
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్‌డమ్ మూవీతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు అభిమానుల అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఇటీవల సాంగ్ రిలీజ్ చేయగా విజయ్ దేవరకొండతో కెమిస్ట్రీ ఫుల్ రొమాంటిక్‌గా సెట్ అయింది. అయితే ఈనెల 30న థియేటర్లలో విడుదల కావాల్సిన కింగ్‌డమ్ ఊహించని విధంగా వాయిదా పడింది. ఇండియా- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కింగ్‌డమ్ మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జూలై 4న సినిమా థియేటర్లలోకి రానుందని వెల్లడించారు.
ఇక సినిమాల సంగతి పక్కనపెడితే విజయ్ తన ఫ్యామిలీతో చాలా సరదాగా గడుపుతూ ఉంటారు. ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో వేదికగా ఫోటోలు షేర్ చేస్తుంటారు. తాజాగా విజయ్ దేవరకొండ తన తల్లి కోరికను తీర్చాడు. ఈ వీకెండ్‌లో డిన్నర్ బయట ప్లాన్ చేద్దామని అమ్మ కోరడంతో వెంటనే విజయ్ డిన్నర్ ప్లాన్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అమ్మానాన్న, తమ్ముడు ఆనంద్‌తో డిన్నర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
(ఇది చదవండి: అటు రొమాన్స్.. ఇటు యాక్షన్.. 'కింగ్డమ్' తొలి పాట చూశారా?)
విజయ్ తన పోస్ట్‌లో రాస్తూ..'అమ్మ అకస్మాత్తుగా మనం డిన్నర్ కి బయటకు వెళ్దామని అడిగింది. మేము బయటకు వెళ్లి చాలా కాలం అయింది. మనమందరం ఎప్పుడూ పని, లక్ష్యాల వెంట పరిగెడుతుంటాం. పనిలో బిజీగా ఉంటూ కొన్నిసార్లు జీవించడం మర్చిపోతాం. అందుకే నిన్న రాత్రి మేము బయటకు వెళ్లి చాలా సమయం గడిపాం. మీరు కూడా మీ అమ్మ, నాన్నలతో సమయం గడపడం మర్చిపోవద్దు. వారిని బయటకు తీసుకెళ్లండి, వారికి కొన్ని కౌగిలింతలు, ముద్దులు ఇవ్వండి. మీరు వారిని ప్రేమిస్తున్నారని చెప్పండి. మీ అందరికీ, మీ కుటుంబాలకు చాలా ప్రేమను పంపుతున్నా' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.