జై బోలో కృష్ణ | Jai Bolo Krishna song release from Devaki Nandana Vasudeva on Superstar Krishna birthday | Sakshi
Sakshi News home page

జై బోలో కృష్ణ

Published Sat, Jun 1 2024 2:46 AM | Last Updated on Sat, Jun 1 2024 2:46 AM

Jai Bolo Krishna song release from Devaki Nandana Vasudeva on Superstar Krishna birthday

సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు అశోక్‌ గల్లా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వారణాసి మానస హీరోయిన్‌. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు.

శుక్రవారం సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ‘దేవకి నందన వాసుదేవ’ మూవీ నుంచి ‘జై బోలో కృష్ణ...’ అంటూ సాగే రెండో పాటని రిలీజ్‌ చేశారు. ఈ పాటకి రఘురామ్‌ సాహిత్యం అందించగా, స్వరాగ్‌ కీర్తన్‌ పాడారు. యష్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ‘‘భక్తి అంశాలతో కూడిన ఫ్యామిలీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. హీరో తన బ్యాచ్‌తో కలిసి కృష్ణుడి జన్మాష్టమిని సెలబ్రేట్‌ చేసుకునే సందర్భంలో ‘జై బోలో కృష్ణ...’ పాట వస్తుంది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని త్వరలో ప్రకటిస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement