చైతూతో ప్రేమకథ అలా మొదలైంది.. రివీల్ చేసిన శోభిత ధూళిపాల | Sobhita Dhulipala reveals love story with Naga Chaitanya started | Sakshi
Sakshi News home page

Sobhita Dhulipala: 'మా లవ్ స్టోరీ అలా మొదలైంది'.. రివీల్ చేసిన శోభిత ధూళిపాల

Published Wed, Mar 19 2025 3:29 PM | Last Updated on Wed, Mar 19 2025 3:46 PM

Sobhita Dhulipala reveals love story with Naga Chaitanya started

టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాలను పెళ్లాడారు. గతేడాది డిసెంబర్ వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని ‍అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీతారలు హాజరయ్యారు.

అయితే ఈ జంట పెళ్లి తర్వాత తొలిసారి ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ప్రముఖ మ్యాగజైన్ వోగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తమ ప్రేమకథ తొలిసారి ఎక్కడ మొదలైందనే విషయాన్ని రివీల్ చేశారు. సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు శోభిత స్పందించారు. మిమ్మల్ని చైతూ ఫాలో అవుతున్నాడు.. కానీ మీరెందుకు ఫాలో కావడం లేదని ఓ నెటిజన్‌ తనను అడిగాడని వెల్లడించింది. ఆ తర్వాత నేను చైతూ ప్రొఫైల్‌కి వెళ్లి చూస్తే నాతో పాటు కేవలం 70 మందిని మాత్రమే అతను ఫాలో అవుతున్నాడని తెలుసుకున్నా.. ఆ తర్వాత చైతన్యను ఫాలో అయ్యానని తెలిపింది.

అప్పటి నుంచి మేమిద్దరం చాటింగ్ ప్రారంభించినట్లు శోభిత తెలిపింది. ఏప్రిల్ 2022లో చైతన్య- నేను తొలిసారి కలుసుకున్నట్లు శోభిత వివరించింది. ముంబయికి టికెట్‌ బుక్ చేసుకుని వచ్చిన చైతూతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశా.. అప్పటి నుంచి మా డేటింగ్ మొదలైందని చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా చాలా నేచురల్‌గా జరిగిందని వెల్లడించింది. ఆ తర్వాత ఒకరి కుటుంబాలను ఒకరు కలుసుకున్నట్లు పేర్కొంది. అలా తమ ప్రేమ మొదలైందని తాజా ఇంటర్వ్యూలో శోభిత తమ లవ్ స్టోరీని రివీల్ చేసింది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement