అనుష్కకు గ్యాప్ ఇవ్వటం లేదుగా..! | Release Problems for Anushka Bhagamathi | Sakshi
Sakshi News home page

అనుష్కకు గ్యాప్ ఇవ్వటం లేదుగా..!

Nov 16 2016 1:15 PM | Updated on Sep 4 2017 8:15 PM

అనుష్కకు గ్యాప్ ఇవ్వటం లేదుగా..!

అనుష్కకు గ్యాప్ ఇవ్వటం లేదుగా..!

గ్లామర్ హీరోయిన్గా కంటిన్యూ అవుతూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటుతుంది యోగా బ్యూటి అనుష్క. ఇప్పటికే అరుంధతి, సైజ్ జీరో లాంటి సినిమాల్లో సత్తా చాటిన అనుష్క ప్రస్తుతం...

గ్లామర్ హీరోయిన్గా కంటిన్యూ అవుతూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటుతుంది యోగా బ్యూటి అనుష్క. ఇప్పటికే అరుంధతి, సైజ్ జీరో లాంటి సినిమాల్లో సత్తా చాటిన అనుష్క ప్రస్తుతం పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో భాగమతి సినిమాలో నటిస్తోంది. దాదాపు 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్ లేడీ ఓరియంటెడ్ సినిమా. అందుకే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి పోటి లేకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే డిసెంబర్ మొదటి వారం నుంచి వరుసగా స్టార్ హీరోల సినిమాలు క్యూ కడుతుండటంతో భాగమతికి రానున్న నాలుగు నెలల్లో గ్యాప్ దొరికే ఛాన్స్ కనిపించడం లేదు.  ఈ సినిమాను ముందుగా 2017 ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సంక్రాంతి సినిమాలు కూడా వాయిదా పడే అవకాశం ఉండటంతో ఫిబ్రవరి నుంచి వెండితెర మీద స్టార్ హీరోల సందడి కనిపించనుంది.

ఓం నమోవేంకటేశాయ, గురు, విన్నర్ లాంటి సినిమాలు ఫిబ్రవరిలోనే రిలీజ్కు రెడీ అవుతున్నాయి. మార్చి నెలలో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు రిలీజ్ కానుంది. కాస్త అటు ఇటుగా మహేష్ బాబు, మురుగదాస్ల మూవీ కూడా రిలీజ్కు రెడీ అవుతోంది. ఇక ఏప్రిల్లో బాహుబలి రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ దరిదాపుల్లో ఏ సినిమా రిలీజ్ చేసే అవకాశం లేదు. అందుకే భాగమతి సినిమాను బాహుబలి హడావిడి కూడా తగ్గిన తరువాత రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement