సుకుమార్ ఫ్యామిలీ నుంచి మరో బ్యానర్ | Sukumar New Movie as producer | Sakshi
Sakshi News home page

సుకుమార్ ఫ్యామిలీ నుంచి మరో బ్యానర్

Jun 3 2016 9:00 AM | Updated on Sep 4 2017 1:35 AM

సుకుమార్ ఫ్యామిలీ నుంచి మరో బ్యానర్

సుకుమార్ ఫ్యామిలీ నుంచి మరో బ్యానర్

మూస మాస్ సినిమాల టైంలో కొత్త తరహా చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు సుకుమార్.

మూస మాస్ సినిమాల టైంలో కొత్త తరహా చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు సుకుమార్. తన ప్రతి కథలోనూ సైన్స్కు కీలక పాత్ర కల్పించే ఈ లెక్కల మాస్టరు, నిర్మాతగానూ మంచి విజయం సాధించాడు. సుకుమార్ రైటింగ్స్ పేరుతో బ్యానర్ను స్థాపించి తొలి ప్రయత్నంగా కుమారి 21ఎఫ్ సినిమాను తెరకెక్కించాడు. సుక్కు స్వయంగా కథా కథనాలు అందించిన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో నిర్మాతగానూ కొనసాగాలని నిర్ణయించుకున్నాడు.

అయితే సుకుమార్ నిర్మాతగా తన రెండో సినిమా కోసం మరో బ్యానర్ను స్థాపిస్తున్నాడు. తన తండ్రి పేరుతో బీటీఆర్ క్రియేషన్స్ స్థాపించిన ఆ బ్యానర్పై తన అన్న కొడుకు అశోక్ను హీరోగా పరిచయం చేయబోతున్నాడు. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయిన ఈ సినిమాకు దర్శకుడు అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన హరిప్రసాద్, ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఈ నెల 9 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement