సెంచరీ కొట్టిన పుష్పరాజ్ .. మేకర్స్ స్పెషల్ వీడియో | Allu Arjun Pushpa 2 The Rule 100 DAYS FOR INDIAN CINEMA INDUSTRY HIT | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule: పుష్ప-2 ది రూల్‌ 100 డేస్.. మేకర్స్ స్పెషల్ వీడియో

Mar 14 2025 8:05 PM | Updated on Mar 14 2025 8:32 PM

Allu Arjun Pushpa 2 The Rule 100 DAYS FOR INDIAN CINEMA INDUSTRY HIT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప 2 గతేడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. అమిర్ ఖాన్   దంగల్ తర్వాత (రూ. 2,070 కోట్లు) ఇండియాలోనే రెండో స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, బాహుబలి లాంటి సినిమాల రికార్డులను తుడిచిపెట్టేసింది.

అయితే ఈ సినిమా విడుదలై నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో మేకర్స్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ పుష్ప 2  ది రూల్.. 100 డేస్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బద్దలు కొడుతూ.. భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కాగా..  ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

కాగా.. పుష్ప -2 విషయానికి వస్తే 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్‌ దర్శకత్వం వహించగా.. దేవి శ్రీప్రసాద్‌ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement