రివాల్వర్‌ రాణి: వరుడి తలకు తుపాకీ పెట్టి.. | Revolver Rani In Uttar Pradesh Stops Wedding, Kidnaps Groom. Here's Why | Sakshi
Sakshi News home page

రివాల్వర్‌ రాణి: వరుడి తలకు తుపాకీ పెట్టి..

May 17 2017 1:23 PM | Updated on Sep 5 2017 11:22 AM

రివాల్వర్‌ రాణి: వరుడి తలకు తుపాకీ పెట్టి..

రివాల్వర్‌ రాణి: వరుడి తలకు తుపాకీ పెట్టి..

తనను ప్రేమించి మోసం చేసి వేరే అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడంటూ..

బుందేల్‌ఖండ్‌: తనను ప్రేమించి మోసం చేసి వేరే అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడంటూ ఓ యువతి రివాల్వర్‌తో పెళ్లి మండపానికి వచ్చి వరుడిని కిడ్నాప్‌ చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పెళ్లి మండపానికి సుమోలో ఇద్దరు వ్యక్తులతో కలిసి వచ్చిన యువతి..' ఇతను నన్ను ప్రేమించాడు. ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమై నన్ను మోసగిస్తున్నాడు. నేను ఈ పెళ్లిని ఎట్టి పరిస్ధితుల్లో జరగనివ్వను' అంటూ వరుడి తలకు వెంట తెచ్చుకున్న తుపాకి గురి పెట్టి అతన్ని కిడ్నాప్‌ చేసింది. కళ్ల ముందు జరిగిన ఈ సంఘటనతో వివాహానికి హాజరైన బంధువులు షాక్‌కు గురయ్యారు.

వెంటన్‌ దగ్గరలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇలాంటి అమ్మాయిలు ఉంటేనే అబ్బాయిలకు బుద్ధి వస్తుందని ఓ పోలీస్‌ అధికారి కిడ్నాప్‌ చేసిన యువతిని 'రివాల్వర్‌ రాణి' వ్యాఖ్యానించారు. కాగా, పెళ్లిపీటల మీద పెళ్లి ఆగిపోవడంపై స్పందించిన వధువు ఇలాంటి కష్టం శత్రువులకు కూడా రాకూడదని ఆవేదన వ్యక్తం చేసింది. వరుడు అశోక్‌ యాదవ్‌ కిడ్నాప్‌పై స్ధానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కిడ్నాప్‌ చేసిన యువతి అశోక్‌కు ముందే తెలుసని చెప్పారు.

మరికొందరు వారు సీక్రెట్‌గా గతంలోనే పెళ్లి చేసుకున్నారని.. తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా ఈ పెళ్లికి అశోక్‌ ఒప్పుకున్నాడని తెలిపారు. పెళ్లిమండపంలో వివాహం ఆగిపోవడంపై స్పందించిన వరుడి తండ్రి.. తన కొడుకు ప్రవర్తన కొంతకాలంగా అనుమానాస్పదంగా ఉన్నట్లు చెప్పారు. పని చేసే నగరానికి కలవడానికి వెళ్తే ఇంటికి తీసుకెళ్లకుండా.. గుడికి రమ్మనేవాడని తెలిపారు. అక్కడే ఏదో ఒక రెస్టారెంట్‌లో భోజనం పెట్టించి తిరిగి బస్‌ ఎక్కించేసేవాడని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement