రాబిన్‌హుడ్‌తో మల్లారెడ్డి.. అదిదా సర్‌ప్రైజ్‌ అంటోన్న మల్లన్న! | Ex Minister Malla Reddy Dance at Tollywood Hero Nithiin Robinhood Movie event | Sakshi
Sakshi News home page

Robinhood Movie: రాబిన్‌హుడ్‌తో మల్లారెడ్డి.. మరోసారి అదరగొట్టేశాడు!

Published Wed, Mar 19 2025 8:55 PM | Last Updated on Thu, Mar 20 2025 8:57 AM

Ex Minister Malla Reddy Dance at Tollywood Hero Nithiin Robinhood Movie event

నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్. ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కించారు. భీష్మ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలకు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా నటించారు.  ఈ మూవీ ద్వారా వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

ప్రస్తుతం రాబిన్‌హుడ్‌ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి మెడికల్ సైన్సెస్ కాలేజీలో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మల్లా రెడ్డి కూడా హాజరయ్యారు. ఇంకేముంది మల్లన్న తన టాలెంట్‌ను మరోసారి ప్రదర్శించారు. వేదికపై నితిన్‌తో కలిసి స్టెప్పులు వేశారు. రాబిన్‌హుడ్‌ మూవీలోని అదిదా సర్‌ప్రైజ్‌ అంటూ సాగే ఐటమ్‌ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ మల్లన్నా మజాకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రాబిన్‌హుడ్‌ చిత్రం ఉగాది కానుకగా ఈనెల 28న థియేటర్లలో సందడి చేయనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement