
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఆయనపై కేసు నమోదు కావడంతో జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు వచ్చారు. తన ఇంటికి వెళ్తున్న క్రమంలో జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద రాంగ్ రూట్‌లో కారు నడపడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. అవసరమైతే మరోసారి కోర్టు విచారణకు రావాలని ఆయనకు పోలీసులు సూచించారు. ఇప్పటికే హీరో కారును సీజ్ చేసిన పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించారు.
(ఇది చదవండి: దురుసు ప్రవర్తన.. టాలీవుడ్ హీరోపై కేసు నమోదు!)
అసలేం జరిగిందంటే..
జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టుల కాలనీలో నివాసం ఉంటున్న బెల్లకొండ శ్రీనివాస్ ఇంటికి వెళ్తున్న సమయంలో రాంగ్ రూట్‌లో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. తనని అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసుతో ఆయన దురుసుగా ప్రవర్తించారు. ఈ సంఘటనను ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ కావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం భైరవం మూవీలో నటిస్తున్నారు.