పొంగల్‌ బ్లాక్‌ బస్టర్‌ 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ | Sankranthiki Vasthunnam Movie Ott Release Date Officially Locked | Sakshi
Sakshi News home page

అఫీషియల్ ప్రకటన: ఓటీటీకి 'సంక్రాంతికి వస్తున్నాం'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Feb 27 2025 5:25 PM | Updated on Feb 27 2025 6:11 PM

Sankranthiki Vasthunnam Movie Ott Release Date Officially Locked

ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి-విక్టరీ వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం  థియేటర్లలో అదరగొట్టేసింది. పొంగల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ఓ రేంజ్‌లో అభిమానులను అలరించింది. దీంతో ఈ సినిమా ఓటీటీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం మేకర్స్ ఆడియన్స్‌ను షాకిచ్చారు. ఓటీటీ కంటే ముందు టీవీల్లో ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా ఓటీటీపై మరో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. టీవీల్లో ప్రసారం చేయడంతో ఓకేసారి ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని జీ5లో విడుదల చేసిన ప్రోమోలో చూపించారు. మార్చి 1న సాయంత్రం 6 గంటల నుంచి జీ తెలుగుతో పాటు జీ5లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. దీంతో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'సంక్రాంతి వస్తున్నాం' స్ట్రీమింగ్ కానుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement