దర్శకుడి ప్రేమకథ | Sakshi
Sakshi News home page

దర్శకుడి ప్రేమకథ

Published Tue, May 16 2017 11:37 PM

దర్శకుడి ప్రేమకథ

అశోక్, ఇషా జంటగా హరిప్రసాద్‌ జక్క దర్శకత్వంలో సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై సుకుమార్‌ నిర్మించిన చిత్రం ‘దర్శకుడు’. వచ్చే నెల 9న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఓ సినీ దర్శకుడి ప్రేమకథ ఇది. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌. ఈ నెల 22న ఓ స్టార్‌  హీరో చేతుల మీదగా టీజర్, ఇదే నెలలో పాటలు విడుదల చేస్తాం. ఈ చిత్రానికి సుకుమార్‌తో పాటు బిఎన్‌సిఎస్‌పి విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి అడూరి, రవిచంద్ర నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్‌ అనుమోలు, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రమేష్‌ కోలా.

Advertisement
 
Advertisement
 
Advertisement