తెలంగాణకు మాట.. మూట సాయం కూడా లేదు: కేంద్రంపై హరీష్‌ ఫైర్‌ | Ex Minister Harish Rao Fires On Revanth Government | Sakshi
Sakshi News home page

తెలంగాణకు మాట.. మూట సాయం కూడా లేదు: కేంద్రంపై హరీష్‌ ఫైర్‌

Jun 14 2025 4:56 PM | Updated on Jun 14 2025 5:00 PM

Ex Minister Harish Rao Fires On Revanth Government

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు మాట సాయం, మూట సాయం కూడా కేంద్రం చేయలేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేటీఆర్‌కు ఎలా నోటీసులు ఇవ్వాలనే ఆలోచనతోనే రేవంత్‌ సర్కార్‌ పనిచేస్తోందంటూ దుయ్యబట్టారు.

బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టమన్న హరీష్‌రావు.. బనకచర్లకు సీడబ్ల్యూసీ, జీఆర్‌ఎంబీ, అపెక్స్‌ కమిటీ అనుమతులు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశం పెట్టడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంతో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతారా?. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను ఆపాలని చూశారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుంటే ఈ ప్రభుత్వం మాట్లాడటం లేదు’’ అంటూ హరీష్‌రావు మండిపడ్డారు.

 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement