
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఏజెంట్'. 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా మెప్పించింది. అయితే అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.
అయితే ఈ మూవీ విడుదలై దాదాపు రెండేళ్లైన ఓటీటీకి రాలేదు. ఎట్టకేలకు ఈ నెల 14 నుంచి ఓటీటీకి రానుందని సోనిలివ్ ప్రకటించింది. అయితే అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందుగానే ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రోజు సాయంత్రం నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇంకేందుకు ఆలస్యం ఏజెంట్ మూవీని ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Secrets, shootouts, and a mission that rewrites the rules.#Agent is now streaming on SonyLIV.#AgentOnSonyLIV #Agent @mammootty @akkineniakhil @_vaidyasakshi#SurenderReddy #DinoMorea @varusarath5@UrvashiRautela #Varalakshmi pic.twitter.com/iAONMsxtZn
— Sony LIV (@SonyLIV) March 13, 2025
Comments
Please login to add a commentAdd a comment