మండలంలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి ఆదివారం 1125 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి నీరు విడుదల
Jan 15 2017 11:39 PM | Updated on Sep 5 2017 1:17 AM
పాములపాడు: మండలంలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి ఆదివారం 1125 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో ఎస్‌ఆర్‌బీసీకి 1050 క్యూసెక్కులు, కేసీసీ 75 క్యూసెక్కులు విడుదల చేసినట్లు డీఈ శివరాంప్రసాద్ తెలిపారు. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటి విడుదల నిలిపివేశామన్నారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు డీఈ వెల్లడించారు.
Advertisement


