
సాక్షి, హైదరాబాద్: బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లీగల్ చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇవాళ ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. లీగల్ ఫైట్ చేయడానికి రోడ్‌మ్యాప్‌ను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
చట్టపరంగా బనకచర్లను అడ్డుకుంటామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ నెల 30న ప్రజాభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పునరుద్ధరణకు ఎన్‌డీఎస్‌ఏ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తోంది. సత్వరమే నాగార్జున సాగర్‌లో పూడికతీతకు ఆదేశాలు ఇచ్చాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్‌ఎల్‌బీసీ పనులను పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తాం’’ అని ఉత్తమ్‌కుమార్ తెలిపారు.