కొత్త సినిమా షురూ | Sukumar Writings and Bunny Vas Works Join Hands for Exciting Film with Priyadarshi | Sakshi
Sakshi News home page

కొత్త సినిమా షురూ

Jun 13 2026 1:40 AM | Updated on Jun 13 2026 1:40 AM

Sukumar Writings and Bunny Vas Works Join Hands for Exciting Film with Priyadarshi

సరికొత్త సినిమాలతో నటుడిగా ప్రేక్షకుల మెప్పు పొందిన హీరో ప్రియదర్శి కొత్త సినిమా కబురు చెప్పారు. ప్రియదర్శి హీరోగా బన్నీ వాసు, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై బన్నీ వాసు, బి. సుకుమార్‌ ఓ సినిమా నిర్మించనున్నారు.

ఈ చిత్రం దర్శకుడి పేరు, నటీనటులు–సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్‌ తెలిపారు. మరోవైపు డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా బన్నీ వాసు సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. ఇక ‘రంగస్థలం’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత రామ్‌చరణ్‌తో మరో సినిమా చేసేందుకు సుకుమార్‌ సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement