ఇంటర్‌ ఫస్టియర్‌లో 28.29% ఉత్తీర్ణత | Above 28 percentage pass in Inter Advanced Supplementary | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫస్టియర్‌లో 28.29% ఉత్తీర్ణత

Jul 25 2019 2:31 AM | Updated on Jul 25 2019 2:31 AM

Above 28 percentage pass in Inter Advanced Supplementary  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప్రథమ సంవత్సర పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో కార్యదర్శి అశోక్‌ ఫలితాలను విడుదల చేశారు. గత వార్షిక పరీక్షల్లో ఫెయిలై, ప్రస్తుతం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో 28.29 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంప్రూవ్‌మెంట్‌ రాసిన విద్యార్థులను కలుపుకుంటే 64.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తంగా 3,00,607 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో గత వార్షిక పరీక్షల్లో ఫెయిలైన వారు 1,49,605 మంది ఉండగా, వారిలో 42,331 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంప్రూవ్‌మెంట్‌కు 1,51,002 మంది విద్యార్థులు హాజరై మార్కులను మెరు గు పరుచుకున్నట్లు బోర్డు కార్యదర్శి అశోక్‌ వెల్లడించారు. 

30 నాటికి మార్కుల జాబితాలు.. 
మార్కుల జాబితాలు, మెమోలు సంబంధిత జిల్లా విద్యాదికారులకు పంపించనున్నట్లు అశోక్‌ తెలిపారు. వాటిని కాలేజీల ప్రిన్సిపాళ్లు ఈనెల 30న తీసుకొని విద్యార్థులకు అందజేయాలన్నారు. విద్యార్థులు ఈనెల 31వ తేదీలోగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ కోసం ఆన్‌లైన్‌ ద్వారా (tsbie. cgg.gov.in స్టూడెంట్‌ సర్వీసెస్‌) దరఖాస్తు చేసుకో వచ్చని తెలిపారు. రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ. 100, రీవెరిఫికేషన్‌ కమ్‌ స్కాన్డ్‌ కాపీ కోసం ఒక్కో పేపరుకు రూ. 600 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement