‘సీఎం రేవంత్‌కు విషయం తక్కువ.. విషం ఎక్కువ’ | BRS Leadear Harish Rao Slams CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

‘సీఎం రేవంత్‌కు విషయం తక్కువ.. విషం ఎక్కువ’

Jun 19 2025 4:36 PM | Updated on Jun 19 2025 6:11 PM

BRS Leadear Harish Rao Slams CM Revanth Reddy

హైదరాబాద్‌ బనకచర్ల ప్రాజెక్టుకు ఆయనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌రావు విమర్శించారు. రేవంత్‌కు విషయం తక్కువ.. విషం ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు. ఈరోజు(గురువారం, జూన్‌ 19) తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వంలో 946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి అనుమతులు పొందామన్నారు. తాను బనకచర్లపై మీటింగ్‌ పెట్టిన తర్వాతే.. మీరు మీటింగ్‌ పెట్టారన్నారు. 

అసలు మీరు మీటింగ్‌ పెట్టింది.. బనకచర్ల ప్రాజెక్టుల ఆపడానికా?, కట్టుకోమనడానికా? అంటూ సీఎం రేవంత్‌ను హరీష్‌ ప్రశ్నించారు.  బనకచర్ల ఏ జిల్లాలో ఉందో కూడా తెలియకుండా సీఎం రేవంత్‌ రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు. కృష్ణ బేసిన్ లో 500 TMC లు, గోదావరి బేసిన్ లో 1000 TMC నీళ్లు ఇచ్చి ఏపీ అన్ని ప్రాజెక్ట్ లు అయిన కట్టుకోండి...అని రేవంత్ అంటున్నారు.. అసలు మన సీఎంకు తెలివి ఉందా? అంటై హరీష్‌ మండిపడ్డారు. సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. 

Harish Rao: రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు

కేసీఆర్‌ సూచనతోనే బనకచర్ల!: సీఎం రేవంత్‌

 

 

Advertisement
 
Advertisement
Advertisement