
దేవన్, ధన్య బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం 'కృష్ణలీల'. ఈ చిత్రాన్ని హీరో దేవన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'ప్రేమించడం.. ప్రేమించబడటం.. రెండూ కర్మలే.'.. ప్రేమ అనే ధర్మం దేవతలైనా.. రాక్షసులైనా.. యోగి అయినా..భోగి అయినా ఎవరైనా అనుభవించాల్సిందే' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది.
టీజర్‌లో 'ఈ ప్రేమను అనైతికంగా అనుభవించాలనుకున్నా.. దూరం పెట్టాలనుకున్నా.. అది నీకు సరైన పాఠం నేర్పుతుంది' అనే డైలాగ్ వింటే ప్రేమ అనే కోణంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వినోద్ కుమార్ , పృధ్వీ, రవి కాలే , తులసి, సరయు , ఆనంద్ భరత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు.