
మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవలే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను త్వరలోనే తండ్రిగా ప్రమోట్ కాబోతున్నట్లు ప్రకటించారు. తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి ఈ శుభవార్తను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఇక తన భార్య ప్రస్తుతం ప్రెగ్నెన్సీ ధరించడంతో మెగా హీరో కొత్త అవతారం ఎత్తాడు. తన ముద్దుల సతీమణి కోసం చెఫ్‌గా మారిపోయారు. స్వయంగా తానే పిజ్జా తయారు చేసి తన భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు మెగా హీరో. వరుణ్ తేజ్ పిజ్జా తయారు చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. 2023లో వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే ఈ జంట మొదటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారు. 2017లో వరుణ్, లావణ్యల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది.వీరిద్దరు కలిసి ‘మిస్టర్’ అనే సినిమాలో తొలిసారి నటించారు. ఆ సమయంలోనే వీరికి పరిచయం ఏర్పడింది. చివరికీ వీరిద్దరి ప్రేమ సక్సెస్ కావడంతో కుటుంబ సభ్యుల ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. వరుణ్, లావణ్యల పెళ్లి ఇటలీలో జరగగా.. హైదరాబాద్‌లో రిసెప్షన్ ఘనంగా జరిగింది.
(ఇది చదవండి: మెగా కోడలిగా తొలి సినిమా.. లేటేస్ట్ అప్‌డేట్ వచ్చేసింది!)
ఇక సినిమాల విషయానికొస్తే వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో నటిస్తున్నారు. మెగా కోడలు లావణ్య త్రిపాఠి సైతం సతీ లీలావతి అనే సినిమాలో కనిపించనుంది. వరుణ్‌తేజ్‌తో పెళ్లి తర్వాత మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి నటిస్తోన్న మొదటి చిత్రం కావడం విశేషం.