ఆ థీమ్ మ్యూజికే హైలెట్..! | Anushka Bhaagamathie Teaser tomorrow | Sakshi
Sakshi News home page

Dec 19 2017 3:33 PM | Updated on Dec 19 2017 4:13 PM

Anushka Bhaagamathie Teaser tomorrow - Sakshi

బాహుబలి సీరీస్ లో దేవసేనగా అలరించిన స్వీటీ అనుష్క, త్వరలో భాగమతిగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ఈ బ్యూటీ భాగమతి లుక్ లో ఎలా కనిపించనుందో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పిల్లజమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

స్వీటీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ బుధవారం భాగమతి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. టీజర్ లో హామర్ (సుత్తి) థీమ్ హైలెట్ గా నిలవనుందట. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఫస్ట్ లుక్ లో అనుష్క చేతిలో సుత్తి పట్టుకొని కనిపించింది. ఇప్పుడు టీజర్ లోనూ అనుష్క అదే లుక్ లో కనిపించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement