అంత ఎనర్జీ ఎక్కడా చూడలేదు.. సింగిల్‌ షాట్‌లో చేశారు: సునీల్ | Tollywood Actor Sunil Abouy Ajith Kumar latest Movie Good Bad Ugly | Sakshi
Sakshi News home page

Sunil: 'ఉదయాన్నే నాలుగు గంటలకే వచ్చారు.. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా'

Apr 13 2025 7:40 PM | Updated on Apr 13 2025 7:52 PM

Tollywood Actor Sunil Abouy Ajith Kumar latest Movie Good Bad Ugly

టాలీవుడ్ నటుడు సునీల్‌ ఇటీవల అజిత్ కుమార్‌ హీరోగా నటించిన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రంలో కనిపించారు. ఈ సినిమాలో స్టైలిష్ గెటప్‌లో కనిపించి అభిమానులను సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. అధిక్ రవిచంద్రన్‌ తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ రావడంతో మేకర్స్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. బ్లాక్ బస్టర్‌ సంభవం పేరిట వేడుకలు నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సునీల్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోలీవుడ్‌ స్టార్ హీరో అజిత్ కుమార్‌ను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన ఎనర్జీ వేరే లెవెల్ అని సునీల్ మాట్లాడారు. ఇంత సింప్లిసిటీ ఉన్న మనిషిని చూసిన ఫీలింగ్ వచ్చిందని అన్నారు.

అజిత్‌ గురించి మాట్లాడుతూ..'మీరు పొద్దున్నే రన్నింగ్‌కు వెళ్తారంట కదా అని నన్ను అడిగారు. నేను కూడా రావొచ్చా అండి అజిత్ అన్నారు. సరే అని అన్నా. ఉదయం 4 గంటలకే ఒక్కరే కారు నడుపుకుంటూ వచ్చారు. దాదాపు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాం. ఆ తర్వాత ఇంకా వాకింగ్ చేద్దామని ఆయన అన్నారు. మొత్తం 9 కిలోమీటర్లు నడిచాం. ఆ తర్వాత షూటింగ్ లోకేషన్ మియాపూర్‌కు గంటన్నర పడుతుంది. అక్కడికి ఆయనతో కలిసి వెళ్లా. ఇంటర్వెల్‌ ఫైట్‌లో వచ్చిన షాట్‌ అప్పుడే చేశారు.  ఆ రోజు 27 మందితో సింగిల్‌షాట్‌లో చేశారు. మళ్లీ వచ్చేటప్పుడు ఆయనే గంటన్నర కారు డ్రైవింగ్ చేశారు. అంత ఎనర్జీ పర్సన్‌ను నేనేప్పుడూ చూడలేదు. పైగా ఆయన సినిమాలో డూప్‌లు పెట్టకూడదు. ఈ సినిమా ద్వారా అజిత్ నుంచి చాలా నేర్చుకున్నా. ఆయనను భగవంతుడు బాగా చూడాలని కోరుకుంటున్నా. ఫ్యాన్స్‌ ఈ సినిమా చూసి అందరూ పండగ చేసుకుంటున్నారు.' అని అన్నారు.

విదాముయార్చి తర్వాత అజిత్ కుమార్ నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించింది. ఫుల్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement