'ఆ దేవుడే రక్షించాడు'.. మార్క్ శంకర్‌ ఆరోగ్యంపై చిరంజీవి ‍ట్వీట్.. | Megastar Chiranjeevi Shares Health Update On Pawan Kalyan’s Son Mark Shankar | Sakshi
Sakshi News home page

Megastar chiranjeevi: 'హనుమాన్ మా బిడ్డను రక్షించాడు'.. చిరంజీవి ‍ట్వీట్

Apr 10 2025 8:02 PM | Updated on Apr 10 2025 9:35 PM

Megastar chiranjeevi Tweet On Pawan Kalyan Son Mark Sankar Health

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడని ఆయన తెలిపారు. అయితే బాబు ఇంకా కోలుకోవాలని.. మా కుల దైవం ఆంజనేయ స్వామి దయతో మళ్లీ మామూలుగా వస్తాడని ట్వీట్ చేశారు. ఓ పెద్ద ప్రమాదం నుంచి  పసిబిడ్డని హనుమాన్ రక్షించాడని పోస్ట్ చేశారు. మార్క్ శంకర్‌ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ నా తరపున, తమ్ముడు పవన్ కల్యాణ్ తరఫున ధన్యవాదాలు తెలియచేస్తున్నా అని రాసుకొచ్చారు.

మెగాస్టార్ తన ట్వీట్‌లో రాస్తూ.. 'మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు. అయితే బాబు ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో  త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్లీ మామూలుగా ఎప్పటిలానే  ఉంటాడు. రేపు  హనుమత్ జయంతి.. ఆ స్వామి ఓ పెద్ద  ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ  సందర్భంగా ఆయా ఊర్లలో, ఆయా  ప్రాంతాల్లో మార్క్  శంకర్  కోలుకోవాలని ప్రతి  ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి  ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కల్యాణ్ బాబు  తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం' అని పోస్ట్ చేశారు.

ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన విశ్వంభరం మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విశ్వంభరకు సంబంధించిన మెగా అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement