'భాగమతి' రిలీజ్ డేట్ ఫిక్స్

Anushka Bhagamathi Release Date Fix - Sakshi

లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న మరో ఆసక్తికర చిత్రం భాగమతి. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయనున్నారు.

తమన్ స్వరాలంధిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటులు ఉన్ని ముకుందన్, జయరాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాతో అనుష్క మరోసారి సత్తా చాటుతుందని భావిస్తున్నారు. సైజ్ జీరో సినిమా తరువాత లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న అనుష్క భాగమతిగా ఎలా కనిపించనుందో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top