వైరల్ వీడియో‌: జూనియర్‌ ఎన్టీఆర్‌ పాటకు స్టెప్పులు

Japanese Couple Dance For Junior NTR Ashok Movie Songs - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌, సమీరారెడ్డి నాయకానాయికలుగా నటించిన చిత్రం అశోక్‌. స్టార్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకుడు. 2006లో వచ్చిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. అయితే, జపాన్‌లోని జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ జంట అశోక్‌ సినిమాలోని ‘గోలాగోలా రంగోలా గుండెల్లోనా రాగాలా.. గోదారేదో పొంగే వేళ’పాటకు స్టెప్పులేసి అదరగొట్టింది. క్యాస్ట్యూమ్స్‌ కూడా హీరోహీరోయిన్లను పోలినట్టుగా ఉండటం విశేషం. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కామెంట్ల వర్షం కురుస్తోంది. అచ్చం జూనియర్‌ ఎన్టీఆర్‌, సమీరాలాగానే స్టెప్పులేశారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక  తెలుగు సినిమాల్లోని పాపులర్‌ పాటలకు ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌​ వార్నర్‌ ఇటీవల టిక్‌టాక్‌ చేసి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. ‘అల వైకుంఠపురములో..’ సినిమాలోని బుట్టబొమ్మ, సరిలేరు నీకెవ్వరూ సినిమాలోని మైండ్‌ బ్లాక్‌ పాటలకు వార్నర్‌ దంపతులు డ్యాన్సుల వైరల్‌ అయ్యాయి.
(చదవండి: యంగ్‌ టైగర్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top