-
కర్రలతో కొట్టి.. గాయాలపై కారం చల్లి
కొత్తగూడ: చోరీకి పాల్పడ్డాడనే అనుమానంతో ఓ దళిత యువకుడిని కర్రలతో చావకొట్టి.. రక్తం కారుతున్న గాయాలపై కారం చల్లి చిత్ర హింసలు పెట్టిన అమానవీయఘటనకు సంబంధించిన వీడియో శనివారం కలకలం రేపింది. బాధితుడి కథనం మేరకు.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం జంగవానిగూడెం(రాంపూర్) గ్రామానికి చెందిన యువకుడు వంకాయల కార్తీక్‌ను అదే మండలం పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన టెంట్‌హౌస్ యజమాని గద్ద అశోక్ పనికి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో డీజే(సౌండ్ బాక్స్)లో ఉపయోగించే యాంప్లిఫైయర్ చోరీకి గురైందని, దాన్ని ఖానాపూర్‌లో విక్రయించారని యజమాని అశోక్ గుర్తించాడు. దీంతో అశోక్ కొందరు వ్యక్తులను తీసుకుని ఈ నెల 19వ తేదీన జంగవానిగూడెం వెళ్లి కార్తీక్‌తో పని ఉందని చెప్పి కారులో ఎక్కించుకుని పొగుళ్లపల్లి సమీప అటవీప్రాంతానికి తీసుకెళ్లి కర్రలతో చితకబాదారు. తప్పించుకుని పారిపోయే క్రమంలో మళ్లీ పట్టుకుని పొగుళ్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకువచ్చారు. ఒంటిపై షర్ట్ విప్పి కార్యాలయ కిటికీకి కట్టి కర్రలతో బాదారు. రక్తం కారుతుండగా గాయాలపై కారం చల్లుతూ చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనను మొత్తం వీడియో తీశారు. స్పృహ కోల్పోయిన కార్తీక్‌ను ఇంటి వద్ద వదిలేశారు. గాయాలతో మూలుగుతున్న యువకుడిని బంధువులు నర్సంపేట పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కార్తీక్‌పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 20వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసులు టెంట్‌హౌస్ యజమాని ఫిర్యాదు మేరకు కార్తీక్‌పై చోరీ కేసు, కార్తీక్‌పై దాడి చేసిన ఘటనలో అశోక్‌తోపాటు మరికొంత మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ విషయాన్ని గోప్యంగా ఉంచారు. సమాచారం తెలుసుకున్న దళిత సంఘాలు మహబూబాబాద్ డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రాత్రి దాడి ఘటన వివరాలు బయటికి వచ్చాయి. -
మానవత్వమే అతడి పాలిట మృత్యువై..
మహబూబ్‌నగర్: మానవత్వమే అతడి పాలిట మృత్యువైంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువకుడితో పాటు అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదం ఇద్దరి జీవితాలను ఛిద్రం చేయడమే గాక.. వారి కుటుంబసభ్యుల ఆశలను సమాధి చేసింది. ఈ విషాదకర ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షి నర్సింహులు, ఎస్ఐ రమేష్ వివరాల మేరకు.. కల్వకుర్తి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన నవాజ్ (25) టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి 11 నెలల కిందట వివాహం కాగా.. 10 రోజుల క్రితం కూతురు జన్మించింది. తన కుమార్తెను చూసేందుకు గురువారం మధ్యాహ్నం బైక్‌పై తన అత్తగారి ఊరైన జడ్చర్ల పట్టణానికి వెళ్లాడు. అక్కడి నుంచి రాత్రి కల్వకుర్తికి బయల్దేరగా.. మండలంలోని మార్చాల సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో హాలియా నుంచి కొత్తకోట మండలం కనిమెట్టకు వెళ్తున్న ఓ కంపెనీ పాల వ్యాన్ హెల్పర్ అశోక్ (30) ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నవాజ్‌ను గమనించి కాపాడే ప్రయత్నం చేస్తుండగా.. కల్వకుర్తి వైపు వేగంగా వెళ్తున్న మరో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో నవాజ్‌తో పాటు అశోక్‌కు తీవ్రగాయాలై దుర్మరణం చెందారు. అశోక్‌ది వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామం. పాల వ్యాన్ డ్రైవర్ నర్సింహులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరి మృతదేహాలను కల్వకుర్తి మార్చురీకి తరలించారు. కాగా.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద ఇరువురి కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి. పాలవ్యాన్ డ్రైవర్ నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. కనిమెట్టలో విషాదఛాయలు.. కొత్తకోట మండలంలోని కనిమెట్టకు చెందిన చీర్ల నాగమ్మ, వెంకటయ్య దంపతుల కుమారుడు అశోక్ కొంత కాలంగా గ్రామ సమీపంలోని ఓ డెయిరీ మిల్క్ ఫ్యాక్టరీకి చెందిన లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. కల్వకుర్తి మండలం మార్చాల వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో అశోక్ దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇవి కూడా చదవండి: బైక్‌ను వెనక నుంచి ఢీకొట్టిన లారీ.. యువకుల దుర్మరణం! -
కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు? ఓడితే బాధ్యులెవరు?
రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు గందరగోళానికి దారితీస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు తేలగా, కొన్నింటిలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అయితే ఇప్పుడు గెలుపు ఓటములు రెండూ కాంగ్రెస్‌కు కొత్త సవాళ్లను సృష్టించనున్నాయి. గత కొన్నేళ్లుగా రాజస్థాన్‌లో కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ పోరుకు పునాది సీఎం కుర్చీ. ప్రస్తుత ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈ పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. రాజస్థాన్‌లో ఒకవేళ కాంగ్రెస్ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మరోమారు ముఖ్యమంత్రి పదవి కోసం యుద్ధం మొదలుకానున్నదని తెలుస్తోంది. దీనిని చూస్తుంటే మరోసారి 2018 ఎన్నికల ఫలితాల తరహా పరిస్థితి ఏర్పడవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. 2018లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుపొందినప్పుడు పార్టీలోని ఒక వర్గం సచిన్ పైలట్‌కు మద్దతు ఇచ్చింది. అయితే పార్టీలో అశోక్ గెహ్లాట్ సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని ఆయనకు మరోమారు సీఎం అయ్యే అవకాశం కల్పించారు. ఈ నేపధ్యంలో ఆయన రెండున్నరేళ్ల పాటు సీఎంగా ఉండాలనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చనే వార్తలు కూడా వినిపించాయి. ఆ దిరిమిలా 2020లో సచిన్ పైలట్ తనను ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చి, తిరుగుబాటుకు దిగారు. ఈ నేపధ్యంలో పైలెట్ డిప్యూటీ సీఎం పదవిని కోల్పోవలసి వచ్చింది. అయితే ఇప్పుడు ఎన్నికల వేళ గెహ్లాట్, పైలట్ల మధ్య టెన్షన్ కాస్త తగ్గినట్లు కనిపించినా, ఫలితాల వెల్లడి తర్వాత మళ్లీ సమస్యలు తలెత్తడం ఖాయం అని పలువురు అంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ ఓటమిపాలైనా గెహ్లాట్-పైలట్ అంశం కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారనుంది. అప్పుడు ఆటంతా ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య తిరుగుతుంది. అలాంటి పరిస్థితిలో వీరిద్దరి మధ్య సంబంధాలు చెడిపోతే.. పార్టీ మళ్లీ వారిని బుజ్జగించే పని చేయాల్సి వస్తుంది. రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే కాంగ్రెస్‌కు 86 నుంచి 106 సీట్లు వస్తాయని, బీజేపీకి 80 నుంచి 100 సీట్లు వస్తాయని పలు మీడియా సంస్థలు అంచనా వేశాయి. ఇది కూడా చదవండి: ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం -
విజయానికి ఏడు హామీలు
రాజస్థాన్‌లో గత 30 ఏళ్లలో అధికార పార్టీ నెగ్గిన దాఖలా లేదు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రభుత్వం మారుతూ వస్తోంది. ఈసారి మాత్రం వరుసగా రెండో విజయంతో చరిత్రను తిరగరాసేందుకు సీఎం అశోక్ గహ్లోత్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ విషయంలో ‘ఏడు హామీ’లపై బాగా ఆశలు పెట్టుకున్నారు. ఆ పథకాలు తనను కచ్చితంగా గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు...! రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పర్వం క్లైమాక్స్‌కు చేరుతోంది. అధికార కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. పోలింగ్‌కు మరో మూడు రోజులే ఉంది. గురువారం సాయంత్రంతో ప్రచారానికి కూడా తెర పడనుంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని సీఎం గహ్లోత్ టాప్ గేర్‌లోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్ తరఫున అంతా తానై వ్యవహరిస్తున్నారు. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో వీలైనన్ని అసెంబ్లీ స్థానాలను కవర్ చేయనున్నారు. ముఖ్యంగా మహిళలకు రూ.10 వేల భృతి మొదలుకుని రూ.25 లక్షల వైద్య సాయం దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న, అందించబోయే పథకాలను ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ప్రచార సభలోనూ అవి ప్రధానంగా ప్రస్తావనకు వచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. జీవన్మరణ సమస్య! 72 ఏళ్ల గహ్లోత్‌కు ఒకరకంగా ఈ అసెంబ్లీ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్‌ను ఈసారి ఆయన పూర్తిగా పక్కన పెట్టారు. కనుక ఫలితాలు ఏ మాత్రం వికటించినా గహ్లోత్ రాజకీయ జీవితానికి తెర పడవచ్చన్న అభిప్రాయముంది. అందుకే కొద్ది రోజులుగా ఆయన దూకుడు పెంచారు. రోజుకు కనీసం నాలుగైదు సభల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఒక్క రోజు ఏకంగా 800 కిలోమీటర్లు పర్యటిస్తున్నారు! తన ఓబీసీ సామాజిక వర్గ మూలాలను కూడా సమయానుకూలంగా ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ప్రచార సభలోనూ ప్రధాని మోదీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆయన ప్రసంగాల్లో కాంగ్రెస్ పథకాలనే యథాతథంగా కాపీ కొడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. తమ ఏడు హామీలకు పోటీగా బీజేపీ తెరపైకి తెచ్చిన ‘మోదీ హామీ’లను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ, అవన్నీ కాంగ్రెస్ హామీలకు నకళ్లేనని పదేపదే చెబుతున్నారు. ‘‘ఇది బీజేపీకి బాగా మైనస్‌గా మారుతోంది. ఈసారి కచ్చితంగా గెలుపు కాంగ్రెస్‌దే. ఓటర్లు ఈ మేరకు నిర్ణయించుకున్నారు కూడా’’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రోజూ క్రమం తప్పకుండా స్వీయ ప్రచార వీడియోలను కూడా విడుదల చేస్తూ, అవి వీలైనంత మందికి చేరేలా జ్రాగత్తలు తీసుకుంటున్నారు గహ్లోత్. అధిష్టానం అనుగ్రహం కోసం... రాష్ట్రస్థాయిలో గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూనే, అధిష్టానంతో సంబంధాలను కూడా సరిదిద్దుకునే పనిలో పడ్డారు గహ్లోత్. గతేడాది కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాల్సిందిగా సోనియా ఆదేశించినా ఆయన బేఖాతరు చేయడం తెలిసిందే. దీనిపై గాంధీ కుటుంబం గుర్రుగా ఉన్న నేపథ్యంలో, వీలు దొరికినప్పుడల్లా సోనియా, రాహుల్, ప్రియాంకలను ఆయన ఆకాశానికెత్తుతూ వస్తున్నారు. రాష్ట్ర ప్రచార పర్వమంతా రాహుల్, ప్రియాంక కనుసన్నల్లోనే జరుగుతోందని పదేపదే చెప్పుకొస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఏడు హామీలు... 1. కుటుంబ పెద్ద అయిన మహిళకు ఏటా రూ.10,000 భృతి 2. ప్రభుత్వ కాలేజీలో చేరే ప్రతి విద్యార్థికి ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్ 3. చిరంజీవి ఆరోగ్య బీమా పథకం ద్వారా రూ.25 లక్షల దాకా వైద్య సాయం. ఇందులో భాగంగా రూ.15 లక్షల ప్రమాద బీమా 4. అందరికీ ఉచితంగా ఇంగ్లిష్ మీడియం విద్య 5. రాష్ట్రంలో కోటి కుటుంబాలకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ 6. పాత పెన్షన్ పథకానికి చట్టబద్ధత 7. రైతుల నుంచి రూ.2కు కిలో చొప్పున పేడ కొనుగోలు -
భారత అమెరికన్లకు అత్యున్నత పురస్కారాలు
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలు అశోక్ గాడ్గిల్, సుబ్రా సురేశ్ అమెరికా అత్యున్నత శాస్త్ర సాంకేతిక రంగ అవార్డులు అందుకున్నారు. గాడ్గిల్‌కు వైట్ హౌస్ నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్, సురేశ్‌కు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అవార్డులు దక్కాయి. అధ్యక్షుడు జో బైడెన్ వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులతో అందజేశారు. మానవ జీవితాన్ని సుఖవంతం చేసే పలు అమూల్య పరికరాలను కనిపెట్టిన ఘనత గాడ్గిల్ది అంటూ కొనియాడారు. ఇక మెటీరియల్ సైన్స్, ఇతర రంగాల్లో దాని వాడకాన్ని సురేశ్ కొత్త పుంతలు తొక్కించారన్నారు. ఈ అవార్డులను అగ్ర శ్రేణి అమెరికా ఇన్నొవేటర్లకు అందిస్తుంటారు. కింది స్థాయి నుంచి... ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న శాస్త్రవేత్తలిద్దరిదీ కష్టించి కింది స్థాయి నుంచి ఎదిగిన నేపథ్యమే. గాడ్గిల్ 1950లో ముంబైలో జని్మంచారు. అక్కడ, ఐఐటీ కాన్పూర్‌లో ఫిజిక్స్‌లో డిగ్రీలు పొందారు. యూసీ బర్కిలీ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. 1980లో లారెన్స్ బర్కిలీ ల్యాబ్‌లో చేరారు. ఈ ఏడాదే రిటైరయ్యారు. అక్కడే సివిల్ అండ్ ఎని్వరాన్మెంటల్ గౌరవ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. చౌకైన, సురక్షిత తాగునీటి సదుపాయాలు, తక్కువ ఇంధనంతో సమర్థంగా పని చేసే గ్యాస్ స్టౌలు, మెరుగైన విద్యుద్దీపాల అభివృద్ధిలో ఆయన పరిశోధనలు ఎంతగానో దోహదపడ్డాయి. ముంబైకే చెందిన సురేశ్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ సారథిగా వ్యవహరించారు. ఈ ఘనత సాధించిన తొలి ఆసియన్ అమెరికన్‌గా నిలిచారు. 1956లో పుట్టిన ఆయన ఐఐటీ మద్రాస్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి రెండేళ్లలో పీహెచ్డీ పూర్తి చేశారు. 1983లో బ్రౌన్ వర్సిటీలో ఇంజనీరింగ్ విభాగంలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రొఫెసర్‌గా రికార్డులకెక్కారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement