
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం స్వయంభూ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇక సినిమాల సంగతి పక్కనపెడితే నిఖిల్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో చూసేద్దాం.
ఇండియా-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో నిఖిల్ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. పాక్‌కు మద్దతుగా టర్కీ నిలవడంపై నిఖిల్ ఫైరయ్యారు. ఇకపై ఎవరూ కూడా టర్కీని సందర్శించవద్దని భారతీయులను కోరారు. టర్కీలో భారతీయులు ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తారని.. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. విహారయాత్రల కోసం అలాంటి దేశాలకు మనం వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. పాక్‌తో తాము సత్సంబంధాలు కొనసాగిస్తామని టర్కీ ప్రెసిడెంట్ ఎర్గోడాన్ చేసిన కామెంట్స్‌పై ఓ నెటిజన్స్ పోస్ట్ చేశాడు. దీనిపై టాలీవుడ్ హీరో నిఖిల్ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఆ సమయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా టర్కీతో పాటు చైనా కూడా సాయం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టర్కీ యాపిల్స్‌ను సైతం దిగుమతి చేసుకోవడం ఆపేశారు.
Anyone still visiting Turkey ? Please read this Below Thread...
Indians Spend Billions of Dollars Every year in Turkey.
Please Stop giving your money to the Nations who are against us. #Tourism #India https://t.co/hUGq6MP6Pm— Nikhil Siddhartha (@actor_Nikhil) May 14, 2025