
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ముంబయిలో సందడి చేశారు. ప్రతిష్టాత్మక వేవ్స్ సమ్మిట్-2025కు బన్నీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఈ సమ్మిట్‌లో పంచుకున్నారు. సినీరంగంలో తనకు మామయ్య మెగాస్టార్ చిరంజీవినే ఆదర్శమంటూ కామెంట్స్ చేశారు. పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్.. ప్రస్తుతం జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టనున్నారు. ఈ సినిమా బన్నీ కెరీర్‌లో 22వ చిత్రంగా రానుంది.
ఇదంతా పక్కన పెడితే వేవ్స్ సమ్మిట్‌కు వెళ్తూ మన ఐకాన్ స్టార్ ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కారు దిగి ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లే సమయంలో ఓ అభిమాని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. కానీ అతనితో ఫోటో దిగేందుకు బన్నీ అనుమతించలేదు. అతన్ని పక్కనే ఉన్న సెక్యూరిటీ సైతం వద్దని వారించారు.
దీంతో అల్లు అర్జున్ వైఖరిపై నెటిజన్స్ ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదని పోస్టులు పెడుతున్నారు. అభిమానులే లేకపోతే అసలు మీరు ఎవరు? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. వెంటనే అల్లు అర్జున్ సినిమాలు చూడటం మానేయాలని మరో నెటిజన్ కామెంట్ చేశారు. అయితే మరికొందరు అల్లు అర్జున్‌కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. బిజీ షెడ్యూల్ వల్ల వారికి సమయం ఉండదని అంటున్నారు.