ఓయ్ భాగమతి... ఎక్కడ ఉన్నావ్? | bhagmati shooting started in hyderabad | Sakshi
Sakshi News home page

ఓయ్ భాగమతి... ఎక్కడ ఉన్నావ్?

Oct 4 2016 10:55 PM | Updated on Sep 4 2017 4:09 PM

ఓయ్ భాగమతి... ఎక్కడ ఉన్నావ్?

ఓయ్ భాగమతి... ఎక్కడ ఉన్నావ్?

‘అదేనండీ.. భాగ్యనగరంలోనే ఉన్నా’ అంటున్నారు అనుష్క. ‘భాగమతి’ని ప్రశ్నిస్తే.. ఈవిడ సమాధానం చెబుతున్నారేంటి అనుకుంటున్నారా! ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’ సినిమాల తర్వాత

‘అదేనండీ.. భాగ్యనగరంలోనే ఉన్నా’ అంటున్నారు అనుష్క. ‘భాగమతి’ని ప్రశ్నిస్తే.. ఈవిడ సమాధానం చెబుతున్నారేంటి అనుకుంటున్నారా! ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’ సినిమాల తర్వాత అనుష్క నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘భాగమతి’. ‘పిల్ల జమిందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్.. తమిళంలో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.

ఈ రెండు భాషల్లోనూ ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రారంభమైంది. చడీ చప్పుడూ లేకుండా 25 రోజుల పాటు షూటింగ్ చేసేశారు. రెండో షెడ్యూల్ దసరా తర్వాత ప్రారంభం కానుంది. ‘‘హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో ‘భాగమతి’ కోసం భారీ సెట్ వేస్తున్నారు. దసరా తర్వాత ఆ సెట్‌లో షూటింగ్ షూరూ చేస్తారు. సినిమా మొత్తం పూర్తయ్యే వరకూ గ్యాప్ లేకుండా షూటింగ్ జరుగుతుంది’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, ఈ సినిమాలో అనుష్క చాలా అందంగా ఉంటుందంటున్నారు యూనిట్ సభ్యులు. ‘సైజ్ జీరో’ కోసం అనుష్క చాలా లావయ్యారు. ఈ సినిమాలో మునుపటిలా నాజూకైన శరీరాకృతిలో కనిపిస్తారు. సామాజికాంశాలతో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ ఏడాది ఆఖరున విడుదల చేయాలనుకుంటున్నారట!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement