Tollywood Hero
-
మంచు మనోజ్ బర్త్ డే స్పెషల్.. భైరవం సాంగ్ రిలీజ్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన తాజా చిత్రం భైరవం. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో మే 30న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఇవాళ మంజు మనోజ్ పుట్టినరోజు కావడంతో భైరవం టీమ్ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది. థీమ్ ఆఫ్ గజపతి పేరుతో పవర్ఫుల్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటకు పూర్ణాచారి చల్లూరి లిరిక్స్ అందించగా.. శ్రీచరణ్ పాకాల, క్రాంతి కిరణ్ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో అజయ్ రాజా, రవీంద్ర శరత్, సంపత్, సందీప్ రాజ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
తమ్ముడి బర్త్ డే.. వెరైటీగా విషెస్ చెప్పిన మంచు లక్ష్మీ!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ప్రస్తుతం భైరవం మూవీతో అభిమానుల ముందుకు రానున్నారు. ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో ఫ్యాన్స్‌తో కలిసి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయనకు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే కుటుంబంతో విభేదాల కారణంగా ఇప్పటి వరకు మంచు విష్ణు కానీ, మోహన్ బాబు కానీ మనోజ్‌కు విష్ చేయలేదు.కానీ మంచు మనోజ్ అంటే అక్క మంచు లక్ష్మీకి విపరీతమైన ప్రేమ. గతంలో తానే పక్కనుండి మనోజ్- మౌనికల పెళ్లిని జరిపించింది. ఇవాళ తమ్ముడి పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. భైరవం మూవీలోని ధమ్ ధమారే అంటూ సాగే పాటకు పిల్లలతో కలిసి డ్యాన్స్ చేస్తూ.. అందరికంటే కాస్తా వెరైటీగా విష్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ కావడంతో సూపర్బ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియో చూసిన మంచు మనోజ్ ఫుల్ ఖుషీ అయ్యారు. లవ్ సింబల్స్‌తో వీడియోకు రిప్లై కూడా ఇచ్చారు. థ్యాంక్యూ యూ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. కాగా.. మంచు మనోజ్ నటించిన భైరవం మూవీ ఈనెల 30న థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
మంచు మనోజ్ బర్త్ డే.. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసిన హీరో
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన 42వ బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు తమ హీరోకు బర్త్ డే విషెస్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన పిల్లలతో కలిసి ఈ పుట్టినరోజును ఆస్వాదించారు. కాగా.. మంచు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన భార్య మౌనిక ఇప్పటికే శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేసింది. తన భర్త ప్రేమను తలచుకుంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.కాగా.. మంచు మనోజ్ ప్రస్తుతం భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చాలా రోజుల విరామం తర్వాత బిగ్ స్క్రీన్‌పై మంచు మనోజ్ సందడి చేయనున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. మే 30న ప్రేక్షకుల థియేటర్లలో సందడి చేయనుంది. #TFNExclusive: Some lovely visuals of Rocking Star @HeroManoj1 celebrating his birthday with his kids and fans!!😍📸#ManchuManoj #Bhairavam #TeluguFilmNagar pic.twitter.com/bgEMWTV8Sp— Telugu FilmNagar (@telugufilmnagar) May 20, 2025 -
మరో జన్మ ఉంటే నువ్వే నా భర్తగా రావాలని కోరుకుంటా: మంచు మనోజ్ భార్య ఎమోషనల్ పోస్ట్
చాలా రోజుల విరామం తర్వాత మంచు మనోజ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం భైరవం. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఇటీవల ట్రైలర్ ఈవెంట్లో సందడి చేసిన మంచు మనోజ్ ఇవాళ తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య భూమా మౌనిక తన భర్తకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన పిల్లలు, భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో అభిమానులు సైతం మంచు మనోజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.మౌనిక తన ఇన్‌స్టాలో రాస్తూ..'నేను ప్రేమించే నా సోల్‌మేట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా జీవితాల్లో వచ్చి.. మీ జీవిత ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు ఈ ప్రపంచాన్ని మధురమైన ప్రదేశంగా మార్చారు. మీ చేయబోయే అన్ని మంచి పనులను బాగా జరగాలి. మీ ప్రేమ, ఆనందాన్ని పంచడానికి మీ హృదయం వెయ్యేళ్లు బతకాలి. ఈ ఏడాది మాత్రమే అన్ని సంవత్సరాలు మీరు గొప్పగా ఉండాలి. మేము నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాం.. మీరు జీవితం మరింత ఎదగాలని కోరుకుంటున్నాం. మా ముగ్గురి ప్రేమ మీ కోసం మాత్రమే. మీరు నిజంగా మా రాకింగ్ స్టార్. ప్రియమైన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ప్రతి పునర్జన్మలో నా స్నేహితుడిగా, భర్తగా మిమ్మల్నే ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Mounika Bhuma Manchu (@mounikabhumamanchu) -
జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)
-
రబ్బరు గాజులు సాంగ్.. థియేటర్లోనే ఇరగదీసిన ఫ్యాన్స్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్- దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం యమదొంగ. 2007లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. అప్పట్లో థియేటర్లలో ఓ రేంజ్లో వసూళ్లు రాబట్టింది. అయితే ఈ నెల 20న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. ఈ అత్యాధునిక టెక్నాలజీతో అభిమానులు సినిమాను ఈరోజు థియేటర్లలో ప్రదర్శించారు.అయితే ఈ సినిమాను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు. ఈలలు, కేకలతో థియేటర్లను హోరెత్తించారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత యమదొంగ బిగ్ స్క్రీన్‌పై సందడి చేయడంతో అభిమానులు ఆనందంలో చిందులు వేశారు. రబ్బరు గాజులు పాట రాగానే పూనకంతో ఊగిపోయారు. ఈ సినిమా చూస్తూ థియేటర్లో రబ్బర్ గాజులు సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ అలరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(ఇది చదవండి: ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్.. థియేటర్స్‌లో ‘యమదొంగ’)కాగా.. ఈ చిత్రంలో మోహన్ బాబు యమధర్మరాజు పాత్రలో మెప్పించారు. ఈ మూవీలో ప్రియమణి, మమత మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇద్దరి ఇరగదీశారు మాటల్లేవ్ 💟💟❤️🔥❤️🔥ఇదేం క్రేజీ రా బాబు మామూలుగా లేదుగా సెలబ్రేషన్ 😍😍🥵🥵👌👌#Yamadonga4K @tarak9999 #ManOfMassesNTR pic.twitter.com/ZN1j0zj5kF— Shivam🐉🔱🚩 (@tarak9999SM) May 19, 2025 -
యంగ్ టైగర్ బర్త్ డే.. వార్-2 అప్డేట్ వచ్చేసింది!
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేయడం మొదలైంది. హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 14, 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో వార్ -2 మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వార్-2 గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ పంచుకున్నారు. జూనియర్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ పోస్టర్ షేర్ చేశారు. ఈ తాజా ప్రకటనతో వార్-2 అప్డేట్స్ కోసం ఎదురు చూస్తోన్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.అత్యధిక ధరకు తెలుగు రైట్స్..తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వార్ 2 పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్, దేవర... ఎన్టీఆర్ నటించిన మూవీ కావడంతో సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా ప్రాంతీయ హక్కుల కోసం ఎదురైన గట్టి పోటీని తట్టుకుని చివరికి ప్రముఖ నిర్మాతలు నాగ వంశీ, సునీల్ నారంగ్ ఈ డీల్‌ను చేజిక్కించుకున్నారు. విడుదలకి ముందే ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కులు రూ. 85–100 కోట్ల మధ్య ధరల్లో అమ్ముడైపోయాయని వార్తలొస్తున్నాయి. #HappyBirthdayNTR Can’t wait for this BANGER 💥💥💥💥💥💥 pic.twitter.com/2hg9aAZgNJ— thaman S (@MusicThaman) May 19, 2025 -
కట్టు బట్టలతో రోడ్డున పడేశారు: మంచు మనోజ్ ఎమోషనల్ స్పీచ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ చాలా రోజుల తర్వాత భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు హాజరైన మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన కుటుంబ సభ్యులు వ్యవహరించిన తీరును తలచుకుని ఎమోషనలయ్యారు.మంచు మనోజ్ మాట్లాడుతూ..' కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు. నా పిల్లల దుస్తులు, చిన్నప్పటి నుంచి దాచుకున్న వాటితో సహా ఏది వదలకుండా రోడ్డున పడేశారు. మేము బయటికి కూడా వెళ్లడానికి కార్లు కూడా లేకుండా చేశారు. కానీ నాకు మాత్రం శివుడు ఫ్యాన్స్ రూపంలో వచ్చాడు అన్న. ఇంటి బయట 20 కార్లు పెట్టారన్నా నా కోసం. ప్రతి ఒక్కరూ మేమున్నాం అంటూ నాకోసం నిలబడ్డారు. కానీ నాకొక్కటే బాధ. ఇంత చేసినా.. ఇంత జరిగినా.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. నాపై ఎన్ని కేసులు వేసినా.. నాకు ఎవరి మీద కోపం రావట్లేదు.. బాధగా మాత్రమే ఉంది. అది నా బలహీనతో.. వాళ్ల బలమో నాకు అర్థం కావట్లేదు.' అని అన్నారు.తన తండ్రి గురించి మాట్లాడుతూ..'ఎన్ని జన్మలైనా.. ఈ జన్మకు మాత్రం నా కట్టె కాలే వరకు నేను మోహన్ బాబు గారి అబ్బాయినే.. అది మార్చడం ఎవరి వల్ల కాదు..నా చిన్నప్పటి నుంచి ఆయన నేర్పించిన క్రమశిక్షణే. నీతి వైపు నిలబడాలని నాకు నేర్పించారు. నేను న్యాయం వైపు నిలబడినప్పుడు చుట్టుపక్కలా అందరూ చేరి తప్పు అంటున్నారు. ఏదేమైనా.. ఎన్ని జన్మలెత్తినా.. మీరే నా దేవుడు.. నా తండ్రి.. నా తల్లి.. మీ దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఎమోషనల్‌గా మాట్లాడారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 30న థియేటర్లలో సందడి చేయనుంది. గతంలో మంచు మనోజ్‌కు తన ఫ్యామిలీతో గొడవలు తలెత్తిన సంగతి తెలిసిందే. -
ఫిల్మ్ మేకర్స్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ వద్ద సందడి చేశారు. హాలీవుడ్ మూవీని థియేటర్లో వీక్షించేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా సినిమాను చూసి బయటకు వచ్చిన ఆర్జీవీని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. సినిమా ఎలా ఉందని అడగడంతో సూపర్‌గా ఉందంటూ రాం గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. టామ్ క్రూయిజ్ అద్భుతంగా చేశాడని కొనియాడారు. ఇప్పటి వరకు రిలీజైన వాటిలో ఇది చాలా బెస్ట్ అని అన్నారు. ఈ సినిమాను మించిన కథ రాదేమో అని అనుకుంటున్నట్లు ఆర్జీవీ మాట్లాడారు.కానీ ఈ సినిమా చూశాక ఆయన చేసిన ఓ కామెంట్ తెగ వైరలవుతోంది. మనం కూడా ఫిల్మ్ మేకర్స్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజమౌళి- మహేశ్ కాంబోలో వస్తోన్న మూవీలో స్టంట్స్ ఇలాగే ఉంటున్నాయని అంటున్నారని ఆర్జీవీ ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలీదన్నారు. కాగా.. హాలీవుడ్ హీరో టామ్ క్రూయిజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్ మే 17న ఇండియాాలో రిలీజైంది. ఈ సినిమా చూసిన రాం గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. #MissionImpossibleTheFinalReckoning#MissionImpossibleMANAM KUDA FILM MAKERS ANI CHEPPU KOVADANIKI SIGGU ESTADI - @RGVzoomin 💥💥💥💥💥I don't think anyone can say like what RGV has said . A BRUTAL HONEST OPINION pic.twitter.com/OkrXxyEvva— EXISTENTIAL NIHILIST 👻 (@Forced_Existenc) May 17, 2025 -
అమ్మ కోరిక తీర్చిన విజయ్ దేవరకొండ.. ఇంతకీ అదేంటో తెలుసా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు అభిమానుల అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఇటీవల సాంగ్ రిలీజ్ చేయగా విజయ్ దేవరకొండతో కెమిస్ట్రీ ఫుల్ రొమాంటిక్‌గా సెట్ అయింది. అయితే ఈనెల 30న థియేటర్లలో విడుదల కావాల్సిన కింగ్డమ్ ఊహించని విధంగా వాయిదా పడింది. ఇండియా- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కింగ్డమ్ మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జూలై 4న సినిమా థియేటర్లలోకి రానుందని వెల్లడించారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే విజయ్ తన ఫ్యామిలీతో చాలా సరదాగా గడుపుతూ ఉంటారు. ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో వేదికగా ఫోటోలు షేర్ చేస్తుంటారు. తాజాగా విజయ్ దేవరకొండ తన తల్లి కోరికను తీర్చాడు. ఈ వీకెండ్లో డిన్నర్ బయట ప్లాన్ చేద్దామని అమ్మ కోరడంతో వెంటనే విజయ్ డిన్నర్ ప్లాన్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అమ్మానాన్న, తమ్ముడు ఆనంద్‌తో డిన్నర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.(ఇది చదవండి: అటు రొమాన్స్.. ఇటు యాక్షన్.. 'కింగ్డమ్' తొలి పాట చూశారా?)విజయ్ తన పోస్ట్‌లో రాస్తూ..'అమ్మ అకస్మాత్తుగా మనం డిన్నర్ కి బయటకు వెళ్దామని అడిగింది. మేము బయటకు వెళ్లి చాలా కాలం అయింది. మనమందరం ఎప్పుడూ పని, లక్ష్యాల వెంట పరిగెడుతుంటాం. పనిలో బిజీగా ఉంటూ కొన్నిసార్లు జీవించడం మర్చిపోతాం. అందుకే నిన్న రాత్రి మేము బయటకు వెళ్లి చాలా సమయం గడిపాం. మీరు కూడా మీ అమ్మ, నాన్నలతో సమయం గడపడం మర్చిపోవద్దు. వారిని బయటకు తీసుకెళ్లండి, వారికి కొన్ని కౌగిలింతలు, ముద్దులు ఇవ్వండి. మీరు వారిని ప్రేమిస్తున్నారని చెప్పండి. మీ అందరికీ, మీ కుటుంబాలకు చాలా ప్రేమను పంపుతున్నా' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
సతీమణి కోసం మెగా హీరో కొత్త అవతారం.. తానే స్వయంగా!
మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవలే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను త్వరలోనే తండ్రిగా ప్రమోట్ కాబోతున్నట్లు ప్రకటించారు. తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి ఈ శుభవార్తను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఇక తన భార్య ప్రస్తుతం ప్రెగ్నెన్సీ ధరించడంతో మెగా హీరో కొత్త అవతారం ఎత్తాడు. తన ముద్దుల సతీమణి కోసం చెఫ్‌గా మారిపోయారు. స్వయంగా తానే పిజ్జా తయారు చేసి తన భార్యకు సర్ప్రైజ్ ఇచ్చాడు మెగా హీరో. వరుణ్ తేజ్ పిజ్జా తయారు చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. 2023లో వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే ఈ జంట మొదటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారు. 2017లో వరుణ్, లావణ్యల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది.వీరిద్దరు కలిసి ‘మిస్టర్’ అనే సినిమాలో తొలిసారి నటించారు. ఆ సమయంలోనే వీరికి పరిచయం ఏర్పడింది. చివరికీ వీరిద్దరి ప్రేమ సక్సెస్ కావడంతో కుటుంబ సభ్యుల ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. వరుణ్, లావణ్యల పెళ్లి ఇటలీలో జరగగా.. హైదరాబాద్‌లో రిసెప్షన్ ఘనంగా జరిగింది.(ఇది చదవండి: మెగా కోడలిగా తొలి సినిమా.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది!)ఇక సినిమాల విషయానికొస్తే వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్లో నటిస్తున్నారు. మెగా కోడలు లావణ్య త్రిపాఠి సైతం సతీ లీలావతి అనే సినిమాలో కనిపించనుంది. వరుణ్‌తేజ్‌తో పెళ్లి తర్వాత మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి నటిస్తోన్న మొదటి చిత్రం కావడం విశేషం. View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya) -
'ప్రేమించడం.. ప్రేమించబడటం.. రెండూ కర్మలే'.. ఆసక్తిగా టీజర్
దేవన్, ధన్య బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం 'కృష్ణలీల'. ఈ చిత్రాన్ని హీరో దేవన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'ప్రేమించడం.. ప్రేమించబడటం.. రెండూ కర్మలే.'.. ప్రేమ అనే ధర్మం దేవతలైనా.. రాక్షసులైనా.. యోగి అయినా..భోగి అయినా ఎవరైనా అనుభవించాల్సిందే' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది.టీజర్లో 'ఈ ప్రేమను అనైతికంగా అనుభవించాలనుకున్నా.. దూరం పెట్టాలనుకున్నా.. అది నీకు సరైన పాఠం నేర్పుతుంది' అనే డైలాగ్ వింటే ప్రేమ అనే కోణంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వినోద్ కుమార్ , పృధ్వీ, రవి కాలే , తులసి, సరయు , ఆనంద్ భరత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. -
రాంగ్ రూట్ కేసు.. విచారణకు హాజరైన బెల్లంకొండ శ్రీనివాస్
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఆయనపై కేసు నమోదు కావడంతో జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు వచ్చారు. తన ఇంటికి వెళ్తున్న క్రమంలో జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద రాంగ్ రూట్లో కారు నడపడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. అవసరమైతే మరోసారి కోర్టు విచారణకు రావాలని ఆయనకు పోలీసులు సూచించారు. ఇప్పటికే హీరో కారును సీజ్ చేసిన పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించారు.(ఇది చదవండి: దురుసు ప్రవర్తన.. టాలీవుడ్ హీరోపై కేసు నమోదు!)అసలేం జరిగిందంటే..జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టుల కాలనీలో నివాసం ఉంటున్న బెల్లకొండ శ్రీనివాస్ ఇంటికి వెళ్తున్న సమయంలో రాంగ్ రూట్లో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. తనని అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసుతో ఆయన దురుసుగా ప్రవర్తించారు. ఈ సంఘటనను ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ కావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం భైరవం మూవీలో నటిస్తున్నారు. -
'ధర్మం దారి తప్పినప్పుడు.. వచ్చినవాడు గౌతమ్'.. ఆసక్తిగా టీజర్
అశ్విన్ బాబు లీడ్ రోల్ నటిస్తోన్న తాజా చిత్రం 'వచ్చినవాడు గౌతమ్'. ఈ చిత్రంలో రియా సుమన్, అయేషాఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి మామిడాల ఎం ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో టి.గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 'ధర్మం దారితప్పినప్పుడు.. ఏ అవతారం రానప్పుడు.. వచ్చినవాడు గౌతమ్' అనే డైలాగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో అజయ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, సాయి రోనక్, అభినయ, నెల్లూరు సుదర్శన్, వైవా రాఘవ, విద్యులేఖ, షకలకశంకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు గౌర హరి సంగీతమందిస్తున్నారు. -
ఆర్ఆర్ఆర్-2 చేస్తారా?.. రాజమౌళి సమాధానమిదే.. వీడియో వైరల్!
ఆర్ఆర్ఆర్ టీమ్ లండన్‌లో సందడి చేస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్‌తో పాటు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం అక్కడే ఉన్నారు. తాజాగా లండన్‌లోని లెజెండరీ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మూవీ ప్రదర్శనతో పాటు ఆర్కెస్ట్రా కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆర్ఆర్ఆర్ ఫరెవర్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.మే 11న రాయల్ ఆల్బర్ట్ హాల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమాను ప్రదర్శించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫుల్ ఖుషీగా కనిపించారు. నాటు నాటు సాంగ్ ప్లే అవుతుండగా ఒకరి చేతిని ఒకరు పట్టుకుని కనిపించారు. ఆ తర్వాత రాజమౌళిని రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సరదాగా ఆట పట్టించారు. ముగ్గురు కలిసి నవ్వుతూ సందడి చేశారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల, జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి ఉన్నారు.ఈ సందర్భంగా ఉపాసన ఆర్ఆర్ఆర్-2 చేస్తారా? అంటూ రాజమౌళిని అడిగింది. దీనికి రాజమౌళి అవును అని సమాధానమిచ్చారు. ఉపాసన వెంటనే 'గాడ్ బ్లెస్ యూ' అంటూ వారిని దీవించింది. ఈ సరదా వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ ఈవెంట్లో ఆస్కార్ స్వరకర్త ఎంఎం కీరవాణి నేతృత్వంలోని రాయల్ ఫిల్హార్మోనిక్ కన్సర్ట్ ఆర్కెస్ట్రా ఆర్ఆర్ఆర్ సంగీతాన్ని ప్రదర్శించారు. దాదాపు మూడేళ్ల తర్వాత రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ మొదటిసారి వేదికపై తిరిగి కలిశారు.ఇక సినిమాల విషయానికొస్తే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో జతకట్టారు. ఈ సినిమా జూన్ 25, 2026న విడుదల కానుంది. మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ పెద్ది అనే టైటిల్ ఖరారు చేశారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. తొలిసారిగా మహేష్ బాబుతో కలిసి పనిచేయనున్నారు. ఈ చిత్రాన్ని 'ఎస్ఎస్ఎంబీ29' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
అలాంటి దేశాల్లో మన డబ్బులు ఖర్చు చేయకండి: టాలీవుడ్ హీరో సిద్ధార్థ్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం స్వయంభూ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇక సినిమాల సంగతి పక్కనపెడితే నిఖిల్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో చూసేద్దాం.ఇండియా-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో నిఖిల్ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. పాక్‌కు మద్దతుగా టర్కీ నిలవడంపై నిఖిల్ ఫైరయ్యారు. ఇకపై ఎవరూ కూడా టర్కీని సందర్శించవద్దని భారతీయులను కోరారు. టర్కీలో భారతీయులు ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తారని.. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. విహారయాత్రల కోసం అలాంటి దేశాలకు మనం వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. పాక్‌తో తాము సత్సంబంధాలు కొనసాగిస్తామని టర్కీ ప్రెసిడెంట్ ఎర్గోడాన్ చేసిన కామెంట్స్‌పై ఓ నెటిజన్స్ పోస్ట్ చేశాడు. దీనిపై టాలీవుడ్ హీరో నిఖిల్ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఆ సమయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా టర్కీతో పాటు చైనా కూడా సాయం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టర్కీ యాపిల్స్‌ను సైతం దిగుమతి చేసుకోవడం ఆపేశారు.Anyone still visiting Turkey ? Please read this Below Thread...Indians Spend Billions of Dollars Every year in Turkey. Please Stop giving your money to the Nations who are against us. #Tourism #India https://t.co/hUGq6MP6Pm— Nikhil Siddhartha (@actor_Nikhil) May 14, 2025 -
ప్రభాస్ స్పిరిట్.. ఆ హీరోయిన్‌కు ఏకంగా రూ.20 కోట్లా!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం స్పిరిట్. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్, ఆలియా భట్, రష్మికా మందన్నా సహా పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇంకా ఎవరూ ఫైనలేజ్ కాలేదు.అయితే తాజాగా వీరు కాకుండా మరో హీరోయిన్ పేరు నెట్టింట వైరలవుతోంది. బాలీవుడ్ భామ దీపికా పదుకొణెను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అయితే స్పిరిట్ కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకోనుందని టాక్ వినిపిస్తోంది. అధికారికంగా ధృవీకరించనప్పటికీ ఈ మూవీకి దాదాపు రూ.20 కోట్ల పారితోషికం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదే నిజమైతే దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్గా దీపికా రికార్డ్ క్రియేట్ చేయనుంది. కాగా..ఇప్పటికే దీపికా కల్కి 2898 ఏడీ మూవీలో కనిపించారు. గతంలో ప్రియాంక చోప్రా, అలియా భట్ కూడా భారీ పారితోషికం తీసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి.ఈ మూవీ ఫుల్ యాక్షన్-ప్యాక్డ్ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ ఏడాదిలోనే 'స్పిరిట్' షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను టీ సిరీస్ భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా (సందీప్‌రెడ్డి వంగా సోదరుడు) భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై నిర్మించనున్నారు . వచ్చే ఏడాది చివర్లో స్పిరిట్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో టాలీవుడ్ మూవీ ప్రదర్శన
టాలీవుడ్ నిర్మాత మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'ఎంఫోర్ఎం' (Motive for Murder). తాజాగా ఈ చిత్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరుదైన అవకాశం దక్కించుకుంది. మే 17న సాయంత్రం 6:00 గంటలకు కేన్స్‌లోని పలాయిస్ థియేటర్లో ప్రైవేట్ స్క్రీనింగ్ చేయనున్నారు. గొప్ప నిర్మాతగా గుర్తింపు పొందిన మోహన్ వడ్లపట్ల ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ప్రముఖ అమెరికన్ నటి జో శర్మ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. విడుదలకు ముందే ఈ సినిమా అనేక అంతర్జాతీయ ప్రశంసలు, అవార్డులు సొంతం చేసుకుంది. ఇటీవలి కాలంలో జో శర్మ ప్రతిష్టాత్మక వేవ్స్ ఈవెంట్లో సందడి చేశారు. ఈవెంట్లో అమెరికన్ డెలిగేట్ నటిగా పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో పాటు అత్యంత గౌరవాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంఫోర్ఎం టీమ్ ముంబయిలోని థియేటర్లో ప్రెస్ మీట్ నిర్వహించింది.మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ..'మా సినిమాను కేన్స్‌లో ప్రదర్శించడమన్నది ఒక గొప్ప అవకాశం, ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. మా టీమ్ అంతా చాలా ఉత్సాహంగా, ఆహ్లాదంగా ఉంది. త్వరలోనే ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం' అని తెలిపారు.ఈ సినిమా హత్యా కథాంశం ఆధారంగా రూపొందిన ఉత్కంఠభరిత థ్రిల్లర్‌గా రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రానికి అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇకపోతే, హంతకుడెవరో ఊహించిన వారికి ఒక లక్ష రూపాయల బహుమతి ఇవ్వనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. కాగా.. మోహన్ వడ్లపట్ల టాలీవుడ్లో మల్లెపువ్వు, మెంటల్ కృష్ణ, కలవరమాయే మదిలో లాంటి చిత్రాలను నిర్మించారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. -
టాలీవుడ్ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్.. సెన్సార్ పూర్తి
రుత్విక్, ఇక్రా ఇద్రిసి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతోన్న చిత్రం వైభవం. ఈ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమాకు సాత్విక్ దర్శకత్వం వహిస్తున్నారు. నూతన నిర్మాణ సంస్థ రమాదేవి ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్కు క్లీన్ యూ సర్టిఫికేట్ లభించింది. ఇదివరకే విడుదలైన రెండు పాటలకీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న వైభవం మూవీ ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఆ సినిమా వల్లే బాలీవుడ్లో ఆఫర్ వచ్చింది: శ్రీ విష్ణు
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు సింగిల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ నెల 9 నుంచి సింగిల్ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొత్తం రెండురోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 11.2 కోట్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీవిష్ణు కెరీర్లో మరో భారీ హిట్‌గా సింగిల్ మూవీ నిలిచింది.సింగిల్ రిలీజ్ నేపథ్యంలో శ్రీ విష్ణు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రతి సినిమాతో ఏదో ఒక అనుభవాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రారంభంలో చిరంజీవి, వెంకటేశ్ లాంటి పెద్ద హీరోలు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా ఎనర్జీ ఇచ్చేదన్నారు. బ్రోచెవారేవరురా లాంటి సినిమాకు చాలా ప్రశంసలు వచ్చాయి.. ఆ సమయంలో గొప్ప ఫీలింగ్ కలిగిందని తెలిపారు. బన్నీ, రవితేజ నా ప్రతి సినిమాకు సపోర్ట్ చేస్తుంటారని వెల్లడించారు.ఇక స్వాగ్ సినిమా విషయానికొస్తే.. తమిళం నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. అలాగే మొదటిసారి స్వాగ్ మూవీ తర్వాత బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందని శ్రీ విష్ణు వెల్లడించారు. కాగా.. సింగిల్ మూవీలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా దర్శకుడు కార్తీక్ రాజు ఈ మూవీని తెరకెక్కించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. -
లవ్ ఎంటర్టైనర్గా టాలీవుడ్ మూవీ.. టైటిల్ ఫిక్స్!
సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'ప్రేమిస్తున్నా'. ఈ సినిమాకు భాను దర్శకత్వం వహించారు. వరలక్ష్మీ పప్పుల సమర్పణలో కనకదుర్గారావు పప్పుల నిర్మిస్తున్నారు. ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ప్రేమిస్తున్నా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ సాలూరి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఐదు సూపర్బ్ సాంగ్స్ అందించారు. ఈ మూవీ మ్యూజికల్ లవ్ స్టొరీ కాబోతోంది. ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో నటించారు. -
పాకిస్తాన్‌కు చిన్న ఛాన్స్ కూడా ఇవ్వకూడదు: హీరో నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం 'హిట్: ది థర్డ్ కేస్'. హిట్ సిరీస్‌లో వచ్చిన మూడో చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మే 1వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నారు. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండియా- పాకిస్తాన్ యుద్ధం గురించి ఆయన మాట్లాడారు.హీరో నాని మాట్లాడుతూ..'ప్రస్తుతం పాక్‌తో యుద్ధం వల్ల పరిస్థితి సెన్సిటివ్‌గా ఉంది కదా మా టీమ్‌తో మాట్లాడా. అవతలి వాళ్లు మనకు ఏదో ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలని ట్రై చేశారు. దానికి మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా తిరిగి ఇచ్చేసింది. అంటే వాళ్ల వల్ల మనదేశంలో ఒక సినిమా ఈవెంట్ కూడా రద్దు అయిందన్న సంతోషం కూడా పాకిస్తాన్‌కు ఇవ్వకూడదు. అందుకే ఈరోజు సక్సెస్ మీట్ ఈవెంట్‌ను ప్లాన్ చేశాం. దేశ సరిహద్దుల్లో ఉండి మనల్ని కాపాడుతున్నా ఆర్మీ, నావీ, ఎయిర్‌ఫోర్స్‌కు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు' అని తెలిపారు.అనంతరం సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ.. 'ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. ఒక క్రైమ్ థ్రిల్లర్‌ని పెద్ద మాస్ కమర్షియల్ సినిమాలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. ప్రేక్షకుల స్పందన చూస్తే అద్భుతంగా అనిపించింది. మాకు ఇంతటి విజయాన్నిచ్చిన వారికి ధన్యవాదాలు’’ అని నాని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రోడక్షన్స్, వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు -
నా వయస్సు పెరిగింది.. రివ్యూల నంబర్ కూడా పెరగాలి: శ్రీ విష్ణు
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం సింగిల్ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి డైరెక్టర్‌గా కార్తీక్ రాజు పనిచేస్తున్నారు. ఇటీవలే సింగిల్ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 9న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే శ్రీ విష్ణు మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సినిమాలో రివ్యూల అంశంపై ఆయన మాట్లాడారు. రివ్యూలను మనం ఆపలేము.. మార్చలేము అన్నారు. కానీ రేటింగ్ నంబర్స్ మారితే బాగుంటుందని శ్రీ విష్ణు తెలిపారు.(ఇది చదవండి: 'శివయ్యా...' హర్టయిన కన్నప్ప టీమ్.. సారీ చెప్పిన శ్రీవిష్ణు)నా చిన్నప్పటి నుంచి ఇండియన్ రూపీతో పాటు అన్ని మారుతూ వచ్చాయని అన్నారు. నా వయస్సు కూడా పెరిగిందని.. అలాగే రేటింగ్ సిస్టమ్‌లో ఐదు పాయింట్లకు బదులు 50 నుంచి 100కు పెంచితే బాగుంటుందని శ్రీ విష్ణు సూచిస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ అయినా అనలిస్ట్ల్లాగే.. ఇది కూడా అనలైసిసే కదా అన్నారు. రివ్యూల్లో చెప్పేది కొన్నిసార్లు కరెక్ట్ కావొచ్చు.. కాకపోవచ్చని తెలిపారు. ఎక్కువ నంబర్స్ ఇస్తే బాగుంటుందని.. ఒక్కసారి ట్రై చేయాలని శ్రీ విష్ణు సూచించారు. -
చిరంజీవితో సినిమా.. భారీగా డిమాండ్ చేస్తోన్న స్టార్ హీరోయిన్!
సినీ పరిశ్రమలో ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్న హీరోయిన్లే ఎక్కువ. కానీ ఈ రోజుల్లో దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఎంట్రీ ఇచ్చి ఎండింగే లేదంటున్న హీరోయిన్లు ఉండడం విశేషమే. అలాంటి అతి తక్కువ మంది కథానాయికల్లో నయనతార ఒకరు. వరుసగా విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్‌కు ఒకటి రెండు ఫ్లాప్‌లు ఎదురైతే కేరీర్ తలకిందులవుతుంది. అలాంటిది నయనతార మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయింది.ఆ మధ్య ఈమె నటించిన ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రం అన్నపూరిణి నిరాశ పరిచింది. ఇటీవల కథానాయకిగా నటించిన టెస్ట్ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించలేక పోయింది. మరో పక్క పెళ్లి, భర్త, ఇద్దరు కవల పిల్లలు అంటూ సంసార జీవితం. అయినా అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. అయితే ఈమె తొలి సారిగా బాలీవుడ్లో షారుఖ్‌ఖాన్‌తో జంటగా నటించిన జవాన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అంతే కాకుండా ఆ చిత్రానికి రూ.12 కోట్లు వరకూ పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.అయితే తమిళ చిత్రాలకు అంత మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నారా అంటే సందేహమే. అలాంటిది తాజాగా ఈ అమ్మడు తన పారితోషికాన్ని ఏకంగా రూ.18 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. తెలుగులో చిరంజీవికి జంటగా ఒక భారీ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని.. అందులో నటించడానికి నయనతార రూ.18 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆ చిత్ర నిర్మాతల వర్గం ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఇదే కనుక నిజం అయితే దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నయనతార పేరు నిలిచిపోతుంది. ఇకపోతే ఈమె ఇంతకు ముందు చిరంజీవితో సైరా, గాడ్ ఫాదర్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. -
'చిరంజీవికి 106 డిగ్రీల జ్వరం.. శ్రీదేవి వల్ల ఆ సాంగ్ చేయాల్సి వచ్చింది'
తెలుగు చిత్రసీమ చరిత్రలోనే కాదు.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే ఓ క్లాసిక్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని మళ్లీ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ ఐకానిక్ సోషియో-ఫాంటసీ చిత్రం విడుదలై 35 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. మే 9న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు.కాగా.. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి టూరిస్ట్ గైడ్‌గా, లెజెండరీ శ్రీదేవి ఇంద్రజ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో అమ్రిష్ పూరి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామి రెడ్డి, బేబీ షాలిని, బేబీ షామిలీ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో మెప్పించారు. ఆ కాలంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించారు.కాగా.. మే 9వ తేదీ 1990న జగదేక వీరుడు అతిలోక సుందరి థియేటర్లలో విడుదలైంది. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ కూడా ఈ సినిమా తుడిచిపెట్టేసింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్ అనేలా ఈ మూవీ నిలిచిపోయింది. ఈ చిత్రం విడుదలైనప్పుడు దాని క్రేజ్ గురించి ఒక్క మాటలో ఓ ఉదాహరణగా చెప్పాలంటే.. రూ. 6 ధర ఉన్న టిక్కెట్ మొదటి మ్యాట్నీ షోకే బ్లాక్ మార్కెట్లో రూ. 210 వరకు అమ్మేశారట. అంటే దగ్గరదగ్గరగా 35 రెట్లు అన్నమాట. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలోని ఎవర్ గ్రీన్ సాంగ్ అబ్బనీ తీయని దెబ్బ పాట గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అదేంటో మీరు కూడా చూసేయండి. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. 'ఈ పాటను ఒక రోజులోపు కంపోజ్ చేశామని తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు. ఇళయరాజా ఉదయం 9 గంటలకు ఆ పాటపై పని చేయడం ప్రారంభించారు. మధ్యాహ్నం 12 లేదా 12:30 గంటల ప్రాంతంలో బాగుందా? లేదా వినండి అంటూ ఇళయరాజా మాకు ఒక ట్యూన్ ఇచ్చారు. అది రాఘవేంద్రరావు, అశ్వనీదత్‌తో పాటు నాకు వెంటనే నచ్చింది. ఆ ట్యూన్ ఎంతో సింపుల్‌గా, తియ్యగా అనిపించింది. భోజన సమయంలో వేటూరి సాహిత్యం రాశారు. బాలు, చిత్ర గారు అలా సరదాగా పాడేశారు'అని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ‘అందాలలో’ అనే పాట గురించి దర్శకుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. 'కథ ప్రకారం హీరో ఒక సామాన్యుడు, హీరోయిన్ ఒక దేవత అని చెప్పాల్సి వచ్చింది. దానిని పాట ద్వారా మాత్రమే సమర్థవంతంగా తెలియజేయగలమని మేము భావించాము. ఆ ఐకానిక్ పాటను కంపోజ్ చేయడం వెనుక ఉన్న ఆలోచన అదే' అని అన్నారు.‘దినక్కుతా’ అనే పాట గురించి అశ్వనీదత్ మాట్లాడుతూ .. ‘ఈ పాటను షూట్ చేసే టైమ్‌కి చిరంజీవి 106 డిగ్రీల జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. ప్రతి షాట్ బ్రేక్ సమయంలో.. మేము అతని శరీరాన్ని ఐస్ ప్యాక్డ్ బట్టలతో చుట్టి చల్లపరుస్తూ వచ్చాం. శ్రీదేవి కాల్ షీట్లు మాకు చివరి రెండు రోజులు మాత్రమే ఉన్నందున ఆయన ఆ పాట కోసం చాలా కష్టపడ్డారు. ఆ తర్వాత, ఆమె మరో షూటింగ్ కోసం ఒకటిన్నర నెలలు విదేశాలకు వెళ్లనుంది. మేము ఆ రెండు రోజుల్లోనే ఒకే సెట్లో షూటింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది. షూటింగ్ తర్వాత చిరంజీవిని వెంటనే విజయ ఆసుపత్రిలో చేర్పించాం. 15 రోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు’ అని అన్నారు.శ్రీదేవి గతంలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ గురించి మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో తనకు ఇష్టమైన పాట ‘ప్రియతమ’ సాంగ్ అని అన్నారు. అది చాలా అందమైన మెలోడీ. రాఘవేంద్రరావు దానిని ఎక్కువ మూమెంట్స్ లేకుండా కేవలం కంటి చూపులు, సైగలతోనే కంపోజ్ చేయించారు. అది మరపురాని పాట అని ఆమె అన్నారు. కాగా.. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్లు అజయన్ విన్సెంట్, కె.ఎస్. ప్రకాష్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు. ‘మాస్ట్రో’ ఇళయరాజా ఎవర్ గ్రీన్ సంగీతాన్ని, పాటల్ని అందించారు. ఈ చిత్రంలోని పాటలు నేటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఈ మూవీకి కథను యండమూరి వీరేంద్రనాథ్.. స్క్రీన్‌ప్లేను జంధ్యాల అందించారు. ఈ వేసవిలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మాయాజాలాన్ని మే 9న 2డీ, 3డీ ఫార్మాట్లలో చూసి ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) -
అమెరికాలో రానా సందడి.. హాలీవుజ్ దిగ్గజాలతో భేటీ!
టాలీవుడ్ హీరో రానా నాయుడు యూఎస్‌లో సందడి చేశారు. ఇటీవల డబ్ల్యూడబ్ల్యూఈ రేజ్లింగ్ మేనియాలోనూ కనిపించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రానా మియామి గ్రాండ్ ప్రిక్స్ వీకెండ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. అక్కడే హాలీవుడ్లో ప్రముఖ సంగీత దిగ్గజాలైన 50 సెంట్, ఆస్కార్ విజేత అయిన గూడింగ్ జూనియర్‌తో ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇండియాకు చెందిన లోకా లోకా పార్టీ సంస్థ ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు రానా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే లోకా లోకా సంస్థకు సహా వ్యవస్థాపకుల్లో ఒకరైన రానా దగ్గుబాటి ఈవెంట్లో సందడి చేశారు. ఈ కంపెనీకి హర్ష వడ్లమూడి, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కలిసి ముగ్గురు ఈ సంస్థకు కో ఓనర్స్‌గా ఉన్నారు. అమెరికా మార్కెట్లో తమ సంస్థ విస్తరణ కోసమే రానా అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. రానా చొరవతో అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ లైఫ్ స్టైల్ బ్రాండ్‌గా లోకా లోకా సంస్థ మరింత బలోపేతం కానుంది. ఈ సందర్భంగా వ్యాపారం, వినోదం, క్రీడల ప్రపంచానికి నిలయమైన మియామిలో రానా దగ్గుబాటి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. -
సెల్ఫీకి అల్లు అర్జున్ నో.. ఎయిర్‌పోర్ట్‌లో అభిమానికి నిరాశ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ముంబయిలో సందడి చేశారు. ప్రతిష్టాత్మక వేవ్స్ సమ్మిట్-2025కు బన్నీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఈ సమ్మిట్‌లో పంచుకున్నారు. సినీరంగంలో తనకు మామయ్య మెగాస్టార్ చిరంజీవినే ఆదర్శమంటూ కామెంట్స్ చేశారు. పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్.. ప్రస్తుతం జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టనున్నారు. ఈ సినిమా బన్నీ కెరీర్లో 22వ చిత్రంగా రానుంది.ఇదంతా పక్కన పెడితే వేవ్స్ సమ్మిట్‌కు వెళ్తూ మన ఐకాన్ స్టార్ ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కారు దిగి ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లే సమయంలో ఓ అభిమాని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. కానీ అతనితో ఫోటో దిగేందుకు బన్నీ అనుమతించలేదు. అతన్ని పక్కనే ఉన్న సెక్యూరిటీ సైతం వద్దని వారించారు.దీంతో అల్లు అర్జున్ వైఖరిపై నెటిజన్స్ ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదని పోస్టులు పెడుతున్నారు. అభిమానులే లేకపోతే అసలు మీరు ఎవరు? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. వెంటనే అల్లు అర్జున్ సినిమాలు చూడటం మానేయాలని మరో నెటిజన్ కామెంట్ చేశారు. అయితే మరికొందరు అల్లు అర్జున్‌కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. బిజీ షెడ్యూల్ వల్ల వారికి సమయం ఉండదని అంటున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
పవన్ కల్యాణ్ హీరోగా కొత్త చిత్రం.. సాంగ్ రిలీజ్ చేసిన తండేల్ డైరెక్టర్
పవన్ కల్యాణ్ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త సినిమా 'ఏ స్టార్ ఈజ్ బార్న్'. ఈ సినిమా ద్వారా ప్రియా పాల్, నేహా శర్మ, ఊహ రెడ్డి హీరోయిన్లుగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ఈ సినిమాకు వీజే సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. సీఆర్ ప్రొడక్షన్స్, వీజే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రవి సాగర్, వీజే సాగర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని "నా గతమే' అనే పాటను తండేల్ మూవీ డైరెక్టర్ చందు మొండేటి విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ... "నా గతమే సాంగ్ బాగుంది. పోస్టర్స్, ప్రోమోస్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ కావడంతో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరికి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. కాగా.. ఈ సినిమాను తెలంగాణలోని వనపర్తి, కొల్లాపూర్, సోమశిల, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సినిమాలో దాదాపు 93 మంది కొత్త నటీనటులు ఉండడం విశేషం. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర టీజర్, ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. -
టాలీవుడ్ యంగ్ హీరో కొత్త చిత్రం.. డప్పులతో ఫస్ట్ లుక్ పోస్టర్
రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో అలరించిన యంగ్ స్టార్ ఆశిష్ మరో మూవీతో సిద్ధమైపోయారు. ఈ సినిమాతో ఆదిత్య రావు గంగసాని డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇవాళ ఆశిష్ పుట్టిన రోజు కావడంతో టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు , శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేత్తడి అనే టైటిల్ ఖరారు చేశారు.ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆశిష్ హైదరాబాద్ వీధుల్లో కనిపించే డప్పు వాద్యకారుడి గెటప్‌లో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్లో బ్యాక్‌డ్రాప్‌లో డప్పులు మోగుతున్న గుంపు చుట్టూ జనం ఉత్సాహంగా డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే ఆశిష్ ఫుల్ మాస్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదీ స్లాంగ్‌లో డైలాగులు చెప్పడం సినిమాకు మరింత హైలైట్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని మేకర్స్ వెల్లడించారు.Gully beat, full heat, and birthday treat 🥁🔥The team of #Dethadi celebrated the birthday of @AshishVoffl in a true dethadi way 🤟🏻#DethadiFirstLook out now❤️🔥Get ready for a pakka Hyderabadi cinema that will resound across borders 💥#HappyBirthdayAshish @AdityaGangasani… pic.twitter.com/fpYvFP3fau— Sri Venkateswara Creations (@SVC_official) May 1, 2025Dethadi... Dethadi... Dethadi....🥁🥁🥁From dhol to dance and cake to crackers, the birthday celebrations of @AshishVoffl by team #Dethadi were a total vibe 🤟🏻Shoot begins soon 💥💥#HappyBirthdayAshish @AdityaGangasani #Dilraju #Shirish #RuthamSamar @SVC_official… pic.twitter.com/NAuQi8Rhub— Sri Venkateswara Creations (@SVC_official) May 1, 2025 -
'సినిమాల్లో మామయ్యే నాకు ఆదర్శం'.. అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్!
ముంబయిలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు హాజరైన బన్నీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాల్లో నాకు మామయ్య మెగాస్టార్ చిరంజీవినే ఆదర్శమని ఐకాన్ స్టార్ ప్రశంసలు కురిపించారు. ఆయన ప్రభావం తనపై ఎప్పటికీ ఉంటుందని బన్నీ అన్నారు. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. గతేడాది పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో జతకట్టారు. జవాన్‌తో సూపర్ హిట్ సాధించిన అట్లీతో కలిసి బన్నీ పనిచేయనున్నారు. ఇటీవలే వీరి సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. బన్నీ కెరీర్లో 22వ సినిమాగా రానున్న ఈ సినిమాపై ఐకాన్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించి కూడా అల్లు అర్జున్ ఈవెంట్లో ప్రస్తావించారు. తప్పకుండా అభిమానులు ఆశించిన స్థాయిలో విజువల్ ప్రెజెంటేషన్ ఉంటుందని బన్నీ చెప్పుకొచ్చారు. The MEGASTAR | It's A Brand 🔥😎Finally AA About Our Boss 😎❤️🔥Evaraina Naa Chiranjeevi Tharuvathey@KChiruTweets #Chiranjeevi@alluarjun #AlluArjun #MegastarChiranjeevi pic.twitter.com/YimIk1NXIA— We Love Chiranjeevi (@WeLoveMegastar) May 1, 2025 -
'రావణాసురుడు నా లెక్క ఆలోచించకపోతే.. రామాయణం ఉండేది కాదు'
దీక్షిత్‌శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజ కీలక పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం 'కేజేక్యూ కింగ్.. జాకీ.. క్వీన్'. ఈ సినిమాకు కేకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.టీజర్ చూస్తే ఈ మూవీని క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సిటీ.. గన్.. రెండు ఒక్కటే.. ఎవరి చేతిలో ఉంటుందో వాడి మాటే వింటుంది అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. 'పెద్దదైనా..చిన్నదైనా రిస్క్ ఒక్కటే.. చేసేదేదో పెద్దదే చేద్దాం' అనే డైలాగ్ వింటే గ్యాంగ్‌స్టర్ కోణంలో ఈ మూవీని రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది. చివర్లో 'రావణాసురుడు నా లెక్క ఆలోచించకపోతే.. రామాయణం ఉండేది కాదు' అనే డైలాగ్ ఆడియన్స్‌లో అంచనాలు పెంచేసింది. కాగా.. ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వి సంగీతమందిస్తున్నారు. -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్డమ్'. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించింది. ఈ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం టీజర్‌కు మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. కింగ్డమ్ ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. నిమిషం పాటు ఉన్న ప్రోమోను సితార ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. హృదయం లోపల అంటూ సాగే రొమాంటిక్ ఫుల్ సాంగ్‌ను మే 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. -
ఓటీటీకి డేవిడ్ వార్నర్ చిత్రం... ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం రాబిన్‌హుడ్. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలోకి వచ్చిన చిత్రం.. ఆశించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంలో తేలిపోయింది. ఈ మూవీ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం కెమియో పాత్రలో మెరిశారు. వార్నర్ కోసమైనా థియేటర్లకు వస్తారనుకున్నప్పటికీ అది కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.ఇప్పటికే ఈ సినిమా విడుదలై నెలరోజులు పూర్తవ్వడంతో ఈ మూవీ ఓటీటీకి ఎప్పుడొస్తుందా అభిమానులు ఎదురు చూస్తున్నారు. గతంలో మే 4న ఓటీటీ వస్తుందని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. మరోవైపు వచ్చేనెల 10 నుంచి స్ట్రీమింగ్ కానుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ హక్కులను జీ5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి వస్తున్నాం తరహాలో ఓకేరోజు టీవీలతో పాటు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.రాబిన్‌హుడ్ కథేంటంటే..'రాబిన్ హుడ్' విషయానికొస్తే.. రామ్ (నితిన్) ఓ అనాథ. అనాథశ్రమాల కోసం రాబిన్ హుడ్ పేరుతో దొంగతనాలు చేస్తుంటాడు. కొన్ని కారణాల వల్ల ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరుతాడు. ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చిన నీరా (శ్రీలీల)కు సెక్యూరిటీగా ఉంటాడు. ఓరోజు నీరాని ఎవరో కిడ్నాప్ చేస్తారు. మరి రామ్, నీరాని ఎలా రక్షించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
కెరీర్‌ను అందుకునే క్రమంలో బహుశా అతను సాధించినన్న రికార్డ్స్ మరే హీరో సాధించి ఉండడు. అత్యంత పిన్న వయసులో నటుడు, అత్యంత పిన్న వయసు హీరో, అత్యంత పిన్న వయసు స్టార్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తొలి సినిమా హీరో... హిందీ, తెలుగు, తమిళ, మళయాళం, కన్నడ..అన్ని భాషల్లోనూ స్వల్ప వ్యవధిలోనే 280 చిత్రాలు చేసిన హీరో...పాతికేళ్ల వయసులోనే ఇన్ని సాధించాడంటే ఇప్పుడెలా ఉండాలి? ఏభై ఏళ్ల వయసులో ఎంత గొప్ప స్థాయిలో ఉండాలి? ఎంత ఉన్నత స్థాయిలో ఉండాలి? కానీ అడ్రెస్ కూడా లేకుండా పోవడం ఏమిటి?అది 90వ దశకం.. భారతీయ సినీ పరిశ్రమకు ఒక మార్పు కాలం. ప్రధాన సినిమాలల్లో స్థిరపడిన తారల వయసు ముదిరిపోతుండగా, వారి స్థానాన్ని భర్తీ చేయడానికి యువ నటీనటులను పెద్ద సంఖ్యలో పరిచయం చేసిన కాలం. అలా తెరపైకి వచ్చిన యువతలో, అప్పుడే 15ఏళ్ల వయసులో హీరోగా అడుగుపెట్టిన ఒక యువ నటుడు ప్రత్యేకంగా నిలిచాడు అతడే హరీష్ కుమార్ (Harish Kumar), తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన హరీష్. బాలనటుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి ప్రధానంగా తెలుగు సినిమాల్లో నటించిన హరీష్, కొన్ని హిందీ, కన్నడ చిత్రాల్లోనూ నటించాడు. ఆ తర్వాత 1988లో, కేవలం 13ఏళ్ల వయసులోనే హీరో పాత్రలు పోషించడం మొదలుపెట్టాడు. దివంగత నిర్మాత రామానాయుడు 1990లో తీసిన ‘ప్రేమ ఖైదీ‘ తెలుగు సినిమాతో అప్పటి యూత్‌ని ఒక ఊపు ఊపాడు. తరువాతి ఏడాది, ఈ సినిమా హిందీ రీమేక్ లో కూడా నటించాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ తొలి సినిమా విజయం సాధించింది. హరీష్–కరిష్మా కపూర్ (అప్పుడు ఇద్దరికీ 16ఏళ్లు) జోడీ ప్రేక్షకులకు ఎంతో నచ్చింది.తర్వాతి కాలంలో, ‘తిరంగా‘, ‘కాలేజ్ బుల్లోడు‘ వంటి విజయవంతమైన చిత్రాల్లో హరీష్ నటించాడు. ఆ సమయానికి, హరీష్‌ను హిందీ తెలుగు సినిమాల్లో ఉన్న అత్యుత్తమ యువ నటుల్లో ఒకరిగా గుర్తించారు. కొందరు ఆయనను షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ తదనంతర స్టార్‌గా కూడా భావించారు. కానీ తర్వాత తర్వాత హరీష్‌కు పూర్తిస్థాయి హీరోగా అవకాశాలు రాకున్నా మంచి పాత్రలే వచ్చాయి. టాప్ స్టార్స్ అయిన రజనీకాంత్, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నానా పాటేకర్, గోవిందా ల చిత్రాల్లో హరీష్ రెండవ హీరో, చిన్న పాత్రలకే పరిమితం అయ్యాడు.‘ద జెంటిల్మన్‘, ‘కూలీ నం.1‘, ‘హీరో నం.1‘ వంటి హిట్ చిత్రాల్లో నటించాక, 2001 ప్రాంతంలో అకస్మాత్తుగా తెరమరుగైన హరీష్... తిరిగి పదేళ్ల తర్వాత తెరపై కనిపించాడు. ఓ పుష్కర కాలం క్రితం ‘నాటీ ః 40‘, ‘చార్ దిన్ కి చాంద్ని‘ వంటి ఫ్లాప్ చిత్రాలతో తిరిగి సినిమాల్లో ప్రయత్నించాడు.ఆ తర్వాత ఏడేళ్ల క్రితం‘ఆ గయా హీరో‘ అనే చిత్రంలో గోవిందాతో కలిసి చివరిసారి తెరపై కనిపించాడు. ఏమైందో తెలీదు గానీ హరీష్ సినిమా జర్నీ ఎంత ఉధృతంగా మొదలైందో అంతే అకస్మాత్తుగా ముగిసింది.అందగాడని, ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు అని, డ్యాన్సులు, ఫైట్స్ బాగా చేస్తాడని మంచి పేరు తెచ్చుకున్న హరీష్..సినిమా కెరీర్‌ను వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులే నాశనం చేశాయని అంటారు. ఆయన ప్రేమ, పెళ్లి కూడా ఆయన సమస్యలకు కారణం అని కూడా కొందరు చెబుతారు.అయితే కొంత కాలం క్రితం ఆయన ఓ ఇంటర్వ్యూలో తన సినీ రంగం విడిచిపెట్టడానికి గల అసలు కారణం గురించి మాట్లాడాడు. చిన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదంలో గాయపడిన తాను సంవత్సరాల తరబడి చికిత్స చేయించుకోకపోవడం వల్ల, సీరియస్ బ్యాక్ ప్రాబ్లెమ్‌కి గురయ్యాడని చెప్పారు. ‘ లంబార్ వెరిబ్రా ఎల్3 ఎల్5 ప్రాంతాల్లో స్లిప్డ్ డిస్క్ ఏర్పడింది. దీనివల్ల నడక కూడా కష్టమైంది. ఆ సమయంలో నేను చాలా నిర్లక్ష్యంగా ఉండి, గాయాన్ని గుర్తించలేకపోయాను. ఆపరేషన్ కూడా చేయించుకోవాలనుకోలేదు,‘ అని హరీష్ చెప్పాడు.చివరికి చికిత్స తీసుకున్న తరువాత, నెలల తరబడి మంచం మీద ఉండాల్సి వచ్చిందని, ఆ లోపు పరిశ్రమ తనను దాటి వెళ్లిపోయిందని హరీష్ తెలిపారు. ‘డాక్టర్ మొదట రెండేళ్ల పాటు పని చేయకూడదని చెప్పాడు. ఆ తర్వాత అలా అలా తెలియకుండానే పరిశ్రమ నుంచి మాయం అయ్యాను,‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హరీష్ ప్రశాంత జీవితం గడుపుతున్నాడు. ‘నేను ఇంకా భారత్‌లోనే ఉన్నాను – చెన్నై, హైదరాబాద్, ముంబైలలో ఎక్కువగా ఉంటాను. సినిమా రంగం విడిచిన విషయం చాలా వ్యక్తిగతమైనది. దీనిపై ఎక్కువగా మాట్లాడాలని ఇష్టం లేదు,‘ అని హరీష్ స్పష్టం చేశాడు. -
పాక్‌పై మనం దాడి చేయాల్సిన పనే లేదు.. వాళ్లే తిరగబడతారు: విజయ్ దేవరకొండ
కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఆ ఘటనను తలచుకుంటేనే చాలా బాధగా ఉందన్నారు. ఎవరైతే వారి ఆప్తులను కోల్పోయారో వారి బాధ తీవ్రత ఎంత అనేది అర్థం చేసుకోలగను అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై దేవరకొండ పహల్గామ్ దాడి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..'కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో తమ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న వారందరికీ ఒక మాట చెబుతున్నా. మేమంతా మీకు అండగా ఉంటాం. మీ బాధను దగ్గరుండి పంచుకోలేకపోయినా.. మేమూ దాన్ని అనుభవిస్తున్నాం. కశ్మీర్లో జరుగుతున్న ఇలాంటి దారుణాలకు కారణం కేవలం చదువు లేకపోవడమే. వాళ్లందరికీ చదువు చెప్పించి బ్రెయిన్‌వాష్ కాకుండా చూడాలి . ఇలాంటి చర్యల వల్ల ఏం సాధిస్తారో నాకైతే తెలియదు. కశ్మీర్ ఎప్పటికీ ఇండియాదే.. కశ్మీరీలు కూడా మనవాళ్లే. రెండేళ్ల క్రితమే అక్కడ ఖుషీ సినిమా షూటింగ్‌కు కూడా వెళ్లా. పాకిస్థాన్‌లో నీళ్లు, కరెంట్ లేక ఇబ్బందులు పడుతుంటే.. ఇక్కడకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు. పాకిస్థాన్‌పై మనం దాడి చేయాల్సిన అవసరం లేదు. వాళ్లకే విరక్తి వచ్చి ఆ దేశ ప్రజలే అక్కడి ప్రభుత్వంపై దాడి చేస్తారు. వాళ్లు బుద్ధి లేకుండా చేసే పనులే ఇవన్నీ. ఇలాంటి సమయంలో మనమంతా ఒక్కటిగా కలిసి ఉండాలి. మనం జీవితంలో ముందుకెళ్లాలంటే చదువు ఒక్కటే మార్గం. మనం, మన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నప్పుడే దేశం కూడా ముందుకు వెళ్తుంది' అని అన్నారు.అనంతరం సూర్య గురించి మాట్లాడుతూ..' నాకు పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో కొంచెం డబ్బు చూసినప్పటి నుంచి చదువుకునేవారి కోసం ఏదైనా చేయాలనే కోరిక ఉండి.. చిన్నగా ట్రై చేశాను. కానీ, పదిహేనేళ్లుగా సూర్య అన్న అగరం ఫౌండేషన్ ద్వారా వేలమంది చదువుకి ఆర్థిక చేయూతనిస్తూ, ఉద్యోగాలు ఇప్పిస్తుండటం చాలా గొప్ప. ఆయన స్ఫూర్తితో ఈ ఏడాది నేను కూడా విద్యార్థులతో ఓ కమ్యూనిటీ ఏర్పరచి వారికి చేయూతనిస్తాం. ఇక ‘రెట్రో’ సినిమాని నేను థియేటర్లో చూస్తాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను' అని అన్నారు.కాగా.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేస్తోంది. -
కాలి నడకన తిరుమలకు కేజీఎఫ్ బ్యూటీ, నాని.. వీడియో వైరల్
నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం హిట్-3. ఈ మూవీ హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మేడే సందర్భంగా 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవ సమయంలో స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.కాగా.. అంతకుముందు కాలి నడకన శ్రీవారి మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దర్శన అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా.. ఈ చిత్రంలో నాని అర్జున్ సర్కార్ పాత్రలో అభిమానులను మెప్పించనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ చూస్తే ఫుల్ వయోలెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Exclusive visuals of @NameisNani , @SrinidhiShetty7 reaching at Tirumala Tirupati Devasthanam on foot #HIT3 #NaturalStarNani pic.twitter.com/eqztW8zfit— Telugu Film Producers Council (@tfpcin) April 26, 2025 -
బన్నీకి రౌడీ హీరో సర్ప్రైజ్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీలో నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ టీజర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ.. మన బన్నీకి మంచి ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు అభిమానం చాటుకుంటూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అల్లు అర్జున్‌కు ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు విజయ్.తాజాగా విజయ్... తన రౌడీ బ్రాండ్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా బన్నీకి రౌడీ బ్రాండ్ టీషర్ట్స్‌ను, పిల్లల కోసం కొన్ని బర్గర్లను పంపారు. దీనికి సంబంధించిన ఫొటోను పంచుకున్న బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మై స్వీట్ బ్రదర్.. ఎప్పుడూ నువ్వు సర్ప్రైజ్ చేస్తుంటావు. సో స్వీట్ అంటూ అని తన స్టోరీస్‌లో రాసుకొచ్చారు. కాగా.. గతంలోనూ అల్లు అర్జున్‌కు పుష్ప 2 రిలీజ్ సందర్భంగా పుష్ప పేరుతో కూడిన టీ షర్ట్‌లను పంపారు.మరోవైపు పుష్ప-2 తర్వాత బన్నీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో జత కట్టనున్నారు. జవాన్ మూవీతో హిట్ అందుకున్ అట్లీ దర్శకత్వంలో నటించునున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి మూవీ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతున్నట్లు తెలుస్తోంది. -
ప్రియదర్శి 'సారంగపాణి జాతకం'.. ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించాడా?
టైటిల్: సారంగపాణి జాతకంనటీనటులు: ప్రియదర్శి, రూప కొడువాయూర్, వీకే నరేశ్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, హర్ష చెముడు తదితరులుదర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటినిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్నిర్మాణ సంస్థ: శ్రీదేవి మూవీస్సినిమాటోగ్రఫీ: పీజీ విందాసంగీత దర్శకుడు: వివేక్ సాగర్ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్విడుదల తేదీ: ఏప్రిల్ 25, 2025ఇటీవలే కోర్ట్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ప్రియదర్శి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చారు. కోర్టు సక్సెస్ ఎంజాయ్ చేస్తుండగానే మరో మూవీ థియేటర్లలో పడిపోయింది. వరుస సినిమాలతో ఫుల్ స్పీడ్‌లో ప్రియదర్శి నటించిన తాజా చిత్రం సారంగపాణి జాతకం. ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ను టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. ఇవాళ థియేటర్లలో విడుదలైన సారంగపాణి జాతకం ప్రేక్షకులను నవ్వించిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.సారంగపాణి జాతకం కథేంటంటే..సారంగ(ప్రియదర్శి) ఓ కార్ల కంపెనీలో సేల్స్ మెన్. చిన్నప్పటి నుంచి యావరేజ్ మార్కులతో పాసైన సారంగకు ఆ జాబ్ సాధించడం గొప్పే అని సారంగ తల్లిదండ్రుల ఫీలింగ్. ముఖ్యంగా ఇదంతా మనోడి జాతకం తెగ నమ్మేస్తుంటారు. అలా చిన్నప్పటి నుంచి జాతకాలపై సారంగకు పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. అయితే అదే కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తోన్న మైథిలి(రూప కొడువాయూర్)తో మన సారంగకు లవ్ మొదలవుతుంది. ఆమెకు సారంగ ప్రపోజ్ చేద్దాం అనుకునేలోపే మైథిలినే ఊహించని సర్ప్రైజ్ ఇస్తుంది. అలా ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలై చివరికీ పెళ్లి వరకు తీసుకెళ్తుంది. అంతా ఓకే అనుకుంటుండగానే సారంగకు చేతి రేఖలు చూసి భవిష్యత్తును డిసైడ్ చేసే జిగ్గేశ్వర్(అవసరాల శ్రీనివాస్)ను అనుకోకుండా కలుస్తాడు. ఆయన చేతిరేఖల జాతకంలో ఫేమస్ కావడంతో అతని వద్దకు సారంగ వెళ్తాడు. ఆ తర్వాత సారంగ చేయి చూసిన జిగ్గేశ్వర్ (అవసరాల శ్రీనివాస్) చేతి రేఖలు చూసి అతని జాతకంలో ఉన్న ఓ షాకింగ్ విషయం చెప్తాడు. ముందు నుంచి జాతకాలు తెగ నమ్మే సారంగ ఆ విషయం తెలుసుకుని తెగ బాధపడిపోతుంటాడు. ఆ పని పూర్తయ్యాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయంలో తన ఫ్రెండ్ చందు(వెన్నెల కిశోర్) సాయం కోరతాడు. ఇద్దరు కలిసి సారంగ జాతకం ప్రకారం ఆ పని కోసం తమ మాస్టర్ మైండ్స్‌తో స్కెచ్ వేస్తారు. మరి అది వర్కవుట్ అయిందా? అసలు సారంగ జాతకంలో ఉన్న ఆ షాకింగ్ విషయం ఏంటి? దాని కోసం చందుతో కలిసి వేసిన ప్లాన్స్ సక్సెస్ అయ్యాయా? చివరికీ సారంగ.. తన ప్రియురాలు మైథిలిని పెళ్లి చేసుకున్నాడా? అనేది తెలియాలంటే సారంగపాణి జాతకం చూడాల్సిందే.ఎలా ఉందంటే..సాధారణంగా మనదేశంలో జాతకాలంటే జనాలకు ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే. మన గ్రామాల్లో అయితే ఇలాంటివీ విపరీతంగా నమ్మేస్తుంటారు. అలా జాతకాలను తెగ నమ్మేసే ఓ యువకుడి స్టోరీనే మన ముందుకు తీసుకొచ్చారు మోహనకృష్ణ ఇంద్రగంటి. చేతి రేఖల జాతకం అనే కాన్సెప్ట్‌తో తీసుకొచ్చిన ఈ కథ ఆడియన్స్‌కు వివరించే విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ప్రేక్షకులను నవ్వించేందుకు జాతకం అనే కాన్సెప్ట్‌ను ఎంచుకోవడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. అలా ఫస్ట్ హాఫ్‌లో లవ్, కామెడీతో ఇంద్రగంటి కట్టిపడేశారు. ప్రతి సీన్లో పంచ్‌లు, ప్రాసలు, అక్కడక్కడ అడల్డ్ జోక్స్‌తో ప్రేక్షకున్ని నాన్‌స్టాప్‌గా నవ్వించేశారు డైరెక్టర్. తన జాతకం ప్రకారం జరగాల్సిన ఆ పనిని ముందే చేస్తే ఎలా ఉంటుంది? ఆ పని కోసం హీరో(సారంగ) ప్లాన్స్ చూస్తే థియేటర్లలో నవ్వుకోని వాళ్లు ఉండరేమో? అలా ఫస్ట్ హాఫ్‌లోనే తన కామెడీ పంచ్‌లతో సగటు ప్రేక్షకున్ని సీట్ నుంచి కదలకుండా చేసేశాడు. సరదాగా వెళ్తున్న కథలో ఓ సీరియస్‌నెస్ తెప్పించే ట్విస్ట్ ఇచ్చిన ఇంద్రగంటి ఇంటర్వెల్ బ్యాంగ్ పడేశాడు. ఫస్ట్ హాఫ్‌తోనే ప్రేక్షకులను తెగ నవ్వించేసిన డైరెక్టర్.. సెకండాఫ్‌లో కొత్త పాత్రలతో కథను మరింత ఇంట్రెస్టింగ్గా మార్చేశాడు. కొత్త క్యారెక్టర్స్‌తో ఎక్కడా బోర్ కొట్టకుండా కామెడీని మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. హర్ష చెముడు, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ చేసే కామెడీ ఆడియన్స్‌కు హిలేరియస్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కథ మొత్తం ఓ హోటల్ చుట్టే ప్లాన్ చేశాడు డైరెక్టర్. హోటల్లో జరిగే సన్నివేశాలు ప్రేక్షకుల ఉహకందేలా ఉన్నప్పటికీ కామెడీతో ప్రేక్షకుడిని కట్టిపడేయడంలో ఇంద్రగంటి ఫుల్ సక్సెస్ అయ్యారు. సెకండాఫ్‌లో తనికెళ్ల భరణి(అహోబిలం రావు) ఎంట్రీతో ఆడియన్స్‌లో మరింత ఆసక్తి పెంచేశాడు. కథలో ఊహించని ట్విస్ట్‌లతో ఎక్కడా కూడా ప్రేక్షకుడికి బోరింగ్ అనే పదం గుర్తు రాకుండా చేశాడు దర్శకుడు. జాతకం అనే కాన్సెప్ట్‌తో ఇంద్రగంటి చేసిన కామెడీ.. రోటీన్ కంటే భిన్నంగా ఉందని సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఫీలవుతాడు. క్లైమాక్స్‌లో వచ్చే ఓ సీరియస్ సీన్లోనూ నవ్వులు పూయించడం ఆయనకే సాధ్యమైంది. సందర్భాన్ని బట్టి అక్కడక్కడా కొన్ని అభ్యంతరకర పదాలు వాడినప్పటికీ.. కామెడీ ఎంటర్టైనర్గా కావడంతో ప్రేక్షకులు అంతగా ఇబ్బందే పడే లా అయితే లేవు. ఓవరాల్‌గా జాతకం అనే కాన్సెప్ట్‌తో డైరెక్టర్ చేసిన కామెడీ తీరు ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉందనడంలో సందేహం లేదు. ఎవరైనా ఫ్యామిలీతో కలిసి కడుపుబ్బా నవ్వాలనుకుంటే మీరు కూడా సారంగపాణి జాతకంపై ఓ లుక్కేయండి.ఎవరెలా చేశారంటే..ప్రియదర్శి నటన, కామెడీ టైమింగ్‌తో మరోసారి అదరగొట్టేశాడు. మిస్టర్ ప్రెగ్నెట్ హీరోయిన్ రూప మరోసారి తన అందం, నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసింది. వెన్నెల కిశోర్, అవసరాస శ్రీనివాస్, హర్ష చెముడు, వీకే నరేశ్, తనికెళ్ల భరణి తమ పాత్రల్లో ఆడియన్స్‌ను అలరించారు. సాంకేతికత విషయానికొస్తే పీజీ విందా సినిమాటోగ్రఫీ బాగుంది. మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ ఫర్వాలేదు. కొన్ని సీన్స్ మరింత క్రిస్పీగా కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. వివేక్ సాగర్ నేపథ్యం సంగీతం ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు శ్రీదేవి మూవీస్ సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
పహల్గామ్ ఘటనపై మరోసారి స్పందించిన మెగాస్టార్..!
పహల్గామ్ ఉగ్రదాడిపై మెగాస్టార్ చిరంజీవి మరోసారి స్పందించారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అమాయక ప్రజలను బలి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రాక్షసుల ఆకృత్యానికి ఎంతోమంది బలైపోయారు. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని తన బాధను వ్యక్తం చేశారు. మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారని ఆవేదన చెందారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు మెగాస్టార్ తెలిపారు.ఈ ఘటనకు కారణమైన వారిని ఎవరినీ విడిచిపెట్టొద్దని మెగాస్టార్ చిరంజీవి కోరారు. ఈ దాడిపై అంతకుముందే చిరు ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది అమాయక ప్రజలతో పాటు పర్యాటకులను కాల్చి చంపడం క్షమించరాని క్రూరమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ దారుణమైన దాడి చాలా భయంకరమైందని.. ఈ ఘటనకు సంబంధించిన విషయాలను చూస్తుంటే గుండె పగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నష్టాన్ని ఏదీ పూడ్చలేదని పోస్ట్‌లో రాసుకొచ్చారు. -
నాని హిట్-3.. సెన్సార్ బోర్డ్ కట్స్ ఇవే!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'హిట్: ది థర్డ్ కేస్'. హిట్ సిరీస్‌లో వస్తోన్న మూడో చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వంలోనే తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఇందులో మోస్ట్ వయోలెన్స్‌తో నాని కనిపించారు. సినిమా రిలీజ్‌కు రెండు వారాల ముందే ట్రైలర్ విడుదల చేసిన మూవీ టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సూపర్ హిట్ అవుతుందని నాని ఫుల్ ధీమాగా ఉన్నారు.తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ట్రైలర్లోనే ఓ రేంజ్లో వయోలెన్స్ చూపించడంతో సెన్సార్ ఏ సర్టిఫికేట్ మాత్రమే జారీ చేసింది. అంతేకాకుండా కొన్ని సీన్స్ మార్పులు చేయాలని సూచించింది. అలాగే అభ్యంతరకర పదాలు మ్యూట్ చేయాలని ఆదేశించింది. రక్తం కనిపించే సన్నివేశాల్లో రెడ్ కలర్‌ను డార్క్ చేయాలని సూచించింది. కాగా.. ఈ మూవీ రన్ టైమ్ దాదాపు రెండుగంటల 37 నిమిషాలుగా ఉండనుంది. అలా మార్పులు చేయడంతోనే సెన్సార్ బోర్ట్ ఓకే టెప్పింది. కాగా.. ఈ చిత్రంలో నాని.. అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నారు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
గోపిచంద్ కొత్త చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ హీరో గోపిచంద్ మరో కొత్త సినిమాకు రెడీ అయిపోయారు. ఇటీవలే ఓ సినిమా ప్రకటించిన కొత్త డైరెక్టర్‌తో జతకట్టారు. కుమార్ సాయి దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ లాంఛనంగా ఇవాళ ప్రారంభమైంది. ఈ చిత్రంలో మలయాళ భామ మీనాక్షి దినేశ్ హీరోయిన్గా కనిపించనుంది.ఈ సినిమాను థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గోపీచంద్ హీరోగా మార్చిలో ప్రారంభమైన సినిమాకి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. The man of grit is back @YoursGopichand 😎This time in a new dimension of Chills 🤟🏻@SVCCOfficial's Production No.39 kickstarts with a Grand Pooja Ceremony Today 🪔Directed by @MysticBoom 🎬Visuals by @ShamdatDOP 🎥Rolling on floors soon 🔥 pic.twitter.com/RgcprG5LjT— SVCC (@SVCCofficial) April 24, 2025 The relentless team that’s all set to give you a BLOCKBUSTER ride 💥💥@SVCCOfficial’s ProductionNo.39 has officially begun with an auspicious pooja ceremony ❤️🪔Here’s a glimpse of the blissful moments that marked the beginning ✨ @YoursGopichand #MeenakshiDineshDirected… pic.twitter.com/NAoLUdwA8P— SVCC (@SVCCofficial) April 24, 2025 -
కుటుంబ సమేతంగా పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సందడి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 మూవీతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను తిరగరాసింది. సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం బన్నీ జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.తాజాగా ఓ పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సందడి చేశారు. తన కజిన్ పెళ్లికి ఆయన హాజరయ్యారు. ఈ పెళ్లికి అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తమ ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలను టీమ్ అల్లు అర్జున్ ట్విటర్లో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Bunny anna : Yesesaava 😳🤣@alluarjun #AA22 pic.twitter.com/6MWEZ36JjK— Allu Babloo AADHF (@allubabloo) April 24, 2025 Icon Star @alluarjun attended his cousin’s wedding, joining the family in the special celebration. ✨#AlluArjun pic.twitter.com/HFR29rUZp1— Team Allu Arjun (@TeamAAOfficial) April 23, 2025 -
ఐదు ప్రశ్నలకు సమాధానం.. ఫ్రీగా ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ టికెట్స్ !
ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన తాజా చిత్రం చౌర్యపాఠం(Chaurya Paatam Movie). ఈ సినిమాకు నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు, చూడామణి సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా..ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే ఈ సినిమాకు రిలీజ్‌కు ఇంకా రెండు రోజులు సమయం ఉండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. దీంతో చౌర్యపాఠం చిత్రబృందం అందరికంటే కాస్తా భిన్నంగా ప్రమోషన్స్ ప్రారంభించింది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ఫుల్ స్వింగ్‌లో ఉండడంతో ప్రమోషన్లలో వాడేశారు. ఈనెల 23న హైదరాబాద్‌లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌కు ఉచితంగా టిక్కెట్స్ గెలుచుకునే అవకాశాన్ని కల్పించారు. దీనికోసం ఓ చిన్న కాంటెస్ట్‌ను ప్లాన్ చేశారు. అదేంటో తెలుసుకుందాం.చౌర్యపాఠం ట్రైలర్ చూసి అందులో ఐదు ప్రశ్నలకు కరెక్ట్‌గా సమాధానాలు పంపాలి. ఐదింటికి సరైన సమాధానాలు పంపిన వారిలో లక్కీ డ్రా ఎంపిక చేస్తారు. ఈ ప్రశ్నలను ట్విటర్ ద్వారా షేర్ చేశారు హీరో ఇంద్ర రామ్. మొదటి ప్రశ్న- ట్రైలర్లో వినిపించే గ్రామం పేరేంటి? రెండోది- ప్రతి రోజు బెల్ ఎన్ని గంటలకు మోగుతుంది? మూడోది.. వీక్నెస్ కోసం వినియోగించే ట్యాబ్లెట్ పేరేంటి? నాలుగో ప్రశ్న- ఈ ట్రైలర్ వాడిన ముగ్గురు హీరోయిన్ల పేర్లు? ఇక ఐదో ప్రశ్న- చౌర్యపాఠం మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు? ఈ ఐదింటికి సరైన సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపిస్తే విజేతలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ సారి ట్రై చేయండి. Hey hai #IPL lovers Need #IPL tickets for Hyderbad match tomorrow ?Then participate in our #ChauryaPaatam contents and the best answers can grab IPL tickets for free ☺️#ChauryaPaatamonApr25th #3daystogo pic.twitter.com/heEyYXqRQq— Velivela Indhra Ram (@indhraram) April 22, 2025 -
స్కూల్ ప్రేమను గుర్తు చేసే 'మధురం'.. ఎలా ఉందంటే?
టైటిల్: మధురం నటీనటులు: ఉదయ్ రాజ్, వైష్ణవీ సింగ్, బస్ స్టాప్ కోటేశ్వర రావు, కిట్టయ్య, ఎఫ్ఎం బాబాయ్, దివ్య శ్రీ, సమ్యూ రెడ్డి తదితరులు డైరెక్టర్: రాజేష్ చికిలే నిర్మాత - ఎం. బంగర్రాజు సినిమాటోగ్రఫీ - మనోహర్ కొల్లి సంగీతం - వెంకీ వీణ ఎడిటర్ - ఎన్టీఆర్ విడుదల తేదీ ఏప్రిల్ 18, 2025 మధురం కథేంటంటే..రామ్ (ఉదయ్ రాజ్), మధు (వైష్ణవీ సింగ్) ఒక రొమాంటిక్ కామెడీ సన్నివేశంలో కలుస్తారు. వారి అమాయకమైన హృదయాలు తక్షణమే ఒకరినొకరు ఆకర్షిస్తాయి. 10వ తరగతి అమ్మాయి, 9వ తరగతి అబ్బాయితో ప్రేమలో పడటం వల్ల ఈ యువ జంట అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. చివరికీ వారి ప్రేమ కథ సక్సెస్ అవుతుందా? తల్లిదండ్రులు, సమాజం నుంచి వారు ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి? వాటిని ఎలా అధిగమించారు? వాళ్లు తమ ప్రేమను గెలిచారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మధురం చూడాల్సిందే!ఎలా ఉందంటే..మధురం టైటిల్ చూస్తే లవ్ స్టోరీ అని ఆడియన్స్‌కు గుర్తుపట్టేలా ఉంది. యవ్వనంలో చిగురించిన ప్రేమే కథాంశంగా తెరకెక్కించిన తీరు బాగుంది. మొదటి భావోద్వేగాల సున్నితత్వాన్ని, గోదావరి ప్రాంతం శాశ్వత సౌందర్యాన్ని తెరపై అందంగా ఆవిష్కరించారు డైరెక్టర్. గోదావరి దాదాపు ఒక పాత్రలా కనిపిస్తూ సినిమా సన్నివేశాలను మరింత ఉన్నతంగా ఆడియన్స్‌కు పరిచయం చేశారు. స్కూల్లో ఇద్దరు విద్యార్థుల ప్రేమ చుట్టే కథ అద్భుతంగా తీర్చిదిద్దారు.అందమైన కాన్సెప్ట్‌ను ఎంచుకొని, హృదయపూర్వకంగా అందించారు దర్శకుడు రాజేష్ చికిలే . కథ పరంగా సరళంగా ఉన్నప్పటికీ, 90ల తరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. కొన్ని రిపీటెడ్ సన్నివేశాలు, రెండు భాగాల్లో కొంత లాగ్ కాస్కా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ దర్శకుడు రాజేష్ చికిలే అందించాలనుకున్న సందేశాన్ని ఇవి దెబ్బతీయలేదు. కథలో కొన్ని భాగాలు ప్రత్యేకంగా బలంగా ఉన్నాయి. ప్రధాన పాత్రల భావోద్వేగాన్ని ప్రేక్షకులు అనుభవించేలా చేస్తాయి. వెంకీ వీణ సంగీతం ఈ సినిమాకు ప్లస్. స్క్రీన్‌పై రెండు పాటలు మాత్రమే ఆకట్టుకున్నాయి. 90ల ప్రేమ కథలను ఇష్టపడే వారికి, గోదావరి సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఈ చిత్రం ఒక మంచి ఎంటర్టైనర్గా నిలుస్తుంది.ఎవరెలా చేశారంటే..డెబ్యూ హీరో ఉదయ్ రాజ్ తన నటనతో మెప్పించారు. గతంలో ఆచార్య, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన ఉదయ్.. తన నటనా నైపుణ్యాన్ని చాటాడు. వైష్ణవీ సింగ్త తన పాత్రలో ఆకట్టుకుంది. తన అందమైన రూపంతో, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మిగిలిన నటీనటులు తమ పాత్రలో పరిధిలో అద్భతంగా చేశారు. సాంకేతికత విషయానికొస్తే మనోహర్ కొల్లి సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నందమూరి తారక రామారావు తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. వెంకీ వీణ నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
నవీన్ చంద్ర ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ .. ఆడియన్స్‌కు సవాల్ విసిరిన హీరో!
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, రాశి సింగ్ జంటగా నటిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ బ్లైండ్ స్పాట్. ఈ సినిమాకు రాకేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈవెంట్‌కు హాజరైన హీరో నవీన్ చంద్ర తన అభిమానులకు ఓ ఛాలెంజ్ విసిరారు. బ్లైండ్ స్పాట్ మూవీ పోస్టర్లోనే ఓ క్లూ ఉందని.. అది కనిపెట్టిన వారితో తానే స్వయంగా థియేటర్లో మూవీ చూస్తానని అన్నారు.నవీన్ చంద్ర మాట్లాడుతా..'బ్లైండ్ స్టాట్ పోస్టర్లోనే ఓ క్లూ ఉంది. ఆ క్లూ ఎవరైతే కనిపెట్టి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేస్తే వారిని వ్యక్తిగతంగా కలుస్తా. అలాగే వారితో కలిసి థియేటర్లో సినిమా చూస్తా. ఈ మూవీపై నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఈ విషయాన్ని నిర్మాత చెప్పలేదు, డైరెక్టర్ చెప్పలేదు. నేనే వ్యక్తిగతంగా చెబుతున్నా. అంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. యాక్టర్ ఫర్మామెన్స్, టెక్నీషియన్స్ వర్క్‌తో ఈ కథను ఆడియన్స్‌ను ఎలా మెప్పించాలో రాకేశ్ పనిని చూసి బానిసను అయిపోయా' అని అన్నారు.ఇవాళ విడుదలైన బ్లైండ్ స్పాట్ ట్రైలర్ చూస్తే ఓ అమ్మాయి ఆత్మహత్య చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నవీన్ చంద్ర పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్లో సన్నివేశాలు చూస్తే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తోంది. కాగా.. ఈ చిత్రంలో అలీ రెజా, రవి వర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక పెడద, హర్ష రోషన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. #BlindSpot పోస్టర్ లోనే ఒక CLUE ఉంది. దాన్ని కనిపెట్టిన వాళ్ళతో కలిసి నేను సినిమా చూస్తా - #NaveenChandra#Tollywood #MangoMassMedia #TeluguFilmNagar pic.twitter.com/hWUHvMiNXp— Telugu FilmNagar (@telugufilmnagar) April 18, 2025 -
ఆచార్య, ఆర్ఆర్ఆర్ నటుడు హీరోగా టీనేజ్ లవ్ స్టోరీ.. రిలీజ్ ఎప్పుడంటే?
ఆచార్య, ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఉదయ్‌రాజ్ ‘మధురం’ మూవీతో హీరోగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి రాజేష్ చికిలే దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వైష్ణవి సింగ్ హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై బంగార్రాజు నిర్మించారు. ఎ మెమొరబుల్ లవ్ ట్యాగ్ లైన్‌తో టీనేజ్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 18న శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుూ..'చిన్నప్పట్నుంచీ చిరంజీవిపై ఇష్టం ఉండేది. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. తర్వాత ఆచార్య షూటింగ్ టైమ్‌లో ఆయనతో మాట్లాడటం గొప్ప అనుభవం. 12 ఏళ్లగా ఇండస్ట్రీలో ఉన్నా. చాలా సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా నటించాను. బంగార్రాజు సపోర్ట్‌తో మధురం చిత్రంలో హీరోగా చేశా. దర్శకుడు రాజేష్ చికిలేతో నాకు ఎప్పట్నుంచో పరిచయం ఉంది. ఆయన ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. నైంటీస్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ ఇది. పదవ తరగతి అమ్మాయి, తొమ్మిదో తరగతి అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథ చాలా అందంగా ఉంటుంది. నేను చదువుకుంది జెడ్పీహెచ్ స్కూల్లోనే కావడంతో అప్పటి విశేషాలను గుర్తు చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. 90ల జనరేషన్‌కు పాత విషయాలను గుర్తుచేసేలా సినిమా ఉంటుంది. ఇందులో కథే హీరో అని భావిస్తారు' అని తెలిపారు.అంతేకాకుడా..'హీరోయిన్గా తెలుగమ్మాయిని తీసుకోవాలనుకున్నా.. కొన్ని ప్రయత్నాలు చేశాం కానీ కుదరలేదు. అయితే వైష్ణవి సింగ్ మాత్రం చాలా బాగా చేసింది. మధు, రామ్‌ల ప్రేమాయణమే ఈ మధురం చిత్రం. దర్శకుడు రాజేష్ చికిలే ఈ కథను చాలా అందంగా తీర్చిదిద్దారు. టీజర్, ట్రైలర్ చూసిన వాళ్లు చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా విషయంలో చాలా మంది నాకు సపోర్ట్‌గా నిలిచారు. హీరోనే కాకుండా ఎలాంటి పాత్రలు చేయడానికికైనా నేను సిద్ధంగా ఉంటాను' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో బస్ స్టాప్ ఫేం కోటేశ్వర రావు, కిట్టయ్య, ఎఫ్ ఎం బాబాయ్, దివ్య శ్రీ, సమ్యు రెడ్డి, జబర్దస్త్ ఐశ్వర్య, ఉష, అప్పు, రామ్ కీలక పాత్రలు పోషించారు. -
మూవీ ప్రమోషన్లలో అలేఖ్య చిట్టి పికిల్స్.. ప్రియదర్శి ఏమన్నారంటే?
టాలీవుడ్ హీరో ప్రియదర్శి సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కోర్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ హింట్ అందుకున్న ప్రియదర్శి.. సారంగపాణి జాతకం అంటూ మరోసారి అభిమానలను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించగా.. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో మిస్టర్ ప్రెగ్నెంట్ హీరోయిన్ రూప కొదువాయూర్ కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్‌తో కలిసి ప్రియదర్శి ఓ వీడియోను చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం ఆధారంగా సారంగపాణి జాతకం ప్రమోషన్ వీడియో చేశారు. దీనిపై హీరో ప్రియదర్శి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో మాట్లాడారు.ప్రియదర్శి మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో మేజర్ ట్రెండ్‌ను చూసే మేము అలా చేద్దామని అనుకున్నాం. దాని ద్వారా ముందుకు తీసుకెళ్దామని అనుకున్నాం. రీల్ చూసి మేము అలా చేద్దామని అనుకున్నాం. అంతే కానీ ఎక్కడా కానీ మేము అలేఖ్య పచ్చళ్ల గురించి మాట్లాడలేదు. నా వ్యక్తిగత సినిమా కోసం వారి కామెంట్స్‌ను వాడుకోను. ఎక్కడా కూడా వాళ్లను కించపరిచేలా చేయలేదు.' అని క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 25న థియేటర్లలో సందడి చేయనుంది. -
రాజ్ తరుణ్-లావణ్య వివాదం.. నడవలేని స్థితిలో ఇంటి బయటే నిరసన!
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కొద్ది రోజుల క్రితమే రాజ్ తరుణ్‌పై పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకుంటున్నట్లు లావణ్య ప్రకటించినప్పటికీ వివాదం ఇంకా ముదురుతోంది. తాజాగా ఇవాళ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య ఉంటున్న ఇంటివద్దకు వెళ్లారు. దీంతో మనుషులను తీసుకొచ్చి తమపై దాడి చేశారంటూ లావణ్య ఆరోపించారు. ఈ నేపథ్యంలో లావణ్య ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.రాజ్ తరుణ్ తల్లిదండ్రుల నిరసనఅయితే తమ ఇంట్లోకి తమను రావనివ్వడం లేదంటూ హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంటిబయటే నిరసనకు దిగారు. లావణ్య ఉంటున్న ఇల్లు మా కుమారుడు రాజ్ తరుణ్దేనని తెలిపారు. రాజ్ తరుణ్ తన సొంత కష్టంతో ఇంటిని కట్టుకున్నాడని.. లావణ్య తమను ఇక్కడ ఉండనివ్వడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నా కొడుకు సినిమా లు తీసి కట్టుకున్న ఇళ్లని ఆయన పేరేంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇల్లు ఉండి కూడా మేము రెంట్‌కు ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రస్తుతం మేము నడవలేని స్థితిలో ఉన్నామని.. లావణ్య మా ఇంటిని పాడు చేస్తోందని ఆరోపిస్తున్నారు.మా ఇల్లు మాకు కావ్వాలి: లావణ్యమరోవైపు రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మా ఇల్లు మాకు కావాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇవాళ మధ్యాహ్నం రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఒక 15 మందిని తీసుకొచ్చారని ఆరోపిస్తోంది. నన్ను జుట్టు పట్టుకుని ఇంట్లో నుండి బయటకి తీసుకొచ్చారని.. మా ఇంటి ముందు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని అంటోంది. మా తమ్ముడి పై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశారని.. రాజ్ తరుణ్ ప్రోద్బలంతోనే వాళ్ల పేరెంట్స్ మనుషులను తీసుకొచ్చి ఈ దాడి చేయించారంటూ ఆరోపణలు చేస్తోంది. ఇకపై రాజ్ తరుణ్‌ను ఇక వదిలి పెట్టనని.. 15 సంవత్సరాలుగా నేను ఈ ఇంట్లోనే ఉంటున్నానని లావణ్య చెబుతోంది. తాజా పరిణామాలతో సద్దుమణిగిందనుకున్న వివాదం టాలీవుడ్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. -
'ప్రియదర్శి సారంగపాణి జాతకం'.. బోల్డ్ డైలాగ్‌తో రిలీజైన ట్రైలర్
కోర్ట్ మూవీ సూపర్ హిట్ తర్వాత ప్రియదర్శి మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జెంటిల్మన్, సమ్మోహనం లాంటి హిట్ చిత్రాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కించారు. సారంగపాణి జాతకం మూవీలో రూప కొదువాయూర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు.మూవీ ప్రమోషన్లలో భాగంగా సారంగపాణి జాతకం ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో వెన్నెల కిశోర్, ప్రియదర్శి మధ్య సన్నివేశాలు ఆడియన్స్‌కు నవ్వులు తెప్పిస్తున్నాయి. అన్ని నువ్వే చేసుకోవడానికి ఇదేం హస్తప్రయోగం కాదు.. హత్యా ప్రయత్నం అంటూ వెన్నెల కిశోర్ చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తోంది. ఈ చిత్రంలో వీకే నరేష్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతమందించారు. -
'జేమ్స్‌బాండ్‌కు కూడా ఫ్యూజులు ఎగిరిపోవాలి'.. నవ్వులు తెప్పిస్తోన్న ట్రైలర్
ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన తాజా చిత్రం చౌర్యపాఠం(Chaurya Paatam Movie). ఈ సినిమాకు నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు, చూడామణి సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలి.. మాకు ఆ డబ్బులు రావాలి అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. మనీ హైయిస్ట్ నేపథ్యంలో వచ్చే సీన్స్ ఆడియన్స్‌కు నవ్వులు తెప్పిస్తున్నాయి. 'మనం ఆయుధాలు దాచే విధానం చూస్తే జేమ్స్‌బాండ్‌కు కూడా ఫ్యూజులు ఎగిరిపోవాలి' అనే డైలాగ్ వింటే థియేటర్లో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: జనాలు థియేటర్లకు రావట్లేదు.. భయంగా ఉంది: మజాకా డైరెక్టర్)ఇక ట్రైలర్ చివర్లో నీకు సమంత ఇష్టమా? రష్మిక ఇష్టమా? అంటే.. ఇద్దరు కాదు అనుష్క అనే డైలాగ్ నవ్వులు పూయిస్తోంది. మొత్తానికి ట్రైలర్లోనే చౌర్యపాఠం ఒక కామెడీ ఎంటర్టైనర్గానే రూపొందించినట్లు క్లూ ఇచ్చేశారు. కాగా.. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు దావ్జాంద్ దర్శకత్వం వహించారు. -
రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్యపై దాడి.. ఎవరు చేశారంటే?
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది మొదలైన ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలోనే వీరిద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కేసులు కూడా పెట్టుకున్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితమే రాజ్ తరుణ్‌పై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. కానీ అంతలోనే రాజ్ తరుణ్- లావణ్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాడి చేసినట్లు తెలుస్తోంది. కోకాపేటలోని లావణ్య నివాసానికి వెళ్లి రాజ్ తరుణ్ పేరేంట్స్ ఆమెపై కొందరితో దాడి చేయించినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు లావణ్య పైన దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.కేసులు వెనక్కి తీసుకున్న లావణ్య..రాజ్ తరుణ్ మీద కేసులు వెనక్కి తీసుకుంటానని.. రాజ్, తాను విడిపోవడానికి మస్తాన్ సాయే కారణమని లావణ్య తెలిపారు. ‘నేను మస్తాన్ సాయి ఇంటికి పార్టీ కోసం వెళ్లాను. నాకు తెలియకుండానే నేను బట్టలు మారుస్తున్నపుడు వీడియో తీసుకున్నాడు. అవి పెట్టుకుని నన్ను బెదిరించాడు. నేను నా వీడియోలు డిలీట్ చేయటానికి ప్రయత్నించాను. ఆ టైం లో నన్ను చంపటానికి మస్తాన్ సాయి ప్రయత్నించాడు. మస్తాన్ సాయి డ్రగ్ పార్టీలు ఇచ్చి యువతులను వశపర్చుకుంటున్నాడు. మస్తాన్ సాయి ఆగడాలు పోలీసులు బయటపెట్టాలని లావణ్య కోరారు. -
'ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్'.. లవ్ సాంగ్ వచ్చేసింది!
రాహుల్ విజయ్, నేహా పాండే హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్". ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.తాజాగా ఈ మూవీ నుంచి 'ఏదో ఏదో' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ అందించగా.. సురేష్ బొబ్బిలి కంపోజ్ చేశారు. కార్తీక్, హరిణి పాడారు. ఈ ఫీల్ గుడ్ సాంగ్ టాలీవుడ్ అభిమానలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, మురళీధర్ గౌడ్, గెటప్ శ్రీను, రచ్చ రవి, రవివర్మ, గంగవ్వ, జయశ్రీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతమందిస్తున్నారు. -
అది మనం క్రియేట్ చేసుకున్నదే.. వదిలేస్తే బాగుంటుంది: హీరో నాని
నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం హిట్-3. టాలీవుడ్ డైరెక్టర్ శైలేశ్ కొలను హిట్ సిరీస్‌లో వస్తోన్న మూడో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ వయొలెంట్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా చాగంటి ప్రవచనాలు ట్రైలర్లో ఉండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు.మూవీ రిలీజ్ తేదీ ఇంకా రెండు వారాలు పైగా సమయం ఉండగానే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇవాళ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన నాని మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మీరు రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన హీరో.. ఇక టైర్- 1 జాబితాలో చేరినట్టేనా? అని ఒకరు ప్రశ్నించగా.. దానిపై నాని స్పందించారు.నాని మాట్లాడుతూ.. 'అది మన డిక్షనరీలో ఉన్నది కాదు. కేవలం మనం క్రియేట్ చేసుకున్న పదమే. నటుడికి తగినట్లుగానే సినిమాలు తెరకెక్కిస్తారు. వారిని ఆ పేర్లతో ఎందుకు డివైడ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అది చాలా స్టుపిడ్ కాన్సెప్ట్. ఎవరు మొదలుపెట్టారోగానీ.. మనమంతా దానినే పెంచి పోషిస్తున్నాం. ఇకపై ఆ వేరియేషన్ ఆపితే మన తెలుగు చిత్ర పరిశ్రమకు మంచిది. అది బాగుంటే అందరం హ్యాపీగా ఉంటాం' అని అన్నారు. కాగా.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కనిపించింది. -
'అలా జరగకపోతే నన్ను నమ్మకండి'.. నాని ఆసక్తికర కామెంట్స్
నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న మోస్ట్ వయొలెంట్ యాక్షన్ థ్రిల్లర్ హిట్-3. ఈ సిరీస్‌లో శైలేశ్ కొలను డైరెక్షన్లో వస్తోన్న మూడో చిత్రం. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ పాత్రలో నాని అభిమానులను మెప్పించనున్నారు. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్స్, టీజర్ చూస్తుంటే నాని గతంలో ఎన్నడు చూడని పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా హిట్-3 ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూశాక నాని వయొలెన్స్ ఓ రేంజ్లో ఉండనుందని అర్థమవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. దీనికి హాజరైన హీరో నాని మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. గతంలో కోర్ట్ మూవీ హిట్ కాకపోతే హిట్-3 చూడొద్దని చెప్పారు కదా? మరీ ఈ సినిమాకు ఏం చెబుతారని నానిని ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందించారు.(ఇది చదవండి: మోస్ట్ వైలెంట్‌గా 'హిట్-3' ట్రైలర్.. మార్కోను మించిపోయిన 'నాని')నాని మాట్లాడుతూ..'ఈ సినిమాకు ఆ డైలాగ్ వాడితే నెక్ట్స్ సినిమాకు నేను నిర్మాతను కాదు. నన్ను నేను తాకట్టు పెట్టుకోగలను.. వాళ్ల ఎవరినో ఎందుకు పెడతాను. హిట్-3 లాంటి జోనర్ లాంటి సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం మే 1న ఫుల్ మీల్స్ పక్కా. కొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఇది కనక తప్పని మీకు అనిపిస్తే నెక్ట్స్ టైమ్ నానిని నమ్మకండి' అంటూ సరదా నవ్వుతూ మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 'Next time Nani ni nammakandi, anthe'A BOLD STATEMENT by Natural Star @NameisNani.Betting big on himself and #HIT3.#HIT3Trailer TRENDING #1 on YouTube 💥💥▶️ https://t.co/BU8cVg4IJD#HIT3 in cinemas worldwide on 1st MAY, 2025.#AbkiBaarArjunSarkaarNatural Star… pic.twitter.com/ZWZlwKDwhu— Wall Poster Cinema (@walpostercinema) April 14, 2025 -
పీఎం మోదీ ఎంట్రీ.. దేవర సాంగ్ బీజీఎం చూశారా!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం గతేడాది దసరా కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. దేవర సినిమాతో జాన్వీ కపూర్ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో మెప్పించారు.అయితే ఈ సినిమాలోని సాంగ్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి. ముఖ్యంగా చుట్టమల్లే, ఆయుధపూజ సాంగ్స్ అయితే సూపర్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాయి. దేవర పాటలకు రీల్స్ చేస్తూ ఫ్యాన్స్ అలరించారు. అయితే ఈ సినిమాలోని రెడ్ సీ సాంగ్ బీజీఎం అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఎర్ర సముద్రం బీజీఎం స్కోర్ ఓ రేంజ్లో ఆకట్టుకుంది.అయితే తాజాగా దేవర మూవీ రెడ్ సీ సాంగ్‌ను ఏకంగా శ్రీలంక ప్రెసిడెంట్ అనురా కుమార దిసానాయకే తన సోషల్ మీడియాలో వినియోగించారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీకి స్వాగతం పలుకుతూ చేసిన ఓ వీడియోను ఆయన తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియోకు దేవర రెడ్ సీ సాంగ్ బీజీఎంను జత చేశారు. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఈ సీన్‌కు సరిగ్గా సరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. మీకు అద్భుతమైన ఎడిటర్ ఉన్నారు సార్ అంటూ శ్రీలంక అధ్యక్షుడిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. అంతేకాకుండా మీ ఎడిటర్‌కు శ్రీలంక కరెన్సీ కాకుండా యూఎస్ డాలర్లలో చెల్లించండి అంటూ ఫ్యాన్స్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.కాగా.. దేవర పార్ట్-1 బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు. దేవర సీక్వెల్ అప్డేట్స్ కోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. View this post on Instagram A post shared by Anura Kumara Dissanayake (@anurakumaraofficial) -
అంత ఎనర్జీ ఎక్కడా చూడలేదు.. సింగిల్ షాట్లో చేశారు: సునీల్
టాలీవుడ్ నటుడు సునీల్ ఇటీవల అజిత్ కుమార్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో కనిపించారు. ఈ సినిమాలో స్టైలిష్ గెటప్‌లో కనిపించి అభిమానులను సర్ప్రైజ్ ఇచ్చారు. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ రావడంతో మేకర్స్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ సంభవం పేరిట వేడుకలు నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సునీల్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన ఎనర్జీ వేరే లెవెల్ అని సునీల్ మాట్లాడారు. ఇంత సింప్లిసిటీ ఉన్న మనిషిని చూసిన ఫీలింగ్ వచ్చిందని అన్నారు.అజిత్ గురించి మాట్లాడుతూ..'మీరు పొద్దున్నే రన్నింగ్‌కు వెళ్తారంట కదా అని నన్ను అడిగారు. నేను కూడా రావొచ్చా అండి అజిత్ అన్నారు. సరే అని అన్నా. ఉదయం 4 గంటలకే ఒక్కరే కారు నడుపుకుంటూ వచ్చారు. దాదాపు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాం. ఆ తర్వాత ఇంకా వాకింగ్ చేద్దామని ఆయన అన్నారు. మొత్తం 9 కిలోమీటర్లు నడిచాం. ఆ తర్వాత షూటింగ్ లోకేషన్ మియాపూర్‌కు గంటన్నర పడుతుంది. అక్కడికి ఆయనతో కలిసి వెళ్లా. ఇంటర్వెల్ ఫైట్‌లో వచ్చిన షాట్ అప్పుడే చేశారు. ఆ రోజు 27 మందితో సింగిల్‌షాట్‌లో చేశారు. మళ్లీ వచ్చేటప్పుడు ఆయనే గంటన్నర కారు డ్రైవింగ్ చేశారు. అంత ఎనర్జీ పర్సన్‌ను నేనేప్పుడూ చూడలేదు. పైగా ఆయన సినిమాలో డూప్‌లు పెట్టకూడదు. ఈ సినిమా ద్వారా అజిత్ నుంచి చాలా నేర్చుకున్నా. ఆయనను భగవంతుడు బాగా చూడాలని కోరుకుంటున్నా. ఫ్యాన్స్ ఈ సినిమా చూసి అందరూ పండగ చేసుకుంటున్నారు.' అని అన్నారు.విదాముయార్చి తర్వాత అజిత్ కుమార్ నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
ప్రపంచంలో అన్నింటికన్నా సులభమైన పనేంటో తెలుసా?.. నవ్వులు పూయిస్తోన్న టీజర్
రాజ్‌తరుణ్, రాశీసింగ్.. హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ 'పాంచ్ మినార్'. ఈ సినిమాకు రామ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ బ్యానర్‌పై మాధవి, ఎంఎస్ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజ్ తరుణ్ నటన, ఫన్నీ డైలాగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నాటకాలు ఆడుతున్నావా? బ్యాగ్ ఎక్కడ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత 'ప్రపంచంలో అన్నింటికన్నా సులభమైన పనేంటో తెలుసా? డబ్బులు సంపాదించడం' అనే కోటేషన్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఇంటర్వ్యూలో ఆన్సర్లు తెలియకపోయినా పర్లేదు కానీ.. కనీసం క్వశ్చన్స్ అయినా తెలిసుండాలిగా అని బ్రహ్మాజీ చెప్పే డైలాగ్ నవ్వులు తెప్పిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, శ్రీనివాస్‌రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం పాంచ్ మినార్ టీజర్ చూసేయండి. -
ఆమెను చూస్తే మా నాన్న లేని లోటు తీరింది: జూనియర్ ఎన్టీఆర్
కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు.ఈ మూవీలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. శనివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీనియర్ నటి విజయశాంతిపై ప్రశంసలు కురిపించారు.జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ..' నేను, అన్న నిల్చున్నప్పుడు ఇలాంటి వేదికలపై నాన్న వచ్చి మాట్లాడేవారు. ఈ రోజు విజయశాంతి మాట్లాడుతుంటే మా నాన్న లేరనే లోటు భర్తీ అయిపోయింది. చాలామంది హీరోలు అభిమానులను సంపాదించుకున్నారు. కానీ ఏ మహిళ కూడా విజయశాంతి లాగా గొప్పదనం సాధించలేదు. తెలుగు సినీ చరిత్రలోనే కాదు.. భారతదేశవ్యాప్తంగా హీరోలతో సమానంగా ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయశాంతి ఒక్కరే. కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు లాంటి ఎన్నో గొప్ప కథలు, పాత్రలు చేసిన మరో నటి ఇండియాలోనే లేదు. ఈ ఘనత కేవలం ఆమెకు మాత్రమే దక్కింది. 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమా కథ కర్తవ్యం మూవీలో వైజయంతికి ఓ కొడుకు పుడితే ఎలా ఉంటుందో అనే ఐడియాతోనే ఈ కథ పుట్టినట్టు ఉంది' అని విజయశాంతిపై ప్రశంసలు కురిపించారు. -
దేవన్ స్వీయ దర్శకత్వంలో వస్తోన్న కృష్ణలీల.. మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన నిఖిల్
దేవన్, ధన్య బాలకృష్ణన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం కృష్ణ లీల. దేవన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరెకెక్కిస్తున్నారు. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్‌పై జ్యోత్స్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు- అనిల్ కిరణ్ కుమార్ అందించారు. ఈ సినిమాకి 'కృష్ణ లీల' అనే టైటిల్ ఖరారు చేశారు. 'తిరిగొచ్చిన కాలం'అనేది ట్యాగ్ లైన్. ఈ టైటిల్ లాంఛ్ ఈవెంట్‌కు హీరో నిఖిల్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ.. 'దేవన్ చాలా పాషన్ ఉన్న యాక్టర్, డైరెక్టర్. హ్యాపీడేస్‌కి ముందు నేను కూడా ఒక మంచి అవకాశం కోసం తపన పడేవాడిని. దేవుడి దయవల్ల నాకు హ్యాపీ డేస్ దొరికింది. అదే దేవుడి దయవల్ల తనకి కృష్ణ లీలతో పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మోషన్ పోస్టరు నాకు చాలా నచ్చింది. ఇందులో దేవ్ డిఫరెంట్ సేడ్స్ నాకు చాలా నచ్చాయి. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ ఈ టీం ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారుహీరో దేవన్ మాట్లాడుతూ. 'అందరికీ నమస్కారం.. ముందుగా మా అమ్మానాన్నలకి కృతజ్ఞతలు. నాకు సినిమా జీవితాన్ని ఇచ్చిన మా నిర్మాతలు జ్యోత్స్న, అనిల్ గారికి ధన్యవాదాలు. వారికి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. చోటా కె నాయుడు ఇష్టమైన కెమెరామెన్. ఆయనతో కలవడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఫైనల్‌గా ఆయనని కలిసి ఈ సినిమా కథ చెప్పా. ఈ జర్నీ ఒక మిరాకిల్‌లా మొదలైంది. గంగాధర్ శాస్త్రికి ఈ సినిమా కథ చెప్పాను. ఆయన నాకు విలువైన సూచనలు ఇచ్చారు. 18 పేజేస్ నుంచి అఖిల్‌తో నాకు పరిచయం ఏర్పడింది. ఆయన చూసిన తర్వాత మరింత ఇన్స్పిరేషన్ వచ్చింది. ఆయన నాకు చాలా ఎంకరేజ్ చేశారు. ఈవెంట్ కొచ్చి మాకు సపోర్ట్ చేసిన నిఖిల్ అన్నకి థాంక్యూ సో మచ్' అని అన్నారు. ఈ చిత్రంలో వినోద్ కుమార్, పృధ్వి (పెళ్లి), రవి కాలే , తులసి, 7ఆర్ట్స్ సరయు, ఆనంద్ భరత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. -
రోడ్డుపై టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి.. సామాన్యుడిలా నడుస్తూ..!
టాలీవుడ్ నటుడు జగపతి బాబు విలక్షణ పాత్రలతో అభిమానులను అలరిస్తున్నారు. పుష్ప-2లో కీ రోల్ ప్లే చేసిన జగ్గు భాయ్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. తాజాగా విడుదలైన సన్నీ డియోల్ జాట్ మూవీలోనూ కనిపించారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే సోషల్ మీడియా ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. సరదా పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తుంటారు. ఇటీవల ఉగాది సందర్భంగా ఇంటికెళ్లిన ఆయన.. తన మాతృమూర్తి చేతుల మీదుగా ఉగాది పచ్చడిని ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.తాజాగా మరో ఆసక్తికర వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు జగపతిబాబు. వీధుల్లో సామాన్యుడిలా నడుచుకుంటూ వెళ్లారు. ఓ మొబైల్ షాప్‌కు వెళ్లేందుకు అందరిలాగే కాలి నడకన రోడ్డుపై నడుస్తూ వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. నా ప్రయాణం బ్లాక్ అండ్ వైట్లోకి అని మీకు తెలియజేస్తున్నా అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో మీరు ఏంటి సార్ ఇంత సింపుల్‌గా ఉన్నారంటూ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Naa payanam black & white loki ani miku telichestuna.. pic.twitter.com/U5M8PF8CVZ— Jaggu Bhai (@IamJagguBhai) April 11, 2025 -
ఈ ఫోటోలోని టాలీవుడ్ స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా.. గుర్తు పట్టగలరా?
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలని ఎవరకీ ఉండదు చెప్పండి. బాల్యంలో తన కుటుంబంతో గడిపిన ఎన్నో మధుర క్షణాలు ఒక్కసారిగా కళ్ల ముందు కదిలితే వచ్చే ఫీలింగే వేరు. మరీ ముఖ్యంగా ఓకే కుటుంబంలో పుట్టి పెరిగిన అన్నదమ్ములు, అక్కచెలెల్లు మధ్య అనుబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరం ఓకే ఇంట్లో ఉండి సరదాగా ఉండే మనం.. ఇప్పుడు పెరిగి, పెళ్లిళ్లు అయ్యాక కేవలం మన కుటుంబమే లోకంగా జీవిస్తున్నాం. అలాంటి ఈ రోజుల్లో మనకు తోబుట్టులను గుర్తు చేసుకునేందుకు ఒక డే ఉందని మీకు తెలుసా? రక్తం పంచుకుని పుట్టిన బంధాలు దూరమవుతున్న ఈ రోజుల్లో కనీసం ప్రత్యేకమైన సిబ్లింగ్స్ డే రోజైనా వారిని గుర్తు చేసుకుందాం.తాజాగా ఇవాళ తోబుట్టువుల దినోత్సవం సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తన సిస్టర్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. తనతో ఉన్న మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంది. మై ఫేవరేట్ పర్సన్ ఇన్ మై లైఫ్ అంటూ తనతో ఉన్న త్రో బ్యాక్ పిక్‌ను షేర్ చేసింది. ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.అలాగే శిల్పా శిరోద్కర్ సైతం తన అక్క నమ్రతాతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంది. నా జీవితంలో నువ్వు అతిపెద్ద మద్దతుగా నిలిచే వ్యక్తి నువ్వే అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. ఇటీవలే శిల్పా శిరోద్కర్ హిందీ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. టాప్-5 నిలిచి మరింత ఫేమస్ అయ్యారు. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
'ఆ దేవుడే రక్షించాడు'.. మార్క్ శంకర్ ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడని ఆయన తెలిపారు. అయితే బాబు ఇంకా కోలుకోవాలని.. మా కుల దైవం ఆంజనేయ స్వామి దయతో మళ్లీ మామూలుగా వస్తాడని ట్వీట్ చేశారు. ఓ పెద్ద ప్రమాదం నుంచి పసిబిడ్డని హనుమాన్ రక్షించాడని పోస్ట్ చేశారు. మార్క్ శంకర్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ నా తరపున, తమ్ముడు పవన్ కల్యాణ్ తరఫున ధన్యవాదాలు తెలియచేస్తున్నా అని రాసుకొచ్చారు.మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు. అయితే బాబు ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్లీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు. రేపు హనుమత్ జయంతి.. ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊర్లలో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కల్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం' అని పోస్ట్ చేశారు.ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన విశ్వంభరం మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విశ్వంభరకు సంబంధించిన మెగా అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు.రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా… pic.twitter.com/nEcWQEj92v— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2025 -
'ఆ పిల్ల నీకు వదిన అవుద్దిరా'.. ఆసక్తిగా సంపూర్ణేశ్ బాబు సోదరా ట్రైలర్
టాలీవుడ్ నటుడు సంపూర్ణేశ్‌బాబు (Sampoornesh Babu) నటిస్తోన్న తాజా చిత్రం సోదరా. ఈ సినిమాలో ఆర్తి, ప్రాచి బన్సాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సంపూర్ణేశ్‌కు తమ్ముడిగా సంజోశ్ నటించారు. ఈ మూవీని క్యాన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో చంద్ర చగన్ల నిర్మించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్, నిర్మాత ఎస్కేఎన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే అన్నదమ్ముల పెళ్లి విషయంలో జరిగే పరిణామాలే కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పెద్ద కుమారుడి పెళ్లి కోసం తల్లిదండ్రులు పడే తపన నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతందించగా.. శివ సర్వాణి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. -
క్యాలెండర్ మార్క్ చేస్కోండి.. దొంగప్ప వచ్చేస్తున్నాడు: మంచు మనోజ్ ట్వీట్
మంచు ఫ్యామిలీలో వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కొద్ది నెలలు సైలెంట్‌గా ఉన్న మోహన్ బాబు కుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. మంచు మనోజ్ మరోసారి పోలీసులను ఆశ్రయించడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. తన కూతురి బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు జైపూర్ వెళ్లగా.. తన కారుతో పాటు తమ వస్తువులను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద నిరసన చేపట్టారు.మరోవైపు మంచు విష్ణు మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి కన్నప్ప మూవీ గురించి మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే మంచు మనోజ్ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. కన్నప్ప మూవీని ఉద్దేశించి ఆయన చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. తన సినిమాకు భయపడే కన్నప్ప సినిమాను వాయిదా వేసుకున్నారని ఇప్పటికే మంచు మనోజ్ ఆరోపించారు. ఇవాళ ఏకంగా కన్నప్ప మూవీని దొంగప్ప అంటూ జూన్ 27న బిగ్ స్క్రీన్‌పైకి రాబోతోందని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. ఇంతకీ రిలీజ్ తేదీ జూలై 17న.. లేదా జూన్ 27నా అంటూ ఎగతాళి చేశారు. వందకోట్లకు పైగా బడ్జెట్ మూవీ కదా.. మీ పీఆర్ ప్లానింగ్ కేక అంటూ మంచు మనోజ్ తన ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ సైతం సరదా కామెంట్స్ చేస్తున్నారు.Mark your calendars! 📅 The legend of #Dongappa hits the big screen on 27th June! 🎥Inthaki release jul 17th aa, Ledha June 27th . 100 crore plus (80% #ViSmith commission) budget movie pr planning keka. pic.twitter.com/Oi7qaNmsj6— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) April 10, 2025 -
సినిమాకు అతను చాలా ముఖ్యం.. లేకపోతే కాళ్లు, చేతులు ఆడవు: సిద్ధు జొన్నలగడ్డ
టిల్లు స్క్వేర్ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం జాక్. ఈ మూవీకి బొమ్మిరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో జాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మన సినీ ఇండస్ట్రీలో ఎడిటర్ గురించి ఎవరూ మాట్లాడరని అన్నారు. టిల్లు స్క్వేర్, తండేల్, మ్యాడ్ స్క్వేర్ హిట్ అయ్యాయంటే ఎడిటర్ నవీన్ నూలి మాత్రమే కారణమన్నారు. కానీ సినిమాకు ఎడిటర్ అనేవారు చాలా ముఖ్యం.. ఆయన లేకపోతే దర్శకుడికి కాళ్లు, చేతులు ఆడవని సిద్ధు అన్నారు. మనం చాలా తక్కువగా ఎడిటర్ గురించి మట్లాడతాం.. కానీ వారే సినిమాకు చాలా ప్రధానమని ఆయన తెలిపారు. మా జాక్ సినిమాకు నవీన్ నూలినే ఎడిటర్.. ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు.అలాగే రానా ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కాకపోవడంపై కూడా సిద్ధు స్పందించారు. రానా ప్రస్తుతం ముంబయిలో ఉన్నారని తెలిపారు. రానా నాయుడు సీజన్-2 డబ్బింగ్‌తో బిజీగా ఉన్నారని సిద్ధు వెల్లడించారు. సాయంత్రం ఐదున్నరకు రావాల్సిన విమానం మిస్ కావడంతోనే రానా రాలేకపోయారని సిద్ధు క్లారిటీ ఇచ్చారు. -
మోహన్ బాబు ఫ్యామిలీలో మళ్లీ వివాదం.. పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీలో మరోసారి వివాదం మొదలైంది. ఆయన కుమారుడు, హీరో మంచు మనోజ్ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తాను లేని సమయంలో తన ఇంటిని ధ్వంసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురి బర్త్ డేకు రాజస్థాన్ వెళ్లినప్పుడు మంచు విష్ణు ఈ దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ఇంట్లో లేనప్పుడు కార్లతో పాటు తన వస్తువులను ఎత్తుకెళ్లారని ఆరోపించారు. జల్పల్లిలోని ఇంట్లో కూడా 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు.గతంలోనూ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన ఘటన తర్వాత వరుసగా కేసులు నమోదయ్యాయి. మంచు విష్ణు, మనోజ్‌కు మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద సైతం వీరి మధ్య గొడవ మొదలైంది. ప్రస్తుతం అంతా సవ్యంగా ఉందనుకుంటున్న సమయంలోనే మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం టాలీవుడ్లో మరోసారి చర్చ మొదలైంది. -
అజిత్ కుమార్ 'ఓజీ సంభవం'.. తెలుగు వర్షన్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ గురువారమే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ తెలుగు, తమిళంలో ట్రైలర్స్ రిలీజ్ చేశారు మేకర్స్.ఇప్పటికే ఓజీ సంభవం పేరుతో తమిళంలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా తెలుగులోనూ విడుదల చేశారు. ఈ చిత్రంపై అజిత్ అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. -
అక్కినేని అఖిల్ బర్త్ డే స్పెషల్.. కొత్త సినిమా టైటిల్ తెలుసా?
అక్కినేని హీరో అఖిల్ దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఇవాళ అఖిల్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు. అఖిల్- మురళి కిశోర్ అబ్బురు కాంబోలో వస్తోన్న మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు.అఖిల్ నటిస్తోన్న ఈ సినిమాకు లెనిన్ అనే క్రేజీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ మాస్ యాక్షన్ మూవీగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ ప్రకటనతో అఖిల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏజెంట్ మూవీ తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. This role is going to be remembered for a long time!! 💥Can’t wait for you all to witness @AkhilAkkineni8 in his most stunning avatar 🔥Presenting you all ~ #LENIN ❤️🔥#Akhil6 @sreeleela14 @iamnagarjuna @KishoreAbburu @MusicThaman @NavinNooli @artkolla #NaveenKumarI… pic.twitter.com/IsyooyDViq— Naga Vamsi (@vamsi84) April 8, 2025 -
జాక్ ట్రైలర్లో బూతులు.. సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిందంటే?
టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం జాక్. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా జాక్ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. అయితే ట్రైలర్లో ఎక్కువగా బూతులు వినియోగించడంతో సెన్సార్ విషయంలో ఇబ్బందులు రావొచ్చని ఊహించారు. కానీ ఎలాంటి కట్స్ లేకుండానే సెన్సార్ పూర్తియినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. The equation is set 😎The chaos is calculated 🤟🏻#JACK certified 𝐔/𝐀 Rounding off the entertainment in the most explosive way ❤️🔥Bookings are now open 🎟️ https://t.co/6uRbOx5ekl#JackOnApril10th#SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz @Prakashraaj #AchuRajamani… pic.twitter.com/9DbOmDuqb3— SVCC (@SVCCofficial) April 7, 2025 -
మారుతీనగర్ సుబ్రమణ్యం హీరో లేటేస్ట్ మూవీ.. సాంగ్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర జంటగా నటిస్తోన్న తాజా చిత్రం బ్యూటీ. ఈ సినిమాకు భలే ఉన్నాడే ఫేమ్ జేఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. మారుతీ టీమ్ ప్రొడక్ట్, వానరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్ బ్యానర్లపై అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.తాజాగా ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి కన్నమ్మ అనే బ్యూటీఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను సనారే రాయగా.. ఆదిత్య ఆర్కే, లక్ష్మీ మేఘన ఆలపించారు. ఇక విజయ్ బుల్గానిన్ సంగీతం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. -
'ముందు కెరీర్‌పై ఫోకస్ పెట్టు..' ఏంటి బ్రో ఇలా వాడేస్తున్నారు!
సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఎప్పుడు ఎందుకు ఫేమస్ అవుతున్నారో అర్థం కావట్లేదు. గతంలో మన చాలామందిని చూశాం. కేవలం సోషల్ మీడియా వల్ల ఓవర్ నైట్‌లో స్టార్స్ అయిపోయిన వాళ్లున్నారు. ఇటీవల ఎక్కడ చూసిన కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వివాదం మరింత వైరల్ కావడంతో కొందరైతే ఏకంగా రీల్స్ కూడా చేసేస్తున్నారు.అయితే తాజాగా అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదాన్ని ఏకంగా సినిమా ప్రమోషన్స్‌లోనూ వాడేస్తున్నారు. టాలీవుడ్ హీరో ప్రియదర్శి పులికొండ నటించిన తాజా చిత్రం సారంగపాణి జాతకం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. హీరోయిన్ రూప కొడువాయూర్తో కలిసి ప్రియదర్శి ప్రమోషన్స్ చేశారు.అయితే ఇద్దరు కలిసి అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం తరహాలో సారంగపాణి జాతకం ప్రమోషన్ చేశారు. ఇందులో హీరోయిన్ ఓ డ్రెస్ చూపిస్తూ చాలా బాగుంది కదా.. అంటూ ప్రియదర్శిని అడుగుతుంది. అది చూసిన హీరో వావ్ సూపర్.. రేటు చూసి రూ.14999 నా అంటూ నోరెళ్లబెడతాడు. ఆ తర్వాత అలేఖ్య చిట్టి పికిల్స్ స్టైల్లో హీరోకు ఇచ్చి పడేస్తుంది. ముందు కెరీర్‌పై ఫోకస్ చేయ్.. డ్రెస్సె కొనలేనివాడిని.. ప్రేమ, పెళ్లి జోలికి పోవద్దు.. అంటూ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో ప్రియదర్శితో మాట్లాడుతుంది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్‌ను ఇలా కూడా వాడేస్తున్నారా? అంటూ పోస్టులు పెడుతున్నారు.#alekhyachittipickles ni ila KudaVaaduthunnara😭😂#SarangapaniJathakam pic.twitter.com/KfgAzzS6PH— Urstruly Vinodh (@UrsVinodhDHFM) April 5, 2025 -
కాబోయే భార్యతో అక్కినేని అఖిల్.. పెళ్లి కళ వచ్చేసిందా?
టాలీవుడ్లో అక్కినేని హీరో అఖిల్ ఏజెంట్ మూవీ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయలేదు. 2023లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ఓటీటీ రిలీజ్ కూడా ఆలస్యమైంది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. అఖిల్ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ కాస్తా నిరాశకు గురవుతున్నారు. అయితే త్వరలోనే అఖిల్ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేయనున్నట్లు నిర్మాత నాగవంశీ ఇప్పటికే ట్విటర్ ద్వారా హింట్ ఇచ్చాడు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. అఖిల్ త్వరలోనే వివాహాబంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన ప్రియురాలు జైనాబ్ రావ్జీతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలోనే పెళ్లి పీటలెక్కుతారని టాక్ వినిపించింది. కానీ అలా జరగలేదు. దీంతో మరోసారి టాలీవుడ్లో అఖిల్ పెళ్లి ఎప్పుడనే విషయంపై చర్చ మొదలైంది.ోఈ నేపథ్యంలో త్వరలోనే పెళ్లి చేసుకోబోయే అఖిల్, జైనాబ్ జంటగా కనిపించారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ఒకరి చేయి ఒకరు పట్టుకుని సందడి చేశారు. ఇది చూసిన నెటిజన్స్.. చూడ ముచ్చటగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వీరి పెళ్లి పనులతో బిజీగా ఉన్నారేమో అంటూ పోస్టులు పెడుతున్నారు. వీరిద్దరు జంటగా వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి అఖిల్ పెళ్లిపై చర్చ మొదలైంది. అయితే ఈనెల 8న అఖిల్ పుట్టినరోజు కావడంతో సెలబ్రేట్ చేసుకునేందుకు వెళ్లారా? అని మరికొందరు చర్చించుకుంటున్నారు. #TFNExclusive: Hero @AkhilAkkineni8 and #ZainabRavdjee get papped walking hand in hand at the Hyderabad airport!!❤️📸#AkhilAkkineni #Akhil6 #TeluguFilmNagar pic.twitter.com/oDD6SU2sMq— Telugu FilmNagar (@telugufilmnagar) April 6, 2025 -
అజిత్ కుమార్ యాక్షన్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ట్రైలర్లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. Maamey!THE MASS CELEBRATION is here 🤩#GoodBadUglyTrailer out now ❤🔥▶️ https://t.co/9KbtVtrkqP#GoodBadUgly Grand release worldwide on April 10th, 2025 with VERA LEVEL ENTERTAINMENT 💥💥#AjithKumar @trishtrashers @MythriOfficial @Adhikravi @gvprakash @AbinandhanR… pic.twitter.com/d2ECC3CoJz— Mythri Movie Makers (@MythriOfficial) April 4, 2025 -
అతను లేకపోతే మ్యాడ్ స్క్వేర్ హిట్ అయ్యేది కాదేమో?: జూనియర్ ఎన్టీఆర్
మ్యాడ్ స్క్వేర్ మూవీతో మరో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ కల్యాణ్ శంకర్. గతంలో వచ్చిన మ్యాడ్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ నిర్వహించింది. హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మ్యాట్ టీమ్‌ను ఉద్దేశించిన ఎన్టీఆర్ మాట్లాడారు. మ్యాడ్ స్క్వేర్ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు .జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ..' నవ్వించడం అనేది ఒక పెద్ద వరం. అలా మనల్ని ఎప్పుడు నవ్వించడానికి మనకు కల్యాణ్ శంకర్ దొరికాడు. దర్శకుడికి నచ్చినట్లుగా మీరు చేయడం కూడా గొప్ప వరం. ఈ సినిమాలో లడ్డు(విష్ణు) లేకపోతే హిట్ అయ్యేది కాదేమో. అతను ఇన్నోసెంట్ అని నేను అనుకోవట్లేదు. కానీ సినిమాలో అలా చేశాడు. సంగీత్ శోభన్‌ను చూసి ఆయన కుటుంబం అంతా గర్వపడుతున్నారు. రామ్ నితిన్.. నేను ఎలా ఉండేవాన్నో అలానే ఉన్నారు. కెమెరా ముందు నిలబడటం అంతా ఈజీ కాదు. కామెడీని పండించడం చాలా కష్టమైన పని. రామ్ నితిన్ నీకు మంచి భవిష్యత్తు ఉంది' అని అన్నారు.బామర్ది నార్నే నితిన్ గురించి మాట్లాడుతూ..'2011లో నాకు పెళ్లైంది. అప్పుడు నార్నే నితిన్ చిన్న పిల్లవాడు. మొదట నాతో మాట్లాడేవాడు కాదు. వీడు ధైర్యం చేసి మొట్టమొదటిసారి చెప్పిన మాట బావ నేను యాక్టర్ అవుతానని. అంతే ధైర్యంగా నీ సావు నువ్వు చావు.. నా సపోర్ట్ అయితే నీకు ఉండదు అని చెప్పా. ఆ తర్వాత అతని కెరీర్‌పై నాకు భయం ఉండేది. నాకు ఏమి చెప్పొద్దు అనేవాడిని. ఏరోజు నన్ను ఏది అడగలేదు. ఈ రోజు తనను చూసి చాలా గర్వంగా ఉంది. మంచి దర్శకులు, నిర్మాతలతో పనిచేశాడు. కచ్చితంగా వారిని గుర్తు పెట్టుకో. నిన్ను నువ్వు నమ్ముకో. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇంటికెళ్లాక మరోసారి నీతో మాట్లాడతా.' అంటూ సరదాగా మాట్లాడారు. -
ఐకాన్ స్టార్ వారసుడి బర్త్ డే.. బన్నీ దంపతుల స్పెషల్ విషెస్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమారుడికి ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఇవాళ అల్లు అయాన్ పుట్టినరోజు కావడంతో ట్విటర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశారు. హ్యాపీ బర్త్ డే చిన్ని బాబు అని ముద్దుగా క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సైతం అయాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.అయాన్ బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి ప్రత్యేకంగా వీడియోను షేర్ చేసింది. అయాన్‌తో సంతోషంగా ఉన్న క్షణాలను వీడియో రూపంలో పంచుకుంది. నువ్వు మా జీవితంలో భాగమైనందుకు మేము చాలా గర్వపడుతున్నాము అంటూ స్నేహా రెడ్డి పోస్ట్ చేసింది. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే గతేడాది పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. పుష్పకు సీక్వెల్‌గా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి అభిమానులను మెప్పించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) Many many happy returns of the day to the love of my life … Happy Birthday my Chinni Babu #AlluAyaan 😘😘😘 pic.twitter.com/1r6fn7xXdc— Allu Arjun (@alluarjun) April 3, 2025 -
దేవసేన తొలి పుట్టినరోజు.. మంచు మనోజ్ దంపతుల ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడైన భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికను పెళ్లాడారు. 2023లో వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. భూమా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం వల్లే మంచు మనోజ్ ఆమెను పెళ్లాడారు. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో వీరిద్దరి వివాహా వేడుక ఘనంగా జరిగింది. వీరిద్దరి పెళ్లికి బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. గతేడాది ఈ జంట ముద్దుల కూతురిని తమ జీవితంలోకి ఆహ్వానించారు. అంతే కాకుండా తమ గారాలపట్టికి దేవసేన శోభ అని శోభనాగిరెడ్డి పేరు కలిసేలా నామకరణం చేశారు. ఈ జంటకు ఏప్రిల్ 2, 2024లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఇవాళ తమ కూతురి మొదటి పుట్టినరోజు కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంచు లక్ష్మీ సైతం చిన్నారి దేవసేన తొలి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. తనతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ప్రేమను వ్యక్తం చేసింది.ఇక మనోజ్, మౌనిక దంపతులు తమ ముద్దుల కూతురి దేవసేన తొలి పుట్టినరోజు ఫోటోలను షేర్ చేశారు. ఓ పురాతన కట్టడంలో బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమ కూతురిపై ప్రేమను కురిపిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.మనోజ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'ఏడాది క్రితం మా ప్రపంచం మరింత అద్భుతంగా మారింది. ముగ్గురిగా ఉన్న మేము నలుగురం అయ్యాం. నాలుగు హృదయాలు. నాలుగు ఆత్మలు. ఒక తిరుగులేని బంధం. ఈ నాలుగు పిల్లర్స్ ప్రేమ, బలంతో నిర్మించిన కుటుంబం. మా ఎంఎం పులి.. దేవసేన శోభ. నువ్వు మా జీవితాల్లో వెలుగు, ధైర్యంతో పాటు అనంతమైన ఆనందాన్ని తెచ్చావు. అమ్మా, నేనూ, ధైరవ్ అన్నా నికు ఎప్పటికీ రక్షణగా ఉంటాం. అద్భుతం, ఆరోగ్యం, అందమైన కలలతో నిండిన జీవితాన్ని కలిసి నిర్మించుకుందాం. నీకు మొదటి జన్మదిన శుభాకాంక్షలు. మాటల్లో కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాం.' అంటూ కూతురిపై ప్రేమను కురిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు మనోజ్ దంపతుల ముద్దుల కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
ట్రైలర్లో ఎక్కువగా బూతులు.. అందుకే వాడాల్సి వచ్చింది: సిద్ధు జొన్నలగడ్డ
డీజే టిల్లుతో ఒక్కసారిగా స్టార్‌గా మారిన టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. గతేడాది టిల్లు స్క్వేర్తో మరో అభిమానులను మెప్పించిన సిద్ధు సినిమాతో అలరించేందుకు రెడీ అయిపోయాడు. సిద్ధు- బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వస్తోన్న సరికొత్త యాక్షన్ మూవీ జాక్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో హీరో సిద్ధు మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అయితే జాక్ ట్రైలర్లో ఎక్కువగా బూతు పదాలు ఉపయోగించడంపై సిద్ధును ప్రశ్నించారు.అవును.. బూతులు వాడాం.. కానీ అక్కడ సీన్‌కు తగినట్లుగానే పెట్టాల్సి వచ్చిందని సిద్ధు అన్నారు. ఈ విషయంలో హీరో క్యారెక్టర్‌కు.. ఆ సమయంలో ఎమోషన్‌కి ఆ డైలాగ్స్ పెట్టామని తెలిపారు. పీక్ క్లైమాక్స్ కావడంతో ఆ ఎమోషన్‌కు అది కరెక్ట్ అని అలా చేసినట్లు సిద్ధు వెల్లడించారు. అలాగే మీ మూవీ సెన్సార్ పూర్తయిందా? అని ప్రశ్నించగా.. ఆ విషయం తనకు ఇంకా తెలియదని బదులిచ్చారు.కాగా.. ఈ చిత్రంలో సిద్ధు సరసన బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 10న థియేటర్లలో సందడి చేయనుంది. -
కుశాల్ రాజు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే?
కుశాల్ రాజు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ దర్శకుడు మల్లిడి వశిష్ట సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఎంఎస్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ బ్యానర్లో డా. లతా రాజు నిర్మిస్తున్నారు. ఇవాళ ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ కొట్టగా..మల్లిడి వశిష్ట ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు మల్లిడి కృష్ణ మాట్లాడుతూ.. '2012లో నా జర్నీ మొదలైంది. ఎన్నోమలుపులు తిరిగి మీ ముందుకు డైరెక్టర్‌గా వచ్చాను. లత గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అలాంటి మంచి నిర్మాత దొరకాలంటే అదృష్టం ఉండాలి. ఇదొక స్కైఫై డ్రామా మూవీ. ఓటీటీల యుగంలో ఇలాంటి కథను ఎంచుకోవాలంటే ధైర్యం ఉండాలి. రాబోయే ఈవెంట్స్‌లో మరిన్ని వివరాలు వెల్లడిస్తా' అని చెప్పారు. హీరో కుశాల్ రాజు మాట్లాడుతూ..'నా దర్శకుడు కృష్ణకు థ్యాంక్స్ చెప్పాలి. నన్ను హీరోగా పరిచయం చేయడం కోసం మా అమ్మ లత చాలా కేర్ తీసుకున్నారు. వీవీ వినాయక్, బెల్లంకొండ శ్రీనివాస్, మా టీమ్ మొత్తానికి బిగ్ థ్యాంక్స్' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో జగపతి బాబు, పృథ్వీరాజ్, వైవా హర్ష, బబ్లూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఆ స్టార్ హీరోయిన్‌తో ప్రభాస్ పెళ్లి.. నిజంగానే జరిగితే?
టాలీవుడ్లో రెబల్ స్టార్ పెళ్లి గురించి చర్చ ఇప్పటి నుంచి మొదలైంది కాదు. గత పదేళ్లుగా ఏదో ఒక సందర్భంలో ప్రభాస్ పెళ్లి ముచ్చట వినిపిస్తూనే ఉంటుంది. అలా మరోసారి ఇటీవలే ప్రభాస్ పెళ్లి లొల్లి మొదలైంది. ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురిని ఆయన పెళ్లాడబోతున్నారని టాక్ వచ్చింది. కానీ ఈ విషయంపై ఆరా తీస్కే అదంతా ఒట్టి పుకారే తేలిపోయింది. ఈ విషయంపై ఆయన టీమ్ సైతం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. అవన్నీ ఫేక్ వార్తలేనని కొట్టిపారేసింది.ఇక ప్రభాస్ అన్న పెళ్లి ముచ్చట వచ్చినప్పుడల్లా ఆ స్టార్ హీరోయిన్ పేరు కూడా వినిపిస్తుంది. ఎందుకంటే వీరిద్దరు జంటగా పలు సూపర్ హిట్ మూవీల్లో నటించారు. ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క శెట్టి. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఎంతోమంది సినీ ప్రియులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇదేది అంత ఈజీగా అయ్యే పనిలా మాత్రం కనిపించడం లేదు. అందుకే ఓ నెటిజన్ వినూత్న ఆలోచనతో ఓ వీడియోను రూపొందించాడు. అది చూస్తే ఈ జంట ఇంత చూడముచ్చటగా ఉన్నారా? అంటూ కామెంట్స్ చేయకుండా ఉండలేరు. అంతలా ఎడిట్ చేసిన ఓ నెటిజన్ ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఇంతకీ ఆ వీడియో ఏంటో చూసేద్దాం పదండి.నెటిజన్ ఎడిట్ చేసిన ఫోటోలతో ప్రభాస్- అనుష్క శెట్టికి పెళ్లైనట్లు ఊహించుకుని ఓ వీడియోను రూపొందించాడు. పెళ్లి మాత్రమే కాదు.. ఈ జంటకు పిల్లలు పుడితే ఎలా ఉంటారో కూడా ఊహించి మరీ ఫోటోలు ఎడిట్ చేసిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. అలా ఎడిట్ చేసిన ఫోటోలు చూస్తే ప్రభాస్- అనుష్క జోడీ టాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా చూసి ఊహల్లో విహరించండి.Entraa idi entha realistic ga undi 🫠 pic.twitter.com/7JG14Sf4kC— x_tweet's 🌅 (@MididoddiSai1) March 31, 2025 -
పొలిమేర హీరోయిన్ మరో థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ జంటగా నటించిన లేటేస్ట్ మూవీ 'షో టైమ్'. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిషోర్ గరికిపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మదన్ దక్షిణా మూర్తి దర్శకత్వం చేస్తున్నారు. తాజాగా ఉగాది పండుగను సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.తాజా పోస్టర్ చూస్తుంటే ఈ మూవీని ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఓ కుటుంబం అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటే వాటి నుంచి ఎలా బయటపడ్డారనే కాన్సెప్టుతోనే ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఓ పోలీస్ అధికారి నుంచి నవీన్ తన భార్య, కూతురును ఎలా కాపాడుకున్నాడనే కథగా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. నవీన్ చంద్ర గతంలో కూడా చాలా క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో నటించారు. కామాక్షి భాస్కర్ల కూడా ‘మా ఊరి పోలిమేరా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. A family on edge.A cop at the door.And a story that’s about to explode💥Welcome to #SHOWTIME – First Look is out now!🌟ing @Naveenc212 #kamakshibhaskarla@SkylineMoviez @AnilSunkara1 @kishore_Atv @aruvimadhan #ShekarChandra @sarath_edit @cinemakaran_dop @gavireddy_srinu… pic.twitter.com/O2FSZA6IOt— Skyline Movies (@SkylineMoviez) March 30, 2025 -
కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా: కోర్ట్ టీమ్‌పై మెగాస్టార్ ప్రశంసలు
చిన్న సినిమా అయినా సరే కంటెంట్ కింగ్ అనే విషయం మరోసారి రుజువైంది. ఆ మాటను ఇటీవల విడుదలైన కోర్ట్ మూవీ మరోసారి స్పష్టం చేసింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరెకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో ఊహించిన దానికంటే అధికంగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా ఈ మూవీపై పలువురు టాలీవుడ్ అగ్ర సినీతారలు ప్రశంసలు కురిపించారు.తాజాగా ఈ మూవీ టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. కోర్ట్ మూవీ టీమ్‌ను తన ఇంటికి ఆహ్వానించిన చిరు.. సినిమా తెరకెక్కించిన తీరుపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో ప్రియదర్శి ఉండడంతో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని భావించానని అన్నారు. కానీ ఈ కథను చాలా స్ట్రైట్‌గా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారని మెగాస్టార్ కొనియాడారు. ఈ సినిమాలో శివాజీ చాలా క్రూయల్‌గా నటించారని.. రోషన్, శ్రీదేవి అద్భుతంగా చేశారని చిరంజీవి ప్రశంసించారు. ఈ సందర్భంగా చిరంజీవితో ప్రియదర్శి కాసేపు సినిమా కాన్సెప్ట్ గురించి వివరించారు. ఠాగూరు మూవీ తర్వాత అంతలా చర్చించుకున్న సినిమా ఇదేనని ప్రియదర్శి అన్నారు. కాగా.. ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. ఈ -
ఇదిదా సర్ప్రైజ్.. విలన్స్‌గా స్టార్ హీరోలు
కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేసి, ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్న హీరోలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కానీ హీరోగా సక్సెస్ అయిన తర్వాత కూడా విలన్ రోల్స్‌ను ప్రయత్నిస్తున్నారు కొందరు హీరోలు. ‘ఇదిదా సర్ప్రైజ్’ అంటూ ఇలా తమ నెగటివ్ షేడ్స్ ట్యాలెంట్‌తో ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేసిన, సర్ప్రైజ్ చేయనున్న కొందరు హీరోల గురించి ఓ లుక్ వేద్దాం.కూలీకి విలన్?సిల్వర్ స్క్రీన్‌పై నాగార్జున నెగటివ్ రోల్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ఆడియన్స్‌లో తప్పక ఉంటుంది. పూర్తి స్థాయి గ్రే షేడ్స్ క్యారెక్టర్లో నాగార్జునను స్క్రీన్‌పై చూడాలని కొందరు ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఆ తరుణం ఆసన్నమైందని, రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో నాగార్జున నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారనే టాక్ కోలీవుడ్‌లో ప్రచారంలోకి వచ్చింది. ‘కూలీ’ సినిమా చిత్రీకరణప్రారంభమైనప్పుడు నాగార్జున ఓ వ్యక్తిని క్రూరంగా కత్తితో చంపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్‌లో ఉంటుందనే వార్తలకు ఈ వీడియో రూపంలో బలం చేకూరినట్లయింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. శ్రుతీహాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ ఇతర కీలకపాత్రల్లో నటించారు. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ‘కూలీ’ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది.బ్రహ్మ రాక్షస హీరోగా ప్రభాస్ కటౌట్‌కి ఉన్న బాక్సాఫీస్ స్టామినా ఏంటో ఆడియన్స్ చూశారు. మరి... ప్రభాస్‌లాంటి కటౌట్ ఉన్న హీరో క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటే ఎలా ఉంటుందో ‘బిల్లా’ సినిమాలో శాంపిల్‌గా ఆడియన్స్ చూశారు. కానీ ఈ డోస్‌ను ఇంకాస్త పెంచి ‘బ్రహ్మ రాక్షస’ సినిమాతో ఆడియన్స్‌ని తన నెగటివ్ షేడ్ యాక్టింగ్ స్కిల్‌తో సర్ప్రైజ్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నారట. ప్రభాస్ మెయిన్ లీడ్ రోల్లో ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘బ్రహ్మ రాక్షస’ అనే మూవీ రానుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్, ఫౌజి’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మూవీ చేస్తారు. ఈ ‘స్పిరిట్’ మూవీ చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే... ప్రశాంత్ వర్మతో ‘బ్రహ్మ రాక్షస’ సినిమాను టేకాఫ్ చేస్తారు ప్రభాస్. ఈ లోపు రిషబ్ శెట్టితో ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ను పూర్తి చేస్తారు ప్రశాంత్ వర్మ. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభాస్–ప్రశాంత్ వర్మ కాంబోలోని మూవీ 2026 చివర్లో లేదా 2027ప్రారంభంలో మొదలు కానున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ ‘బ్రహ్మ రాక్షస’ సినిమాను తొలుత రణ్వీర్ సింగ్‌తో చేయాలనుకున్నారు ప్రశాంత్ వర్మ. కానీ కొన్ని కారణాల వల్ల రణ్వీర్ సింగ్ ఈప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.బాలీవుడ్ వార్ ‘టెంపర్, జై లవకుశ’ వంటి చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్‌లో ఎన్టీఆర్ స్క్రీన్‌పై ఎంత రెచ్చిపోయారో ఆడియన్స్ చూశారు. కాగా ఎన్టీఆర్లోని నెగటివ్ షేడ్ యాంగిల్ ఈసారి నార్త్ ఆడియన్స్‌కు కూడా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుందని తెలిసింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో హిందీలో ‘వార్ 2’ అనే మూవీ రానుంది. ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని బాలీవుడ్ సమాచారం. ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్ వీరేంద్ర నాథ్పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారని, ఆయన క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని టాక్. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆగస్టు 14న ‘వార్ 2’ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే.తొలిసారిగా విలన్‌గా... సిల్వర్ స్క్రీన్‌పై బ్లాక్ బస్టర్ హీరోస్లో అల్లు అర్జున్ ఒకరు. కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘ఆర్య 2’ చిత్రంలో ఆయన క్యారెక్టర్లో కాస్త గ్రే షేడ్స్ ఉంటాయి. ఆ తర్వాత ‘పుష్ప’ వంటి ఎగ్రెసివ్ ఎనర్జీ ఉన్న క్యారెక్టర్స్ చేశారు కానీ, పూర్తి స్థాయి గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను అల్లు అర్జున్ చేయలేదు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందట. అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్లో ఓ భారీ బడ్జెట్ మూవీ రానుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మూవీలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారని, ఈ రెండు రోల్స్‌లో ఓ రోల్లో నెగటివ్ షేడ్స్ ఉంటుందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనుందట. ఈ వేసవిలో చిత్రీకరణనుప్రారంభించి, 2026 చివర్లో ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని భోగట్టా. ఈ చిత్రంపై పూర్తి స్థాయి సమాచారం అందాల్సి ఉంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.బ్లాక్ స్వార్డ్ హీరోగా తెలుగు స్క్రీన్‌పై సక్సెస్ అయ్యారు మంచు మనోజ్. ఇప్పుడు విలన్‌గా కనిపించనున్నారు. ‘హను–మాన్’ ఫేమ్ తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ ఈ మైథలాజికల్ అండ్ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్‌ను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సూపర్ యోధపాత్రలో తేజ సజ్జా నటిస్తుండగా, బ్లాక్ స్వార్డ్పాత్రలో మంచు మనోజ్ విలన్‌గా కనిపిస్తారు. ఇక ‘మిరాయ్’ చిత్రం ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ హీరోలే కాదు... ఇంకొందరు స్టార్స్ కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్‌కి సై అన్నారు. – ముసిమి శివాంజనేయులుకోలీవుడ్ హీరోలు కూడా వీలైనప్పుడు విలన్ రోల్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో మెయిన్ విలన్‌గా కమల్‌హాసన్ నటించారు. కమల్‌హాసన్ హీరోగా చేసిన ‘విక్రమ్’ మూవీ క్లైమాక్స్‌లో రోలెక్స్‌గా విలన్‌పాత్రలో కనిపించారు సూర్య. ఇక సూర్య హీరోగా చేసిన ‘కంగువ’ మూవీలో కార్తీ విలన్‌గా కనిపించారు. కార్తీ హీరోగా చేసిన ‘ఖైదీ’ సినిమాలో తమిళ యువ నటుడు అర్జున్ దాస్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించారు. కమల్‌హాసన్ ‘విక్రమ్’, కార్తీ ‘ఖైదీ’ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనగరాజ్ నేతృత్వంలోని ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంలోనివే. సో... ‘ఖైదీ 2’ చిత్రంలో సూర్య విలన్‌గా నటించే చాన్సెస్ ఉన్నాయి.⇒ ఇంకా శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ సినిమా కోసం తొలిసారిగా విలన్‌గా స్క్రీన్‌పై కనిపించనున్నారు రవి మోహన్ (ఇటీవల ‘జయం’ రవి తన పేరును రవి మోహన్‌గా మార్చుకున్నారు). సుధ కొంగర దర్శకత్వంలోని ఈ మూవీ వచ్చే ఏడాదిప్రారంభంలో రిలీజ్ కానుందని తెలిసింది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’లో అరుణ్ విజయ్ విలన్‌గా చేస్తున్నారన్న వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఇంకా వీలైనప్పుడల్లా విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, మాధవన్ వంటి యాక్టర్స్ కూడా విలన్ రోల్స్ చేస్తున్నారు. ఇలా ఇంకొంతమంది ఉన్నారు.⇒ బాలీవుడ్ హీరోలు కూడా విలన్ రోల్స్ చేస్తున్నారు. షారుక్ ఖాన్ హీరోగా చేయ నున్న నెక్ట్స్ మూవీ ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో అభిషేక్ బచ్చన్ తొలిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా చేస్తున్న ‘రామాయణ’ సినిమాలో ‘కేజీఎఫ్’ హీరో యశ్ రావణుడిపాత్ర చేస్తున్నారు. గత ఏడాది విడుదలైన అజయ్ దేవగన్ ‘సింగమ్ ఎగైన్’లో అర్జున్ కపూర్ విలన్‌గా చేశారు. ఇంకా బాలీవుడ్లో హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్న సంజయ్ దత్, బాబీ డియోల్ (హరిహర వీరమల్లు), ఇమ్రాన్ హష్మి (ఓజీ, జీ 2), జిమ్ సర్ఫ్ (కుబేర), సోహైల్ ఖాన్ (అర్జున్ సన్నాఫ్ వైజయంతి), దివ్యేందు (పెద్ది) వంటి వారు తెలుగు సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తున్నారు. ఇలా ఇంకొందరు ఉన్నారు.⇒ కథ నచ్చితే నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేసేందుకు హీరోయిన్స్ సైతం వెనకాడటం లేదు. ఈ విషయంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ముందుంటారు. హీరోయిన్గా చేస్తూనే ఎక్కువగా విలన్ రోల్స్ చేస్తుంటారామె. ఇక వెంకటేశ్ ‘సైంధవ్’లో ఆండ్రియా, విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ‘వెన్నెల’ కిశోర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’లో అనన్య నాగళ్ల, అజిత్ ‘విడాముయర్చి’ లో రెజీనా, రణ్‌బీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’లో మౌనీ రాయ్, ‘పొన్నియిన్ సెల్వన్’లో ఐశ్వర్యా రాయ్ వంటి వారు కెరీర్లో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్న సమయంలోనే నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. ఇలా మరికొంతమంది ఉన్నారు. -
హీరో విజయ్ కంటే మన హీరోనే స్మార్ట్..: మల్లారెడ్డి ప్రశంసలు
దివంగత లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ చాలా ఏళ్ల తర్వాత 'లైఫ్'(లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్‌పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ కేతరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటిస్తున్నారు. భావన పోలేపల్లి కాస్ట్యూమ్ డిజైనర్. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మల్లా రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా హీరో శ్రీ హర్ష మాట్లాడుతూ.. 'ముందుగా ముఖ్య అతిధి మల్లా రెడ్డికి కృతజ్ఞతలు. ఆయన ఈ సినిమాలో నటించి ఉంటే, పాన్ వరల్డ్ సినిమా అయ్యేది. ఈ సినిమాని నిర్మించిన తన తండ్రి రామ స్వామి రెడ్డికి కృతజ్ఞతలు. ఇంత అద్భుతంగా తీసిన డైరెక్టర్ పవన్ కేతరాజుకి ఎంతో రుణపడి ఉంటా. మణి శర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తన సినిమాకి సంగీతం ఇవ్వడం తన అదృష్టం. అలాగే సింగర్ ఎస్పీ చరణ్, నటుడు ప్రవీణ్‌తో కలిసి పని చెయ్యడం చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు.ఎమ్మెల్యే మల్లా రెడ్డి మాట్లాడుతూ.. 'ముందుగా ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో తీశారని తెలిసి ఆశ్చర్యపోయా. హీరో శ్రీ హర్ష తమిళ హీరో విజయ్ కంటే స్మార్ట్‌గా ఉన్నారు. శ్రీ హర్ష తమ కాలేజీ స్టూడెంట్.. అతని తండ్రి తమ కాలేజీ ప్రిన్సిపాల్.. వీరు సినిమా చెయ్యడం తనకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాలో పని చేసిన నటినటులకి నా అభినందనలు. డైరెక్టర్ ప్రవీణ్ కేతరాజు ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు ప్రత్యేక అభినందనలు. ఈ సినిమా కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవ్వాలి' అని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇక డైరెక్టర్ పవన్ మాట్లాడుతూ.. 'తమని దీవించడానికి వచ్చిన ముఖ్య అతిధి మల్లా రెడ్డికి నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. చరణ్ ఈ సినిమా చేయబట్టే చాలా అద్భుతంగా వచ్చింది. బాల సుబ్రహ్మణ్యం చరణ్‌ను మనకు గిఫ్ట్‌గా ఇచ్చారు. బాల సుబ్రహ్మణ్యం ఎక్కడున్నా మమ్మల్ని దీవిస్తూ ఉంటారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు' అని అన్నారు.సింగర్ ఎస్పీ చరణ్ మాట్లాడుతూ.. 'వేదిక మీద ఉన్న పెద్దలందరికి నమస్కారం. తన క్యారెక్టర్‌ను అద్భుతంగా డిజైన్ చేసిన డైరెక్టర్ పవన్ కేతరాజుకు ధన్యవాదాలు . ఈ సినిమా హీరో శ్రీ హర్ష చాలా కష్ట పడ్డారు. వారణాసిలో ఆయన పడ్డ కష్టాన్ని గుర్తు చేశారు. ఈ సినిమా శ్రీ హర్షకి మంచి సక్సెస్ ఇవ్వాలి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించినందుకు కషికకి స్పెషల్ థాంక్స్. అలాగే ఎంతో సపోర్టింగ్ యాక్ట్ చేసిన నటుడు ప్రవీణ్‌కు నా కృతజ్ఞతలు. ఇంతమంచి సినిమాలో తాను పాడేందుకు అవకాశం ఇవ్వనందుకు కోపంగా ఉన్నానని సరదాగా' అన్నారు. ఈ చిత్రంలో చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిినిమాను ఏప్రిల్ 4వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
నా సోదరి మరణం తీవ్రంగా కలచివేసింది: మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
డైరెక్టర్ మెహర్ రమేశ్ సోదరి మరణం పట్ల మెగాస్టార్ సంతాపం వ్యక్తం చేశారు. నా తమ్ముడు మెహర్ రమేశ్ సోదరి మాదాసు సత్యవతి మరణం నన్ను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. తాను నాకు కూడా సోదరేనని ఎమోషనల్ అయ్యారు. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి, నా తమ్ముడు మెహర్ రమేశ్‌కు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారు.(ఇది చదవండి: టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట తీవ్ర విషాదం)మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి స్వర్గస్థులవటం ఎంతో కలచి వేసింది. తాను నాకూ సోదరే. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు, దర్శకుడు మెహెర్ రమేష్ కు, నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ.. నా సోదరి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నా' అంటూ పోస్ట్ చేశారు.తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి స్వర్గస్థులవటం ఎంతో కలచి వేసింది. తాను నాకూ సోదరే. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు, దర్శకుడు మెహెర్ రమేష్ కు, నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ, నా సోదరి ఆత్మ కి శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను🙏— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2025 -
బిజినెస్మెన్ కూతురితో ప్రభాస్ పెళ్లి.. స్పందించిన టీమ్
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ పెళ్లి గురించి ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి చాలాసార్లు వార్తలొచ్చాయి. కానీ అవన్నీ కేవలం రూమర్స్‌గానే మిగిలిపోయాయి. కొన్ని నెలల గ్యాప్ తర్వాత మళ్లీ ప్రభాస్ పెళ్లి గురించి మొదలైంది. త్వరలోనే ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నారని నెట్టింట తెగ వైరలవుతోంది. అంతేకాదు రెబల్ స్టార్ పెద్దమ్మ శ్యామలా దేవి అప్పుడే పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్ అన్న పెళ్లి కోసం ఎంతోమంది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తల నేపథ్యంలో తాజాగా ఆయన టీమ్ స్పందించింది. ప్రభాస్ మ్యారేజ్ గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని కొట్టి పారేశారు. ఓ బిజినెస్మెన్ కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ వార్తలపై ఆయన టీమ్‌ను సంప్రదించగా.. ఎలాంటి ఊహగానాలు నమ్మవద్దని రెబల్ స్టార్ అభిమానులకు సూచించారు.(ఇది చదవండి: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఏర్పాట్లలో శ్యామలా దేవి)గతంలో ప్రభాస్ పెళ్లి గురించిన వచ్చిన రూమర్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. అతను తన బాహుబలి నటి అనుష్క శెట్టితో రిలేషన్షిప్లో ఉన్నాడని చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత ఈ వార్తలను నటీనటులిద్దరూ ఖండించారు. తాము మంచి స్నేహితులమని క్లారిటీ ఇచ్చారు.ఇక సినిమాల విషయానికొస్తే ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. ఆ తర్వాత దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి -2, ప్రశాంత్ నీల్‌తో సలార్ 2: శౌర్యంగ పర్వం సినిమాలను చేయనున్నారు. -
ఆ సినిమా తొలి రోజే అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుంది: నిర్మాత రవిశంకర్
టాలీవుడ్ నిర్మాత వై.రవిశంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్‌హుడ్ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ గురించి వ్యాఖ్యానించారు. అజిత్ కుమార్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మొదటి రోజే రికార్డులు కొల్లగొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కోలీవుడ్‌లోనే ఓపెనింగ్ డే ఆల్ రికార్డ్స్ సృష్టిస్తుందని మా డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించిన గుడ్ బ్యాడ్ అగ్లీ వచ్చేనెల 10న విడుదల కానుంది. ఈ మూవీలో అజిత్ కుమార్ సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది.కాగా.. నితిన్ రాబిన్ హుడ్ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. భీష్మ సూపర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించడం మరో విశేషం. ఇటీవల ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన సందడి చేశారు. శ్రీలీల, కేతికా శర్మతో కలిసి అది దా సర్ప్రైజ్ అంటూ స్టెప్పులు కూడా వేశారు. ఈ సినిమా ఉగాది కానుకగా ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. తమిళ ఇండస్ట్రీలో #GoodBadUgly DAY 1 రికార్డులు కొడుతుంది - #RaviShankar#AjithKumar #Robinhood #TeluguFilmNagar pic.twitter.com/90DmdTZclA— Telugu FilmNagar (@telugufilmnagar) March 26, 2025 -
రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బర్త్ డే స్పెషల్ అప్డేట్ వచ్చేసింది!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ16 మూవీతో బిజీగా ఉన్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈనెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఆర్సీ16 సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. చెర్రీ బర్త్ డే స్పెషల్‌గా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. గురువారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్ స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో చెర్రీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ సినిమాను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. Grit, power, and an untamed spirit from the rural lands ❤️🔥#RC16 TITLE & FIRST LOOK out tomorrow at 9.09 AM 💥💥#RamCharanRevoltsGlobal Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @IamJagguBhai @divyenndu… pic.twitter.com/ZvwUrN7fNl— Vriddhi Cinemas (@vriddhicinemas) March 26, 2025 -
భార్యకు బర్త్ డే విషెస్ చెప్పిన టాలీవుడ్ యంగ్ హీరో.. నుదుటన బొట్టు పెట్టి!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే దిల్రుబాతో ప్రేక్షకులను అలరించారు. ఈనెల 14న థియేటర్లలోకి వచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాకు విశ్వకరుణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా కనిపించింది.అయితే మన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవలే తాను గర్భంతో ఉన్నట్లు ప్రకటించి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా ఇవాళ తన సతీమణి బర్త్ డే కావడంతో కిరణ్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన భార్య నుదుటన బొట్టు పెడుతున్న ఫోటోలను షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే మా.. అంటూ సతీమణికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం కిరణ్ అబ్బవరం భార్యకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోహీరోయిన్లుగా పరిచయమైన కిరణ్-రహస్య.. ఆ తర్వాత స్నేహితులుగా మారారు. కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే తమ బంధాన్ని చాలా రహస్యంగా ఉంచారు. గత ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకుని అధికారికంగా ప్రకటించారు. 2024 ఆగష్టు నెలలో పెళ్లితో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram) -
భారతీరాజా తనయుడు మృతి.. మైత్రి మూవీ మేకర్స్ కీలక నిర్ణయం
కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు భారతీరాజా తనయుడు మనోజ్ గుండెపోటుతో మంగళవారం సాయంత్రం మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన మనోజ్‌కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 48 ఏళ్లు కాగా.. ఇటీవలే ఆయనకు గుండెకు శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది.అయితే ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంతాపం వ్యక్తం చేసింది. మనోజ్ మృతితో కీలక నిర్ణయం తీసుకుంది. తమ బ్యానర్లో తెరకెక్కించబోయే ప్రదీప్ రంగనాథన్ మూవీ ప్రకటనను వాయిదా వేసింది. ఇవాళ ఉదయం 11:07 నిమిషాలకు విడుదల కావాల్సిన ఫస్ట్ షాట్ బూమ్ టైమ్‌ను మార్చినట్లు ట్విటర్ ద్వారా వెల్లడించింది.(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. దర్శకుడు భారతీరాజా కుమారుడు కన్నుమూత)కాగా.. మనోజ్ భారతిరాజా ప్రముఖ లెజెండరీ ఫిల్మ్ మేకర్ భారతిరాజా కుమారుడు. మనోజ్ తొలిసారిగా తాజ్ మహల్ (1999)మూవీలో నటించారు. ఆ తర్వాత అల్లి అర్జున (2002), కాదల్ పుక్కల్ (2001), అన్నక్కోడి, పల్లవన్, లాంటి తమిళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. గత రెండేళ్లుగా దర్శకత్వం వైపు అడుగులు వేశారు. తన తండ్రి నిర్మించిన 2023 తమిళ చిత్రం మార్గజి తింగల్‌తో దర్శకుడిగా పరిచయమయ్యారు.Due to the unfortunate passing of Manoj Bharathiraja Sir, son of legendary filmmaker Bharathiraja Sir, the #PR04 'FIRST SHOT BOOM' is postponed to a later time today. Our heartfelt condolences to the family. May the family find strength and peace in these tough times.— Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2025 -
ఉద్యోగం కోసం ఫారిన్కే పోవాలా?.. ఆసక్తిగా హోమ్ టౌన్ ట్రైలర్
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు మరో వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన తెలుగు వెబ్ సిరీస్ హోమ్ టౌన్(Home Town). ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పడే కష్టాల నేపథ్యంలోనే ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ ఫ్యామిలీ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. తమ పిల్లలు బాగా చదివి గొప్పవాళ్లుగా ఎదిగితే చూడాలని ఆశపడే తండ్రి తపనే ట్రైలర్లో ప్రధానంగా కనిపిస్తోంది. మధ్య తరగతి కుటుంబాల పరిస్థితులు ఎలా ఉంటాయనేదే హోమ్ టౌన్లో ట్రైలర్లో చూపించారు. ఈ వెబ్ సిరీస్‌కు శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. వచ్చేనెల నాలుగో తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.You can leave your hometown, but can you ever leave the memories?The streets, the friendships, the late-night dreams Srikanth’s journey is ours too.https://t.co/T4V4GXBJWL#Hometown premieres from April 4 on #aha#ahaOriginal #RajeevKanakala #Jhansi pic.twitter.com/D523DRCH1s— ahavideoin (@ahavideoIN) March 25, 2025 -
'చనిపోయిన వాళ్లు మళ్లీ తిరిగొస్తారా?'.. ఆసక్తిగా 28 డిగ్రీల సెల్సియస్ ట్రైలర్
నవీన్ చంద్ర, షాలిని జంటగా నటించిన చిత్రం '28 డిగ్రీస్ సెల్సియస్'(28°C Movie). ఈ చిత్రానికి పొలిమేర సిరీస్ చిత్రాల డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ కరోనాకు ముందే రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. తాజాగా హైదరాబాద్‌లో ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మించారు.ట్రైలర్ చూస్తే హారర్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒక అమ్మాయిని 28 డిగ్రీల సెల్సియస్‌లోనే కాపాడుకునే కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. ట్రైలర్లో సీన్స్ చూస్తే ఓ ఇంటి చుట్టే ఈ కథ తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించారు. -
గేమ్ ఛేంజర్‌లో ఛాన్స్.. ఎలా వచ్చినా నాకైతే గర్వంగా ఉంది: నవీన్ చంద్ర
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర నటించిన చిత్రం '28 డిగ్రీ సెల్సియస్'. ఈ మూవీకి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో షాలిని హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. కరోనాకు ముందే రావాల్సిన ఈ మూవీ పలు కారణాలతో వాయిదా పడింది. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన హీరో నవీన్ చంద్ర గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ చిత్రంలో అవకాశం రావడంపై ఆయన మాట్లాడారు. అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినందుకు గర్వపడతానని నవీన్ చంద్ర అన్నారు. నన్ను ఎలా సెలెక్ట్ చేసినప్పటికీ ఆ మూవీ చేయడం నా కెరీర్లో ఓ గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు.నవీన్ చంద్ర మాట్లాడుతూ..'పెద్ద బడ్జెట్, పెద్ద సినిమా.. అందరు ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని గేమ్ ఛేంజర్ తీశారు. నేను బళ్లారి నుంచి వచ్చా. అలాంటి పెద్ద సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినందుకు గర్వంగా ఉంది. ఫలితం పక్కనపెడితే ఆ బిగ్గెస్ట్ బడ్జెట్.. బిగ్గెస్ట్ స్టార్ సినిమాలో ఛాన్స్ రావడమే చాలా గొప్పగా ఫీలయ్యా. నేను కొత్తవారితోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంటాను. అయితే నేను చేసిన మొదటి పెద్ద సినిమా నేను లోకల్.. ఆ తర్వాత అరవింద సమేత వీరరాఘవ. మధ్యలో ఎక్కువగా చిన్న చిన్న బడ్జెట్ చిత్రాలే చేశా. కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌కు వాళ్లు ఎలా సెలెక్ట్ చేసినా శంకర్ సార్‌తో, దిల్‌రాజ్ ప్రొడక్షన్లో వర్క్ చేయాలనే లక్ నాకు ఉంది. అందుకే గేమ్ ఛేంజర్‌లో అవకాశం వచ్చింది' అని అన్నారు. -
జపాన్‌లో దేవర ఫీవర్.. ఆయుధ పూజ సాంగ్‌కు ఫ్యాన్స్ స్టెప్పులు
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన ఫుల్ యాక్షన్ మూవీ దేవర పార్ట్-1. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటించింది. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే మన టాలీవుడ్ సినిమాలకు జపాన్‌లో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను జపాన్‌లోనూ విడుదల చేయనున్నారు. ఇప్పటికే మన యంగ్ టైగర్ జపాన్ చేరుకుని ప్రమోషన్లతో బిజీ అయిపోయారు. తాజాగా అక్కడి ఫ్యాన్స్‌తో కలిసి ఓ థియేటర్లో సందడి చేశారు.ఈ సందర్భంగా దేవర మూవీలోని ఆయుధ పూజ సాంగ్‌కు జపాన్ ఫ్యాన్స్ డ్యాన్స్ చేశారు. వారితో కలిసి మన జూనియర్ ఎన్టీఆర్ సైతం స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియోను దేవర టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. దేవరను మార్చి 28న జపాన్‌లో విడుదల కానుందని మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో దేవర-2 కూడా ఉంటుందని డైరెక్టర్ కొరటాల ఇప్పటికే ప్రకటించారు.#Devara fever grips Japan! 🌊🔥Man of Masses #NTR stuns the Japanese audience as he grooves to Ayudha Pooja with a fan! 🤙🏻@tarak9999 #デーヴァラ #KoratalaSiva @anirudhofficial @devaramovie_jp pic.twitter.com/y9ybqaAYsT— Devara (@DevaraMovie) March 24, 2025┼─映画『#デーヴァラ』ジャパンプレミア@新宿ピカデリー🔱┼─1日目 無事に終わりました🦈サプライズゲストで登場した#キンタロー 。さんと#NTRJr がダンス🕺✨お越しいただいたみなさま、ありがとうございました❗️ pic.twitter.com/QvMutZAyYB— 【公式】映画『デーヴァラ』 (@devaramovie_jp) March 24, 2025 -
బౌలర్‌గా శ్రీలీల .. బ్యాట్స్‌మెన్‌గా ఎవరంటే?.. రాబిన్‌హుడ్ టీమ్ ప్రకటించిన నితిన్!
టాలీవుడ్ హీరో నితిన్ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వెంకీ కుడుముల డైరెక్షన్లో వస్తోన్న రాబిన్‌హుడ్ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. గతంలో వీరిద్దరి కాంబోలో భీష్మ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా డేవిడ్ వార్నర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నితిన్‌కు యాంకర్ ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది. రాబిన్‌హుడ్ టీమ్ నుంచి క్రికెట్ జట్టును తయారు చేయాలంటే ఎవరూ దేనికి సూట్ అవుతారో చెప్పాలంటూ హీరోను అడిగింది. దీనికి నితిన్ స్పందిస్తూ.. మా క్రికెట్ టీమ్‌లో శ్రీలీల బౌలర్.. ఎందుకంటే ఆమె వయ్యారంగా బౌలింగ్ చేస్తే ఎవరైనా అవుట్ కావాల్సిందే.. వికెట్ కీపర్‌గా మా మైత్రి నిర్మాత రవిశంకర్.. అంపైర్‌గా వెంకీ కుడుముల.. బ్యాట్స్‌మెన్‌గా నేనే.. మా టీమ్‌లో క్యాచ్‌లో పట్టేది నవీన్.. మా టీమ్ ఓనర్‌గా డేవిడ్ వార్నర్ అంటూ ఫన్నీగా తమ రాబిన్‌హుడ్ టీమ్‌ను ప్రకటించారు. -
రెమ్యునరేషన్‌పై హీరోకు ప్రశ్న.. నాకు ఇదేం టార్చర్ రా బాబు!
సరికొత్త సినిమాలతో టాలీవుడ్ ప్రియులను అలరిస్తోన్న యంగ్ హీరో సుహాస్(Suhas). తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సుహాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఓ భామ అయ్యో రామా'(O Bhama Ayyo Rama). ఆ మూవీలో మాళవిక మనోజ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో సుహాస్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు యాడ్లకు ఎంత తీసుకుంటారో.. అలాగే సినిమాకు అంతే రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్ ఉంది.. దీనిపై మీరేమంటారు అని సుహాస్‌ను ప్రశ్నించారు. దీనిపై సుహాస్ కూడా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.సుహాస్ మాట్లాడుతూ..' ఇదేంటీ నాకు టార్చర్. నేను అనుకున్నంత నంబర్ అయితే లేదు. అయినా కూడా నా యాక్టింగ్ బాగుందో లేదో చూడాలి కానీ.. ఈ రెమ్యునరేషన్ గోల ఏంది? అన్నారు. అలాగే ప్రభాస్ స్పిరిట్‌లో నటిస్తున్నారా? అని ప్రశ్నించగా..అదేం లేదు అని సుహాస్ సమాధానమిచ్చారు. కాగా.. ఈ చిత్రంలో అనిత హస్సానందాని, అలీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
సన్‌రైజర్స్ మ్యాచ్‌లో వెంకటేశ్ సందడి.. జెండా పట్టుకుని హుషారు
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్‌కు క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం. గతంలో చాలాసార్లు టీమిండియా మ్యాచ్‌ల్లోనూ సందడి చేశారు. తాజాగా ఐపీఎల్ సీజన్లో మరోసారి స్టేడియంలో మెరిశారు. ఇవాళ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు ఆయన హాజరయ్యారు. ఎస్ఆర్హెచ్ జెండాను పట్టుకుని టీమ్‌కు మద్దతుగా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోను సన్‌రైజర్స్ హైదరాబాద్ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది.కాగా.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు మన హీరో విక్టరీ వెంకటేశ్. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. పొంగల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు.Anytime, Uppal center lo Single handedly support chese our Victory Venkatesh is here 💪🧡#PlayWithFire | #SRHvRR | #TATAIPL2025 pic.twitter.com/2v4qDKh4bI— SunRisers Hyderabad (@SunRisers) March 23, 2025 -
కోటి రూపాయలకు మళ్లీ అమ్మేస్తావా?.. శుభలగ్నం సీన్ గుర్తు చేసిన జగపతిబాబు
టాలీవుడ్ నటుడు జగపతి బాబు విలక్షణ పాత్రలతో వెండితెరపై అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. గతేడాది పుష్ప-2తో ప్రేక్షకులను మెప్పించిన జగపతిబాబు.. ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న కీ రోల్ ప్లే చేస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లోనే ఉంటారు. తాను ఎక్కడికెళ్లినా వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటారు. తాజాగా మరో ఆసక్తికర వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు.ఇందులో ఆమని, జగపతిబాబు మధ్య సరదా సంభాషణ జరిగింది. ఓ మూవీ షూటింగ్ సెట్లో వీరిద్దరు సరదాగా ఒకరినొకరు ఆట పట్టించారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అందులో పార్ట్-1.. కోటి రూపాయలకు నా భార్య నన్ను అమ్మేసే ముందు.. పార్ట్-2 మేకప్ వేస్తున్నావ్ ఏంటి? నన్ను మళ్లీ మార్కెట్లో పెడతావా ఏంటి? అని సరదాగా క్యాప్షన్ రాసుకొచ్చాడు. మొదటి వీడియోలో ఆమనికి జగపతిబాబు మేకప్ వేయగా.. రెండో పార్ట్‌లో ఆమనికి జగపతి బాబు మేకోవర్ చేశారు. ఇదంతా షూటింగ్ సెట్లో సరదా కోసమే చేశారు.అయితే గతంలో వీరిద్దరు జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం శుభలగ్నం. ఈ సినిమాలో తన భర్త అయిన జగపతిబాబును అమ్మకానికి పెడుతుంది. ఆ సీన్‌ను గుర్తుకు తెచ్చుకున్న జగపతి బాబు సరదాగా ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మళ్లీ ఇద్దరు కలిసి సరదాగా ఇలా చేయడంతో ఇది చూసిన అభిమానులు శుభలగ్నం సినిమాను గుర్తు చేశారంటూ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) -
గోదారిగట్టు, బుజ్జితల్లి.. ఇప్పుడు ప్రేమలో.. ఆ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది
కొన్ని సాంగ్స్ వింటే పదే పదే వినాలనిపిస్తుంది. అంతేకాదు డ్యాన్స్ కూడా చేయాలనిపిస్తుంది. అలాంటి పాటలు ఇటీవల తెలుగు సినిమాల్లో అభిమానులను అలరిస్తున్నాయి. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి గోదారి గట్టు సాంగ్, అలాగే తండేల్ సినిమా నుంచి బుజ్జితల్లి సాంగ్ సినీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఎక్కడ చూసిన ఈ పాటలకు ఆడియన్స్ కాలు కదిరాపు. దీంతో ఈ రెండు పాటలకు ఓ రేంజ్లో క్రేజ్ వచ్చింది కొంతమంది ఏకంగా ఈ పాటలకు రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అలా ఇదే జాబితాలో మరో హిట్ సాంగ్ వచ్చి చేరింది. అదేనండి ఇటీవల సోషల్ మీడియాను ఊపేస్తోన్న కోర్ట్ మూవీ సాంగ్. ఇంకేంటీ మీకోసమే తాజాగా ఫుల్ సాంగ్ కూడా వచ్చేసింది. మరెందుకు ఆలస్యం చూసి ఎంజాయ్ చేయండి.(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద ‘కోర్ట్’ సంచలనం.. నాలుగో రోజు ఊహించని కలెక్షన్స్!)ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం కోర్ట్(Court: State Vs Nobody). కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలా ఈ నెల 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. మొదటి రోజే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. పాజిటివ్ మౌత్‌టాక్‌తో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 28.9 కోట్లు రాబట్టింది. చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్ వల్ల బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. -
బాలకృష్ణ షో వల్లే బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా: బాధితుడి ఆవేదన
బెట్టింగ్ యాప్ కేసు టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇలాంటి యాప్‌లను కొందరు టాలీవుడ్ బుల్లితెర నటులతో పాటు పలువురు అగ్ర సినీతారల పేర్లు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట పోలీసులు ముందు యాంకర్ విష్ణుప్రియ, రీతూ చౌదరి హాజరైన తమ స్టేట్మెంట్ ఇచ్చారు. యాప్‌లను ప్రమోట్ చేసినట్లు విచారణలో అంగీకరించారు.అయితే ఈ బెట్టింగ్ యాప్‌ల వలలో చిక్కుకుని అప్పులపాలైన వారు చాలామందే ఉన్నారు. అలా ఈ బెట్టింగ్ భూతానికి బలైన ఓ సామాన్యుడు పంజాగుట్ట పీఎస్‌కు వచ్చారు. తనకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తిని మీడియా ప్రశ్నించింది. తాను ఈ యాప్‌ను ఉపయోగించడానికి కారణం ఆ టాలీవుడ్ షోనే కారణమని బాధితుడు చెప్పారు.టాలీవుడ్ హీరో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న షో వల్లే తాను బెట్టింగ్ యాప్‌ను ఉపయోగించానని నెల్లూరు చెందిన రాంబాబు వాపోయారు. బాలయ్య షోకు అతిథులుగా వచ్చిన గోపీచంద్, ప్రభాస్‌కు బాలకృష్ణ కొన్ని బహుమతులిస్తారు.. ఈ గేమ్ ఆడండి.. గిఫ్ట్‌లు గెలుచుకోండి అని చూపించారని అన్నారు. నేను మొదటి నుంచి ప్రభాస్ అన్నకు ఫ్యాన్ అని.. అందువల్లే తాను కూడా ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత ట్రాప్‌లో పడి దాదాపు రూ.80 లక్షలు కోల్పోయినట్లు సదరు వ్యక్తి వివరించాడు. ఆ యాప్ వాళ్లు మోసం చేయడం వల్లే తాను అప్పుల పాలైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల భారంతో ఎనిమిది నెలలుగా ఇంటికి దూరంగా ఉంటున్నట్లు బాధితుడు రాంబాబు చెప్పుకొచ్చారు. -
ఆది సాయికుమార్ లేటేస్ట్ థ్రిల్లర్ మూవీ.. ఎలా ఉందంటే?
టైటిల్: షణ్ముఖనటీనటులు: ఆది సాయికుమార్, అవికా గోర్, ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని, మాస్టర్ మను సప్పని, మనోజ్ ఆది, వీర శంకర్, కృష్ణుడు, అరియానా గ్లోరీ తదితరులుదర్శకత్వం: షణ్ముగం సప్పని నిర్మాతలు: తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మాణ సంస్థ: సాప్‌బ్రో ప్రొడక్షన్స్సంగీతం: రవి బస్రూర్విడుదల తేదీ: మార్చి 21, 2025టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ భిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. మరోసారి డిఫరెంట్ స్టోరీతో అభిమానుల ముందుకొచ్చారు. గతంలో ప్రేమకథా చిత్రాలు ఎక్కువగా చేసిన ఆది సాయికుమార్.. టాప్ గేర్ తర్వాత గేర్ మార్చాడు. వరసగా క్రైమ్, యాక్షన్ జోనర్‌తో అభిమానులను మెప్పిస్తున్నారు. సీఎస్ఐ సనాతన్ క్రైమ్ థ్రిల్లర్ తర్వాత ఆది హీరోగా నటించిన మరో యాక్షన్ అండ్ డివోషనల్ థ్రిల్లర్ 'షణ్ముఖ'. ఈ మూవీలో ఆది సరసన ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ అవికా గోర్ గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.షణ్ముఖ కథేంటంటే..చిరాగ్ జానీ(విగాండ) దంపతులకు ఓ విచిత్రమైన రూపంలో కుమారుడు జన్మిస్తాడు. అతన్ని అలా చూసిన తండ్రి కొడుకు రూపాన్ని మార్చాలనే ఉద్దేశంతో కాశీకి వెళ్లి క్షుద్ర పూజలు నేర్చుకుంటాడు. ఆ తర్వాత తిరిగొచ్చిన అతను తన కుమారుడి సాధారణ రూపం కోసం బామ్మర్ది సాయంతో తాంత్రిక పూజలు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలోనే ఎస్సైగా పనిచేస్తున్న కార్తీ వల్లభన్(ఆది సాయికుమార్) ఓ డ్రగ్ మాఫియాను పట్టుకునే క్రమంలో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతాడు. వారం రోజుల్లోనే తన తప్పును సరిదిద్దుకోవాలని కార్తీని కమిషనర్ ఆదేశిస్తాడు. ఆ తర్వాత బెంగళూరులో జర్నలిజం చేస్తున్న సారా మహేశ్(అవికా గోర్) తన ఇన్వెస్టిగేషన్ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్‌కు వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఎస్సై కార్తీ వల్లభన్ సాయం కోరుతుంది. ఆ సమయంలోనే సారా తన రీసెర్చ్ ప్రాజెక్ట్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని కార్తీకి చెబుతుంది. అసలు ఆమె చేస్తున్న రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏంటి? ఆరేళ్లుగా చేస్తున్న ఆ పరిశోధనలో కనిపెట్టిన అమ్మాయిల మిస్సింగ్, అబ్బాయిల సూసైడ్లకు ఏంటి సంబంధం? దీని వెనక ఏదైనా హ్యుమన్ ట్రాఫికింగ్ మాఫియా ఉందా? అసలు సారాను చంపాలనుకున్నది ఎవరు? చివరికీ ఈ ఇన్‌స్టిగేషన్ ప్రాజెక్ట్‌లో కార్తీ, సారా సక్సెస్ అయ్యారా? లేదా? అన్నదే అసలు స్టోరీ.ఎలా ఉందంటే.. మనదేశంలో మూఢ నమ్మకాలు, క్షుద్రపూజలను నమ్మేవారు ఇప్పటికీ ఉన్నారడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తమ స్వార్థం కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారనే పాయింట్‌ను కథగా ప్రేక్షకుల ముందుకొచ్చారు డైరెక్టర్ షణ్ముగం. గతంలోనూ ఇలాంటి జోనర్లో ఎన్నో సినిమాలు వచ్చినా ఈ స్టోరీని కాస్తా భిన్నంగా చూపించారు. కథను అడవుల్లో మొదలుపెట్టిన షణ్ముగం.. చివరికీ అడవుల్లోనే ముగించాడు. ఫస్ట్ హాఫ్ అంతా రోటీన్‌గా అనిపిస్తుంది. అద్భుతమైన ఫైట్ సీన్‌తో ఆది సాయి కుమార్‌ను ప్రేక్షకులను పరిచయం చేస్తాడు. ఆ తర్వాత జరిగే సీన్స్ ప్రేక్షకులకు ఊహకందేలా ఉంటాయి. ఆది సాయికుమార్, అవికా గోర్ లవ్ స్టోరీ కూడా అంతగా ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేదు. మొదటి భాగం అంతా ఇన్‌స్టిగేషన్ చుట్టే తిరుగుతుంది. కథలో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ కాలేదు. అక్కడక్కడ కృష్ణుడు(సుబ్రమణ్యం)తో వచ్చే కామెడీ సీన్స్ కాస్తా నవ్వించినా అంతగా మెప్పించలేదు. కార్తీ, సారాల ఇన్‌స్టిగేషన్ ప్రాజెక్ట్ ట్విస్ట్‌లతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.సెకండాఫ్‌కు వచ్చేసరికి కథ మొత్తం సారా, కార్తీ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేషన్ చుట్టే తిరుగుతుంది. అమ్మాయిల మిస్సింగ్, అబ్బాయిల సూసైడ్ ట్విస్ట్‌లతో ఆడియన్స్‌లో కాస్తా కన్ఫ్జూజన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. కొన్ని చోట్ల సీరియస్‌గా కథ సాగుతున్న సమయంలో కామెడీని తీసుకొచ్చి ప్రేక్షకుల్లో కనెక్షన్ మిస్సయ్యేలా చేశాడు. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ మంచిదే.. కానీ తెరపై ఆవిష్కరించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. లాజిక్ పరంగా ఆలోచిస్తే కొన్ని చోట్ల సన్నివేశాల్లోనూ అది పూర్తిగా మిస్సయినట్లు కనిపించింది. కొన్ని సీన్స్ ఆడియన్స్ ఊహకందేలా ఉండడంతో కథనంలో క్యూరియాసిటీ మిస్సయింది. కథను మరింత ఆసక్తిగా మలచడంలో డైరెక్టర్ సక్సెస్ కాలేకపోయాడు. క్లైమాక్స్ సీన్లో వచ్చే ట్విస్ట్‌లతో ప్రేక్షకులను కాసేపు కట్టిపడేశాడు. కానీ కొన్ని లాజిక్ లెస్ సీన్స్‌తో కథలో సీరియస్‌నెస్ అలాగే కొనసాగించలేకపోయాడు. ఓవరాల్‌గా దర్శకుడు తాను చెప్పాలనుకున్నా సందేశం మంచిదే అయినప్పటికీ.. కథనం, స్క్రీన్‌ప్లేపై మరింత ఫోకస్ చేసుంటే ఇంకా బాగుండేది. ఎవరలా చేశారంటే..ఆది సాయికుమార్ ఎస్సై పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. పోలీస్‌గా తన అగ్రెసివ్నెస్ చూపించాడు. చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్ తెరపై కొత్తగా కనిపించింది. అయినప్పటికీ తన నటనతో మెప్పించింది. ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని కృష్ణుడు, అరియానా గ్లోరీ తమ పాత్రల పరిధిలో ఫర్వాలేదనిపించారు. సాంకేతికత విషయానికొస్తే ఆర్ఆర్ విష్ణు సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎంఏ మాలిక్ ఎడిటింగ్‌లో తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. ఈ సినిమాకు రవి బస్రూర్ అందించిన నేపథ్యం సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.-మధుసూధన్, సాక్షి వెబ్ డెస్క్ -
ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: మెగాస్టార్ ఆగ్రహం
యూకే పర్యటనపై మెగాస్టార్ చిరంజీవి మరో ట్వీట్ చేశారు. తన పట్ల మీరు చూపించిన ప్రేమ, అభిమానం వెలకట్టలేనిదని పోస్ట్ చేశారు. అయితే ఇదే క్రమంలో కొందరు డబ్బులు వసూలు చేశారని నాకు సమాచారం వచ్చిందన్నారు. అభిమానుల సమావేశాల పేరుతో ఇలా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మెగాస్టార్ ట్విటర్లో రాసుకొచ్చారు. ఇలాంటి చర్యలకు తాను పూర్తిగా వ్యతిరేకమని చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు సందేశమిచ్చారు. లండన్‌లో తనని కలిసేందుకు ఫ్యాన్స్ మీట్ పేరుతో డబ్బులు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.చిరు తన ట్వీట్లో రాస్తూ..'నా ప్రియమైన అభిమానులారా.. యూకేలో నన్ను కలవాలనుకునే మీ అందరి ప్రేమ, ఆప్యాయత నా మనస్సును తాకింది. అయితే కొంతమంది వ్యక్తులు అభిమానుల సమావేశాల కోసం డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని నాకు సమాచారం అందింది. ఇలాంటి వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎవరైనా డబ్బులు వసూలు వస్తే వెంటనే వారికి తిరిగి ఇవ్వండి. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను ఎక్కడా కూడా ఇలాంటి చర్యలను అనుమతించను. మీ ప్రేమ, ఆప్యాయత, బంధం వెలకట్టలేనిది. దీన్ని ఎవ్వరూ ఏ విధంగానూ వ్యాపారంగా మార్చలేరు. ఇలాంటి దోపిడీకి దూరంగా ఉందాం' అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో మెగాస్టార్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.(ఇది చదవండి: నా హృదయం సంతోషంతో నిండిపోయింది: మెగాస్టార్ చిరంజీవి)కాగా.. చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్- యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. My Dear Fans , I am deeply touched by all your love and affection in wanting to meet me in UK. However, I’ve been informed that some individuals are attempting to charge a fee for the fan meetings. I strongly condemned this behaviour. Any fee collected by any one will be refunded…— Chiranjeevi Konidela (@KChiruTweets) March 20, 2025 -
రానాపై బెట్టింగ్ యాప్ కేసు.. స్పందించిన టీమ్
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటిపై వస్తున్న ప్రచారంపై ఆయన టీమ్ స్పందించింది. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో రానాపై కూడా కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రానా పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. స్కిల్ ఆధారిత గేమ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా రానా దగ్గుబాటి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపింది. అయితే ఈ అగ్రిమెంట్ 2017లోనే ముగిసిందని వెల్లడించింది. కేవలం చట్టబద్ధమైన కంపెనీలకే రానా ప్రమోట్ చేశారని పీఆర్ రిలీజ్ చేసిన ప్రకటనలో పేర్కొందిఏదైనా ఒప్పందాలు చేసుకునే ముందు రానా దగ్గుబాటి న్యాయ బృందం అన్నింటినీ క్షుణ్ణంగా సమీక్షిస్తుందని వివరించారు. చట్టపరంగా అనుగుణంగా ఉంటేనే రానా అంగీకరిస్తారని తెలిపారు. రానా దగ్గుబాటి ప్రమోట్ చేసిన యాప్ చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉందని చెప్పడానికే ఈ ప్రెస్ నోట్ జారీ చేశామని వెల్లడించారు. జూదానికి వ్యతిరేకంగా భారత సుప్రీంకోర్టు గుర్తించిన ఈ ఆన్లైన్ గేమ్‌లను హైలైట్ చేయడం చాలా అవసరమని.. ఇలాంటి గేమ్‌లు నైపుణ్యం మీద ఆధారపడి ఉన్నాయని.. అందువల్ల చట్టబద్ధంగా వీటిని అనుమతించారని గతంలో కోర్టు తీర్పు ఇచ్చిందని నోట్లో ప్రస్తావించారు.బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారంటూ ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్, యూట్యూబర్స్‌తో పాటు పలువురు బుల్లితెర నటీనటులపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. విష్ణు ప్రియతో పాటు రీతూ చౌదరి పంజాగుట్ట పీఎస్‌లో పోలీసులకు వివరణ ఇచ్చారు. -
రాబిన్‌హుడ్ మూవీ ఈవెంట్.. ముఖ్య అతిథిగా సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. భీష్మ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండగా.. మూవీ టీమ్ ప్రమోషన్ల జోరుతో దూసుకెళ్తోంది. కాలేజీల్లో వరుస ఈవెంట్లతో నితిన్ టీమ్ సందడి చేస్తోంది.అయితే ఈ మూవీలో పుష్ప మేనరిజంతో అభిమానులను ఆకట్టుకున్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ పాత్రలో కనిపించనున్నారు. ఓ సినిమా ఈవెంట్లో ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ద్వారా డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టీమ్‌కు కెప్టెన్‌గా పనిచేశారు. దీంతో వార్నర్‌కు టాలీవుడ్ ఫ్యాన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడేమో ఏకంగా సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.టతాజాగా రాబిన్‌హుడ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేవిడ్ వార్నర్ హాజరు కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఈవెంట్‌కు అనుమతుల కోసం చిత్రబృందం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకునే పనిలో రాబిన్‌హుడ్ టీమ్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఏదేమైనా తెలుగు సినిమా ఈవెంట్‌కు డేవిడ్ వార్నర్ హాజరైతే మాత్రం ఓ రేంజ్లో ఉంటుందని టాలీవుడ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రాబిన్ హుడ్ మూవీ మార్చి 28న థియేటర్లలో సందడి చేయనుంది. -
నా హృదయం సంతోషంతో నిండిపోయింది: మెగాస్టార్ చిరంజీవి
యూకే పార్లమెంట్లో తనకు జరిగిన సన్మానంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. చాలా మంది గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, సెక్రటరీలు, దౌత్యవేత్తలు సమక్షంలో అందుకున్న గౌరవంతో నా మనసు నిండిపోయిందని పోస్ట్ చేశారు. టీమ్ బ్రిడ్జ్ ఇండియా ద్వారా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించడంతో మనస్ఫూర్తిగా సంతోషాన్ని ఇచ్చిందని రాసుకొచ్చారు.మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ..' నాకు దక్కిన ఈ గౌరవం గురించి చెప్పాలంటే మాటలు చాలవు. కానీ నా అద్భుతమైన ప్రేమగల అభిమానులకు, నా సోదర, సోదరిమణులకు, నా కుటుంబం, శ్రేయోభిలాషులు, స్నేహితులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా ప్రయాణానికి నాకు అన్ని విధాలుగా సహకరించి.. నా మానవతా కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ గౌరవం నన్ను మరింత కష్టపడేందుకు ప్రేరేపిస్తుంది. నాకు మరింత శక్తిని అందిస్తోంది' అంటూ పోస్ట్ చేశారు.ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. Heart filled with gratitude for the honour at the House of Commons - UK Parliament by so many Esteemed Members of Parliament , Ministers & Under Secretaries, Diplomats. Humbled by their kind words. Heartened by the Life Time Achievement Award by Team Bridge India. Words are not… pic.twitter.com/XxHDjuFIgM— Chiranjeevi Konidela (@KChiruTweets) March 20, 2025 -
మంచు లక్ష్మి నిర్మాతగా సైకలాజికల్ థ్రిల్లర్.. మోహన్ బాబు లుక్ రివీల్
టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈరోజు ఆయన పుట్టిన రోజు కావడంతో మరో మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు. దక్ష అనే మెడికల్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో మోహన్ బాబు నటిస్తున్నారు. ఈ సినిమాకు వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు.ఈ సినిమాను మంచు ఎంటర్ టైన్మెంట్, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీ ప్రసన్న, మార్కో స్టార్ సిద్ధిక్, సముద్రఖని, విశ్వంత్, చిత్రా శుక్లా, మహేష్, వీరేన్ తంబిదొరై ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ వేసవి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.Happy Birthday Dear Legend! Back with another banger, #Daksha The Deadly Conspiracy. Proud to be a producer alongside you. 🧿❤️ pic.twitter.com/AV09pC3wLs— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 19, 2025 -
రాబిన్హుడ్తో మల్లారెడ్డి.. అదిదా సర్ప్రైజ్ అంటోన్న మల్లన్న!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్. ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కించారు. భీష్మ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా నటించారు. ఈ మూవీ ద్వారా వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.ప్రస్తుతం రాబిన్‌హుడ్ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి మెడికల్ సైన్సెస్ కాలేజీలో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మల్లా రెడ్డి కూడా హాజరయ్యారు. ఇంకేముంది మల్లన్న తన టాలెంట్‌ను మరోసారి ప్రదర్శించారు. వేదికపై నితిన్‌తో కలిసి స్టెప్పులు వేశారు. రాబిన్‌హుడ్ మూవీలోని అదిదా సర్ప్రైజ్ అంటూ సాగే ఐటమ్ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ మల్లన్నా మజాకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రాబిన్‌హుడ్ చిత్రం ఉగాది కానుకగా ఈనెల 28న థియేటర్లలో సందడి చేయనుంది.Moment of the day 💥💥💥#MallaReddy Garu and @actor_nithiin dance to the trending #AdhiDhaSurprisu songduring team #Robinhood's visit to Malla Reddy Institute of Medical Sciences ❤🔥❤🔥GRAND RELEASE WORLDWIDE ON MARCH 28th.@actor_nithiin @sreeleela14 @VenkyKudumula… pic.twitter.com/oqq8l3HZh2— Mythri Movie Makers (@MythriOfficial) March 19, 2025 -
మంచు విష్ణు కన్నప్ప మూవీ.. మహదేవ శాస్త్రి గ్లింప్స్ చూశారా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీని ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పలువురు అగ్రతారల ఫస్ట్ లుక్ పోస్టర్లను ఆడియన్స్‌కు పరిచయం చేశారు. ఈ మూవీలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.(ఇది చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)అయితే ఈ చిత్రంలో మోహన్ బాబు మహదేవ శాస్త్రి పాత్రలో అభిమానులను అలరించనున్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు కావడంతో ప్రత్యేక గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. మహదేవ శాస్త్రి పాత్రను పరిచయం చేసే సాంగ్‌ను గ్లింప్స్ రూపంలో రిలీజ్ చేశారు. ఈ పాటను ఓకేసారి ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆడియన్స్‌కు పరిచయం చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
'నా సూర్యుడివి.. నా చంద్రుడివి నువ్వే'.. తండ్రికి మంచు మనోజ్ బర్త్ డే విషెస్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబు ఫోటోను షేర్ చేస్తూ పుట్టినరోజు విషెస్ చెప్పారు. తన తండ్రితో సినిమాల్లో నటించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వీడియోను కూడా పంచుకున్నారు. ఈ వీడియోను 'నా సూర్యుడివి.. చంద్రుడివి.. నా దేవుడివి నువ్వే' అంటూ యానిమల్ సాంగ్‌తో తండ్రి తన ప్రేమను చాటుకున్నారు.మంచు మనోజ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'హ్యాపీ బర్త్ డే నాన్న.. ఈ రోజు నీ పక్కన ఉండి సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని మిస్సవుతున్నా.. నీ వెంట నడిచేందుకు ఎంతో ఆసక్తిగా వేచి ఉన్నా. నీతో ఉన్న ప్రతి క్షణాలను ప్రేమిస్తా నాన్న' అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ చూసిన మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి లైక్ కొట్టింది. ఇది చూసిన అభిమానులు తండ్రిపై తన ప్రేమను మరోసారి చాటుకున్నారని ప్రశంసిస్తున్నారు. మీరిద్దరు త్వరలోనే కలిసిపోవాలని కోరుకుంటున్నట్లు మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.మంచు ఫ్యామిలీలో గొడవలు..గత కొద్ది నెలలుగా మంచు వారి ఫ్యామిలీలో గొడవలు జరుతుగున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు జల్పల్లిలోని నివాసం వద్ద మొదలైన ఈ వివాదం.. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు కూడా చేరింది. మంచు విష్ణు- మనోజ్‌కు మధ్య మొదలైన గొడవే ఈ వివాదానికి కారణమని తెలుస్తోంది. ఈ గొడవల నేపథ్యంలో ఒకరిపై ఒకరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం వీరంతా తమ పనులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మోహన్ బాబు కన్నప్ప మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
చైతూతో ప్రేమకథ అలా మొదలైంది.. రివీల్ చేసిన శోభిత ధూళిపాల
టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాలను పెళ్లాడారు. గతేడాది డిసెంబర్ వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీతారలు హాజరయ్యారు.అయితే ఈ జంట పెళ్లి తర్వాత తొలిసారి ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ప్రముఖ మ్యాగజైన్ వోగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తమ ప్రేమకథ తొలిసారి ఎక్కడ మొదలైందనే విషయాన్ని రివీల్ చేశారు. సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు శోభిత స్పందించారు. మిమ్మల్ని చైతూ ఫాలో అవుతున్నాడు.. కానీ మీరెందుకు ఫాలో కావడం లేదని ఓ నెటిజన్ తనను అడిగాడని వెల్లడించింది. ఆ తర్వాత నేను చైతూ ప్రొఫైల్‌కి వెళ్లి చూస్తే నాతో పాటు కేవలం 70 మందిని మాత్రమే అతను ఫాలో అవుతున్నాడని తెలుసుకున్నా.. ఆ తర్వాత చైతన్యను ఫాలో అయ్యానని తెలిపింది.అప్పటి నుంచి మేమిద్దరం చాటింగ్ ప్రారంభించినట్లు శోభిత తెలిపింది. ఏప్రిల్ 2022లో చైతన్య- నేను తొలిసారి కలుసుకున్నట్లు శోభిత వివరించింది. ముంబయికి టికెట్ బుక్ చేసుకుని వచ్చిన చైతూతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశా.. అప్పటి నుంచి మా డేటింగ్ మొదలైందని చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా చాలా నేచురల్‌గా జరిగిందని వెల్లడించింది. ఆ తర్వాత ఒకరి కుటుంబాలను ఒకరు కలుసుకున్నట్లు పేర్కొంది. అలా తమ ప్రేమ మొదలైందని తాజా ఇంటర్వ్యూలో శోభిత తమ లవ్ స్టోరీని రివీల్ చేసింది. View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) -
కల్కి-2లో ఆ రెండు పాత్రలపైనే ఎక్కువగా ఉంటుంది: నాగ్ అశ్విన్
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. గతేడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు. అశ్వత్తామ పాత్రలో అభిమానులను మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి-2 అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగాఎవడే సుబ్రమణ్యం రీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కల్కి-2 ఎప్పుడొస్తుందనే విషయంపై నాగ్ అశ్విన్ స్పందించారు.నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది. అది పూర్తయ్యాక షూటింగ్ మొదలు పెడతాం. సెకండ్ పార్ట్‌లో భైరవ, కర్ణకు సంబంధించిన పార్ట్ ఎక్కువగా ఉంటుంది. అంతా సజావుగా సాగితే ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లే ప్రయత్నం చేస్తాం. కల్కిలో మహాభారతం నేపథ్యం, సుమతి, అశ్వత్థామ పాత్రలను డిజైన్ చేసుకుని ఇక్కడి వరకూ వచ్చాం. ప్రభాస్‌ను పార్ట్-2లో ఎక్కువగానే చూపిస్తాం. ఇంకా చాలా వర్క్ ఉంది. విడుదల తేదీ గురించి ఇంకా ఏం డిసైడ్ చేయలేదు.' అని అన్నారు.కాగా.. ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్తో బిజీగా ఉన్నారు. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబల్ స్టార్ నటించనున్నారు. ఈ మూవీకి స్పిరిట్ అనే టైటిల్ ఖరారు చేశారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ తర్వాతే కల్కి-2లో ప్రభాస్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రశాంత్ నీల్‌తో సలార్ 2- శౌర్యంగ పర్వం, ప్రశాంత్ వర్మతో ఓ మూవీ చేయనున్నారు. -
ఇలాంటి సినిమా చాలా అరుదుగా వస్తుంది: డైరెక్టర్ నాగ్ అశ్విన్
నాని, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ఎవడే సుబ్రమణ్యం. ఈ మూవీకి కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కించారు. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ద్వారానే నాగ్ అశ్విన్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ విడుదలైన పదేళ్లు పూర్తి కావడంతో మరోసారి బిగ్ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు.ఇలాంటి అరుదైన సినిమాలు తరచుగా రావని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. మీలో ఎవరైనా ఈ సినిమాను చూడకపోతే తప్పుకుండా థియేటర్లకు వెళ్లి చూడాలని అభిమానులను కోరారు. నేటి యువతరం తప్పకుండా చూడాల్సిన చిత్రాల్లో ఎవడే సుబ్రమణ్యం ఒకటని ఆయన తెలిపారు. ఈ జనరేషన్‌కు మూవీ కథ సరిగ్గా సెట్ అవుతుందన్నారు. గత పదేళ్లలో చాలా చిత్రాలు వచ్చాయి.. కానీ ఆ టైమ్‌లో చూడని వాళ్లు ఎవరైనా ఉంటే చూడాలని కోరారు. ఈ సినిమా చూసి కనీసం ఒకశాతం మార్పు వచ్చినా చాలని నాగ్ అశ్విన్ వీడియోను రిలీజ్ చేశారు.కాగా.. ఎవడే సుబ్రమణ్యం మూవీ ఈనెల 21న థియేటర్లలో రీ రిలీజ్ అవుతోంది. ఇంకేందుకు ఆలస్యం ఎవరైనా మిస్సయితే ఎంచక్కా బిగ్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by nagi (@nag_ashwin) View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) -
టాలీవుడ్ ప్రిన్స్ గొప్ప మనసు.. మరో రెెండు మహోన్నత సేవలకు శ్రీకారం
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో నటిస్తున్నారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని అమెజాన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచరస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే.అయితే మహేశ్ బాబు సినిమాలతో పాటు సమాజసేవలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. మహేశ్ బాబు ఫౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలను ఉచితంగా అందజేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని వేలమంది పేదల చిన్నారులకు వైద్య సాయానికి అండగా నిలుస్తున్నారు.తాజాగా మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా మరో సేవకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోనే మొట్టమొదటి సారిగా విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్‌లో మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ హాజరై మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించారు. అంతేకాకుండా బాలికల కోసం ఉచిత గర్భాశయ క్యాన్సర్ టీకా డ్రైవ్‌ను కూడా ఏర్పాటు చేశారు. 2025 నాటికి దాదాపు 1,500 మంది బాలికలకు ఉచితంగా టీకాలు వేయడం లక్ష్యమని ఈ సందర్భంగా నమ్రతా శిరోద్కర్ వెల్లడించారు. మదర్స్ మిల్క్ బ్యాంక్ ద్వారా తల్లి పాలు సరిపోని నవజాత శిశువులకు ప్రతి ఏడాదికి దాదాపు 7,200 మందికి ప్రయోజనం చేకూరుతుందని వైద్యులు తెలిపారు. #Namratashirodkar garu inaugurated the Mothers Milk Bank at Andhra Hospitals, Vijayawada to help newborns with maternal milk which benefits 7,200 babies every year associating with @andhrahospital1 Alongside, @MBfoundationorg also initiating a cervical cancer vaccination drive… pic.twitter.com/vaBvDunrPT— Mahesh Babu Space (@SSMBSpace) March 17, 2025 -
ఆమెను చూస్తే మా అమ్మనే గుర్తుకొస్తుంది: హీరో నాని ఎమోషనల్
టాలీవుడ్ హీరో నాని నిర్మాతగా తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నిర్మించిన తాజా చిత్రం 'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలి రోజే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమా టీం సెలబ్రేషన్ అఫ్ ఆడియన్స్ వర్డిక్ట్ పేరిట గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెను మా అమ్మనే గుర్తుకు వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.హీరో నాని మాట్లాడుతూ..'నా మోస్ట్ ఫేవరేట్ పర్సన్ ఇన్ సినిమా ఆమెనే. రోహిణి మేడంను చూడగానే మా అమ్మనే గుర్తుకొస్తుంది. అమ్మను చూడగానే రోహిణి మేడం గుర్తొస్తుంది. ప్రతి సినిమా సెట్లో ఆమెను చూడగానే మా పని సులువుగా అయిపోతుందని అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి నేను మణిరత్నం గారికి గ్రేటేస్ట్ ఫ్యాన్‌ను. ఆయన చాలా సినిమాల్లో హీరోయిన్లకు రోహిణి మేడం డబ్బింగ్ చెప్పింది. అందుకే మాకు మొదటి నుంచి ఎక్కడో కనెక్షన్ ఉందినిపిస్తుంది. చాలా ఈవెంట్స్‌లో మేం ఇద్దరం చాలా మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈ రోజుకి ఇక్కడితో ఆపేస్తాను' అంటూ నటి రోహిణిపై ప్రశంసలు కురిపించారు.కాగా.. తొలిరోజే కోర్ట్–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటిరోజు ఏకంగా రూ. 8.10 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం అతని కెరీర్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటిరోజు బ్రేక్ఈవెన్కు దగ్గరలో కోర్టు కలెక్షన్లు రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. రెండు రోజుల్లోనే రూ.15.90 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. మూడు రోజుల్లోనే రూ. 20 కోట్ల మార్క్‌ను దాటేస్తుందని టాలీవుడ్ అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ కీలక పాత్రల్లో మెప్పించారు. -
చైతూ టాటూ తొలగించిన సమంత.. నెటిజన్ల రియాక్షన్ చూశారా?
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన సమంత ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లో చేయడం లేదు. తెలుగులో చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషీ చిత్రంలో మాత్రమే కనిపించింది. ఇటీవల సినిమాల కంటే ఎక్కువగా డేటింగ్ వార్తలతో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సామ్ రిలేషన్లో ఉన్నట్లు చాలా సార్లు రూమర్స్ వినిపించాయి. వీరిద్దరు కలిసి తరచుగా ఈవెంట్లకు హాజరు కావడంతో ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి.ఇవన్నీ పక్కనపెడితే తాజాగా సోషల్ మీడియాలో సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాను నిర్మిస్తోన్న కొత్త మూవీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అందులో తన టీమ్‌తో ఉన్న ఫోటోలకు వరుసగా క్యాప్షన్ ఇస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే సామ్ షేర్ చేసిన తొలి ఫోటోపైనే అందరి కళ్లు పడ్డాయి. ఎందుకంటే ఆ ఫోటోలో సామ్ చేతికి టాటూ కనిపించడమే కారణం. టాలీవుడ్ హీరో నాగ చైతన్య ప్రేమలో ఉన్నప్పుడు ఆ టాటూ వేయించుకుంది. ప్రస్తుతం ఆ టాటూను తొలగించుకున్నప్పటికీ.. కొద్ది కొద్దిగా కనిపించడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి నాగచైతన్యకు గుర్తుగా వేయించుకున్న టాటూను తొలగించుకున్నారంటూ కొందరు కామెంట్స్ చేశారు. సమంత ఎట్టకేలకు చైతూ టాటూను తొలగించినట్లు కనిపిస్తోందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇప్పటి నుంచి మీ స్వంత రియాలిటీని సృష్టించండి అంటూ రాసుకొచ్చారు. టాటూను తొలగించుకున్నందుకు మంచిది.. ఇకపై మీ భాగస్వామి పేరును ఎప్పుడూ టాటూలుగా వేయించుకోకండి అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు. అయితే ఈ ఫోటోలతో పాటు ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న పిక్‌ను కూడా సమంత పోస్ట్ చేసింది.కాగా.. చైతూ సినిమాలో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సమంత.. చాలా కాలం పాటు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన నాలుగేళ్లకే వీరిద్దరూ విడిపోవడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఆ ఆ తర్వాత నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్లను గతేడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
పారితోషికం 10 కోట్లు.. బడ్జెట్ 25 కోట్లు.. యంగ్ హీరో కండిషన్!
సినిమా బడ్జెట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. చిన్న సినిమా అయినా సరే ఐదారు కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. ఇక కొంచెం పేరున్న నటీనటులతో సినిమా చేయాలంటే పది కొట్లకు పైనే అవుతుంది. ఒక్క హిట్ పడితే చాలు.. ఆ హీరోలో సినిమా చేయాలంటే తక్కువలో తక్కువ 20 కోట్లు ఉండాల్సిందేనట. టాలీవుడ్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. చాలా మంది హీరోలు కథలు వినడం కంటే ముందే.. తన రెమ్యునరేషన్, సినిమా బడ్జెట్ ఎంతో చెప్పమని అడుగుతున్నారట. తక్కువ బడ్జెట్ సినిమాలు చేయమని ముఖంపైనే చెప్పేస్తున్నారు. టాలీవుడ్‌కి చెందిన ఓ యంగ్ హీరో అయితే తనతో సినిమా చేయాలంటే పాతిక కోట్లకు పైగా బడ్జెట్ పెట్టాల్సిందేనని కండీషన్ పెట్టాడట.తాజాగా ఓ యంగ్ డైరెక్టర్, నిర్మాత మంచి కాన్సెప్ట్‌తో సదరు హీరోని సంప్రదించారట. కథ మొత్తం విన్నాక.. బడ్జెట్ ఎంత అని అడిగాడట. 10-15 కోట్లతో తీయ్యొచ్చని చెబితే..మినిమం 25 కోట్ల బడ్జెట్ పెడితేనే సినిమా చేస్తానని చెప్పాడట. తన రెమ్యునరేషన్‌గా రూ.10 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేశారట. అయితే ఆ హీరోకి ఇటీవల ఒక్క హిట్ కూడా లేకపోవడం గమనార్హం. పైగా ఆయన నటించిన ఓ హిందీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. అయినా కూడా తన రెమ్యునరేషన్‌ని ఏమాత్రం తగ్గించలేదట. ఆ హీరో మార్కెట్ వ్యాల్యూ కూడా అంతగా లేదు. దీంతో సదరు నిర్మాత అంత బడ్జెట్ పెట్టలేనని చెప్పి బయటకు వచ్చాడట. వరుసగా ఫ్లాపులు వచ్చాయి కదా..తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటాడని ఆ హీరోని సంప్రదిస్తే.. ఆయన పెట్టిన కండీషన్ చూసి సదరు నిర్మాత షాకయ్యారట. ఇలా చాలా మంది యంగ్ హీరోలు ఒక్క హిట్ పడగానే రెమ్యునరేషన్ పెంచడంతో పాటు భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికే మొగ్గు చూపుతున్నారని చిన్న నిర్మాతలు వాపోతున్నారు. -
1000 వాలా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: 1000 వాలానటీనటులు: అమిత్, సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్ తదితరులుదర్శకుడు: అఫ్జల్ నిర్మాత: షారూఖ్నిర్మాణ సంస్థ: సూపర్ హిట్ మూవీ మేకర్స్ విడుదల తేదీ: మార్చి 14, 2025యువ నటుడు అమిత్ హీరోగా నటించిన తాజా చిత్రం '1000 వాలా'. ప్రముఖ సీనియర్ నటులు సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. అఫ్జల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ ఈ చిత్రం ఈ మార్చ్ 14 న థియేటర్లలోకి వచ్చింది. సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే..చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన అర్జున్(అమిత్ డ్రీం స్టార్) తన తాతయ్య వద్ద పెరుగుతూ ఉంటాడు. నటుడు కావాలనేది అతని కల. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కోరిక తీరదు. అయితే తన స్నేహితుడు బుజ్జి తండ్రి(పిల్ల ప్రసాద్) తన స్నేహితుడు హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చాడని తెలుసుకుని అర్జున్ను అక్కడికి రమ్మంటాడు. ఎలాగైనా అతన్ని మంచి నటుడిని చేయమని బుజ్జి తండ్రి అతని స్నేహితుడికి చెబుతాడు. అయితే అతను అర్జున్ను చూడగానే షాక్ అవుతాడు. వెంటనే అతన్ని సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని హైదరాబాద్‌కు తీసుకెళ్తాడు. అక్కడ భవాని ప్రసాద్(ముక్తార్ ఖాన్)ను కలుస్తాడు. ఆ తర్వాత అతని స్నేహితుడు(సుమన్) అర్జున్‌తో సినిమా నిర్మిస్తానని చెబుతాడు. ఈ క్రమంలోనే అర్జున్.. తన హీరోయిన్ శైలుతో ప్రేమలో పడతాడు. ఆమె అర్జున్‌కి లవ్ ప్రపోజ్ చేయాలనుకున్న టైంలో ... అతనికి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. చనిపోయిన అమిత్ ప్లేస్‌లో తనని తీసుకొచ్చి సినిమా కంప్లీట్ చేస్తున్నారని అర్జున్‌కు అర్థమవుతుంది. మరోపక్క డేవిడ్(షారుఖ్ భైగ్) కావ్య అనే అమ్మాయిని చంపడానికి మనుషుల్ని పంపుతాడు. ఈ క్రమంలో అర్జున్ ఆమెను కాపాడతాడు. అయితే అమిత్‌ను తానే చంపేశానని అర్జున్‌కి చెప్పి ఇంకో షాక్ ఇస్తుంది కావ్య. అయితే అమిత్‌ను ఆమె ఎందుకు చంపింది. అసలు వీరి మధ్య ఏం జరిగింది? తర్వాత అర్జున్ జీవితం ఎలా మారింది అనేదే మిగిలిన కథ.ఎలా ఉందంటే..కమర్షియల్ కథలకి ఫ్యామిలీ సెంటిమెంట్ కలిస్తే ఎక్కువగా సక్సెస్ అవుతాయి. ఈ విషయాన్ని '1000 వాలా తో మరోసారి ప్రూవ్ చేశాడు దర్శకుడు అఫ్జల్. అతనిలో ఉన్న మాస్ ఈ సినిమాతో బయటపెట్టారు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే తాత మనవళ్ల సెంటిమెంట్, ఇంటర్వెల్ ఫైట్ మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. ఇక సెకండాఫ్ వచ్చేసరికి ఫ్యామిలీ ఎమోషన్స్, మదర్ సెంటిమెంట్ బాగా ఆకట్టుకుంది. సినిమాలో వచ్చే లాస్ట్ పాట మాస్ ఆడియన్స్‌లో ఊపేసింది. ఓవరాల్‌గా మాస్ ఆడియన్స్‌కు 1000 వాలా ఫీలింగ్ తీసుకొచ్చాడు డైరెక్టర్.ఎవరెలా చేశారంటే...అమిత్ డ్రీమ్ స్టార్ అటు అర్జున్‌గా.. ఇటు అమిత్‌గా రెండు షేడ్స్ కలిగిన పాత్రల్లో ఒదిగిపోయాడు. షారుఖ్ భైగ్ రూపంలో ఓ స్టైలిష్ విలన్‌గా మెప్పించారు.సీనియర్లు సుమన్, ముక్తార్ ఖాన్, పిల్లా ప్రసాద్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేర మెప్పించారు. వంశీ కాంత్ రేఖాన అందించిన సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్. చందు ఏజే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నేపథ్యం సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
సెంచరీ కొట్టిన పుష్పరాజ్ .. మేకర్స్ స్పెషల్ వీడియో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 గతేడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. అమిర్ ఖాన్ దంగల్ తర్వాత (రూ. 2,070 కోట్లు) ఇండియాలోనే రెండో స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, బాహుబలి లాంటి సినిమాల రికార్డులను తుడిచిపెట్టేసింది.అయితే ఈ సినిమా విడుదలై నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో మేకర్స్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ పుష్ప 2 ది రూల్.. 100 డేస్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బద్దలు కొడుతూ.. భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా.. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.కాగా.. పుష్ప -2 విషయానికి వస్తే 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా.. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. 100 DAYS FOR INDIAN CINEMA'S INDUSTRY HIT #Pushpa2TheRule ❤️🔥From wildfire moments on the screen to record-breaking moments at the box office, #Pushpa2 has taken Indian Cinema to the next level 💥💥💥#100DaysofPushpa2TheRule#WildFirePushpa pic.twitter.com/cjJVVTeoUR— Mythri Movie Makers (@MythriOfficial) March 14, 2025 -
హీరోల చేతిలో ముచ్చటగా మూడు
తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు... మూడు సినిమాలను లైన్లో పెట్టేశారు. చిరంజీవి, ప్రభాస్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, నాని, నితిన్, సిద్ధు జొన్నలగడ్డ, శర్వానంద్ వంటి హీరోల చేతిలో ముచ్చటగా మూడు ప్రాజెక్టులున్నాయి. మరికొందరు నాలుగు సినిమాలు చేస్తున్నారు... ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.. చిరంజీవి... భలే జోరు తెలుగులో స్టార్ హీరోల్లో ఒకరైన చిరంజీవి భలే జోరుమీదున్నారు. ఈ సీనియర్ హీరో వరుసగా ప్రతిభావంతులైన యువ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి వంటి స్టార్‌తో అందివచ్చిన అవకాశాన్ని నిరూపించుకుని, ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో దర్శకులు సైతం ఉన్నారు. చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న వశిష్ఠ మల్లిడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, కునాల్ కపూర్ ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఫ్యాంటసీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదలకు సిద్ధం అవుతోంది.చిరంజీవి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కాంబినేషన్ చాలా రోజుల తర్వాత ‘విశ్వంభర’తో రిపీట్ అవుతోంది. ఇదిలా ఉంటే.. ‘విశ్వంభర’ తర్వాత కూడా చిరంజీవి యంగ్ డైరెక్టర్స్‌తో పని చేయనున్నారు. కెరీర్ ఆరంభం నుంచి వరుస విజయాలు అందుకుంటున్న అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నట్లు చిరంజీవి ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే తొలి చిత్రం ‘దసరా’తో (నాని హీరో) సూపర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు చిరంజీవి పచ్చజెండా ఊపారు. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో ‘ది ప్యారడైజ్’ మూవీ రూపొందిస్తున్నారు. మరి చిరంజీవి ముందుగా అనిల్ మూవీని సెట్స్‌కి తీసుకెళతారా? శ్రీకాంత్ ఓదెల మూవీ చేస్తారా? అనేది వేచి చూడాలి. ఇక ‘వాల్తేరు వీరయ్య’ మూవీ దర్శకుడు బాబీ కూడా చిరంజీవి కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. పవన్ కల్యాణ్... తీన్మార్‘బ్రో’ (2023) సినిమా తర్వాత పవన్ కల్యాణ్ వెండితెరపై కనిపించలేదు. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు చేస్తున్నారాయన. ప్రస్తుతం ఆయన చేతిలో కూడా మూడు చిత్రాలున్నాయి. వాటిలో ‘హరి హర వీరమల్లు: పార్ట్–1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ఒకటి. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్యప్రోడక్షన్స్ పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.అయితే ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఈ మూవీ విడుదల వాయిదా పడనుందని టాక్. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. కాగా ‘రన్ రాజా రన్, సాహో’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ అనే ఓ మూవీ చేస్తున్నారు పవన్. అలాగే ‘గబ్బర్ సింగ్’ తర్వాత హీరో పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభాస్... ఫుల్ స్వింగ్‘బాహుబలి’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు హీరో ప్రభాస్. ఆ చిత్రాల తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో దూసుకెళుతున్నారాయన. గత ఏడాది ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో (‘కన్నప్ప’ చిత్రంలో అతిథి పాత్ర) బిజీ బిజీగా ఉన్నారు.మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ సినిమా చేస్తున్నారాయన. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీని ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే విధంగా ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. అలాగే మంచు విష్ణు హీరోగా రూపొందిన ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్ రుద్రుడిగా అతిథి పాత్ర చేశారు. ఇక ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్: పార్ట్ 1–సీజ్ఫైర్’కి కొనసాగింపుగా ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ రూపొందనున్న సంగతి తెలిసిందే.హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించనున్న ఈ పాన్ ఇండియన్ మూవీ 2026లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’తో పాటు మరో రెండు సినిమాలు ప్రభాస్ తమ బ్యానర్లో చేయనున్నట్లు హోంబలే ఫిల్మస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2027, 2028లో వరుసగా ఈ సినిమాలు విడుదలవుతాయి. నితిన్... జోరుగా‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ’ మూవీతో 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ 2024ని మిస్ అయ్యారు. కానీ ప్రస్తుతం ఆయన మూడు సినిమాలతో జోరుగా ఉన్నారు. ‘భీష్మ’ (2020) వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందిన ద్వితీయ చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది.అదే విధంగా ‘వకీల్ సాబ్’ మూవీ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘తమ్ముడు’ సినిమా చేస్తున్నారు నితిన్. ఇందులో సప్తమి గౌడ కథానాయికగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అక్కా తమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీలో నితిన్‌కి అక్కగా లయ నటిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా మే 9న విడుదల కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. అలానే తొలి మూవీ ‘బలగం’తో బంపర్ హిట్ సాధించిన వేణు యెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేయనున్నారు నితిన్. ఏప్రిల్ లేదా మేలో ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుందట. ఎన్టీఆర్... యమా స్పీడు ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’ వంటి వరుస విజయాల తర్వాత హీరో ఎన్టీఆర్ యమా స్పీడుమీదున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు చూడనటువంటి మాస్ లుక్‌లో ఎన్టీఆర్‌ని ప్రెజంట్ చేయనున్నారు ప్రశాంత్ నీల్. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వార్ 2’. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారని టాక్. యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. కాగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర: పార్ట్ 1’ (2024) హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘దేవర 2’ రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు కొరటాల శివ. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్‌పైకి వెళుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. నాని... ఫుల్ జోష్హీరో నాని ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఓ వైపు హీరోగా రెండు మూడు చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారాయన. నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయిక. యునానిమస్ప్రోడక్షన్స్ తో కలిసి నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో అర్జున్ సర్కార్‌గా పవర్ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు నాని.‘హిట్’ సిరీస్‌లో మూడవ భాగంగా ఈ చిత్రం రానుంది. ఇదిలా ఉంటే... ‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఫుల్ రా రస్టిక్ పాత్ర చేస్తున్నారు నాని.తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లిష్, స్పానిష్, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో 2026 మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ రెండు సినిమాల తర్వాత ‘రన్ రాజా రన్, సాహో’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు నాని. భారీ యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని సమాచారం. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ మూవీ నిర్మించనున్నారు. శర్వానంద్... బిజీ బిజీహీరో శర్వానంద్ బిజీ బిజీగా ఉన్నారు. ‘మనమే’ (2024) చిత్రంతో ప్రేక్షకులను నవ్వించిన ఆయన ప్రస్తుతం మూడుప్రాజెక్టులతో దూసుకెళుతున్నారు. అభిలాష్ కంకర దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న చిత్రం ‘శర్వా 36’ (వర్కింగ్ టైటిల్). విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్న్స్పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ బేస్డ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో శర్వానంద్ బైక్ రేసర్‌గా కనిపించనున్నారు. అదే విధంగా శర్వానంద్ నటిస్తున్న 37వ చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాక్షీ వైద్య, సంయుక్త కథానాయికలు.అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే శర్వానంద్ నటిస్తున్న 38వ చిత్రం ‘శర్వా 38’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకుడు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. 1960లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇది. ఈ మూవీలో 60ల నాటి పాత్రను పోషించడానికి మేకోవర్ అవుతున్నారు శర్వానంద్. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. సిద్ధు జొన్నలగడ్డ... హుషారుగా...‘డీజే టిల్లు’ (2022), ‘టిల్లు స్క్వేర్’(2024) వంటి వరుస హిట్స్‌తో జోరుగా హుషారుగా దూసుకెళుతున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ’జాక్ – కొంచెం క్రాక్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘బేబి’ మూవీ ఫేమ్ వైష్ణవీ చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. కాగా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘తెలుసు కదా’.ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాలతో పాటు ‘టిల్లు క్యూబ్’ కూడా చేయనున్నారు సిద్ధు. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ‘మ్యాడ్’ మూవీ ఫేమ్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తారని ఇప్పటికే ప్రకటించారు ఆ చిత్రనిర్మాత నాగవంశీ.పైన పేర్కొన్న కథానాయకులే కాదు... మరికొందరు కూడా మూడుప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇంకొందరు హీరోల చేతిలో రెండు సినిమాలు ఉండగా మూడో సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. – డేరంగుల జగన్ మోహన్ -
'ఒక అసురుడిని ఎదురించిన ధీరుడి కథ'.. ఆసక్తిగా ట్రైలర్
టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన తాజా చిత్రం షణ్ముఖ. ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్గా కనిపించనుంది. డివోషనల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమాకు షణ్ముగం సప్పని దర్శకత్వం వహించారు. సాప్‌బ్రో ప్రొడక్షన్స్ బ్యానర్లో తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ చేశారు.'సూరులైనా.. అసురులైనా.. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇది ఒక అసురుడిని ఎదురించిన ధీరుడి కథ అనే డైలాగ్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. ఇందులో ఆది సాయి కూమార్ పోలీసు అధికారి పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని, మాస్టర్ మను సప్పని, మనోజ్ ఆది, వీర శంకర్, కృష్ణుడు, అరియానా గ్లోరీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 21న థియేటర్లలో సందడి చేయనుంది. -
వరుణ్ సందేశ్ లేటేస్ట్ మూవీ.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది
వరుణ్ సందేశ్, మధులిక జంటగా చిత్రం కానిస్టేబుల్. ఈ మూవీకి ఆర్యన్ సుభాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై బలగం జగదీష్ నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ మూవీ నుంచి 'మేఘం కురిసింది' అనే క్రేజీ సాంగ్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..' శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పాత్ర ప్రధానమైxof. పోలీసు శాఖలో కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, కుటుంబ నేపథ్యం, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో నిర్మించిన ఈ చిత్రం విజయవంతం కావాలి. ప్రేక్షకుల ఆదరణ పొందాలి. సినీ పరిశ్రమలో రాణించాలనే లక్ష్యంతో కొత్త నటీనటులు వస్తున్నారని.. వారిని ప్రోత్సహించాలని' సూచించారు.సందేశాత్మక చిత్రాలను తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశంలోనే హైదరాబాద్ నగరం సినీ హబ్‌గా మారిందని చెప్పారు. చిత్ర నటీనటులు, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ మధులిక, డైరెక్టర్ ఆర్యన్ సుభాన్, నిర్మాత బలగం జగదీశ్, నాయకులు జగ్గయ్య, రమణ పాల్గొన్నారు. -
ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన సంస్థ!
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఏజెంట్'. 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా మెప్పించింది. అయితే అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ మూవీ విడుదలై దాదాపు రెండేళ్లైన ఓటీటీకి రాలేదు. ఎట్టకేలకు ఈ నెల 14 నుంచి ఓటీటీకి రానుందని సోనిలివ్ ప్రకటించింది. అయితే అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందుగానే ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రోజు సాయంత్రం నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇంకేందుకు ఆలస్యం ఏజెంట్ మూవీని ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.Secrets, shootouts, and a mission that rewrites the rules.#Agent is now streaming on SonyLIV.#AgentOnSonyLIV #Agent @mammootty @akkineniakhil @_vaidyasakshi#SurenderReddy #DinoMorea @varusarath5@UrvashiRautela #Varalakshmi pic.twitter.com/iAONMsxtZn— Sony LIV (@SonyLIV) March 13, 2025 -
'నా భార్య గర్భంతో ఉంది.. ఆ సినిమా చూడలేకపోయాం': కిరణ్ అబ్బవరం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణం అబ్బవరం మరో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క మూవీ తర్వాత ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'దిల్ రూబా'. ఈ మూవీలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటించింది. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్కు విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ నేపథ్యంలో కిరణ్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన మలయాళ హిట్ మూవీ మార్కో గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.తన భార్య రహస్య గోరఖ్‌తో కలిసి ఉన్ని ముకుందన్ నటించిన మార్కో సినిమాకు వెళ్లినట్లు కిరణ్ అబ్బవరం వెల్లడించారు. ఆ చిత్రంలోని సన్నివేశాలు చూసి తను అసౌకర్యంగా ఫీలవడంతో బయటికి వచ్చేసినట్లు తెలిపారు. సినిమా మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయామని కిరణ్ పేర్కొన్నారు. తన భార్య గర్భంతో ఉండడంతో వయోలెన్స్ మూవీ చూడలేక వెనక్కి వచ్చేశామని కిరణ్ వివరించారు.ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..'నా భార్యతో నేను మార్కో మూవీ చూసేందుకు వెళ్లా. ఫుల్ వయోలెన్స్‌గా ఉండడంతో నా భార్య అసౌకర్యంగా ఫీలైంది. అందువల్లే మూవీ మధ్యలోనే బయటికి వచ్చేశాం. క్లైమాక్స్ సీన్ వరకు ఉండలేదు. ఇలాంటి సినిమాల ప్రభావం జనాలపై పూర్తిస్థాయిలో ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వందలో పదిశాతం ప్రభావం ఉండొచ్చు. అలా అని ఆ సినిమాలో పాటలు, సీన్స్‌ను వదిలేయడం లేదు కదా. ఇలాంటి సినిమాల ప్రభావం వయస్సు బట్టి మారుతూ ఉంటుంది' అని తెలిపారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దిల్ రుబా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
దిల్ రూబా సాంగ్ రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం!
కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దిల్ రూబా’. ఈ లవ్ ఎంటర్టైనర్ను విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో దూసుకెళ్తున్నారు మన యంగ్ హీరో.ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఏకంగా బైక్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు కిరణ్ అబ్బవరం ప్రకటించాడు. సినిమాలో కిరణ్ ఉపయోగించిన బైక్‌నే బహుమతిగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. 'దిల్ రుబా' కథని ఎవరైతే ఊహించి తమకు చెబుతారో వాళ్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ బైక్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ నాడు వాళ్లతో కలిసి బైక్ పై థియేటర్ కి వెళ్లి సినిమా కూడా చూస్తానని కిరణ్ చెప్పాడు.అయితే ఇవాళ దిల్ రూబా మూవీ నుంచి నాలుగో సింగిల్ కేసీపీడీ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సాయంత్రం 05:01 గంటలకు రిలీజ్ చేస్తామని వెల్లడించారు. కానీ ఊహించని విధంగా ఈ సాంగ్ రిలీజ్ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 09:06 గంటలకు విడుదల చేస్తామని కిరణ్ అబ్బవరం తెలిపారు. బెస్ట్ ఇవ్వడానికి పాటను వాయిదా వేసినట్లు ట్వీట్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దిల్ రుబా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.Best ivvandaniki team still working on KCPD song . Tomorrow sharp 9:06am song release aipotundi ❤️Song 🔥#DilRuba #KCPD— Kiran Abbavaram (@Kiran_Abbavaram) March 10, 2025 -
భారీ ప్రాజెక్ట్‌లో గోపిచంద్.. డైరెక్టర్‌గా ఎవరంటే?
టాలీవుడ్ హీరో గోపీచంద్ ఈ ఏడాదిలో కొత్త సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. గతేడాది విశ్వం, భీమా చిత్రాలతో మెప్పించిన గోపిచంద్ కొత్త ఏడాదిలో ప్రాజెక్ట్ ప్రకటించారు. అతని కెరీర్లో 33వ చిత్రంగా నిలవనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను గోపీచంద్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు.ఈ సినిమాకు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఐబీ 71, ఘాజీ వంటి చిత్రాలతో సంకల్ప్ రెడ్డి ఫేమస్ అయ్యారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూలి మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇదివరకెన్నడు చూడని పాత్రలో గోపిచంద్ కనిపించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దాదాపు 7వ శతాబ్దం నాటి సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతిక సిబ్బంది వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. Excited to announce my next from the vision of #SankalpReddy, teaming up once again with my producers @srinivasaaoffl garu & Pavan garu under @SS_ScreensNeed all your love..! pic.twitter.com/8wHOdw7d70— Gopichand (@YoursGopichand) March 10, 2025 -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ఈ స్పెషల్ వీడియో చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీలో పలువురు అగ్రతారలు నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇటీవలే రెండో టీజర్ విడుదల చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియోను మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ మూవీ మేకింగ్‌కు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ఇందులో మంచు విష్ణు పలు అంశాలపై టీమ్‌తో చర్చిస్తూ కనిపించారు. ఈ సినిమా తెర వెనుక సంగతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The making of Kannappa#kannappa pic.twitter.com/hZCBKbjjYK— Vishnu Manchu (@iVishnuManchu) March 9, 2025 -
మంచి సందేశాన్ని ఇచ్చే చిత్రమే 'బందీ': ఆదిత్య ఓం
టాలీవుడ్ నటుడు ఆదిత్య ఓం ఇటీవలే బందీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతవారం విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రఘు తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గల్లీ సినిమా బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 'బందీ సినిమా అద్భుతంగా ఉంది. పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో తీశాం. మేము ఊహించినట్లే అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆదిత్య ఓం ఎంతో విలక్షణ నటుడు. యూపీ నుంచి ఇక్కడకు వచ్చి ప్యాషన్‌తో చేస్తున్నారు. రఘు తిరుమల మంచి పాయింట్‌తో సినిమా తీశారు. అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రం కమర్షియల్‌గా ఆడటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.రఘు తిరుమల మాట్లాడుతూ.. 'మా లాంటి కొత్త వాళ్లని ఆదిత్య ఓం చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఆయన సహకారంతోనే సినిమా ఇంత బాగా తీయగలిగాం. ఆయన లేకపోతే ఈ సినిమానే లేదు. వెంకటేశ్వరరావు ఈ మూవీని చూసి ఎగ్జైట్ అయ్యారు. ఈ సినిమాలో మ్యూజిక్, విజువల్స్ గురించి అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు చాలా థాంక్స్' అని అన్నారు.ఆదిత్య ఓం మాట్లాడుతూ.. 'బందీ సినిమాను చాలా బాగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం పర్యావరణ అసమతుల్యత వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. మంచి సందేశాన్ని ఇచ్చేలా తెరకెక్కించిన బందీ మూవీని ఆదరిస్తున్న ఆడియన్స్‌కు ధన్యవాదాలు. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని మంచి చిత్రాలతో ఆడియన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేస్తాను.' అని అన్నారు. -
అల్లు అర్జున్- స్నేహారెడ్డి మ్యారేజ్ డే.. పిల్లలతో కలిసి సెలబ్రేషన్స్
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి గ్రాండ్‌గా వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు బన్నీ భార్య స్నేహారెడ్డి. తమ పిల్లలతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ యానివర్సరీ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. బన్నీ- స్నేహారెడ్డి 2011లో మార్చి 6వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఈ టాలీవుడ్ కపుల్ తమ 14వ వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. 2011లో వివాహాబంధంలోకి అడుగుపెట్టిన ఈ టాలీవుడ్ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లైన మూడేళ్లకు 2014లో అల్లు అయాన్ జన్నించగా.. ఆ తర్వాత 2016లో ఈ జంటకు కూతురు పుట్టింది. బన్నీ తమ ముద్దుల కూతురికి అల్లు అర్హ అని నామకరణం చేశారు. తమ అభిమాన హీరో పెళ్లి రోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తాయి. తమ హీరోకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.కాగా.. గతేడాది పుష్ప-2 మూవీతో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా ఈ చిత్రం భారీ రికార్డులు సృష్టించింది. ఏకంగా కేజీఎఫ్, బాహుబలి సినిమాల రికార్డ్లను దాటేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. Happy Anniversary to the most adorable couple's#alluarjun #AlluSnehaReddy 💙🤍 pic.twitter.com/ph25JnihdF— SAITEJA_Bunny🚩 (@SaiTeja307799) March 6, 2025 -
నాగ చైతన్య 'తండేల్'.. 'బుజ్జి తల్లి' వచ్చేసింది
అక్కినేని హీరో నాగ చైతన్య ఇటీవలే తండేల్ మూవీతో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కించారు.ఈ చిత్రంలో ఓ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బుజ్జితల్లి అంటూ సాగే లవ్ సాంగ్ చైతూ ఫ్యాన్స్‌ను అలరించింది. ఈ ప్రేమకథా చిత్రంలోని ఈ సాంగ్ హైలెట్‌గా నిలిచింది. ఈ పాట యూట్యూబ్‌లో ఏకంగా 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాను శ్రీకాకుళం మత్స్యకారుల రియల్ స్టోరీ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.(ఇది చదవండి: నాగచైతన్య వందకోట్ల మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)తండేల్ ఓటీటీ డేట్ ఫిక్స్..బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన తండేల్ ఓటీటీలోనూ సందడి చేయనుంది. మార్చి 7వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. -
మొదటిసారి అరుణాచలం వెళ్లా.. చాలా పాజిటివ్‌గా అనిపించింది: కిరణ్ అబ్బవరం
గతేడాది క మూవీతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. కొత్త ఏడాదిలోనూ సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ప్రేమకథా చిత్రం దిల్ రుబా. లవర్స్ డే కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఊహించని విధంగా వాయిదా పడింది. ఇటీవల దిల్ రుబా మూవీ కొత్త తేదీని మేకర్స్ ప్రకటించారు. దీంతో కిరణ్ అబ్బవరం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అరుణాచలం ఆలయం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. 'అరుణాచలం మొదటిసారి వెళ్లా. చాగంటి వారి మాటలు వినేవాడిని. ఇటీవల అనుకోకుండా కుదిరింది. అక్కడ నాకు చాలా పాజిటిల్ ఫీలింగ్ కలిగింది. అక్కడ గిరి ప్రదక్షణ 14 కిలోమీటర్లు నడిచాం. కానీ గిరి ప్రదక్షణ ఎప్పుడు చేయాలనేది తెలియదు. మార్నింగ్ 6కు మొదలు పెడదాం అనుకున్నాం. దర్శనం చేసుకున్నాకే గిరి ప్రదక్షణ చేయాలన్నారు. టిఫిన్ చేసిన ఎనిమిది గంటలకు బయలుదేరాం. 14 కిలోమీటర్లు తిరిగి వచ్చేసరికి నాలుగు గంటలు పట్టింది. ఎండలో వెళ్లడంతో చుక్కలు కనిపించాయి. ఎవరైనా అరుణాచలం వెళ్లకపోతే ఇప్పుడైనా వెళ్లండి. చాలా అద్భుతంగా ఉంటుంది'అని అన్నారు.అయితే కిరణ్ అబ్బవరం ఇటీవలే అభిమానులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తన మూవీ దిల్ రుబా కథేంటో చెబితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో బైక్‌ను బహుమతిగా ఇస్తామని తెలిపారు. బైక్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ నాడు వాళ్లతో కలిసి బైక్ పై థియేటర్ కి వెళ్లి సినిమా కూడా చూస్తానని కిరణ్ చెప్పాడు. ఇప్పటివరకు జరిగిన ప్రమోషన్లలో కథ గురించి తాము పలు హింట్స్ ఇచ్చామని వెల్లడించారు. ఈ సినిమా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
ఎట్టకేలకు మోక్షం.. ఓటీటీకి అఖిల్ ఏజెంట్ మూవీ
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్ చిత్రం 'ఏజెంట్'. 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా మెప్పించింది. అయితే అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ మూవీ విడుదలై దాదాపు రెండేళ్లు కావొస్తోంది. కానీ ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. గతంలో సోనీలివ్‌లో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాలతో ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూనే ఉంది. గతంలో పలుసార్లు డేట్స్ అనౌన్స్ చేసినప్పటికీ స్ట్రీమింగ్కు రాకపోవడంతో అఖిల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా అఖిల్ అభిమానులకు ఎట్టకేలకు ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది.(ఇది చదవండి: ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. మళ్లీ ఏమైంది?)తాజాగా ఏజెంట్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేశారు. మార్చి 14వ తేదీ నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోనీ లివ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
దాన్ని అడ్డుకోవాలంటే ఓ ఉద్యమం చేయాలి: దిల్ రాజు కామెంట్స్
సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తోన్న పైరసీపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ రీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఎవరి సినిమాపై ఎఫెక్ట్ పడుతుందో వారు మాత్రమే పైరసీ గురించి మాట్లాడుతున్నారని వెల్లడించారు. పైరసీ గురించి శుక్రవారం మాట్లాడితే సోమవారానికే మర్చిపోతున్నారని అన్నారు. పైరసీకి అడ్డుకట్ట వేయాలంటే ఓ ఉద్యమం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.దిల్ రాజు మాట్లాడుతూ..' ఎవరి సినిమా ఎఫెక్ట్ అయితే వారే పైరసీపై మాట్లాడతారు. ఈ విషయాన్ని శుక్రవారం మాట్లాడితే.. సోమవారానికి మర్చిపోతున్నారు. దానికి అడ్డుకట్ట వేయాలంటే ఓ ఉద్యమం కావాలి. ఎఫ్డీసీ ఛైర్మన్‌గా నేను లీడ్ చెస్తాను . నిర్మాతలందరు కలిసి రావాలి. డబ్బులు పోయేవి నిర్మాతలవే కాబట్టి అందరూ మేల్కోవాలి. సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉన్నవారు కూడా ముందుకు రావాలి. నేను నిర్మాతగా, పంపిణీదారుడిగా వన్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటా. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన, నితిన్ ఎల్లమ్మ సినిమాల స్క్రిప్ట్ లు సిద్దంగా ఉన్నయి. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.' అని వెల్లడించారు.కాగా.. సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తోన్న పైరసీ అనే భూతం ఎప్పటి నుంచో పట్టి పీడిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. ఇటీవల విడుదలైన గేమ్ ఛేంజర్, తండేల్, విదాముయార్చి సినిమాలు సైతం పైరసీ బారినపడ్డాయి. గేమ్ ఛేంజర్ సినిమాను ఏకంగా ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారు. ఈ సంఘటనపై కేసు కూడా నమోదు చేశారు. అలాగే తండేల్ మూవీని పైరసీ చేసిన వారిని వదిలిపెట్టేది లేదని నిర్మాత బన్నీ వాసు హెచ్చరించారు. -
మెగాస్టార్‌కు ఆ దేశ పౌరసత్వం.. ఆయన టీమ్ ఏమన్నారంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. ఈ మువీకి బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌లో చిరు సందడి చేశారు. అయితే తాజాగా మెగాస్టార్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుకు యూకే గౌరవ పౌరసత్వం అందించనుందని టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ టీమ్ స్పందించింది. ఇటీవల ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవి తాను లండన్ వెళ్తన్నట్లు చెప్పడంతో ఈ ఈ వార్తలొచ్చాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి యూకే గౌరవ పౌరసత్వం ఇస్తుందన్న వార్తలు అవాస్తవమని ఆయన టీమ్ కొట్టిపారేసింది. ఇలాంటి వార్తలు రాసేముందు ముందుగా ధృవీకరించుకోవాలని తెలిపింది. విశ్వక్ సేన్ మూవీ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ లండన్ వెళ్లనున్నట్లు తెలిపారు. లండన్‌లో ఓ ఈవెంట్లో తనకు సన్మానం జరగనుందని మెగాస్టార్ తెలిపారు. దీంతో కొన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో సిటిజెన్షిప్ గురించే లండన్ వెళ్తున్నారంటూ వార్తలు వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి టీమ్ క్లారిటీ ఇచ్చింది. కాగా.. చిరంజీవి చివరిసారిగా భోలా శంకర్‌లో కనిపించారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర్ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశముంది. ఆ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఒదెలతో చిరు జతకట్టనున్నారు. -
నీ రెండేళ్ల ప్రేమ.. నా జీవితకాలం సరిపోదు: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండేళ్ల క్రితం పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ఆయన పెళ్లాడారు. గతేడాది ఈ జంటకు ఓ కుమార్తె కూడా జన్మించింది. మార్చి 3వ తేదీ 2023లో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి నివాసంలో ఈ వివాహా వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు ఆశీర్వదించారు.మౌనికతో పెళ్లి జరిగి రెండేళ్లు పూర్తి కావడంతో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా తన భార్యకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. రెండో వివాహా వార్షికోత్సవం వేళ మౌనికలో ఉన్న సంతోషకరమైన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్విటర్లో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. మౌనికను పెళ్లి చేసుకోవడం నా జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమని పోస్ట్ చేశారు.(ఇది చదవండి: నాపై నీ ప్రేమకు, నమ్మకానికి థాంక్యూ.. పెళ్లిరోజు మౌనిక స్పెషల్ పోస్ట్)మంచు మనోజ్ తన ట్వీట్లో రాస్తూ..' రెండు సంవత్సరాల క్రితం నా జీవితంలో అత్యుత్తమ నిర్ణయం తీసుకున్నా. నా ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నా. మౌనిక నా జీవితంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి నాకు తెలియని కొత్త ప్రేమను అందించావు. నేను విధిని నమ్మడానికి కారణం నువ్వు నా కష్టాల్లో నా వాయిస్‌గా, గందరగోళంలో నా ప్రశాంతతగా నిలిచావు. కేవలం రెండేళ్లలో ప్రేమ, సంతోషం, నవ్వులతో ఇద్దరు అందమైన చిన్న పిల్లలతో ఇంటిని తీర్చిదిద్దావు. మన పిల్లల పట్ల ఒక తల్లిగా నీ అనంతమైన ప్రేమను చూసి.. ప్రతిరోజూ నీతో ప్రేమలో పడిపోతున్నా. ఈ రెండేళ్లలోనే ఎన్నో ఎత్తులు, పతనాలు, విజయాలు, పోరాటాలను ఎదుర్కొన్నాం. కానీ వీటన్నింటిలో ఒకటి మాత్రం స్థిరంగా ఉంది. అదే మనం. నువ్వు ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్, నాకు అతిపెద్ద సపోర్టర్. ఈ రెండేళ్లు నాపై నువ్వు చూపించిన ప్రేమకు.. నా జీవితకాలం సరిపోదు. హ్యాపీ వార్షికోత్సవ శుభాకాంక్షలు మున్నీ. మన కలలు, సాహసాలు, ప్రేమ, సమయంతో పాటు మరింత బలంగా పెరుగుతుంది. ఇట్లు నీ మను' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. అంతకుముందే మౌనిక కూడా సోషల్ మీడియా వేదికగా తన భర్త మంచు మనోజ్‌కు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ ఫోటోలను షేర్ చేసింది. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
జబర్దస్త్ రాంప్రసాద్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆసక్తిగా ట్రైలర్
జబర్దస్త్ రాంప్రసాద్, జెమినీ సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయికిరణ్, నాజియా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'వైఫ్ ఆఫ్ ఆనిర్వేశ్'. ఈ సినిమా గంగా సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకం పై వెంకటేశ్వర్లు, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ నటుడు శివాజీ చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు.ట్రైలర్ చూస్తుంటే రాంప్రసాద్ విభిన్నమైన పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సన్నివేశాలు చూస్తే కామెడీకి భిన్నంగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. ఈ సందర్భంగా సినిమా మంచి హిట్ అవుతుందని టీమ్‌కు శివాజీ అభినందనలు తెలిపారు. నిర్మాత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చిందని తెలిపారు. మార్చి 7వ తేదీ ఈ చిత్రం రిలీజ్ అవుతుందని వెల్లడించారు.దర్శకుడు గంగ సప్తశిఖర మాట్లాడుతూ..' జబర్దస్త్ రాంప్రసాద్‌తో క్రైమ్ థ్రిల్లర్ చేయించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి గల కారణం మా చిత్రబృందమే. మ్యూజిక్ డైరెక్టర్ షణ్ముఖ, మా చిత్రంలో నటించిన తారాగణం ఎంతో అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. -
పార్లమెంట్‌కు రామ్ చరణ్.. ఎందుకంటే?
గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం ఆర్సీ16. ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే సెట్లోని ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు చెర్రీ. తన కూతురు క్లీంకారతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆర్సీ16 మూవీ షూటింగ్ షెడ్యూల్ మైసూరులో జరుగుతోన్న సంగతి తెలిసిందే.మైసూరు షెడ్యూల్లో రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ దాదాపుగా ముగిసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రామ్ చరణ్ మూవీ టీమ్ ఢిల్లీకి షిఫ్ట్ అవుతున్నట్లు సమాచారం. ఢిల్లీలోని పార్లమెంట్లో మరిన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుడా జామా మసీదు ప్రాంతంలోనూ షూట్ చేయనున్నారని టాక్. షూటింగ్ అనుమతులకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. మార్చి 4న పార్లమెంట్లో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
నాగచైతన్య వందకోట్ల మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
తన పెళ్లి తర్వాత అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన ఈ మూవీలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించారు. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ రియల్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్క్‌ను చేరుకుంది.బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ తాజాగా స్ట్రీమింగ్ డేట్‌ను రివీల్ చేసింది. ఈనెల 7 నుంచి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేసింది.తండేల్ అసలు కథేంటంటే..శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తుండగా పొరపాటున పాకిస్థాన్ ప్రాదేశిక జలాల్లోకి వారు ప్రవేశించారు. అప్పుడు పాక్ వారిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. తండేల్ కథకు ఇదే మూలం.. డి.మత్స్యలేశం గ్రామం నుంచే తండేల్ కథ మొదలౌతుంది. రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) ప్రేమికులుగానే మనకు పరిచయం అవుతారు. ప్రాణాలకు ఎదురీదుతూ సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం ఉండదు. వారు ఎప్పుడైతే తమ ఇంటికి చేరుతారో అప్పుడే కుటుంబ సభ్యులు ఊపిరిపోసుకుంటారు. ఇదే పాయింట్ సత్యలో భయం కలిగేలా చేస్తుంది. తను ప్రేమించిన రాజు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్తే.. ఏదైనా ప్రమాదం జరగవచ్చని అతన్ని వేటకు వెళ్లొద్దంటూ ఆమె నిరాకరిస్తుంది. అప్పటికే తండేల్ (నాయకుడు)గా ఉన్న రాజు.. సత్య మాటను కాదని వేట కోసం గుజరాత్ వెళ్తాడు. ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. సాధారణ కూలీగా ఉన్న రాజు తండేల్ ఎలా అయ్యాడు..? వేటకు వెళ్లొద్దని సత్య చెప్పినా కూడా రాజు గుజరాత్‌కు ఎందుకు వెళ్తాడు..? ఈ కారణంతో తన పెళ్లి విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? అందుకు ఎదురైన కారణం ఏంటి..? వేటకు వెళ్లిన వారందరూ పాక్ చెరలో ఎలా చిక్కుకుంటారు..? రాజు మీద కోపం ఉన్నప్పటికీ వారందరినీ తిరిగి ఇండియాకు రప్పించేందుకు సత్య చేసిన పోరాటం ఏంటి..? చివరగా రాజు, సత్య కలుసుకుంటారా..? అనేది తెలియాలంటే 'తండేల్' మూవీని వీక్షించాల్సిందే.Prema kosam yedu samudhralaina dhaatadaniki osthunnadu mana Thandel! 😍❤️Watch Thandel, out 7 March on Netflix in Telugu, Hindi, Tamil, Kannada & Malayalam!#ThandelOnNetflix pic.twitter.com/GIBBYHnME9— Netflix India South (@Netflix_INSouth) March 2, 2025 -
మజాకా సూపర్ హిట్.. అప్పుడే మరో సినిమా!
టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు ఇటీవల మజాకా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద మజాకా దూసుకెళ్తోంది. ఇటీవల మజాకా మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా మజాకా సినిమాను నవ్వుతూ ఎంజాయ్ చేయాలని డైరెక్టర్ త్రినాథరావు ఆడియన్స్‌కు సూచించారు.(ఇది చదవండి: సినిమా చూసిన దిల్ రాజు ఆ ఒక్క మాట అన్నారు: మజాకా డైరెక్టర్)అయితే ఒక పక్కా మజాకా సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే మరో సినిమా పనిలో నిమగ్నమయ్యారు దర్శకుడు త్రినాథరావు. అప్పుడే మరో యంగ్ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అయిపోయారు. టాలీవుడ్లో పలు సూపర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ యువ హీరో హవీశ్ కోనేరుతో జతకట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే రివీల్ చేయనున్నారు. ప్రతిభావంతులైన యువ హీరోలను ప్రోత్సహిస్తూ తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నారు. తెలుగులో సినిమా చూపిస్తావా మావా, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా లాంటి సినిమాలతో సూపర్‌హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు త్రినాథరావు. కాగా.. కోనేరు నువ్విలా, జీనియస్, సెవెన్ లాంటి సినిమాలతో యంగ్ హీరో హవీశ్ గుర్తింపు తెచ్చుకున్నారు. -
'రజినీకాంత్ మూవీ సెట్లో సందీప్ కిషన్.. అసలు కారణం ఇదే'
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తాజాగా మజాకా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రీతూవర్మ హీరోయిన్గా నటించారు. మన్మధుడు హీరోయిన్ అన్షు కీలక పాత్రలో కనిపించారు. అయితే ఇటీవల తన మూవీ ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకెదురైన ఓ ప్రశ్నకు సందీప్ సమాధానమిచ్చారు. రజినీకాంత్ కూలీ మీరు నటిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తనపై వస్తున్న వార్తలపై సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారో మనం ఓ లుక్కేద్దాం.రజినీకాంత్ మూవీ కూలీలో తాను నటించడం లేదని సందీప్ కిషన్ అన్నారు. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తన ఫ్రెండ్ కావడంతోనే కూలీ సెట్‌కు వెళ్లానని తెలిపారు. ఈ చిత్రంలో తన పాత్రపై వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని వెల్లడించారు. నేను దాదాపు 45 నిమిషాల పాటు కూలీ సినిమాను వీక్షించానని సందీప్ వివరించారు. ఈ మూవీ కచ్చితంగా రూ.1000 కోట్ల మార్క్‌ను అధిగమిస్తుందని తెలిపారు. రజినీకాంత్ సార్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని మన యంగ్ హీరో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో లోకేశ్ కనగరాజ్‌తో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. కాగా.. కూలీ మూవీ సెట్స్ నుంచి లోకేష్ కనగరాజ్, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సందీప్ కిషన్ ఉన్న ఫోటో వైరల్ కావడంతో ఆయన నటిస్తున్నారంటూ వార్తలొచ్చాయి.(ఇది చదవండి: నాగచైతన్య తండేల్ మూవీ.. అలాంటి సీన్ రిపీట్!)సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న కూలీ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. ఇదిలా ఉంటే పూజా హెగ్డే అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌లో చేరింది. ఈ విషయాన్ని ఫిబ్రవరి 27 న మేకర్స్ వెల్లడించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్కరం బంగారం స్మగ్లింగ్ మాఫియా చుట్టూ తిరిగే యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నరు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. -
నాగచైతన్య తండేల్ మూవీ.. అలాంటి సీన్ రిపీట్!
అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. శ్రీకాకుళం ప్రాంతంలోని మత్స్యకారుల నేపథ్యంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఏపీకి చెందిన కొందరు జాలర్లు పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించడంతో వారి బంధించి తీసుకెళ్లారు. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వారిని విడిపించారు. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా సక్సెస్ సాధించింది.అయితే తాజాగా ఇలాంటి సంఘటనే మరోసారి రిపీట్ అయింది. తమిళనాడుకు చెందిన కొందరు మత్స్యకారులు పొరపాటున సరిహద్దు రేఖ దాటారు. వీరి గుర్తించిన శ్రీలంక నావికాదళం దాదాపు 27 మందిని అరెస్ట్ చేసింది. దీంతో తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతానికి చెందిన దాదాపు 700 మంది జాలర్లు నిరవధిక సమ్మెకు దిగారు. వారి ఆందోళనలతో దిగొచ్చిన తమిళనాడు ప్రభుత్వం.. కేంద్రం సహకారంతో వారిని విడిపించారు. దీంతో మరోసారి తండేల్ సినిమా రిపీట్ అయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. నాగచైతన్య నటించిన తండేల్ మూవీ తమిళంలోనూ విడుదలైన సంగతి తెలిసిందే. -
పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి-విక్టరీ వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో అదరగొట్టేసింది. పొంగల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ఓ రేంజ్లో అభిమానులను అలరించింది. దీంతో ఈ సినిమా ఓటీటీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం మేకర్స్ ఆడియన్స్‌ను షాకిచ్చారు. ఓటీటీ కంటే ముందు టీవీల్లో ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా ఓటీటీపై మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. టీవీల్లో ప్రసారం చేయడంతో ఓకేసారి ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని జీ5లో విడుదల చేసిన ప్రోమోలో చూపించారు. మార్చి 1న సాయంత్రం 6 గంటల నుంచి జీ తెలుగుతో పాటు జీ5లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. దీంతో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'సంక్రాంతి వస్తున్నాం' స్ట్రీమింగ్ కానుంది. -
నాగార్జున కుబేర మూవీ.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
నాగార్జున, ధనుశ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజవుతుందని భావించినా అలా జరగలేదు. ఈ సినిమా రిలీజ్ కోసం నాగార్జున ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కుబేర టీమ్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.ఈ పాన్ ఇండియా చిత్రాన్ని జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన పోస్టర్లో నాగార్జున్, ధనుశ్‌తో పాటు బాలీవుడ్ నటుడు జిమ్ షర్బ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నాగ్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. రష్మిక హీరోయిన్గా నటిస్తుండడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. A story of power..👑A battle for wealth..💰A game of fate..♟️#SekharKammulasKuberaa is ready to deliver an enchanting theatrical experience from 𝟐𝟎𝐭𝐡 𝐉𝐮𝐧𝐞, 𝟐𝟎𝟐𝟓. @dhanushkraja KING @iamnagarjuna @iamRashmika @sekharkammula @ThisIsDSP @SVCLLP @amigoscreation pic.twitter.com/OUATNh4iES— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) February 27, 2025 -
దేవర ప్రమోషన్లతో బిజీగా జూనియర్ ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ మూవీ దేవర పార్ట్-1. గతేడాది దసరా ముందు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో దేవర-2 కూడా ఉంటుందని డైరెక్టర్ కొరటాల ఇప్పటికే ప్రకటించారు.అయితే గతంలో మన తెలుగు చిత్రాలు చాలా వరకు జపాన్‌లో కూడా విడుదలై ఘన విజయం సాధించాయి. మన టాలీవుడ్ సినిమాలకు జపాన్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. గతంలో ఆర్ఆర్ఆర్తో పాటు పలు చిత్రాలు సైతం జపాన్ భాషలో కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీని కూడా ఈ ఏడాది అక్కడ విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగానే దేవర ప్రమోషన్స్ ప్రారంభించారు యంగ్ టైగర్.జపాన్ అభిమానులు, అక్కడి మీడియాతో వర్చువల్ ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలను దేవర టీమ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. మూవీ ప్రమోషన్లతో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చే నెల మార్చి 22న జపాన్‌లో పర్యటించనున్నారని తెలిపింది. ఈ సినిమాను మార్చి 28న జపాన్‌లో విడుదల కానుందని మేకర్స్ వెల్లడించారు. Man of Masses @Tarak9999 has kick started #Devara promotions with interviews for Japanese media ahead of his visit on March 22nd 🌊The countdown begins for the grand release in Japan on March 28th. pic.twitter.com/UwPJLNrQ1I— Devara (@DevaraMovie) February 25, 2025 -
నాని వయొలెన్స్.. దెబ్బకు విజయ్ దేవరకొండ రికార్డ్ బ్రేక్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'హిట్-3'. హిట్ సిరీస్‌లో వస్తోన్న మూడో చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నాని సరసన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. నాని బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేయగా యూట్యూబ్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో హిట్-3 టీజర్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి దాదాపు 21 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించింది. ఈ చిత్రంలో నాని మునుపెన్నడు కనిపించని పాత్రలో నటించారు. టీజర్లో సన్నివేశాలు చూస్తేనే ఆ విషయం అర్థమవుతోంది. ఇంతకుముందెన్నడు చేయని మోస్ట్ వయొలెంట్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ చిత్రంలో నాని.. అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అభిమానులను అలరించనున్నారు.అయితే ఇటీవల విడుదలైన విజయ్ దేవరకొండ మూవీకి 24 గంటల్లోనే 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఎన్టీఆర్ వాయిస్ అందించిన ఈ టీజర్‌కు ఇప్పటి వరకు 15 మిలియన్ల వీక్షణలు సాధించింది. కానీ నాని మూవీ హిట్-3 టీజర్ కేవలం 24 గంటల్లోనే కింగ్డమ్ వ్యూస్ రికార్డ్‌ను అధిగమించింది. దీంతో హీరో నాని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వేసవి కానుకగా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నారు. -
మూడేళ్ల తర్వాత మరో ఓటీటీకి టాలీవుడ్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ జంటగా నటించిన చిత్రం అర్జున ఫల్గుణ. ఈ మూవీ 2021 డిసెంబర్ 31న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయింది. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.అయితే తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ఈనెల 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో విడుదలైన దాదాపు మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి తీసుకొచ్చారు మేకర్స్. కాగా.. ఈ చిత్రంలో నరేశ్, సుబ్బరాజు, మహేశ్, శివాజీ రాజా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిరంజన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి ప్రియదర్శన్ సంగీతం అందించాడు. A heist, a twist, and a whole lot of laughs! 🎭💰 Don't miss #ArjunaPhalguna, now streaming on @PrimeVideoIN! 🤩#ArjunaPhalgunaOnPrime ▶️ https://t.co/zqJeq98baa@sreevishnuoffl @Actor_Amritha @DirTejaMarni @MatineeEnt #TeluguFilmNagar pic.twitter.com/wUFnuSfpD1— Telugu FilmNagar (@telugufilmnagar) February 24, 2025 అర్జున ఫల్గుణ అసలు కథేంటంటే..?డిగ్రీ అయిపోయి ఊర్లోనే ఉంటున్న ఐదుగురు స్నేహితులు అర్జున్(శ్రీవిష్ణు), రాంబాబు(రాజ్ కుమార్), తాడి(‘రంగస్థలం’మహేశ్), ఆస్కార్(చైతన్య గరికిపాటి), శ్రావణి(అమృత అయ్యర్)ల చూట్టూ ‘అర్జున ఫల్గుణ’కథ సాగుతుంది. వీరంతా చిన్నప్పటి నుంచి బెస్ట్‌ఫ్రెండ్స్. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే వ్యక్తిత్వం వాళ్లది. వీరంతా ఊర్లోనే సోడా సెంటర్ పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటారు. దాని కోసం బ్యాంకు లోన్‌కు ట్రై చేస్తారు. రూ. 50 వేలు ఇస్తే లోన్ వస్తుందని చెప్పడంతో.. డబ్బుకోసం వీళ్లు ప్రయత్నాలు చేస్తారు. ఈక్రమంలో ఈ ఐదుగురు గంజాయి కేసులో పోలీసులకు పట్టుబడతారు. అక్కడి నుంచి వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? సరదాగా ఊర్లో తిరిగే వీళ్లు గంజాయి స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ కేసు నుంచి ఈ ఐదుగురు ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా కథ. -
సందీప్ కిషన్ 'మజాకా'.. అభిమానులను అలరిస్తోన్న ఫోక్ సాంగ్
సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘మజాకా’. ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన సాంగ్‌కు ఆడియన్స్‌ను అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరో క్రేజీ పాటను మేకర్స్ విడుదల చేశారు.తాజాగా మజాకా మూవీ నుంచి అద్భుతమైన జానపద పాటను విడుదల చేశారు. సొమ్మసిల్లి పోతున్నావే.. ఓ చిన్నా రాములమ్మా అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు రాము రాథోడ్, ప్రసన్న కుమార్ బెజవాడ లిరిక్స్ అందించగా.. రేవంత్ ఆలపించారు. ఈ క్రేజీ ఫోక్ సాంగ్‌కు లియోన్ జేమ్స్ సంగీతమందించారు. ఈ చిత్రంలో మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. నల్ల నల్లాని కళ్ళతో, నాజూకు నడుముతో నన్ను ఆగమే జేస్తివే 🎶❤️🔥The Most Viral Folk Sensation Of The Year - #SommasilliPothunnave Out Now✨️— https://t.co/JCqj0HaZyi🎵 @leon_james🎤 @singerrevanth✍🏻#RamuRathod @KumarBezwada#MazakaOnFeb26th #Mazaka @sundeepkishan @riturv… pic.twitter.com/8gEID6cJL0— AK Entertainments (@AKentsOfficial) February 21, 2025 -
టాలీవుడ్లో ఇప్పుడదే ట్రెండ్.. చిన్నోడు.. పెద్దోడు.. మళ్లీ వచ్చేస్తున్నారు..!
టాలీవుడ్ ప్రియులను అలరించిన చిత్రాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ముందు వరుసలో ఉంటుంది. విక్టరీ వెంకటేశ్, మహేశ్ బాబు అన్నతమ్ముళ్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అంజలి, సమంత హీరోయిన్లుగా నటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో శిరీష్ నిర్మించారు. 2013లో సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సినీ ప్రియులను మెప్పించింది.తాజాగా ఈ చిత్రం రీ రిలీజ్‌కు సిద్దమైంది. ఇటీవల పలు సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ టాలీవుడ్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీని మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం ఫ్యాన్స్‌కు దక్కనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. మార్చి 7న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు థియేటర్లలో సందడి చేయనుందని పోస్ట్ చేసింది. ఈ ప్రకటనతో వెంకటేశ్, మహేశ్ బాబు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. The wait is over! 🎬✨Relive the magic of family, love, and brotherhood with Peddhodu @VenkyMama & Chinnodu @urstrulyMahesh 🙌Catch the timeless classic #SeethammaVakitloSirimalleChettu in theatres on March 7th❤️🔥Get Ready to experience the nostalgia once again🔥… pic.twitter.com/mYD1RZvvnI— Sri Venkateswara Creations (@SVC_official) February 21, 2025 -
అమ్మ అంజనాదేవికి అస్వస్థత.. స్పందించిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి అమ్మగారు అంజనాదేవి అస్వస్థత గురైనట్లు వచ్చిన వార్తలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన ట్వీట్ చేశారు. మా అమ్మ అస్వస్థతకు గురైందని కొన్ని మీడియా కథనాలు చూశానని వెల్లడించారు. అమ్మ కొద్దిపాటి అస్వస్థతకు గురైన మాట వాస్తవమేనని.. రెండు రోజుల ముందు నుంచే ఆమెకు ఆరోగ్యం కాస్తా బాగాలేదని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని.. సంపూర్ణం ఆరోగ్యంతో ఉన్నారని చిరంజీవి తెలిపారు. అమ్మ ఆరోగ్యంపై ఎలాంటి ఊహాజనిత కథనాలు ప్రచురించవద్దని అన్ని మీడియాలకు విజ్ఞప్తి చేస్తున్నా అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థత గురైనట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే కేవలం రెగ్యూలర్ చెకప్ కోసం మాత్రమే ఆసుపత్రికి వెళ్లినట్లు వారి కుటుంబ సన్నిహితులు తెలిపారు. కానీ సోషల్ మీడియాలో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు కథనాలొచ్చాయి. దీంతో మెగాస్టార్ చిరు స్పందించారు. తాజాగా అమ్మ అంజనాదేవి ఆరోగ్యంపై అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార్ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. My attention is drawn to some media reports claiming our mother is unwell and is hospitalised. Want to clarify that she was a little indisposed for a couple of days. She is hale and hearty and is perfectly alright now. Appeal to all media not to publish any speculative reports…— Chiranjeevi Konidela (@KChiruTweets) February 21, 2025 -
ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు జంటగా హాజరైన వీకే నరేశ్- పవిత్రా లోకేశ్.. వీడియో వైరల్
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు వీకే నరేశ్. విభిన్నమైన పాత్రలో వెండితెరపై అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. తొమ్మిదో ఏట పండంటి కాపురం మూవీతో బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు వీకే నరేశ్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసిన అతడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక చిత్రాల్లో కనిపించారు. ఇటీవల తన 65వ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాకుండా ఈ వేడుకల్లో నటి పవిత్రా లోకేశ్ కూడా పాల్గొన్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.అయితే ప్రముఖ నటి, దర్శకురాలు, వీకే నరేశ్ తల్లి విజయ నిర్మల జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తన తల్లి విజయ నిర్మల పేరిట అవార్డులను ప్రకటించారు. ఫిబ్రవరి 20న ఆమె జయంతి సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ప్రతిష్టాత్మక అవార్డులను అందించారు. ఈ కార్యక్రమానికి నటి పవిత్ర లోకేశ్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరితో పాటు సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్ అనిల్ రావిపూడి, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. కాగా.. ఈ ఈవెంట్లో జంధ్యాల జీవితంపై రైటర్ సాయినాథ్ రాసిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. నాకు సినిమాల్లో ఓనమాలు నేర్పించిన జంధ్యాలను చరిత్రలో ఒక భాగంగా ఉంచాలని ఆయన పేరుతో డబ్బింగ్, పోస్ట్ ప్రోడక్షన్ థియేటర్నుప్రారంభించినట్లు పేర్కొన్నారు.అయితే తన కెరీర్లోనే 2025 బిజీగా ఉండబోతోందని ఇటీవల ఓ ఈవెంట్లో వెల్లడించారు. ఏకకాలంలో తొమ్మిది సినిమాల్లో నటిస్తున్నా.. బ్యూటీ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సినిమా మ్యూజియమ్ అండ్ లైబ్రరీ అండ్ క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ పీపుల్ అనే కార్యక్రమాన్ని శ్రీమతి ఘట్టమనేని ఇందిరా దేవి పేరుతో ప్రారంభించినట్లు వెల్లడించారు. అందులో విజయకృష్ణ మందిరం ఏర్పాటు చేయడం జరిగిందని.. నేను, పవిత్ర దీనిని ఓ మిషన్లా తీసుకుని కళాకారుల ఐక్య వేదిక సంస్థ పేరుపై ఏర్పాటు చేసినట్లు ఇటీవలే వివరించారు.Visuals of Actor & MAA President @iVishnuManchu, Director @AnilRavipudi, Actor @ItsActorNaresh, and #PavitraLokesh from the Vijaya Nirmala Awards function in Hyderabad! 📸🤩#ManchuVishnu #AnilRavipudi #ShivaBalaji #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/LkIrqymsGi— Telugu FilmNagar (@telugufilmnagar) February 20, 2025 -
నా సినిమాపై విమర్శలను అంగీకరిస్తున్నా: అభిమానులకు విశ్వక్ సేన్ లేఖ
మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) ఇటీవలే లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో అభిమానులను అలరించారు. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందే వివాదానికి దారి తీయడంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విషయంలో తీవ్రంగా నిరాశపర్చింది. ఈ నేపథ్యంలో హీరో విశ్వక్ సేన్ తాజాగా ఓ లేఖ విడుదల చేశారు. అభిమానులు ఆశించిన స్థాయిలో సినిమాలు చేయలేకపోయానని ట్విటర్ వేదికగా వెల్లడించారు.విశ్వక్ సేన్ తన లేఖలో రాస్తూ..'అందరికీ నమస్కారం.. ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శలను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణానికి మద్దతిచ్చిన నా అభిమానులకు.. నాకు ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే. కానీ.. ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నా. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్.. మాస్ ఏదైనా సరే అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే.. నన్ను విమర్శించే హక్కు మీకు ఉంది. ఎందుకంటే, నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరే' అని రాసుకొచ్చారు.'అంతేకాకుండా నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు.. నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నా. అంతే కాకుండా, నా మీద విశ్వాసం ఉంచిన నిర్మాతలు, పంపిణీదారులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే నా కథానాయకులు, దర్శకులు, రచయితలు నాకు వెన్నెముకగా నిలిచి.. నన్ను మలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరో బలమైన కథతో ముందుకు వస్తా. నా మంచి, చెడు కాలాల్లో నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం- ఇట్లు మీ విశ్వక్ సేన్' అంటూ లేఖను విడుదల చేశారు.కాగా.. ప్రస్తుతం విశ్వక్సేన్ జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ డైరెక్షన్లో ఫంకీ చిత్రంలో నటిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవ్ అండ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.🙏 With gratitude #vishwaksen pic.twitter.com/c95Jyal2Il— VishwakSen (@VishwakSenActor) February 20, 2025 -
విమానంలో వివాహ వేడుక.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి తన వివాహా వార్షికోత్సవాన్ని చాలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. విమానంలో తన సన్నిహితులు, స్నేహితులతో కలిసి జరుపుకున్నారు. ఫ్టైట్‌లో దుబాయ్ వెళ్తూ తమ పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నామని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఈ వేడుకల్లో అక్కినేని నాగార్జున, అమల దంపతులు కూడా ఉన్నారు. తాజాగా చిరు తమ పెళ్లి రోజు వేడుకకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. చిరంజీవి తన ట్వీట్లో రాస్తూ..' ప్రియమైన స్నేహితులతో కలిసి విమానంలో మా వివాహ వార్షికోత్సవాన్ని చాలా జరుపుకుంటున్నాం. సురేఖ లాంటి డ్రీమ్ లైఫ్ పార్ట్నర్ దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఆమె నా బలం, నా యాంకర్ కూడా. ప్రపంచంలోని అద్భుతమైన నాకు తెలియని వాటిని నావిగేట్ చేయడానికి ఎల్లప్పుడూ సహాయం చేస్తుంది. తను నా పక్కన ఉంటే సౌకర్యంతో పాటు అద్భుతమైన ప్రేరణ కూడా. ఈ సందర్భంగా నా సోల్‌మేట్ సురేఖకు ధన్యవాదాలు. నీ పట్ల నాకున్న ప్రేమ, అభిమానాన్ని తెలియజేయడానికి ఇలాంటివీ మరిన్నీ సందర్భాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు, అభిమానులు, కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార్ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. Celebrating our wedding anniversary on a flight with some very dear friends en route Dubai ! 🎉I always feel I am very fortunate to have found a dream life partner in Surekha. She is my strength, my anchor and the wind beneath my wings. Always helps me navigate through the… pic.twitter.com/h4gvNuW1YY— Chiranjeevi Konidela (@KChiruTweets) February 20, 2025