భాగమతి రిలీజ్ వాయిదా..? | Anushka Bhagmati Release Date Update | Sakshi
Sakshi News home page

భాగమతి రిలీజ్ వాయిదా..?

Mar 9 2017 12:29 PM | Updated on Sep 5 2017 5:38 AM

భాగమతి రిలీజ్ వాయిదా..?

భాగమతి రిలీజ్ వాయిదా..?

టాలీవుడ్లో లేడీ సూపర్ స్టార్గా ఎదుగుతున్న యోగా బ్యూటి అనుష్క నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా భాగమతి

టాలీవుడ్లో లేడీ సూపర్ స్టార్గా ఎదుగుతున్న యోగా బ్యూటి అనుష్క నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా భాగమతి.  హర్రర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క టైటిల్ రోల్లో నటిస్తోంది. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాను ముందుగా అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే తాజాగా అనుష్క కోరిక మేరకు సినిమాను ఆగస్టు రెండు వారంలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవల అనుష్క కీలక పాత్రల్లో నటించిన సింగం 3, ఓం నమో వేంకటేశాయ సినిమాలు వెంట వెంటనే రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో బాహుబలి 2 రిలీజ్ అయిన వెంటనే భాగమతి రిలీజ్ అయితే బాహుబలి ఎఫెక్ట్ భాగమతి మీదపడుతుందని భావిస్తుందట స్వీటి. అందుకే ఆ సినిమాను రెండు నెలలు వాయిదా వేయాలని కోరింది. అనుష్క కోరికను మన్నించి భాగమతి టీం స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా భాగమతిని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement