ప్రేమించిన యువతి రెండు రోజుల కిందట ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఓ ప్రేమికుడు పురుగులమందు తాగాడు.
ప్రేమించిన యువతి రెండు రోజుల కిందట ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఓ ప్రేమికుడు పురుగులమందు తాగాడు. ఈ సంఘటన టేకులపల్లి మండలం జండాలతండాలో ఆదివారం చోటుచేసుకుంది. ఆత్మహత్యాయత్నం చేసిన బానోత్ అశోక్(23)ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.