మంచి సందేశాన్ని ఇచ్చే చిత్రమే 'బందీ': ఆదిత్య ఓం | Actor Aditya Om latest Movie Bandhi Success Meet | Sakshi
Sakshi News home page

Aditya Om: మంచి సందేశాన్ని ఇచ్చే చిత్రమే 'బందీ': ఆదిత్య ఓం

Mar 7 2025 8:01 PM | Updated on Mar 7 2025 8:01 PM

Actor Aditya Om latest Movie Bandhi Success Meet

టాలీవుడ్ నటుడు ఆదిత్య ఓం ఇటీవలే బందీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతవారం విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రఘు తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గల్లీ సినిమా బ్యానర్‌పై నిర్మించారు.  ఈ మూవీ మంచి విజయాన్ని సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 'బందీ సినిమా అద్భుతంగా ఉంది. పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో తీశాం. మేము ఊహించినట్లే అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆదిత్య ఓం ఎంతో విలక్షణ నటుడు. యూపీ నుంచి ఇక్కడకు వచ్చి ప్యాషన్‌తో చేస్తున్నారు. రఘు తిరుమల మంచి పాయింట్‌తో సినిమా తీశారు. అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రం కమర్షియల్‌గా ఆడటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

రఘు తిరుమల మాట్లాడుతూ.. 'మా లాంటి కొత్త వాళ్లని ఆదిత్య ఓం చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఆయన సహకారంతోనే సినిమా ఇంత బాగా తీయగలిగాం. ఆయన లేకపోతే ఈ సినిమానే లేదు. వెంకటేశ్వరరావు ఈ మూవీని చూసి ఎగ్జైట్ అయ్యారు. ఈ సినిమాలో మ్యూజిక్, విజువల్స్ గురించి అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు చాలా థాంక్స్' అని అన్నారు.

ఆదిత్య ఓం మాట్లాడుతూ.. 'బందీ సినిమాను చాలా బాగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం పర్యావరణ అసమతుల్యత వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. మంచి సందేశాన్ని ఇచ్చేలా తెరకెక్కించిన బందీ మూవీని ఆదరిస్తున్న ఆడియన్స్‌కు ధన్యవాదాలు. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని మంచి చిత్రాలతో ఆడియన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేస్తాను.' అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement