ప్రేమించే దర్శకుడు | Sakshi
Sakshi News home page

ప్రేమించే దర్శకుడు

Published Mon, Mar 27 2017 11:41 PM

ప్రేమించే దర్శకుడు

దర్శకుడు ఏం చేస్తాడు? సినిమా తీస్తాడు. ఇంకా ఏం చేస్తాడంటే... వీలైతే అతను తీసే సినిమా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అతనే రాసుకుంటాడు. ఇప్పుడు ‘దర్శకుడు’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఓ నిర్మాత. ఈ సినిమాలో దర్శకుడు... అదేనండీ హీరో ఏం చేస్తాడని అడిగితే? ప్రేమిస్తాడంటున్నారు. ప్రేమించడంతో పాటు ఇంకేం చేస్తాడని అడిగితే... అది చెప్పడానికి ఇంకా టైముందంటున్నారు.

అశోక్, ఈష జంటగా హరి ప్రసాద్‌ జక్కా దర్శకత్వంలో సుకుమార్, బీఎన్‌సీఎస్పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి నిర్మిస్తున్న ‘దర్శకుడు’ సినిమా టాకీ పార్ట్‌తో పాటు మూడు పాటల చిత్రీకరణ పూర్తయింది. ఏప్రిల్‌లో మిగతా పాటల చిత్రీకరణకు విదేశాలు వెళ్లనున్నారు. త్వరలో ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రమేశ్‌ కోలా, సంగీతం: సాయి కార్తీక్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement