బాహుబలి పార్ట్‌-3.. అభిమానులకు రాజమౌళి సర్‌ప్రైజ్ | SS Rajamouli Bahubali Part 3 Officially announced | Sakshi
Sakshi News home page

Bahubali Part 3: బాహుబలి పార్ట్‌-3.. అభిమానులకు రాజమౌళి సర్‌ప్రైజ్

Jun 26 2026 8:37 AM | Updated on Jun 26 2026 8:46 AM

SS Rajamouli Bahubali Part 3 Officially announced

బాహుబలి సినిమాలతో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ సినీ చరిత్రలో తన పేరు లిఖించుకున్నారు. ఈ రెండు సినిమాలు వసూళ్లు మాత్రమే కాదు.. ఇండియన్ మూవీ మేకింగ్‌ ముఖచిత్రాన్నే మార్చేశాయి. ఈ రెండు పార్టులు బ్లాక్‌బస్టర్‌ హిట్ కావడంతో పార్ట్-3 కూడా ఉంటుందని సినీ ప్రియులు భావించారు. ఇప్పటికే పలుసార్లు ఈ విషయంపై రాజమౌళి ఇంటర్వ్యూల్లో మాట్లాడారు. భవిష్యత్తులో పార్ట్-3 ఉంటుందని అన్నారు.

ఇవాళ బాహుబలి పార్ట్-3పై అఫీషియల్‌ ప్రకటన వచ్చేసింది. దీనిపై నెట్‌ఫ్లిక్స్‌ ఓ వీడియోను రిలీజ్ చేసింది. బాహుబలి: ది టార్చ్ బేరర్ మూవీ స్ట్రీమింగ్‌కు ముందు ప్రభాస్, అనుష్క, రానాలతో కూడిన వీడియోను పంచుకుంది. ఇందులో రాజమౌళి సార్‌ లేకపోయినా కూడా ఈ విషయాన్ని చెప్పేస్తున్నానంటూ రానా పార్ట్‌-3 ఉందని రివీల్ చేశారు. దీంతో బాహుబలి పార్ట్-3పై అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ఈ ప్రకటనలో ప్రభాస్, రానా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఇవాళ బాహుబలి: ది టార్చ్ బేరర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. 
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement