డేటా చోరీ కేసు.. కీలక ఆధారాలు సేకరించిన అధికారులు

Data Theft Case Telangana SIT Officials Find Valuable Proves - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో తెలంగాణ సిట్‌ కీలక ఆధారాలు సేకరించింది. పరారీలో ఉన్న అశోక్‌ కదలికలను పసిగట్టినట్లు సిట్‌ అధికారులు వెల్లడించారు. డేటా చోరీ వెలుగు చూసిన కొన్ని గంటల్లోనే అశోక్‌ విజయవాడవైపు వెళ్లినట్లు తమ దృష్టికి వచ్చిందని సిట్‌ అధికారులు తెలిపారు. ఆ తర్వాత కొద్ది సేపటికే అశోక్‌ సెల్‌ఫోన్‌ టవర్‌ గుంటూరు లోకేషన్‌ని చూపించినట్లు అధికారులు పేర్కొన్నారు.

అశోక్‌ విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేలోగా పలువురు రాజకీయనాయకులతో, ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు గుర్తించామన్నారు. అంతేకాక అశోక్‌ గత ఆరు నెలలుగా ఇదే నంబర్‌తో విస్తృతంగా మాట్లాడినట్లు దర్యాప్తులో తెలిందన్నారు. ఈ సంభాషణలను బట్టి ప్రముఖులేవరికైనా ఈ కేసుతో సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా డేటా చోరీ కేసులో హై కోర్టు అశోక్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13న విచారణకు హాజరు కావాలంటూ కోర్టు అశోక్‌ను ఆదేశించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top