా మారిపోయారు. చంద్రబాబును ప్రజాభవన్‌లో కలిశాక చీకటి ఒప్పందం కుదిరింది. గురు దక్షిణలో భాగంగానే చీకటి ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ నీటి హక్కులను రేవంత్ మరణశాసనం రాశారు. తెలంగాణ పుటల్లో సీఎం రేవంత్ ద్రోహిగా మిగిలిపోతారు. రేవంత్ చిల్లర మల్లర రాజకీయాలు మానేసి రాష్ట్రం కోసం పోరాడాలి. నిన్నటి ప్రజంటేషన్లో అన్ని అబద్దాలే. రేవంత్ అబద్ధాలను బీఆర్ఎస్ చీల్చి చెండాడుతుంది. కేసీఆర్ మీదు ముఖమంత్రి రేవంత్ నిందలు మోపుతున్నారు. సీఎం వాస్తవాలు మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గొంతు కోస్తోంది. మాకు తెలంగాణ రాష్ట్ర హక్కులే ముఖ్యం. బనకచర్లపై ప్రజంటేషన్ ఇస్తే అన్ని పార్టీలను పిలవాలి కదా?. అహంకారంతో మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారు అని ఘాటు విమర్శలు చేశారు. -
గోదావరి-బనకచర్ల.. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జలాల విషయంలో రాజీ పడమంటూ సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. ప్రజాభవన్‌లో మంగళవారం.. గోదావరి-బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నీటి హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామన్నారు. కృష్ణాలో 68 శాతం పరీవాహకం తెలంగాణలో ఉంది. 68 శాతం తెలంగాణకు ఇచ్చి.. మిగిలిన నీళ్లే ఏపీకి ఇవ్వాలి. కానీ 299 టీఎంసీలే చాలని రెండుసార్లు కేసీఆర్ సంతకం పెట్టారు. 299 టీఎంసీలున్నా 220కి మించి ఎప్పుడూ వినియోగించలేదు’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు.‘‘ధన దాహం తీర్చుకోవడం కోసమే కాళేశ్వరం రీ డిజైన్. 38 వేల కోట్ల ప్రాజెక్టుకు ఇప్పటికే లక్ష కోట్లు ఖర్చు పెట్టారు. లక్ష కోట్లు ఖర్చు చేసి 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారు. మిగిలిన పనుల పూర్తికి మరో లక్ష కోట్లు కావాలి. వరద జలాలను తరలిస్తే ఇబ్బందేంటని ఏపీ వాదిస్తోంది. నికర జలాల్లో మా వాటాపై ఏపీ ఎందుకు అభ్యంతరం చెప్తోంది. మూడో పంట కోసం ఏపీ ప్రయత్నిస్తోంది. మాకు మొదటి పంటకే నీళ్లు లేవు. మా నీటివాటాలపై ఏపీ కూడా సహకరించాలి కదా?. ఇరు రాష్ట్రాల చర్చలకు కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి’ అంటూ రేవంత్‌రెడ్డి కోరారు. -
పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదన తిరస్కరణ
విజయవాడ: పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ నిపుణల కమిటీ వెనక్కి పంపింది. దీనికి సంబంధించి సీడబ్యూసీ అనుమతి తీసుకోకపోవడంతో ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. దాంతో బనకచర్లకు ఆమోదం సాధించడంలో చంద్రబాబు సర్కారు ప్రభుత్వం విఫలమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో కూటమి భాగస్వామిగా ఉన్న ఏపీ ప్రభుత్వం అనుమతి మాత్రం సాధించలేకపోయింది. కాగా, ‘పోలవరం - బనకచర్ల’ ప్రాజెక్టుపై కేంద్రం ముందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. పోలవరం నుంచి బనకచర్లకు నీటి తరలింపు ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ నిపుణల కమిటీకి వివరాలు అందించారు. అయితే సీడబ్యూసీ అనుమతి తీసుకోకుండానే ప్రతిపాదన పంపించారు. ఫలితంగా ప్రతిపాదనను పర్యావరణ నిపుణుల కమిటీ తిరస్కరించి దానిని వెనక్కి పంపించింది. ఇది బీఆర్ఎస్, తెలంగాణ ప్రజల విజయం: హరీష్రావుపోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనను పర్యావరణ నిపుణుల కమిటీ తిరస్కరించడంపై బీఆర్ఎస్ నేత హరీష్‌రావు స్పందించారు. బనకచర్లపై నిపుణుల కమిటీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇది బీఆర్ఎస్, తెలంగాణ ప్రజల విజయంగా ఆయన పేర్కొన్నారు. గోదావరి జలాలను తరలించే కుట్రకు ఇది చెంపపెట్టన్నారు. బనకచర్ల ప్రాజెక్టును ఆపే వరకూ పోరాడతామన్నారు హరీష్. -
రేవంత్.. ఆ డబ్బంతా ఎక్కడికి పోతోంది?: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: 18 నెలల కాంగ్రెస్ పాలనలో రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన కానీ.. పెన్షన్లు, మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వలేక పోతున్నారంటూ ఆమె నిలదీశారు.‘‘అప్పు కావాలని ఆర్ఏసీ సంస్థకు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నాడు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించాడు. రాష్ట్ర ఆదాయం ఎక్కడకి పోతుందో ప్రజలకు రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి’’ అంటూ కవిత డిమాండ్ చేశారు.‘‘అవినీతి చక్రవర్తి బిరుదు రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. వాస్తవాలు లేకుండా నేను ఏది మాట్లాడను. రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు దేనికి ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చెయ్యాలి. భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలకు చీమ కుట్టినట్లు లేదు. ప్రజా భవన్లో చంద్రబాబుకు హైదరాబాద్ బిర్యాని తినిపించి బనకచర్ల ప్రాజెక్ట్ కట్టుకోండి అని రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కలలో కూడ తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేయరు. రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ఇద్దరు ప్రజా భవన్లో కలిసినప్పుడే గోదావరి జలాలను ఏపీకి రేవంత్ రెడ్డి కట్టబెట్టిండు’’ అంటూ కవిత చెప్పుకొచ్చారు. -
బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లీగల్ చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇవాళ ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. లీగల్ ఫైట్ చేయడానికి రోడ్‌మ్యాప్‌ను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.చట్టపరంగా బనకచర్లను అడ్డుకుంటామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ నెల 30న ప్రజాభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పునరుద్ధరణకు ఎన్డీఎస్ఏ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తోంది. సత్వరమే నాగార్జున సాగర్‌లో పూడికతీతకు ఆదేశాలు ఇచ్చాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్ఎల్బీసీ పనులను పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తాం’’ అని ఉత్తమ్‌కుమార్ తెలిపారు. -
‘తెలంగాణతో చర్చించకుండా.. ఢిల్లీ నుంచి అనుమతులు కోరడం సరైంది కాదు’
ఢిల్లీ: పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అంశానికి సంబంధించి ఏపీతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే చంద్రబాబుతో చర్చలకు తామే ముందడుగు వేస్తామన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణతో చర్చించకుండా ఢిల్లీ నుంచి అనుమతులు కోరతామని ఏపీ ప్రభుత్వం చెప్పడం సరైనది కాదన్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కేంద్ర మంత్రులతో సమావేశమయ్యేందుకు రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్. ఈరోజు(శుక్రవారం, జూన్ 20వ తేదీ) ఢిల్లీ నుంచి బయల్దేరి క్రమంలో మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ‘టిఆర్ఎస్ వల్లే తెలంగాణకు కృష్ణా నీటి పంపకాల్లో అన్యాయం జరిగింది. 299 టీఎంసీలకు ఒప్పుకున్నది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాటి నీటిపారుదుల శాఖ మంత్రి హరీష్ రావే. కృష్ణానదిలో మేము 500 టీఎంసీల నీరు ఇవ్వాలని కోరుతున్నాం. బిజెపికి టిఆర్ఎస్ అవయవ దానం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లను బీజేపీ గెలిపించడంలో బీఆర్ఎస్ సహాయం చేసింది. టీఆర్ఎస్ చరిత్రలో ఒక్క సీటు కూడా గెలవకుండా ఉండటం ఇదే తొలిసారి’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
బనకచర్లను అడ్డుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు ప్రీఫీజబిలిటీ నివేదికను తిరస్కరించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్–1980 (జీడబ్ల్యూడీటీ), ఏపీ పునర్విభజన చట్టం–2014లకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో జల్‌శక్తి మంత్రి పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, ఇతర ఉన్నతాధికారులతో రేవంత్, ఉత్తమ్‌తోపాటు ఎంపీలు మల్లురవి, రఘువీర్ రెడ్డి, నీటి పారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ గురువారం సమావేశమయ్యారు. బనకచర్ల అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళన నెలకొందని వివరించారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెబుతోందని.. జీడబ్ల్యూడీటీ–1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదన్నారు. 2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటే ముందు ఆ నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జల్‌శక్తి మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే అపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాలని, అయితే బనకచర్ల విషయంలో ఏపీ వీటన్నింటిని ఉల్లంఘిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, జల్‌శక్తి శాఖ తక్షణమే జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్ట్ ముందుకెళ్లకుండా చూడాలని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కోరారు.వరద నిజమైతే ఇచ్చంపల్లి–సాగర్ అనుసంధానంపై చర్చిద్దాంసీడబ్ల్యూసీ పరిధిలోని సాంకేతిక సలహా మండలి నుంచి అనుమతులు పొందకుండానే వరద జలాల పేరుతో పోలవరం కింద పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఏపీ చేపట్టిందని కేంద్ర మంత్రి పాటిల్‌కు రేవంత్, ఉత్తమ్ వివరించారు. గోదావరి అవార్డు ప్రకారం పోలవరం డిజైన్లు మార్పు చేసిందని, పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడుతోందని, తాము అభ్యంతరాలు లేవనెత్తినా పనులు కొనసాగిస్తూనే ఉందని చెప్పారు. గోదావరిలో వరద జలాలున్నాయని నిజంగా ఏపీ భావిస్తుంటే పోలవరం–బనకచర్లకు బదులు, కేంద్రం నిధులు ఇచ్చే ఇచ్చంపల్లి–నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్‌కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చకు తాము సిద్ధమని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాము ఎట్టిపరిస్థితుల్లో రాజీపడబోమని, అన్ని వేదికల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని తెలిపారు. కేంద్రం స్పందన సానుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీఎం స్పష్టం చేశారు.1,500 టీఎంసీలను వాడుకునేలా..» తెలంగాణకు గోదావరి నదిలో 1,000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు మొత్తంగా 1,500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జల్‌శక్తి శాఖ, ఏపీ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేయాలని, దానికి కేంద్రం ఆమోదం తెలపాలని సీఆర్ పాటిల్‌కు రేవంత్ విజ్ఞప్తి చేశారు. 1500 టీఎంసీల నీటితో కోటి న్నర ఎకరాలకు నీరు అందుతుందని, ఆ తర్వాత ఏపీ చేపట్టే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీ లిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.» ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు అనుమతు ల ప్రక్రియలో సత్వరం స్పందిస్తూ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శించడం తగదని సీఎం రేవంత్ అన్నారు. ఈ వైఖరితో ఇరు రాష్ట్రాల మధ్య అపోహలు, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయన్నా రు. పాలమూరు–రంగారెడ్డి, సమ్మక్క–సారక్క, తుమ్మిడి హెట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులతోపాటు అన్ని రకా ల అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కోరారు.» గంగా, యమునా నదుల ప్రక్షాళనకు నిధులిచ్చినట్లే మూసీ పునరుజ్జీవానికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి పాటిల్‌కు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
‘సీఎం రేవంత్‌కు విషయం తక్కువ.. విషం ఎక్కువ’
హైదరాబాద్ బనకచర్ల ప్రాజెక్టుకు ఆయనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు విమర్శించారు. రేవంత్‌కు విషయం తక్కువ.. విషం ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు. ఈరోజు(గురువారం, జూన్ 19) తెలంగాణ భవన్లో హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో 946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి అనుమతులు పొందామన్నారు. తాను బనకచర్లపై మీటింగ్ పెట్టిన తర్వాతే.. మీరు మీటింగ్ పెట్టారన్నారు. అసలు మీరు మీటింగ్ పెట్టింది.. బనకచర్ల ప్రాజెక్టుల ఆపడానికా?, కట్టుకోమనడానికా? అంటూ సీఎం రేవంత్‌ను హరీష్ ప్రశ్నించారు. బనకచర్ల ఏ జిల్లాలో ఉందో కూడా తెలియకుండా సీఎం రేవంత్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు. కృష్ణ బేసిన్ లో 500 TMC లు, గోదావరి బేసిన్ లో 1000 TMC నీళ్లు ఇచ్చి ఏపీ అన్ని ప్రాజెక్ట్ లు అయిన కట్టుకోండి...అని రేవంత్ అంటున్నారు.. అసలు మన సీఎంకు తెలివి ఉందా? అంటై హరీష్ మండిపడ్డారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ సూచనతోనే బనకచర్ల!: సీఎం రేవంత్ -
ఏపీ ప్రభుత్వం చేపడుతోన్న బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ
-
కేసీఆర్ సూచనతోనే బనకచర్ల!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్లో నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలోని ప్రాజెక్టులకు వెయ్యి టీఎంసీలకి మించి నీళ్లు అవసరం. ఏటా 3 వేల టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలు చర్చించుకుని నీళ్లను వాడుకోవాలని 2016 సెపె్టంబర్ 21న అప్పటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 3 వేల టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని కనిపెట్టింది కేసీఆరే. ఆ నీటి వినియోగంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది ఆయనే. కేసీఆర్ సూచన నుంచే గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినట్స్‌లో కేసీఆర్ చేసిన సూచనలను రికార్డు చేశారని, ఆ మినట్స్ కాపీని ఎంపీలందరికీ అందజేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నికర జలాల వినియోగం పూర్తి కాకముందే మిగులు జలాల లభ్యతను ఎలా తేల్చుతారంటూ బీజేపీ ఎంపీ రఘునందర్రావు అడిగిన ప్రశ్నకు సీఎం బదులిస్తూ కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు. గోదావరి జలాల తరలింపే ఆ భేటీల లక్ష్యం ‘చంద్రబాబు, కేసీఆర్ మధ్య సమస్యలు రావడంతో 2016 తర్వాత 3 వేల టీఎంసీల మిగులు జలాల అంశం మరుగున పడిపోయింది. ఆ తర్వాత 2019 ఆగస్టులో నాటి ఏపీ సీఎం జగన్‌తో ప్రగతిభవన్‌లో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమై మళ్లీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం అని ఆ సమావేశంలో కేసీఆర్ అన్నారు. కేసీఆర్, జగన్‌లు ప్రగతిభవన్‌లో నాలుగుసార్లు సమావేశమై గోదావరి జలాలను రాయలసీమకు తరలించుకోవడంపై చర్చలు జరిపారు. గోదావరి జలాలను కృష్ణా, పెన్నా బేసిన్లకు తరలించడమే నాటి సమావేశాల లక్ష్యం. ఈ నేపథ్యంలోనే బనకచర్ల ప్రాజెక్టును ప్రస్తుతం ఏపీ చేపట్టింది. 400 టీఎంసీలను రాయలసీమకు తరలించాలని అప్పట్లో కేసీఆర్, జగన్ మాట్లాడుకున్నారు. అందులో భాగంగానే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా నేరుగా 200 టీఎంసీలు, పరోక్షంగా 100 టీఎంసీలు కలిపి 300 టీఎంసీలను తరలిస్తామంటూ ఏపీ తాజాగా ప్రతిపాదించింది..’ అని రేవంత్ చెప్పారు. ఆ మినట్స్‌నే గుదిబండగా మార్చాలని ఏపీ చూస్తోంది.. రాయలసీమకు గోదావరి జలాల తరలింపునకు పెద్దన్నగా సహకరిస్తా అని నాడు కేసీఆర్ హామీ ఇచ్చినట్టు పత్రికల్లో వచ్చిన వార్తలను సీఎం రేవంత్ రెడ్డి చదివి వినిపించారు. దీనిపై బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా గోదావరి జలాలను శ్రీశైలంకు తరలించి.. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు తరలించే ఉద్దేశంతో కేసీఆర్ ఆ ప్రతిపాదనలు చేశారని వివరణ ఇచ్చారు. బనకచర్లతో తెలంగాణ నష్టపోకుండా ప్రభుత్వానికి సహకరించడానికే తాము ఈ భేటీకి వచ్చామన్నారు. సీఎం జోక్యం చేసుకుని అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినట్స్‌లో ఉన్న అంశాలను మళ్లీ చదివి వినిపిస్తా అని అన్నారు. ‘గోదావరి నీళ్లను శ్రీశైలంలో వేయాలంటే తొలుత సాగర్‌లో వేయాల్సి ఉంటుంది. కానీ బనకచర్ల ప్రాజెక్టు ద్వారా సాగర్‌లో వేయకుండా నీళ్లను నేరుగా తరలించుకుంటామని ఏపీ ప్రతిపాదించింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్లో ఏపీ, తెలంగాణ సీఎంలు చర్చించిన తీసుకున్న నిర్ణయం ప్రకారమే బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ఏపీ వాదిస్తోంది..’ అని చెప్పారు. దీంతో.. రాజకీయ ఉద్దేశంతో జరుగుతున్న ఈ సమావేశం నుంచి తాము వాకౌట్ చేస్తున్నట్టు వద్దిరాజు ప్రకటించారు. బీజేపీ ఎంపీ డీకే అరుణ నచ్చజెప్పబోగా, ‘పోనీయండి’ అంటూ సీఎం వారించారు. కొన్ని వాస్తవాలు బయటకు వచ్చినందుకు మిత్రుడు కొంత ఇబ్బంది పడ్డట్టు ఉన్నాడని వ్యాఖ్యానించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినట్స్‌నే తెలంగాణకు గుదిబండగా మార్చడానికి ఏపీ ప్రయత్నిస్తోందని అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులను 2015లో నాటి సీఎం కేసీఆర్ అంగీకరించడంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు. జూలైలో ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తాం బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి టెక్నికల్, లీగల్, పొలిటికల్..మూడు మార్గాల్లో ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. గురువారం మళ్లీ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి అభ్యంతరం తెలుపుతామని అన్నారు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో ఈ సమావేశానికి రాలేమని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు సమాచారం ఇచ్చారని, వారిని సైతం సీఆర్ పాటిల్ వద్దకు తీసుకెళ్తామని చెప్పారు. జూలైలో జరిగే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీతో పాటు కేంద్ర జలశక్తి, ఆర్థిక, పర్యావరణ శాఖల మంత్రులను కలిసి అభ్యంతరాలు తెలియజేస్తామని వెల్లడించారు. రాజకీయ ప్రయత్నాలు ఫలించకపోతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎంపీ అసదుద్దీన్ సూచించినట్టు జలవివాదాల్లో నిపుణులైన న్యాయవాదులను నియమించుకుంటామని చెప్పారు. పార్టీలకు అతీతంగా బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఎంపీలందరూ ఈ సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దామని ప్రతిపాదించారు. తెలంగాణ ప్రయోజనాలను పరిక్షించిన తర్వాతే ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరదామన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, సలహదారు ఆదిత్యనాథ్ దాస్‌లు ఎంపీలను సమన్వయం చేస్తారన్నారు. కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ ప్రాజెక్టులపై ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఎంపీలందరికీ అందించాలని ఆదిత్యనాథ్‌ను ఆదేశించారు. సీఎం ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్తాడంటూ విమర్శలు చేస్తున్నారని, నిరంతరం వెళ్లి సంప్రదింపులు చేస్తేనే ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయని సీఎం అన్నారు. భవిష్యత్తులో సైతం కేంద్రంతో సంబంధాలు కొనసాగిస్తామన్నారు. కాంగ్రెస్ ఎంపీలు రేణుకా చౌదరి, మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, రఘురాం రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, రఘునందన్ రావు, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. -
‘రేవంత్‌కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటో’?
సాక్షి,తెలంగాణ: రేవంత్‌కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటో? రేవంత్ నల్లమల టైగర్ కాదు..పేపర్ టైగర్ రేవంత్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. బుధవారం (జూన్18) ఎమ్మెల్సీ కవిత ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో మాట్లాడారు.‘కేంద్ర బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ తెలంగాణ జాగృతి తరుఫున జులై 16,17,18న రైల్వే రోకోలు నిర్వహిస్తాం. రైల్వే వ్యవస్థను స్తంబింపజేస్తాం. బనక చర్ల ప్రాజెక్ట్ అపాలంటే ఢిల్లోలో ఉద్యమాలు చేయాలి. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో ఒరిగేదేమీ లేదు. డిల్లీకి వెళ్ళే సీఎంలలో రేవంత్ గిన్నిస్ బుక్ రికార్డు. కేటీఆర్ ఏసీబీ విచారణ అంతా టైంపాస్నిరుపయోగంగా సముద్రంలోకి వెళుతున్న నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాలి అని కేసీఆర్ చెప్పారు. లీకేజీ పాయింట్ తుపాకుల గూడెం బ్యారేజి వద్ద ఉండాలని కేసీఆర్ తెలిపారు. పోలవరం వద్ద లీకేజీ పాయింట్ పెడితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది.సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వంతో తుపాకుల గూడెం వద్ద లీకేజీ పాయింట్‌ను చేపట్టాలని ఎందుకు చెప్పడం లేదు? రేవంత్‌కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటి? రేవంత్ నల్లమల టైగర్ కాదు..పేపర్ టైగర్ రేవంత్. చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణపై అక్రమంగా నిర్మిస్తున్న నీటి ప్రాజెక్ట్‌లపై కోర్టుకు వెళ్తాం. బనక చర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం.కేటీఆర్‌పై ఏసీబీది టైం పాస్ విచారణ.ఇలాంటి విచారణలు చాలా చూశాం. హరీష్ రావుకు అస్వస్థత విషయం నాకు తెలియదు. నేను ఏ కార్యక్రమం చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తున్నారు. బీఆర్ఎస్కు తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ’ అని కవిత స్పష్టం చేశారు. -
‘బనకచర్ల’పై చర్చిద్దాం రండి
సాక్షి, హైదరాబాద్: ఏపీ చేపడుతున్న గోదావరి –బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును తీవ్రంగా ప్రతిఘటించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణ యించింది. ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమ తులు జారీ చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అంశంపై ..రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో పాటు అధికార, విపక్ష పార్టీల లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల అభిప్రాయాలు, సలహాలను స్వీకరించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి బుధవారం సాయంత్రం 4 గంటలకు సచి వాలయంలో రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్య సభ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వ హించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ సమా వేశానికి గౌరవ అతిథు లుగా హాజరు కావాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజ య్‌లకు మంత్రి ఉత్తమ్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అందు బాటులో ఉన్న ఇతర ఎంపీలకు సైతం ఆయన ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్రం నుంచి ఎంపికైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఎంపీలందరికీ ఆహ్వాన లేఖలను పంపించారు. అడ్డుకునే వ్యూహంపై చర్చిద్దాంగోదావరి ట్రిబ్యునల్ తీర్పుతో పాటు రాష్ట్ర పున ర్విభజన చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఈ నెల 3న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను.. సీఎం రేవంత్‌రెడ్డి, తాను కలిసిన విషయాన్ని ఎంపీలకు రాసిన లేఖల్లో మంత్రి ఉత్తమ్ గుర్తుచేశారు. అంతేకాకుండా సీఆర్ పాటిల్‌కు తాను లేఖ సైతం రాశానని తెలిపారు. అయితే ఏపీ నుంచి ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు ఇంకా అందలేదని, అందిన తర్వాత తమ శాఖ పరిధిలోని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)..అమల్లో ఉన్న నిబంధనలు, ట్రిబ్యునళ్ల తీర్పులు, అంతర్రాష్ట్ర జల ఒప్పందాలతో పాటు ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనల ఆధారంగా పరిశీలన జరిపి నిర్ణయం తీసుకుంటుందంటూ పాటిల్ హామీ ఇచ్చారని వివరించారు. కాగా ప్రాజెక్టు ప్రీఫీజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కోరుతూ ఈ నెల 13న సీఆర్ పాటిల్‌కు మళ్లీ తాను లేఖ రాసినట్టు ఉత్తమ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టును అడ్డుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి బుధవారం సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు వస్తారా?తెలంగాణకు నష్టం కలిగించనున్న గోదావరి– బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభు త్వానికి లేఖ రాయాలని సీఎం రేవంత్‌రెడ్డికి తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సమర్పించిన ప్రతిపాదనలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టును అడ్డుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫల మైందని బీఆర్ఎస్ గత కొంత కాలంగా ఆరోప ణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం మంత్రి ఉత్తమ్ నిర్వహించనున్న సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు వస్తారా? అనే అంశం ఆసక్తికరంగా మారింది. -
బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం
సాక్షి, హైదరాబాద్: గోదావరి–బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులకు తీవ్ర నష్టం కలుగుతుందని మాజీమంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 200 టీఎంసీల గోదావరి నీటిని బనకచర్ల వరకు తరలించేందుకు మూడు దశల్లో ప్రాజెక్టు డిజైన్, కేంద్రానికి పీఎఫ్ఆర్ (ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్) సమర్పించడం తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమే అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర నీటి హక్కుల కోసం బీఆర్ఎస్... ప్రభుత్వానికి తోడుగా నిలుస్తుందని వెల్లడించారు. ఈ మేరకు గోదావరి బనకచర్ల అంశంపై మంత్రి ఉత్తమ్‌కు మాజీమంత్రి హరీశ్‌రావు ఆదివారం ఒక లేఖ రాశారు. ఈ ప్రాజెక్టును కేంద్రం ఆమోదించేలోపే, తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రావాల్సి ఉండగా, ఏపీ యూనిలేటరల్‌గా ముందుకెళ్తుండటం అన్యాయమన్నారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్ర జలశక్తి మంత్రికి ఈ ఏడాది జూన్ 13న మంత్రి ఉత్తమ్ లేఖ రాయడాన్ని హరీశ్‌రావు అభినందించారు. ‘ఏపీ తీసుకుంటున్న చర్యలు.. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంతోపాటు నదీ జలాల బోర్డుల నియమాలను ఉల్లంఘించడమే. వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాలి. గోదావరి జలాల్లో 969 టీఎంసీల తెలంగాణ వాటాలో ఇప్పటివరకు వినియోగం 600 టీఎంసీలకు పెరిగింది. గోదావరి నదిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ, సీతమ్మసాగర్, సమ్మక్కసాగర్ వంటి బరాజ్‌లు, 19 లక్షల ఎకరాల స్థిరీకరణతో గోదావరి బేసిన్ అభివృద్ధి, చెరువులు, చెక్ డ్యామ్‌లు, మిషన్ కాకతీయ, కాల్వల ద్వారా గోదావరి నీటిని వ్యవస్థీకృతంగా వినియోగంలోకి తెచ్చాం. కాళేశ్వరం ఎత్తిపోతల అదనపు నివేదిక, సమ్మక్కసాగర్, వార్ధా (బీఆర్ అంబేడ్కర్ ప్రాజెక్టు) డీపీఆర్‌లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఏపీ వానాకాలపు వరద జలాలే తరలిస్తామన్నా, గోదావరి ట్రిబ్యునల్ అవార్డ్‌లో ‘ఆల్ వాటర్స్’అనే పదమే ఉన్నదని నిపుణుల అభిప్రాయం. అదనపు జలాలు అనే అంశం గోదావరి అవార్డులో లేదు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణకు ఈ 157.5 టీఎంసీల అదనపు వాటాను కోరాలి. న్యాయ నిపుణులతో చర్చించి తగిన చర్యలు చేపట్టాలి. కేసీఆర్ పోరాట ఫలితంగా ఇప్పుడు 45 టీఎంసీలతో పాటు 112.5 టీఎంసీల అదనపు వాటా కోసం ట్రిబ్యునల్ ముందు వాదించే అవకాశం వచ్చింది’అని హరీశ్‌రావు తన లేఖలో పేర్కొన్నారు. -
తెలంగాణకు మాట.. మూట సాయం కూడా లేదు: కేంద్రంపై హరీష్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు మాట సాయం, మూట సాయం కూడా కేంద్రం చేయలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేటీఆర్‌కు ఎలా నోటీసులు ఇవ్వాలనే ఆలోచనతోనే రేవంత్ సర్కార్ పనిచేస్తోందంటూ దుయ్యబట్టారు.బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టమన్న హరీష్‌రావు.. బనకచర్లకు సీడబ్ల్యూసీ, జీఆర్ఎంబీ, అపెక్స్ కమిటీ అనుమతులు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశం పెట్టడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంతో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతారా?. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను ఆపాలని చూశారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుంటే ఈ ప్రభుత్వం మాట్లాడటం లేదు’’ అంటూ హరీష్‌రావు మండిపడ్డారు. -
బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. ‘చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కు’
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఏపీతో కుమక్కు అయ్యారని మాజీ మంత్రి హరీష్ మండిపడ్డారు. కాళ్లేశ్వరం కమిషన్ విచారణపై శనివారం హరీష్ రావు చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar) చెప్పిన విషయాలను ప్రసావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్థికశాఖతో సమన్వయం చేసుకునే నిధులు తీసుకొచ్చాం. అర్థికశాఖకు సంబంధం లేదని ఈటల రాజేందర్ అనటం సరైంది కాదుఆర్థికశాఖకు సంబంధం లేకుండా ఉండదు. ఈటల రాజేందర్ కు కొన్ని గుర్తు ఉండి ఉండకపోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నియమించిన సబ్ కమిటీలో నేను, ఈటల,తుమ్మల ఉన్నాం. సబ్ కమిటీ రిపోర్ట్‌పై నాతో పాటు ఈటల, తుమ్మల కూడా సంతకం చేశారు. తుమ్మల నాగేశ్వరరావును కూడా విచారణకు పిలవాలి కదా.కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అప్పులపై కూడా త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను.గోదావరి బనకచర్ల ప్రాజక్ట్ వలన తెలంగాణకు జరుగనున్న నష్టంపై కూడా ప్రజెంటేషన్ ఉంటుంది. బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీతో కుమక్కు అయ్యాడు. నా దగ్గర మరొక డాక్యుమెంట్ ఉంది. కమీషన్ దగ్గర అది బయట పెడతా. వాళ్ళు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ రాత పూర్వకంగా ఇస్తాను’ అని హరీష్ రావు చిట్ చాట్‌లో తెలిపారు. -
బనకచర్లపై కేంద్రం కీలక హామీ
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదులపై స్పందించి కేంద్రం కీలక హామీ ఇచ్చింది. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసే ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఎలాంటి అనుమతులు, నిధులు ఇవ్వరాదని కోరుతూ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గత జనవరి 22న రాసిన లేఖకు స్పందిస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ గత నెల 28న మరో లేఖ రాశారు. ‘ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు ఏపీ నుంచి ఇంకా కేంద్రానికి అందలేదు.అందిన తర్వాత సంబంధిత నియమ నిబంధనలు, ట్రిబ్యునల్ తీర్పులు, అంతర్రాష్ట్ర ఒప్పందాలతోపాటు ఏపీ పునర్విభజన చట్టంలోని వివిధ నిబంధనల కింద ఆ ప్రతిపాదనలను మా శాఖ పరిధిలోని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) పరిశీలించాకే తగిన నిర్ణయం తీసుకుంటాం’అని ఈ లేఖలో సీఆర్ పాటిల్ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ శుక్రవారం సచివాలయంలో విలేకరులతో నిర్వహించిన ఇష్టాగోష్టి సమావేశంలో వెల్లడించారు. ప్రాజెక్టుకు కేంద్రం ఎలాంటి ఆర్థిక సహాయం చేయరాదని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి సైతం లేఖ రాసినట్టు గుర్తు చేశారు. నీళ్ల విషయంలో బీఆర్ఎస్ ద్రోహం సాగునీటి విషయంలో తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. నీళ్ల విషయంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం, ద్రోహం జరిగిందని స్పష్టం చేశారు. 2014 జూన్ 2 నాటికి శ్రీశైలం జలాశయం నుంచి మొత్తం 47,850 క్యూసెక్కులను మాత్రమే తరలించుకునే సామర్థ్యాన్ని ఏపీ కలిగి ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో 2023 డిసెంబర్ నాటికి 1,11,400 క్యూసెక్కులకు ఏపీ పెంచుకుందని ఆరోపించారు. ఈ కాలంలో రోజుకు నీటి తరలింపు సామర్థ్యం 4.1 టీఎంసీల నుంచి 9.6 టీఎంసీలకు పెరిగిందన్నారు.రాష్ట్ర విభజనకు ముందు 10 ఏళ్లలో శ్రీశైలం జలాశయం నుంచి 727.15 టీఎంసీలను ఏపీ తరలించుకోగా, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 12,01 టీంఎసీలను తరలించుకుందని లెక్కలు బయటపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ.64 వేల కోట్ల వృథా ఖర్చులను కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులపై చేసి ఉంటే మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ప్రాజెక్టుల కింద 25,64,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేదన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరై ఏపీ, తెలంగాణ మధ్య నీటి విభజనపై కృష్ణా ట్రిబ్యునల్–2 నిర్ణయం తీసుకునే వరకు ఇదే తాత్కాలిక సర్దుబాటు కొనసాగుతుందని చెప్పి వచ్చారని ఆరోపించారు.గత ప్రభుత్వం రాతపూర్వకంగా ఈ తాత్కాలిక కోటాకు అంగీకరించడంతో దాన్ని తెలంగాణకు వ్యతిరేకంగా వాడుకోవడానికి ఏపీ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్–2లో దాఖలు చేసిందన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే ఏపీలోని ముచ్చుమర్రి లిఫ్టు సామర్థ్యం 3,850 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం 44వేల క్యూసెక్కుల నుంచి 92,592 క్యూసెక్కులకు పెరిగిందని చెప్పారు. బీఆర్ఎస్ సహకారంతోనే నాటి ఏపీ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీలను తరలించుకోవడానికి రాయలసీమ లిఫ్టును చేపట్టిందన్నారు.ఈ ప్రాజెక్టు టెండర్లను అడ్డుకోవాల్సింది పోయి సజావుగా జరిగేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందని, ఇందుకోసం టెండర్లకు ముందు జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని కేంద్రానికి లేఖ రాసిందన్నారు. బీఆర్ఎస్ వారు తమ ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, గోబెల్స్‌కు వారసులు కావడంతో వారి పేర్లను ‘గోబెల్స్ రావు’గా మార్చాలని ఎద్దేవా చేశారు. -
బనకచర్లతో తెలంగాణకు భారీ నష్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగు నీటి ప్రయోజనాలు కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు కడుతుంటే అడ్డుకోవలసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఆ పార్టీ ఎంపీలు.. తమకేమీ పట్టనట్లుగా ఉన్నారని ధ్వజమెత్తారు. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జల దోపిడీ మళ్లీ షురూ ఉమ్మడి పాలనలో సాగిన జల దోపిడీ, నేడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైందని, ఎప్పటిలాగే పదవుల కోసం పెదవులు మూసుకుంటున్నారని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలకు నీళ్లొదిలి సీఎం రేవంత్‌రెడ్డి గురు దక్షిణ చెల్లించుకుంటూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. బనకచర్ల ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ కుట్ర చేస్తోందన్నారు.ఇందుకు సహకరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..ఈ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని విమర్శించారు. నాడు తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయాలని, అనుమతులు ఇవ్వొద్దని లేఖలు రాసిన చంద్రబాబు నేడు మిగులు జలాలను తీసుకుంటున్నట్లు చెప్పడం శోచనీయమన్నారు. ఏ ఒక్క అనుమతి లేకుండా, నిబంధనలు బుల్డోజ్ చేస్తూ, కేంద్రం జుట్టు తమ చేతిలో ఉందని ఏపీలో రాత్రికి రాత్రి పనులు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అనుమతుల్లేని ప్రాజెక్టుకు నిధులెలా ఇస్తారు? గత అసెంబ్లీలో నీతి అయోగ్ బహిష్కరిస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందరి కంటే ముందే నీతి అయోగ్ మీటింగ్‌కు వెళ్లారని, బనకచర్లను అడ్డుకుంటారని భావిస్తే ఏమీ మాట్లాడకుండా వచ్చారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్టుకు 50 శాతం కేంద్రం గ్రాంటు ఇవ్వడంతో పాటు, మరో 50 శాతం ఎఫ్ఆర్బీఎంను మించి రుణం తీసుకునే వెసులుబాటు కల్పిస్తారని చెపుతున్నారని.. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించే ప్రాజెక్టుకు ఇలా నిధులు, అనుమతులు, రుణాలు ఎలా ఇస్తారని నిలదీశారు. కిషన్‌రెడ్డి చొరవ చూపి ఈ ప్రాజెక్టును ఆపాలన్నారు. లేదంటే ఢిల్లీ సీడబ్ల్యూసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. తెలంగాణపై ఎందుకింత కక్ష? పోలవరానికి జాతీయ హోదా ఇచి్చ..కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వరని హరీశ్‌రావు ప్రశ్నించారు. పోలవరానికి రూ.80 వేల కోట్లు, బనకచర్లకు రూ.80 వేల కోట్లు కలిపి రూ.1.6 లక్షల కోట్లు ఏపీకి ఇస్తున్నప్పుడు, తెలంగాణ ప్రాజెక్టులకు అందులో ఒక్క శాతం అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణపై బీజేపీకి ఎందుకింత కక్ష, సవతి తల్లి ప్రేమో అర్థం కావడం లేదన్నారు.కృష్ణాలో వాటా కోసం కేసీఆర్ పోరాటం చేసి సెక్షన్ 3ని సాధించారని,. కొత్త ట్రిబ్యునల్ సాధించారని చెప్పారు. గోదావరి మీద కూడా భవిష్యత్తులో కొత్త ట్రిబ్యునల్ వస్తుందని భావించి ప్రాణహితకు 160 టీఎంసీల నీటి కేటాయింపులు ఉంటే, కాళేశ్వరానికి 240 టీఎంసీల నీటి కేటాయింపులు చేసినట్లు తెలిపారు. ఈ విధంగా పలు ప్రాజెక్టులు చేపట్టి కొన్నింటిని పూర్తి చేశామని వివరించారు. కాంగ్రెస్ వాళ్లు ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఉండబట్టే నీళ్లు కిందకు వెళుతున్నాయని అన్నారు. -
బనకచర్ల నిర్మాణం అక్రమం
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు విస్తరణలో భాగంగా ఏపీ చేపట్టిన గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు.. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డు–1980కి పూర్తి విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఎలాంటి అనుమతుల్లేకున్నా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ వేగవంతం చేసిందంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే ఈ అక్రమ ప్రాజెక్టును తక్షణమే ఏపీ విరమించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ప్రాజెక్టు విషయంలో గోదావరి బోర్డు పారదర్శకతను పాటించడం లేదని తీవ్రంగా తప్పుబట్టింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) 17వ సమావేశం సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగింది. ఈ సందర్భంగా గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై వాడీవేడిగా సుదీర్ఘమైన చర్చ జరిగింది. చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్ పాల్గొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ట్రిబ్యునల్ అవార్డును కాలరాయడమే.. ‘పోలవరం ప్రాజెక్టులో భాగంగా చెరో 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి, ఎడమ ప్రధాన కాల్వల నిర్మాణానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతించగా, ఇప్పటికే చెరో 17,500 క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు కాల్వలను నిర్మించి ఉల్లంఘనలకు పాల్పడ్డారు. గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా కుడికాల్వ సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కులకు పెంచాలని ప్రతిపాదించడం ట్రిబ్యునల్ అవార్డును కాలరాయడమే. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)లోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) పలు సమావేశాల్లో చేసిన తీర్మానాలకు సైతం పూర్తి విరుద్ధం..’అని తెలంగాణ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేశారు..సొరంగాలు నిర్మించారు ‘ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన పల్నాడు కరువు నివారణ పథకం కింద ఇప్పటికే రూ.1000 కోట్లు విలువైన పనులు చేశారు. 20వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న రెండు సొరంగాలను సైతం నిర్మించినట్టుగా సమాచార హక్కు చట్టం కింద ఏపీ ప్రభుత్వమే మాకు సమాచారం ఇచి్చంది. సత్వరమే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని తాజాగా జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. దీనికోసం అమరావతి జల హారతి పేరుతో కార్పొరేషన్‌ను సైతం స్థాపించింది..’అని తెలిపారు. ‘బనకచర్ల’ప్రాజెక్టు డీపీఆర్‌ను తమకు సమర్పించాలని, అనుమతులొచ్చాకే పనులు జరపాలని గోదావరి బోర్డు చైర్మన్ ఏకే ప్రధాన్ చెప్పగా, డీపీఆర్ తయారీ పూర్తైన తర్వాత సమరి్పస్తామని ఏపీ ఈఎన్సీ బదులిచ్చారు. గోదావరి బోర్డులో గోప్యత ఎందుకు? ‘బనకచర్ల’ప్రాజెక్టులో భాగంగా పోలవరం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున గోదావరి జలాలను గుంటూరు జిల్లాలో నిర్మించనున్న బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తామని ఏపీ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. మరోవైపు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే ఈ అక్రమ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు, నిధులు ఇవ్వరాదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ..కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులకు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రతిపాదనలతో పాటు తెలంగాణ ఫిర్యాదులను కేంద్ర ప్రభుత్వం గోదావరి బోర్డుకు తదుపరి చర్యల కోసం పంపిస్తే, ఆ వివరాలను మాకు తెలియజేయలేదు. మా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు తీవ్ర నష్టాన్ని కలిగించనున్న ‘బనకచర్ల’విషయంలో గోదావరి బోర్డు పారదర్శకతను పాటించలేదు..’అని తెలంగాణ అధికారులు ధ్వజమెత్తారు. బోర్డులో సభ్యులైన తమకు ఇలాంటి విషయాలను తెలియజేయాల్సిన అవసరం ఉందని రాహుల్ బొజ్జా స్పష్టం చేయగా, ఆ అవసరం లేదని బోర్డు సభ్య కార్యదర్వి ఎ.అజగేషన్ వాదించారు. ఏపీ సైతం ఆయనకు మద్దతు తెలిపింది. పెద్దవాగు మరమ్మతులకు ఓకే.. గతేడాది వర్షాలతో గండిపడిన రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకి రూ.15 కోట్లతో 5 అదనపు గేట్లను ఏర్పాటు చేసి రెండు నెలల్లోగా తాత్కాలిక మరమ్మతులు నిర్వహించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరిచాయి. సభ్య కార్యదర్శిపై విచారణకు త్రిసభ్య కమిటీ గోదావరి బోర్డులో రెండు రాష్ట్రాల నుంచి డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగులను బోర్డు సభ్య కార్యదర్శి అజగేషన్ తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారంటూ సమావేశంలో తెలంగాణ, ఏపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అంతర్రాష్ట్ర జల విభాగాల చీఫ్ ఇంజనీర్లు, గోదావరి బోర్డు నుంచి మరో అధికారితో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి నిజనిర్థారణ జరిపించాలంటూ తెలంగాణ చేసిన ప్రతిపాదనకు బోర్డు చైర్మన్ అంగీకారం తెలిపారు. సమావేశం ఎజెండాలో బోర్డు పెట్టిన పరిపాలన, ఆర్థికపరమైన ప్రతిపాదనలతో రెండు రాష్ట్రాలు తీవ్రంగా విబేధించాయి. 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన గజిట్ నోటిఫికేషన్ అమలులో భాగంగా 16 ప్రాజెక్టుల నిర్వహణను తమకి అప్పగించాలని గోదావరి బోర్డు కోరగా, రెండు రాష్ట్రాలూ అంగీకరించలేదు. సమావేశంలో తెలంగాణ తరఫున అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ మోహన్ కుమార్, డీడీ సుబ్రమణ్యం ప్రసాద్ కూడా పాల్గొన్నారు. -
నేడు ‘బనకచర్ల’పై చర్చ!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రం వ్యక్తం చేసిన అభ్యంతరాలపై నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశంలో కీలక చర్చ జరగనుంది. జీఆర్ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డు 17వ సమావేశం జరగనుంది. తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్.. ఏపీ తరఫున ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు పాల్గొని వాదనలు వినిపించనున్నారు. గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలతో పాటు నాగార్జునసాగర్ నుంచి కృష్ణా వరద జలాలను తరలించి గుంటూరు జిల్లాలో నిర్మించనున్న బొల్లపల్లి రిజర్వాయర్‌లోకి వేస్తామని ఏపీ ప్రతిపాదించింది. దీనికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రూ.80 వేల కోట్ల ప్రాథమిక అంచనాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీల చొప్పున 90 రోజుల్లో 180 టీఎంసీల మిగులు జలాలను తరలిస్తామని ఏపీ చెబుతోంది.దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గోదావరి, కృష్ణా బోర్డులతోపాటు కేంద్ర జల్‌శక్తి శాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్, ఇతర వివరాలివ్వాలని గోదావరి బోర్డు ఏపీకి లేఖ రాయగా ఇంతవరకు అందించలేదు. సోమవారం నాటి సమావేశంలో ఈ ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాల మధ్య వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. సాగర్ కుడికాల్వ సామర్థ్యం పెంచడం ద్వారా కృష్ణా వరద జలాలను బొల్లపల్లి రిజర్వాయర్కి తరలిస్తామని ఏపీ చేసిన ప్రతిపాదనతో సాగర్ కింద తెలంగాణలో ఉన్న ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టుల అప్పగింతపై చర్చగోదావరి పరీవాహకంలోని మొత్తం 16 ప్రాజెక్టుల నిర్వహణను గోదావరి బోర్డుకు అప్పగించాలని 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై సైతం గోదావరి బోర్డు సమావేశంలో చర్చ జరగనుంది. గోదావరిపై ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు మాత్రమే రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అని, దానిని మినహా ఇతర ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తే లేదని ఇప్పటికే తెలంగాణ తేల్చి చెప్పింది. తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులను అప్పగిస్తే తమ ప్రాజెక్టులు సైతం అప్పగిస్తామని ఏపీ మెలిక పెట్టింది.గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణలోని 11 ప్రాజెక్టులు, ఏపీలోని 4 ప్రాజెక్టులు కలిపి గోదావరి బేసిన్‌లోని మొత్తం 15 అనుమతి లేని ప్రాజెక్టులకు అనుమతి పొందాల్సి ఉంది. ఈ ప్రక్రియలో పురోగతిపై సైతం చర్చ జరగనుంది. తెలంగాణలోని 11 ప్రాజెక్టుల్లో తొమ్మిదింటికి సంబంధించిన 8 డీపీఆర్‌లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల కోసం సమర్పించగా, 6 ప్రాజెక్టులకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) అనుమతులు సైతం లభించాయి. అపెక్స్ కౌన్సిల్ అనుమతిస్తే పూర్తిస్థాయి అనుమతులు లభించినట్టే. ఏపీ ఇంతవరకు తమ ప్రాజెక్టుల డీపీఆర్‌లను అనుమతుల కోసం సమర్పించలేదు. -
నేడు గోదావరి బోర్డు సమావేశం
సాక్షి, అమరావతి: గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం సోమవారం హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో జరగనుంది. గోదావరి–బనకచర్ల అనుసంధానం, అనుమతి లేని ప్రాజెక్టుల డీపీఆర్‌ల మదింపు, బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021, జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు, పెద్దవాగు ఆధునికీకరణ ఈ సమావేశం ప్రధాన అజెండా.జీఆర్ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన జరగనున్న ఈ 17వ సర్వ సభ్య సమావేశంలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీలను బనకచర్లకు తరలించేలా ఏపీ ప్రభుత్వం చేపట్టిన అనుసంధానంపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ జీఆర్ఎంబీకి లేఖ రాసింది. సర్వ సభ్య సమావేశంలో ఆ అనుసంధానంపై చర్చించాలని కోరింది. -
బనకచర్ల, ఆర్‌ఎల్‌ఐపై ‘సుప్రీం’కు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదులపై అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (ఆర్ఎల్ఐ)లపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం నీటి ఒప్పందాల ఉల్లంఘననేనని అన్నారు. వీటివల్ల తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు, తాగునీటికి పెను ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టులను అడ్డుకునేలా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు గాను న్యాయ నిపుణులు, సాగునీటి శాఖ స్టాండింగ్ కౌన్సిల్స్‌తో పాటు అడ్వొకేట్ జనరల్‌తో త్వరలోనే సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. శుక్రవారం జలసౌధలో సాగునీటి శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘించి ‘బనకచర్ల’, ఆర్ఎల్ఐ ఈ రెండు ప్రాజెక్టులపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. వేగవంతమైన, సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని, ఎలాంటి జాప్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత నియంత్రణ సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ఉపక్రమించిందని చెప్పారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాను రక్షించేందుకు సుప్రీంకోర్టులో గట్టిగా కొట్లాడతామన్నారు. గోదావరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) చేసిన పంపకాలతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని నిబంధనలను కూడా బనకచర్ల ప్రాజెక్టు ఉల్లంఘిస్తోందని, కేంద్ర జల సంఘం, గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ల నుంచి రావాల్సిన అనుమతులు కూడా రాలేదని చెప్పారు.ఆర్ఎల్ఐ పథకం విషయంలోనూ పర్యావరణ నిబంధనలు, నీటి నిల్వ తదితర విషయాల్లో ఉల్లంఘనలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. అయితే తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కోరిన అనంతరం నిపుణుల కమిటీ ఈ పథకం పనులు నిలిపివేయాలని ఆదేశించిందని, అయినా ఏపీ ప్రభుత్వం ఇతర రూపాల్లో ప్రాజెక్టు పనులను కొనసాగిస్తోందని ఉత్తమ్ పేర్కొన్నారు.దానివల్ల భద్రాచలానికీ ప్రమాదం గోదావరి వరదను రాయలసీమకు తరలించడం ద్వారా టెంపుల్ సిటీ అయిన భద్రాచలానికి కూడా ప్రమాదం పొంచి ఉందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. వరదలు సహజంగా ప్రవహించే స్థితి కోల్పోయేలా ఏపీ ప్రభుత్వం ముందుకెళుతోందని, భద్రాచలం చుట్టూ గోడ కట్టడం ద్వారా వరదల నుంచి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం రాకుండా కేంద్ర సాయాన్ని కోరతామని తెలిపారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో పూడికను తొలగించే పనులకు త్వరలోనే టెండర్లు పిలవాలని, ప్రతి నీటి చుక్కను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలన్నీ చేపడతామని చెప్పారు. సమీక్షలో సాగునీటి శాఖ ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు. -
బనకచర్లకు గోదారెలా?
-
మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ సీఎం చంద్రబాబు ఎత్తేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో రూ.2,800 కోట్లు, వసతి దీవెన రూపంలో రూ.1,100 కోట్లు వెరసి రూ.3,900 కోట్లు విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3 వేల కోట్లను చెల్లించడం లేదు. సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు.. అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తూ స్వర్ణాంధ్ర విజన్–2047 పేరుతో సీఎం చంద్రబాబు మరో నాటాకానికి తెరతీశారు. రూ.లక్ష కోట్లతో రాజధాని అమరావతిని నిర్మిస్తానని ప్రకటనలు చేస్తూనే.. రోజుకో పిట్టకథ చెబుతూ ఆ నాటకాన్ని రక్తికట్టించడం ద్వారా ప్రజలను ఏమార్చేందుకు పూనుకున్నారు.అందులో భాగంగా సోమవారం విజన్–2047 డాక్యుమెంట్లో పది సూత్రాల్లో ఒకటైన నీటి భద్రతపై వెలగపూడిలోని సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గోదావరి–బనకచర్ల గోదావరి జలాలను రాయలసీమలోని బనకచర్లకు తరలించి.. తెలుగుతల్లికి జలహారతి ఇవ్వడం తన జీవితాశమయంటూ జనం చెవిలో పువ్వు పెట్టారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వాస్తవానికి గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుకు 2019లోనే నాటి సీఎం వైఎస్ జగన్ రూపకల్పన చేశారు. గోదావరిలో ఏటా సగటున సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీల్లో 280 టీఎంసీలను ఈ ప్రాజెక్టు ద్వారా తరలించాలని నిర్ణయించారు. ఆ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)పై 2019, డిసెంబరు 20న నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాప్కోస్, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి జలాలను గరిష్ఠ స్థాయిలో కనిష్ఠ వ్యయంతో ఒడిసి పట్టి.. దుర్భిక్ష ప్రాంతాలకు తరలించడం ద్వారా కరువన్నదే ఎరుగని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. పోలవరం ప్రాజెక్టులో 2014–19 మధ్య ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ మ్యాన్యువల్‌ను తుంగలో తొక్కి పనులు చేపట్టడం ద్వారా నాటి సీఎం చంద్రబాబు సృష్టించిన విధ్వంసాన్ని వైఎస్ జగన్ చక్కదిద్దుతూ ప్రణాళికాబద్ధంగా పోలవరాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా.. జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తూ.. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి వైఎస్ జగన్ ప్రణాళిక రచించారు. పోలవరంతోపాటు హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తోటపల్లి తదితర ప్రాజెక్టులను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపడితే– వాటిని తానే ప్రారంభించినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ రూపొందించిన గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు కూడా తన మానసపుత్రికగా చంద్రబాబు చెప్పుకోవడంపై నీటిపారుదలరంగ నిపుణులు నివ్వెరపోతున్నారు. మూడేళ్లలో ‘బనకచర్ల’?మూడేళ్లలో బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు గోదావరి జలాలను తరలించేలా గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. గోదావరి జలాలను బనకచర్లకు తరలించి.. తెలుగుతల్లికి జలహారతి ఇవ్వడం తన జీవితాశయమన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ ఛేంబర్ అవుతుందన్నారు. నదుల అనుసంధానంతో భావి తరాలకు నీటి సమస్య ఉండదని చెప్పారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. స్వర్ణాంధ్ర విజన్–2047 డాక్యుమెంట్‌లోని పది సూత్రాల్లో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు.గోదావరి నుంచి సముద్రంలోకి వృథాగా పోయే మూడువేల టీఎంసీల నీటిలో 300 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా ఒడిసిపడతామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. మూడు దశల్లో బనకచర్ల ప్రాజెక్టు పూర్తిచేసేందుకు ప్రణాళికలు రూపొందించామని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ రతనాలసీమగా మారుతుందని.. పెన్నా నది ద్వారా నెల్లూరుకు నీరు ఇవ్వొచ్చని చంద్రబాబు చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..వెలుగొండతో ‘ప్రకాశం’లో కరువుకు చెక్..ఇక వెలుగొండ ప్రాజెక్టు పూర్తిచేసి ప్రకాశం జిల్లాలో కరువును అరికట్టవచ్చు. భావితరాలకు ఉపయోగపడే గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై ప్రజల్లో చర్చ జరగాలి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.80,112 కోట్లు అవసరమవుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు హైబ్రీడ్ విధానంలో ప్రైవేటు సంస్థ భాగస్వామ్యం ద్వారా నిధులు సమకూర్చుకోవడంపై ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే ప్రాజెక్టు గురించి కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించా. డీపీఆర్ పూర్తిచేసి.. పనులకు రెండు మూడు నెలల్లో టెండర్లు పిలుస్తాం. సకాలంలో నిధులు అందితే మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. గత పాలకుల అసమర్థత, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. విధ్వంసమైన వ్యవస్థలను పునరుద్ధరిస్తున్నాం. క్యూఆర్ కోడ్‌తో ప్రజాభిప్రాయ సేకరణప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాలను సేకరించి అందుకు తగ్గట్టుగా అధికారులు పనితీరును మెరుగుపరుచుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆలయాలకు వెళ్లే భక్తులు, ఆర్టీసీ ప్రయాణికుల నుంచి ఆస్పత్రులకు వచ్చే రోగుల వరకు ప్రభుత్వ సేవలపై అభిప్రాయం తెలుసుకోవాలన్నారు. సోమవారం సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో రూ.860 కోట్లతో చేపట్టిన రోడ్ల మరమ్మతులపైనా ప్రజల అభిప్రాయాలను సేకరించాలన్నారు. తద్వారా ఏవైనా ఫిర్యాదులు, అసంతృప్తి ఉంటే దానికి గల కారణాలను విశ్లేíÙంచి పనులు మెరుగుపర్చాలన్నారు. దీపం పథకం, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారుల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను పంపిణీ చేస్తున్నారా.. లేదా.. అనేది జీపీఎస్ అనుసంధానం ద్వారా తెలుసుకోవాలని, మద్యం బెల్టు షాపులు ఎక్కడైనా ఉన్నాయా అన్న సమాచారాన్ని ప్రజల నుంచి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉచిత ఇసుక విధానం సక్రమ అమలుకు రీచ్‌లలో సీసీ కెమెరాలు, వాహనాల జీపీఎస్ ద్వారా పర్యవేక్షణ జరగాలని, ఇక నుంచి పాలనలో గేరు మార్చబోతున్నామని, వేగం పెంచుతామని అన్నారు. ఈ వేగానికి తగ్గట్టు అధికారులంతా పనిచేయాలన్నారు. -
బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి నీరు విడుదల
పాములపాడు: మండలంలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి ఆదివారం 1125 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో ఎస్ఆర్బీసీకి 1050 క్యూసెక్కులు, కేసీసీ 75 క్యూసెక్కులు విడుదల చేసినట్లు డీఈ శివరాంప్రసాద్ తెలిపారు. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటి విడుదల నిలిపివేశామన్నారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు డీఈ వెల్లడించారు. -
ఎస్ఆర్బీసీకి 1,700 క్యూసెక్కులు విడుదల
బానకచెర్ల (పాములపాడు) : మండలంలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి ఆదివారం ఎస్ఆర్బీసీకి 1,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు డీఈ శివరాంప్రసాద్ తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరు నుంచి 2,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందన్నారు. ఇందులో తెలుగుగంగకు 300, కేసీసీకి 400 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నట్లు చెప్పారు. -
బానకచెర్ల నుంచి 4వేల క్యూసెక్కులు విడుదల
పాములపాడు : మండల పరిధిలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి సోమవారం 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు సీఈ శివరామ్‌ప్రసాద్ తెలిపారు. అలాగే ఎస్సార్బీసీకి 1800 క్యూసెక్కులు, కెసీసీకి 700, టీజీపీకి 1500 క్యూసెక్కుల చొప్పున దిగువకు వదిలామన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి ఎస్సార్‌ఎంసీ దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.