
కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు భారతీరాజా తనయుడు మనోజ్ గుండెపోటుతో మంగళవారం సాయంత్రం మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన మనోజ్‌కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 48 ఏళ్లు కాగా.. ఇటీవలే ఆయనకు గుండెకు శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది.
అయితే ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంతాపం వ్యక్తం చేసింది. మనోజ్ మృతితో కీలక నిర్ణయం తీసుకుంది. తమ బ్యానర్‌లో తెరకెక్కించబోయే ప్రదీప్ రంగనాథన్ మూవీ ప్రకటనను వాయిదా వేసింది. ఇవాళ ఉదయం 11:07 నిమిషాలకు విడుదల కావాల్సిన ఫస్ట్ షాట్ బూమ్ టైమ్‌ను మార్చినట్లు ట్విటర్ ద్వారా వెల్లడించింది.
(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. దర్శకుడు భారతీరాజా కుమారుడు కన్నుమూత)
కాగా.. మనోజ్ భారతిరాజా ప్రముఖ లెజెండరీ ఫిల్మ్ మేకర్ భారతిరాజా కుమారుడు. మనోజ్ తొలిసారిగా తాజ్ మహల్ (1999)మూవీలో నటించారు. ఆ తర్వాత అల్లి అర్జున (2002), కాదల్ పుక్కల్ (2001), అన్నక్కోడి, పల్లవన్, లాంటి తమిళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. గత రెండేళ్లుగా దర్శకత్వం వైపు అడుగులు వేశారు. తన తండ్రి నిర్మించిన 2023 తమిళ చిత్రం మార్గజి తింగల్‌తో దర్శకుడిగా పరిచయమయ్యారు.
Due to the unfortunate passing of Manoj Bharathiraja Sir, son of legendary filmmaker Bharathiraja Sir, the #PR04 'FIRST SHOT BOOM' is postponed to a later time today.
Our heartfelt condolences to the family. May the family find strength and peace in these tough times.— Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2025