రియల్ ఎస్టేట్ మోసాలను ఎత్తిచూపేలా ‘శంకుస్థాపన’ | Bashetty Ashok Talk About Sankusthapana Movie | Sakshi
Sakshi News home page

రియల్ ఎస్టేట్ మోసాలను ఎత్తిచూపేలా ‘శంకుస్థాపన’

Aug 15 2023 3:38 PM | Updated on Aug 15 2023 3:42 PM

Bashetty Ashok Talk About Sankusthapana Movie - Sakshi

ప్రముఖ రాజకీయ నాయకుడు బాసెట్టి అశోక్‌ సినీ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ‘అశోక చక్ర మూవీస్‌’పేరిట ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పి ‘శంకుస్థాపన’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ‘తారకాసుర-2’చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విజయ్‌ భాస్కర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరుగుతున్న మోసాలు, అవకతవకల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుండడం గమనార్హం. 

అశోకచక్ర మూవీస్ అధినేత బాసెట్టి అశోక్ మాట్లాడుతూ..."ఈరోజు ఎకరా 100 కోట్లు పలుకుతున్న పుడమితల్లిని పది పదిహేను వేలకు అమ్ముకుని, ఇప్పుడు కుమిలి కుమిలి ఏడుస్తున్న పుడమిపుత్రులు (రైతులు) ఎందరో నాకు తెలుసు. మధ్యవర్తులు సైతం మధ్యంతర సిరితో కోట్లకు పడగలెత్తారు.

కానీ రైతుల పరిస్ఠితి అగమ్యగోచరంగా ఉంది. స్థిరాస్తి వ్యాపారంలోని లొసుగులను బహిర్గతం చేస్తూనే... మానవీయ కోణంలో భావోద్వేగాలను సమ్మిళితం చేసి "శంకుస్థాపన" చిత్రాన్ని తీర్చిదిద్దనున్నాం. మా దర్శకుడు విజయ్ భాస్కర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కిస్తాడనే నమ్మకం నాకుంది" అన్నారు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి చేస్తామని దర్శకుడు విజయ్ భాస్కర్ రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement