
అక్కినేని హీరో నాగ చైతన్య ఇటీవలే తండేల్ మూవీతో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కించారు.
ఈ చిత్రంలో ఓ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బుజ్జితల్లి అంటూ సాగే లవ్ సాంగ్ చైతూ ఫ్యాన్స్‌ను అలరించింది. ఈ ప్రేమకథా చిత్రంలోని ఈ సాంగ్ హైలెట్‌గా నిలిచింది. ఈ పాట యూట్యూబ్‌లో ఏకంగా 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాను శ్రీకాకుళం మత్స్యకారుల రియల్ స్టోరీ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
(ఇది చదవండి: నాగచైతన్య వందకోట్ల మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)
తండేల్ ఓటీటీ డేట్ ఫిక్స్..
బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన తండేల్ ఓటీటీలోనూ సందడి చేయనుంది. మార్చి 7వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment