భాగమతి కోటకు మూడున్నర కోట్లు | 3.5 crores set for anushka Bhagamathi | Sakshi
Sakshi News home page

భాగమతి కోటకు మూడున్నర కోట్లు

Sep 2 2016 3:04 PM | Updated on Sep 4 2017 12:01 PM

భాగమతి కోటకు మూడున్నర కోట్లు

భాగమతి కోటకు మూడున్నర కోట్లు

టాలీవుడ్లో లేడి ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన అనుష్క మరో లేడి ఓరియంటెడ్ సినిమాకు రెడీ అవుతోంది. ప్రస్తుతం బాహుబలితో పాటు సింగం 3 సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటి...

టాలీవుడ్లో లేడి ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన అనుష్క మరో లేడి ఓరియంటెడ్ సినిమాకు రెడీ అవుతోంది. ప్రస్తుతం బాహుబలితో పాటు సింగం 3 సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటి, త్వరలో థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న భాగమతి సినిమాలో నటించనుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చారిత్రక నేపథ్యం కూడా ఉందని తెలుస్తోంది. పిల్లజమీందార్ ఫేం అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు.

చారిత్రక నేపథ్యంలో వచ్చే సన్నివేశాల కోసం మూడున్నర కోట్లతో ఓ భారీ రాజభవనం సెట్ను వేస్తున్నారు. నాలుగు వందల ఏళ్ల నాటి పరిస్థితులు నిర్మాణ శైలి ప్రతిభింబించేలా ఈ సెట్ వేస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా కావటంతో ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్లోనూ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకు తగ్గట్టుగా నైజాం నిర్మాణ శైలితోపాటు తమిళ నేటివిటి కూడా కనిపించేలా సెట్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement